Google+ Followers

Followers

Wednesday, 18 December 2013

హిందూ ధర్మం అంటే ఏమిటి? నేను హిందువుని ఎందుకు అయ్యాను?మిగిలిన మతాలవలే కాకుండా, హిందు ధర్మం స్వర్గం/నరకం అనే మూఢ విశ్వాసం మీద ఆధారపడిలేదు. కొన్ని మూఢవిశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమని చెప్పేది కాదు హిందు ధర్మం ! హిందు ధర్మం దేనిని గుడ్డిగా నమ్మమని చెప్పదు, దేనిలో అయినా సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది. ఈ ప్రపంచంతరువాత స్వర్గం/నరకం అనేవి లేవు. కేవలం మన కర్మలే జీవితాన్ని స్వర్గం/నరకం అయ్యేలా చేస్తాయి.

హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను కాపాడడం !ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమి లేదు, అంతా దైవత్వమే ! మన శరీరంలానే ఈ విశ్వం కూడా పంచభూతాలతో సృష్టింపబడినది. అంటే మన శరీరం కూడా చిన్న విశ్వంలాంటిదే! మన లోపల ఎలాగైతే తెలివి, జ్ఞానం, ఆత్మ ఉంటాయో అలానే ఈ విశ్వం లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు !

దేవుడు అనేవాడు ఒక వ్యక్తి/జీవం కాదు. దేవుడు అంటే పవిత్రమైన, అనంతమైన శక్తి. శివుదు(పరమాత్మ), గౌరీ మాత( శక్తి) కలయిక వలనే ఈ విశ్వం సృష్టిపబడుతూ ఉంటుంది. పరమాత్మను తెలుసుకుని మన ఆత్మను ఐక్యం చేయడమే ఆత్మ సాక్షాత్కారం ! అదే మన జీవిత గమ్యం మరియు ఇదే సులభమైన/ఉత్తమమైన మార్గం !

హిందు ధర్మం లొ శాస్త్రీయత/విజ్ఞానం ఉంది ! హిందు ధర్మం ద్వారా మీకు సత్యం తెలుసుకోవాలని లేకపోతే ఇతరులను బాధపెట్టకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. దానినే ధర్మం అంటారు. 

మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే అది మూఢ విశ్వాసలపై ఆధారపడి ఉంటుంది.

ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.

హిందు ధర్మం లోకి అందరికి స్వాగతం: సత్యాన్ని పరమాత్మను తెలుసుకోండి !

" లొకా సమస్తా సుఖినో భవంతు !"

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన (15 వ భాగము )ఓం శ్రీ గణేశాయ నమః ,
ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ పరామ్బికాయై నమః 

అపారమైన పరమ జ్యోతి అమ్మ భువనేశ్వరీ తమ మధుర మైన వాక్కు తో పలుకాగానే ,వీణా నాదాన్ని సహితము వెల-వెల పోయింది ది . ఆమె పలుకులు వీణా నాదము కన్న మిన్నగా ఉన్నయ్యి . ఆమెకు ఎందఱో సఖులు , దాసీలు .దేవతాస్త్రీలు . అఖిల దేవతలా వృoదము ఆమెను చుట్టూ ముట్టి ఉన్నారు , అందరు ఆమె ఆఘ్య కొరకు వేచి ఉన్నారు . ఆ తల్లి ఇచ్చా శక్తి , ఘ్యాన శక్తి ,క్రియా శక్తి చే సంపాన్నురాలు . లజ్జ , తుష్టి,పుష్టి , కీర్తి , కాంతి ,కీర్తి , క్షమా దయా , బుద్ధి మేధా ,, ఇవన్ని మూర్తిభవించి , అందరు అమ్మచెంత చేరాఋ . .

జయా , విజయా, అజితా , అపరాజితా , నిత్యా , విలాసిని,దోగ్ధ్రీ అఘోరా,అమంగాలా ఇవి తొమ్మిది శక్తులు ,భగవతి పరామ్బిక సేవ లో . తత్పరులైయ్యి ఉంటారు . శంఖ నిధి ,పద్మ నిధీ భగవతి కి పార్శ్వ భాగాన ఉన్నారు . పద్మ నిధి

నవరత్న వహా, కాంచనసహత్ర ,సప్త దాతువహా , సంఘ్యక్,నదులు , ఈ ధాతువులనుండి ప్రవహిస్తాయి . ఇవన్ని వెళ్లి సుదాసగారములో కలుస్తాయి . ఈ విధముగా సమస్త శక్తులు కలిగి ఉన్నట్టి భువనేశ్వరీ దేవి , భువనేశ్వరుని తో కూడి ఉన్నది .” సర్వేశుడు “ అన్న బిరుదు భువనేశునికి అమ్మ వలన నే వచ్చిన ది . వ్యాసులవారు చెపుతున్నారు , రాజా ,

ఇప్పుడు ఈ చిoతామణి గృహ ము యొక్క పరిమాణము గూర్చి విను .
“ఇది ఓక వేయి యోజనాలు తో అతి పెద్దగా ఉన్న విశాలమైన భవనము . వేయి యోజనాల పొడవు , వేయి యోజనాల వెడల్పుతో ఉంది . దీనికి ఉత్తరాన అనేకమగు సుదీర్ఘముగా ఉన్న ప్రాకారాలు ఉన్నయి . పూర్వ ప్రాకారానికన్న ఉత్తర ప్రాకారములు రెండoతలుగా ఉన్నాయి . అని చెప్ప బడింది .

దేవి భగవతి మణి ద్వీపము భూమి పైన లేదు , అంతరిక్షములో ఉన్నది . ప్రళయములో ,దీనికి వినాశము లేదు . ఇది సృష్టికి ముందు కూడా ఉన్నది . కాని ఇందులో కార్యానుకూలముగా సంకోచాలు , వికాసాలు జరుగుతుంటాయి .

ఇందులులో భగవతి మహామాయ నివసిస్తుంది . ఇక్కడికి సమస్త లోకాలనుండి అమ్మ భక్తులు వస్తుంటారు . ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మను గూర్చి తపస్సును చేసుకుంటూ తమ ప్రాణాలు వదులుతారు .
అందరు వెళ్లి మహోత్సవా దగ్గరికి చేరి పోతారు .

అక్కడ ఘ్రుత కుల్యా ,దుఘ్ద కుల్యా, దధీ కుల్యా , మధస్త్రవా ,అమృత వహా ,,ద్రాక్షారసవహా , జమ్బురసవహా , ఆమ్రేక్షు రసవహా . ఈ నదులు ప్రవహిస్తుంటాయి . మనోరథ ఫలాలు ఇచ్చేటి , వృక్షాలు , బావులు , సరస్సులు , అందరు ,యథేష్టముగా సేవిచు కొరకు , అన్ని దొరకుతాయి . మణి ద్వీపములో ఎవరు రోగాల బాధలు తో ఉండరు . వృద్దాప్యము లు ఉండవు , ఈ దివ్యమగు క్షేత్రము లో , కామక్రొధములుoడవు .అక్కడ నివసించే ప్రతి ఒక్కరు యువావస్తలోనే ఉంటారు . స్త్రీ యుక్తముగా కోటి సూర్య తేజముతో ప్రకాశిస్తుంటారు . ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరు దేవిని ఉపాసిస్తారు . 7 కోట్ల మహామంత్రాలు దేవిని ఆరాధిస్తుంటారు . కారణ బ్రహ్మ స్వరూపిణి . శివా . మాయాబలము చే సబల విగ్రహాన్ని సృష్టించింది . మహావిద్యలు , సతతము ఆమెను సేవిస్తాయి .

వ్యాసులు చెపుతున్నారు రాజ ఈ మణి ద్వీపాన్ని ఎవరు వర్ణించలేరు , ఒక్కోసారి చిన్న పెసరు గింజ అంత ప్రకాశము కనబడితే మరో పక్క సూర్యడిలా తేజం కనపడుతుంటుంది , ఒక్కో సారి , మరకత మణి లా ప్రాకాశాన్ని వెదజల్లుతుంటుంది ఒక్కో సారి విద్యుత్తూ లా కన పడితే , ఒక్కో సారి మధ్యాన్హ తేజము ప్రకాశమానముగా కోటి సూర్య కాంతులు కనపడతాయి . ఒక్కో చోట సిందూర్ వర్ణ కాంతి కనపడితే వెంటనే రక్తవర్ణ మెరుపు కనపడుతుంది , నీలమణి
కాంతులు వెదజల్లుతుంటుంది , కొన్ని చోట్ల దావానల కాంతి పుంజాలు కనపడతాయి . ఇవన్ని వన్నెలు కలిగిన కాంతులతో ఎల్లప్పుడూ దేదివ్యా మానముగా ప్రకాశించే అమృతమయ కాంతుల లోకమే ఈ మణి ద్వీపము .

వర్ణించలేని కాంతులచే నిర్మితమైన గోపురాలు , ప్రాకారాలు ,భవనాలు, మందిరాలు ,వృక్షాలు , నేమిల్లు కోకిలలు అన్ని జాతుల పక్షులు , అన్ని ఆత్మా స్వరూప ప్రకాశాన్నిపూనీ వెలుగొందే ఈ లోకమే మణి ద్వీపము ప్రపంచ లో ఉన్నట్టి అన్ని ఆనందాలు ఇక్కడ లభ్యము అవుతాయి . మధుర సుగందితంయ్యి ఉన్నట్టి ఈ లోకము రంగురంగు ల ఎండ లచే చల్లని కాంతి యుతముగా ఉన్నది , దర్పణ రూపములో ప్రకాశిస్తూ , ఒక్కో సారి జాలము లా ప్రకాశిస్తున్నది . రాజు కు కలిగేటి ఆనందమును మొదలుకొని , బ్రహ్మ పర్యంతము పొంద గలిగే ఆననదము ఇక్కడ లభిస్తుంది .

మహాదేవి పరమ దాము అయినట్టి ఈ పురిని స్మరిచిన , సమస్త పాపాలు హరించి పోగలవు . చివరి సమయమందు దీనిని స్మరిo చిన మణిపురి నివాసమే తథ్యము ,”దేవి భాగవతము లో 8వ అధ్యాయమును మొదలుకొని 12 ఆదాయము పర్యంతము “అధ్యాయ పంచకము అని చెప్పబడింది . దీనిని నిత్యమూ పతించిన చొ భూత ప్రేత పిశాచ బాధలు తొలగి , పోతాయి వాస్తు , గ్రహ శాంతి చేయ దళిచినప్పుడు ప్రయత్నా పూరవకముగా ఈ అధ్యా యాలను చదివిన యెడల శుభములు చేకూరుతాయి.
ఓం శ్రీ మాత్రె నమః

“సర్వం శ్రీ లలితార్పనమస్తూ “

అమ్మ త్రిపుర సుందరీ ! తల్లీ !నాకు ఇంతటి భాగ్యమును ప్రసాదించి నీకు శతకోటి ప్రణామాలు

. అందరికి శుభాలు కలిగించి , “ ఆత్మ సత్యము అన్న తలంపును కలిగించి” స న్ మార్గాన నడిపించు . పరస్పర ప్రేమాభిమానాలు మాయందు ఉదయింప చేసి , ,మంచి మార్గాన నడిపించు . అందరి కష్టార్జిత సంపదలను కాపాడు ,పరివా ర ఆనదములు అందరికి లభించి , సుఖ్ సంతోషాలు కలిగి అందరిని సుభిక్షముగా ఉంచు తల్లీ !అందరికి ,మంచి విఘ్యాన తృష్ణ కలిగించు ,

“నీకు జయము, జయము తల్లీ !” ఓం శాంతి , శాంతి శాంతిహి

tranlated by shakunthala bhat

మణి ద్వీప వర్ణన (14 వ భాగము )

ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీ పరామ్బికాయైయ్ నమో నమః .

ఇంతకు ముందు మనము జగత పిత , భువనేశ్వరుని రూపాన్ని తలుచుకున్నాము . శుద్ధ స్ఫాటికమణి లా , దేదివ్యమానముగా ,వెలిగుతూ , ఆయన శ్రీ విగ్రమునుండి దివ్యా కాంతులు సమస్త లోకాలను ప్రకాశింప గా , ఆయనకు వామాన్గము న ఉన్నట్టి మన అమ్మ ,భువనేశ్వరీ దేవి , ఏంతో మనోహరముగా ప్రకాశిస్తున్నది . చక్కని మంద హాసము తో , కనులలో ప్రేమ తొణికిసలాడుతూ ఉన్నట్టి తల్లి ,సన్నని నడుముకు రత్నాలు తాపిన వడ్డాణము ,

శ్రీ చక్రమును పోలి నట్టి భుజకీర్తులను , పెట్టుకున్నది , చెవులకు , కర్ణ పుష్పములు , వింత కాంతులీనుతూ ఆమె ముఖ కమలానికి మరింత శోభ చేకూర్చ గా ,ముచ్చట గొలిపే శోభ ను వర్ణిoప తరమా !

అమ్మవారి లలాట కాంతి వైభవం అర్ధ చంద్రున్ని తిరస్కరిస్తున్నదా ? అన్నట్టున్నది . దొండ పండు వంటి పెదాలు , మo దహాసము చేసినప్పుడు , చక్కు మని మెరిసేటి ,చక్కని పనువరుస , కుంకుమ కస్తూరి తిలకము , పెట్టుకొని అమ్మ అద్భుతముగా శోభయమానురాలిగా ఉన్నది .

చంద్ర సూర్యుల వంటి ఆకారము కలిగిన ముకుటాన్నిధరించిoది అందులో రత్నాలు పొదిగి ఉన్నాయి . శుక్ర తారను పోలినట్టి నాసికా భరణము ,అమ్మ తేజానికి మరింత అందాన్ని , జోడించింది .
దివ్యమగు చూడమణి శిరస్సుకు , శోభను చేకూర్చింది . కoఠాన్ని ముత్యాల హారాలతో అలకరించింది .ఆ అమ్మా యొక్క దేహమునుంది దివ్య సుగాదాలు (దేవతల శ్రీములోనుండి దివ్య సుగంధాల పరిమళాల వాసనలు వస్తాయి దివ్య గంధా అన్న పేరు . )

చంద్రిని వలే వెలిగే ముఖము పైన, ముంగురులు వచ్చి పడుతున్నాయి . కమల దళాల వంటి మూడు నేత్రాలు ,ఎనలేని శోభ కలుగ చేయగా , మారాగా , పద్మరాగ కాంతి వెదజల్లే ఆమె శరీర ఛాయా, చేతులకు కంకణాలు ,సమస్త ఆభరణాల కాంతి అంత ఆమె పాదాల నుండి ప్రసరిచే వెలుగు రేఖలత . ఎంతటి దివ్య జ్యోతి !అమ్మ సర్వ మంగళ !

తమ బరువైన ఉరొజల భారము వలన అమ్మ బద్ధకించినదా !అన్నట్టు ఉన్నది ఆమె వాలకం . సృగార రసము చే అమ్మ సంపన్నురాలుగా ఉన్నది . సుకుమారమైన శరీరము ,సమస్త సౌo దర్యానికి ఆధార భూత నిష్కపటముగా ఉంది ఆ కరుణామూర్తి . 

మణి ద్వీప వర్ణన (13వ భాగము )


ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ పరామ్బికయై నమః 

రాజా ! మధ్యభాగాన ఉన్నదే జగజ్జనని నివాసము . నాలుగు ద్వారాలతో నిర్మించిన మండపము . ఒక్కొక్క మండపము వేయి స్తంభాలచే నిర్మించి ఉంది . కాంతి లో కోటి సూర్యులతో సమానముగా ఉన్నది . మొదటి మo డ పము శృంగార మండపము రెండకాది , ముక్తి మండపము , మూడవది , ఘ్యాన మండపము , నాలగవది , ఏకాంత మండపము .

ఈ మండపములో అనేకమైన్ట్టి చంద్రుల తాపిడి ఉన్నది , రక రకాల ధూపముల సువాసన వ్యాపించి ఉన్నాయి . ఈ మండపాలు కోటి సూర్యుల తేజము తో ప్రకాశిస్తున్నది . దీనికి నాలుగు వైపులా , కేసరాలు మల్లికలు , కుంద పుష్పాలు , తెల్లని రంగు గల పుష్పాలు ,అసంఖ్యాకముగా ఉన్నట్టి సుగంధమయ పుష్పాలు , తీగలు లతలు కేసరాలు కలిగినట్టి వింత పూవులు, ,సువాసనలు వెదజల్లుతూ అద్భుత శోభ కలిగి ఉన్నవి
వీటి పైన పరిపరి విధాల భ్రున్గాలు కూర్చొని ఉన్నాయి . పూవుల తెనేలను గ్రోలుతూ మదోన్న్తతముగా ఉన్నాయి . తీనె రుచికి మరిగిన ట్టి ఈ కీటకములు ఈ వనానికి ,చక్కని సొంపును , కలిగిస్తుంటే ,ఈ వనము , ముగ్ధ మనోహరముగా ఉన్నది . రాజహంసలు , వింతైన పక్షులు ధ్వనులు ఏంతో హాయిగా విపిస్తున్నాయి . ఇక్కడి మెట్ల పైన రత్నాలు పొదిగి ఉన్నాయి

. పక్షుల కిలకిలలు , భ్రమరాల , గుంజితాలు ,కమ్మని సువానాలు , ధూపాలు పుష్పాల సుగంధము అన్ని కలిపి మధురాను భూతి కలిగించు ఈ మణి ద్వీపము , ఏంతో మనోహరముగా ఉన్నది . ఇది శృంగార మంటపము అని చెప్పబడింది . .

ఈ శృంగార మంటపములో దేవి కూర్చొని ఉంది . సభాసదులుగా దేవతలు ఉన్నారు దేవనాo గనలు వచ్చి కూర్చున్నారు . అపరసలు ఉన్నారు , వివిధమగు గానాలతో స్వర రాగాలతో , అమ్మను స్తుతిస్తున్నారు . రెండవ మంటపము , ముక్తి మంటపము , మధ్య భాగాలలో విరాజిల్లే కరుణామూర్తి భగవతి శివ , ప్రతి ఒక్క బ్రహ్మాన్దాలలోని భక్తులకు ముక్తిని ప్రసాదించే తల్లి ,

మూడవ మంటపములో , ఘ్యాన మంటపము , భగవతీ అక్కడ కూర్చొని , ఘ్యానోపదేశము ఇస్తున్నది . నాలగవ మంటపము , లో ఎకాన్తమంతప సoఘ్యక్ నాలగవ మంటపములో భగవతి అనంగ కుసుమ ప్రజల రక్షణ విషయాలను చర్చిస్తుంటుంది

రాజా చింతామణి గృహము , అమ్మవారి యొక్క ప్రదానమైనట్టి నివాసము . అమ్మవారు మూలప్రకృతి రూపములో తమ తమ పది శక్తి తత్వాల సోపాన రూపములో ఉన్నది , భగవతి యొక్క మంచము చాల ఎత్తుగా ఉన్నది . బ్రహ్మ విష్ణు రుద్రుడు సదాశివుడు అక్కడ ఈ సున్దరమైనత్తి మంచానికి , నాలుగు కొల్ల వలే ఉన్నారు . మంచము పైన మన ఆదారాభిమాని పరమ పితా దేవదేవుడు , భువనేశ్వరుడు విరాజమానుడై ఉన్నాడు .

సృష్టి కి ఆదిలో , స్వయముగా భగవతి తానె రెండు రూపాలను ధరించి ప్రకతియైయ్ వచ్చింది . ఆ సమయాన కుడి భాగమునుండి భావనేశ్వరుడు , ఎడమ భాగాన సలిల బ్రహ్మ స్వరూపినిభువనేశ్వరి ప్రకటి తమైయ్యింది . భగవతి యొక్క అర్దాన్గుడు ఈ భగవానుడే , మహేశ్వరుడు . కామదేవుని అహంకారాన్ని దగ్ధము చేసినట్టి ఈ మహేశ్వరుడు కోటి కామదేవుల సౌన్దర్యము కలిగి ఉన్నాడు .

ఐదు ముఖాలు మూడు మూడు నేత్రాలతో శోభాయమానముగా ఉన్నడు . చింతా మణులతో విభూశితుడుగా ఉన్నాడు . తమ భుజాలలొ జింకా , అభయ ముద్ర , వరద ముద్రను పెట్టుకొని , పరసు ను ధరించి ఉన్నాడు .

అందరి పైన ఆధిపత్యము చేసేటి మాహా దేవుని వయస్సు పదహారు సంవత్సరాలవలె కనిపిస్తున్నాడు . కోట్ల కొద్ది సూర్యులవలె ప్రకాశిస్తుంటే , కోటి చంద్రులవలె చల్లగా ఉన్నాడు , అట్టి తెజములో కోటి చంద్రుల వంటి చల్లదనము ,

ప్రకాశములో కోటి సూర్యుల వంటి కాంతి . శుద్ధ స్పటిక మణి లా ప్రకాశించే భువనేశ్వరుడు , దేదీప్య మానముగా ప్రకాశిషిస్తూ , విరాజితుడై ఉన్నాడు . . తొమ్మిది రకాలుగా ఉన్న రత్నాల వడ్డాణo పెట్టుకొని భువనేశ్వరునికి వామాన్కములో కూర్చొని ఉన్నది భువనేశ్వరి దేవి . సన్నని నడుముకు వడ్డాణము ఏంతో శోభను చేకూర్చింది .

మేలిమి బంగారు భుజకీర్తులు ,వైదూర్యాలతో పొదగ బడి ఉంది అవి చేతి దండలకు ఎనలేని శోభను కలుగ చేస్తున్నాయి . భుజ కీర్తుల ఆకారము శ్రీ చక్రము వలెనె ఉన్నది .

om sree maatre namaha ,

మణి ద్వీప వర్ణన (12వ భాగము )

ఓం శ్రీ గురుభ్యో నమః , 
ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీ పరామ్బికయై నమః

అనేక రకాలైనటువంటి , మహాలక్ష్మిలు ఇక్కడ నివసిస్తున్నారు . అనేమగు కుబేరులు జగదమ్బ యొక్క కోశాగారాన్ని పరి రక్షణ చేస్తున్నారు . వరుణుని కి సంబంధిత కోణము లో రతీ దేవి , తో పాటుగా కామదేవుడు నివసిస్తున్నాడు . కామ దేవుని చేతి లో పాశము , అంకుశము , ధనుస్సు , అలo కార యుతముగా ఉంటాయి . శృంగారాలు ఇక్కడ నివసిస్తాయి . ఈశాన కోణము లో విఘ్నేశ్వరుడు తమ లాంటి గణే శులతో నిండి ఉంటాడు . తమ విభూతులు ,ఐశ్వర్యాలతో పాటుగా ఉంటాడు . బ్రహ్మ ప్రభుతి తమ విభూతులను సహితము బ్రహ్మ గా పేర్కొన్నారు . జగదంబకు ఇక్కడా సేవలు జరుగుతుంటాయి .

మహామరకత మని ప్రాకారము తరువాత్ , ప్రవరాల ప్రాకారము వస్తుంది . ఇక్కడ పంచ మహాభూతాల స్వామి నివసిస్తుంటాడు . ఇకాడి ప్రభలు . పగడాల ప్రాకారము . . వీరు తమ చేతుల్లో ఆయుధాలు ధరించి , నిల్చుంటారు . ఇవి ఐదు శక్తులు , వీరి పేర్లు , హల్ల్రేఖ , గగనా , రకటా , కరాలికా , మహోచ్చుష్మా . ఇక్కడి శక్తులు , కించిత్తు గర్వము తో ఉంటారు .ఈ దేవతలు కించిత్తు సౌoదరయ గర్వముతో ఉన్నారు. .

ఈ ప్రవ రాల ప్రాకారము అయ్యాక ,నవ రత్న ప్రాకారము వస్తున్నది . ఈ రత్నాలు అనేక యోజనాలవరకు వ్యాపించి ఉన్నాయి రంగు రంగుల ప్రభలతో ప్రకాశించే వీటి శోభ చెప్ప రా నిది . తొమ్మిది రంగుల రత్నాలు చక్కని వన్నెలతో చేముకు - చేముకు మంటూ ప్రకాశించగా చక్కని కాంతి సౌo దర్య వర్ణనను మనము చేయ గలమా ?

ఆగమ ప్రసిద్ధ దేవతలు ఇక్కడ నివసిస్తుంటారు . 7 కోట్ల మహా మంత్రం దేవతలు ఇక్కడ ఉంటారు . కోటి సూర్యుల వలే ప్రకాశమును చిoదించే ,వీరి అద్భుత లావన్యాలు చెప్పరానివి . మాహావిద్యల సమస్త అవతారాలు ఇక్కడే ఉంటాయి . శ్రీ దేవి రూపాలు అన్ని ఇక్కడే నివసిస్తాయి .

తొమ్మిది రత్నాల ప్రాకారము అయ్యాక వచ్చేది చింతామణి ప్రాకారము . ఇందులో ఒక అద్భుతమైనట్టి గుడి ఉంది . దీనిలో సూర్యుని వలే , చంద్రుని వలే , విద్యుత్తూ వలే వెలుగొందే అద్భుత మగునట్టి స్తంభాలు ఉన్నాయి . వీటి ప్రభల వెలుగులో మరో వస్తువే కనపడుట లేదు . ఇక్కడి వస్తువు లన్ని చింతామణి చే నిర్మితము . అయినవే !ఇక్కడ ప్రవహించే నదులన్నీ సుధా సింధు లో లీనమవుతున్నాయి . ఈ ప్రాకారానికి విశిష్ట శక్తి భువనేశ్వరీ దేవి . ఈ తల్లి భువనేశ్వరుని వామ భాగాన ఉన్నది .” ఆమె సాంగత్యమే , ఆ యన అక్కడ ఉన్నాడు .”అని పరాశాక్తికి కోటాను కోటి వందనాలు .”అమ్మ !నీకు జయము తల్లి “

om sree maatre namaha

sree shivaa shiva shaktyaikya roopini,
lalitaambikaayai namo namaha

మణి ద్వీప వర్ణన (11వ భాగము )


ఓం శ్రీ గురుభ్యో నమ:
ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీ పరామ్బికయై నమః

ముక్తామణి ప్రాకారము దాటాక , మహామరకత మణి ప్రాకారము వస్తున్నది . ఇది పది యోజనాలు పొడవును కలిగి ఉంది . ఇక్కడి మధ్య భూమి సహితము మహా మరకత మనణి చే నిర్మింప బడి ఉన్నది . ఇక్కడ సౌ భాగ్యాల సామగ్రి మరియు సమస్త భోగ సామగ్రులు అన్ని కలిగి ఉన్నాయి . ఈ ప్రాకారమున ఆరు కోణాలు కలిగినట్టి, భువనేశ్వరీ దేవి యంత్రము ఉన్నది .

ఇట్టి కొణాలపైన నివసించే దేవతలా పేర్లు వినండి , పూర్వ కోణం లో చతుర్ముఖ బ్రహ్మ , భగవతి గాయిత్రి దేవి వెంట , విరాజిమానుడు . కమండలము ,అక్ష సూత్రము . అభయ ముద్ర , దండము , శ్రేష్థ మగు ఆయుధాలు ధరించి ఉన్నాడు . గాయిత్రి దేవి సహితము అవే
ఆయుధాలు ధరించి ఉన్నది . వేదాలు మరియు,శాస్త్రాలు వీరితో పాటుగా నివసిస్తున్నాయి .
వీరి తో పాటుగా వ్యాహృతులు ఇక్కడే ఉన్నాయి .

నైరుతి కోణంలో శంఖ చక్రం , గదా కమలం ధరింఛి న ట్టి సావిత్రి దేవి నివాసము ఇక్కడే . విష్ణువు అదే వేషముల్ ఇక్కడే నివసిస్తారు . మత్స్య కూరం , విష్ణువు రూపాలు ఇక్కడ నివసిస్తుంటాయి .

గొడ్డలి అక్ష మాల , వరద , అభయం ముద్రలతో, రుద్రు డు వాయవ్యములో ఉంటాడు . భగవతీ సరస్వతి కూడా ఇక్కడే నివసిస్తుంటుంది . దక్షిణా మూర్తి గా , అన్ని రూపాలతో , పార్వతీ దేవీ తమ సమస్త రూపాల తో ఇక్కడ నివసిస్తున్నది . 64 ఆగమ శాస్త్రాలు , ఇక్కడే ఉన్నాయి .

కుబేరుడు తమ రెండు హస్తములలో రత్న కలశాలు పట్టుకొని , అగ్ని కొనం లో నివాసమున్తాడు . దేవీ సంపదలను కాపాడుకుంటూ ఆగ్నేయములో ఉంటాడు .
ఓం శ్రీ మాత్రే నమః …

మణి ద్వీప వర్ణన (10 వ భాగము )


ఓం శ్రీ గురుభ్యో నమ:
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ పరామ్బికయై నమః

ఇంద్ర నీల మణి ప్రాకారము దాటాక ,చాలా విశాలముగా ఉన్నట్టి ముక్తా ప్రాకారము వస్తుంది , ఈ ప్రాకారపు ఎత్తు పది యోజనములు .ఈ ప్రాకాపు భూమి సహితము ముక్తా మణి చే నిర్మితమైయ్యి ఉంది . ఇందులో కూడా మధ్య భాగాన , ఎనమిది దళముల కమలము ఉన్నది . ముక్తా ప్రభ్రుతి మణుల ఇట్టి కమలము కేసరాలచే ఎంతో శోభాయమానముగా ఉన్నది .

చల్లని దట్టమైన కాంతి ప్రభలతో సుందర శోభను కలిగి ఉన్నది . ఎనమిది రేకులపైన భువనేశ్వరీ దేవిలాగానేకనపడే దేవతలు ఎనమిది,రేకులపై విరాజ మానులై ఉన్నారు . వీరు అమ్మ వారి సచివలు .

అమ్మవారి మనోభావాలను యిట్టె తెలుసుకొనే సామర్థ్యము వీరికి ఉన్ది .
ఆకార ప్రాకారాలతో అమ్మవారినే పోలి ఉన్నారు . సమస్త కార్యాలను అవలీలగా నిర్వర్తించే సామర్థ్యము వీరికి ఉన్నది . అత్యంత సుందరీ మణులు , మరియు ప్రవీణులు . వీరు తమ ఘ్యానము ద్వారా సమస్త లోకాల యందు నివసించే ప్రాణుల సమాచారముతెలుసుకొని , అమ్మవారికి ఇస్తుంటారు . ఇది వీరి ప్రధాన కార్యము .

వీరి పేర్లు ఇలా ఉనాయి , అనంగ కుసుమ ,అనంగ కుసుమాతురా , అనంగ మదన,అనంగ మదనాతురా , భువన పాలా , గగన వేగా , శశిరేఖా , మరియు గగన రేఖా . వీరు ఎర్రని కాంతి తో ప్రాకాశిస్తుంటారు .వీరి హస్తములలో ,పాశం అంకుశం ,వరద ముద్ర అభయ ముద్రను చూపుతారు .ప్రతి క్షణం జగత్తుకు సంబంధిత వార్తలు భువనేశావారీ దేవికి ఇవ్వటమే వీరి ప్రధాన మయిన కార్యము .

om sree maatre namaha

మణి ద్వీప వర్ణన (9 వ భాగము )


ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ ప్రామ్బికాయై నమః

వైడూర్య మణి చే నిర్మితమైనట్టి ,అద్భుతముగు శోభల తో ఉన్న పరాకారము దాటాక ,ఇంద్ర నీల మణి ప్రాకారము వస్తుంది . పది యోజనాల వరకు ఉన్నట్టి ఈ ప్రాకారము అతి ఉత్తమ ప్రాకారము . నీల వర్ణ కాంతి ప్రభలతో పరాకాశించే ఈ ప్రాకారము తేజోమయ ప్రభలు చెప్పతరము కానిది . ఇక్కడి వాపి, కూప , తటాకములు ,అన్ని ఇంద్ర నీలము తో నిర్మితమైనవి .

ఇక్కడ అనేక యోజనాల వరకు విస్తృతముగా ఉన్నట్టి ఒక కమలము ఉన్నది
. పరమ ప్రకాశమానముగా ఉన్నది . ఈ కమలము , పదహారు వరుసల కలిగి ఉన్నది . కమలము పదహారు పొరలతో విచ్చుకున్నదా అన్నట్లు , , ఒక చక్రము పదహారు చక్రాల సమన్వయము తో పదహారు చక్రాలు ఉన్నావా ?అన్నట్లు ఉన్నది , పదహారు ,వరుస క్రమాలు కలిగిన ఈ కమలము లొ, అధిదేవతలు నివసించుటకు , తగిన చోటు ఉంది .

ఈ స్థానాలు , అన్ని విధాల సమృద్ధి ని కలిగి , ఇక్కడి శక్తుల పేర్లు ఇలా ఉన్నాయి , కరాలి ,వికరాలి , ఉమా , సరస్వతీ , శ్రీ , దుర్గా , ఉషా , లక్ష్మి , శృతి , స్మృ తి , ధృతి ,శ్రద్ధా , మతి ,మేధా , కాంతి , ఆర్యా , వీరు అందరు నీల మేఘము వలే ప్రకాశిస్తుంటారు . ఒకే లాగా కనపడే ఈ దేవతలు తమ చేతుల్లో , డ్హాలు , కత్తి ,పట్టుకొని యుద్ధము చేయవలె నన్న కాంక్ష తో నిలబడతారు . వీరంతా శ్రీ దేవి సేనానిలు ,

ప్రతి ఒక్క బ్రహ్మoడము లో ఉన్నట్టి ఈ దేవతలు బ్రహ్మాండాన్ని క్షుబ్దము చేయగల సామర్థ్యము కలిగినట్టి వారు . అనేక స్థానాలలో వీరు విహరిస్తుంటారు . సహస్ర ఫణాలు కలిగినట్టి శేష నాగు సహితము వీరి పరాక్రమము ను వర్ణించ లేడు .
ఓం శ్రీ మాత్రే నమః

మణి ద్వీప వర్ణన ( 8 వ భాగము )ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ పరామ్బికాయై నమః
వజ్ర ప్రాకారము తరువా వచ్చేది ,వైడూర్య మణి చే నిర్మింపబడిన ప్రాకారము . గోపురాలు అందమైన ద్వారాలచే నిర్మింపబడిన ప్రాకారము ,పది యోజనాల ఎత్తు ఉంది . ఇక్కడి బావులు , చెరువులు ప్రాకారములు , తలుపులు , చెట్లు , భూమి , సందులు రాజమార్గములు , సరస్సులు ,నదులు ,ఇసక , మొత్తము వైడూర్య మణుల చే నిర్మింపబడి ఉంది .
వ్యాసుల వారు జన్మేజేయుని తో ఇలా చెపుతున్నారు , “రాజన్ , ఇక్కడ బ్రాహ్మీ దేవతల సముదాయము ఉంటుంది . “ఈ దేవతలు తమ గణాలచే కూడి ఉంటారు . ఎంతో శోభను కలగాచేస్తూ ప్రకాశిస్తూ ఉంటారు . ప్రాతి ఒక్క బ్రహ్మాండ మాతృకల సమిష్టి రూపమే అని చెపుతారు .
బ్రాహ్మీ ,మాహేశ్వరీ ,కౌమారీ ,వైష్ణవీ ,వారాహీ ,ఇంద్రాణీ ,మరియు చాముండా .ఎనమిదవ మాతృకా మహాలక్ష్మి . వీరి రూపాలు అచ్చంగా బ్రహ్మా, విష్ణు , మహేశ్వరుల వలే ఉంటాయి .
నాలుగు ప్రాకారాలలో అమ్మవారి వాహానాలు , ఎంతో ముచ్చటగా ముస్తాబు అయ్యి ఇటు అటు తిరుగుతుంటాయి . ఇ ట్టి వాహనాలు కోట్ల కొద్ది ఉన్నయి . అవి ముగ్ధ మనోహర శోభను కలుగ చేస్తున్నాయి . ఈ విమానాలనుండి పెద్ద ధ్వని వస్తుంటుంది . అందులు ఎన్నో రకముల వాద్యాలు ఉన్నాయి .
om sree maatre namaha

మణి ద్వీప వర్ణన ( 7 వ భాగము )


ఓం శ్రీ గణేశాయ నమః ,
ఓం శ్రీ గురుభ్యో నమః ,
ఓం పరామ్బికాయై నమః 

గోమేద ప్రాకారము దాటాక , వజ్రాల ప్రాకారము కలదు . ఇందులో అన్ని వ్జరాలచే నిర్మించిన ద్వారాలు ప్రాకారాలు ఉన్నవి , తలుపులు గొలుసుల చే కట్ట బడి ఉంది , కొత్త వృక్షాలు ఈ ప్రాకారానికి శోభను కలుగ చేస్తాయి .

ఇక్కడి పక్షులు , లతలు , వృక్షాలు , ఇక్కడి భూమి , బంగళాలు , సందులు , రాజమార్గాలు అన్ని వజ్రము వాలే , ప్రకాశిస్తూ ఉంటాయి అందులో నుండి ప్రసరించే కాంతి పరి పరి విధాలుగా ,మెరుస్తూ శోభిల్లుతున్నది .

ఒక్కొక్క పరిచారిక సుందర మైన రూపము వర్ణించ రానిది , కించిత్తు అబిమాన గర్వము తోనణి కిసలాడగా ,సేవకొరకు తమ చేతుల్లో ఉన్నట్టి సామగ్రి పట్టుకొని , విశేషమైన ఆనందముతో నిల్చున్న తీరు (అమ్మ సేవా భాగ్యము )పొంది గర్వ పడే వారు , లక్షల కొద్ది దాసీ మణులు ఉంటారు

. కొందరు పాదాలు వోత్తి తే మరి కొందరు చిత్ర లేఖనము చేస్తూ , ఆభూష్ ణా లు పెడుతూ, కొందరు శిరోజాలు సవరిస్తూ , ఏంతో మంది , అమ్మమీద ప్రేమ తో భక్తీ తో సేవలు చేస్తుంటారు

. వీరిని శివ దూతికలు అని అంటారు . వీరి పేర్లు అనంగ రూపా , అనంగ మదన ,సుందరి , మదనాతురా , భువన వేగా , భువన పాలిక , సర్వ శిశిరా, అనంగ వేదాం, అనంగ మేఖల . వీరి సంపూర్ణ శరీర ఛాయా విద్యుత్తు లాగ మేరుస్తుంటుంది . నడుము కు చక్కని వొడ్డానము , చిన్న చిన్నమువ్వ లతో నిర్మితమై ఉన్నది .

కా ళ్ళకు మువ్వలు , నడవగా నూపూర్ శబ్దాలు వినటానికి ఇంపుగా ఉంటాయి . వీరు శర వేగముతో ,బయటకు లోపలికి దూసుకో వస్తు పోతుంటారు . చేతిలో
ఓక బెత్తం తీసుకొని తిరుగుతుంటారు . వీరికి ఉత్తమ కోటి వాహనములు , కలిగి ఉంటారు . వీరు అన్ని కార్యములు చక్కగా నిర్వర్తించే నేర్పును కలిగి ఇంటారు . ఈ విధముగా ఈ అందమైన క్షేత్ర ము ఈ దూతికల నివాస స్థానము .
om sree maatre namaha

మణి ద్వీప వర్ణన ( 6 వ భాగము )


మణి ద్వీప వర్ణన (పార్ట్ 6)
ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం పరామ్బికాయై నమః 

పద్మ రాగ ప్రాకారము అయ్యాక , గోమేద రత్న ప్రాకారము వస్తుంది . ఇది పది యోజనాలవరకు ఉన్నది . బంగారు కాంతుల మధ్య మందార పూలవలె మెరుస్తూ కాంతు ల ప్రసారము జరుగుతున్నది , గోమెద ప్రాకారాలవలె స్తంభాలు , రత్నజతటి త ముగా ఉన్నట్టి స్తంభాలు మెరుపులతో ఉన్నాయి , అలాగే చెట్లు వృక్షాలు బంగారు వన్నెల తో మధ్యన ఎరుపుమందారాలవలె మెరుస్తూ , శోభను కలుగ చేస్తున్నాయి .

ఇక్కడి బావులు , పక్షులు, స్తంభాలు , సరోవరాలు అన్ని గోమెద మణి చే నిర్మింప బడినవి . గోమేదము నుండి మందార పూల వలే వచ్చే కాంతి ,ఈ రెండిటి కి పరస్పర ముగా , చక్కని కలియికగా భాసిస్తున్నది . అందులో నుండి అరుణ కాంతుల శోభ వర్ణించ టానికి మాటలే అందవు .

వీటి మధ్యన 32 ప్రసిద్ధ శక్తులు నివసిస్తాయి . ఈ శక్తులు అన్ని విధాల అస్త్రాలతో విభూషితలుగా ఉన్నారు . ఈ దేవతా శక్తులు నలు వైపులా ఉంటాయి . ఈ గోమేద ప్ర్రాకారములో శక్తులు చూడటానికి భయంకరముగా కనపడతాయి . యుద్ధము కొరకు ,”సింగారించుకొని” నిలబడతాయి . ఈ లోకము లోని పురుషులు ఈ దేవతలను నిత్యమూ పూజిస్తుంటారు . క్రోధముతో నున్నట్టి ఈ దేవతల కనులు ఎర్రగా ఉంటాయి . “కొట్టండి , జీర్నించుకోండి , గుచ్చి చంపండి , భస్మము చేయండి అని నిరంతరమూ ఉచ్చరిస్తుంటారు .
ఒక్కొక్క మహా శక్తికి పదేసి అక్షుహినీ సేనలు ఉన్నాయి ఇందులోని ఒక్కోక్క శక్తికి , లక్ష బ్రహ్మాo డా లను సంహరించే శక్తి ఉన్నది . ఈ లాంటి విభూతిల సమైక్య శక్తిని అసలు అంచనా వేయగలమా ?వీరి రథాలు వాహన్నలు ఆన్చాన్న కట్టలేము . జగదంబ శక్తుల యుద్ధ సంబంధిత అస్త్రాలు శాస్త్రాలు అన్ని ఇక్కడ ఉన్నాయి . ఇవన్ని భగవతి యొక్క అంతరంగిణి సైన్యాలు . పాప నాశము చేయు పేర్లు వినండి . విధ్యా ,హ్రీ , పుష్టి ప్రఘ్య ,సినీవాలి , కుహూ ,రుద్రా, వీర్యా , ప్రభా , ఆనందా , పోషిణి , ఋద్ధిదా ,కాలరాత్రి , మహారాత్రి , భద్రకాళి , కపర్దిని , వికృతి ,దండిని , మున్డి ని , సెందు ఖండా , శిఖండిని,నిశుమ్భ శుమ్భ మథని , మహిషాసుర మర్దిని , ఇంద్రాణి , రుద్రాణి , శంకరార్ధ శరీరిణి , నారీ , నారాయణీ , త్రిశూలిని , పాలిని అంబికా , హ్లాదిని . ఈ దేవతలు కుపితులైతే బ్రహ్మాండాన్ని వెంటనే భస్మము చేయు శక్తి ఉన్నవారు . వీరికి ఎక్కడ పరాజయమే లేదు .
om sree maatre namaha

మణి ద్వీప వర్ణన (5వ భాగము )


మణి ద్వీప వర్ణన -(part 5)

om sree gurubhyo namaha ,om mahaa ganaadhipataye namahaom parabrahma sameta paaraambikayai namaha 

వ్యాసులవారు చెప్పుతున్నారు , రాజా !పుష్పరాగ ప్రాకారము తరువాత ,కుంకుమ రంగు వర్ణము గల పద్మరాగమణి ,ప్రాకారము ఉంది . ఇక్కడి మధ్య భూమి సహితము ఇదే వర్ణము కలిగి ఉంది . పది , యోజనాలు పొడవు , అనేకమగు గోపురాలు ,వందల కొద్ది పద్మరాగ మణిమయ స్తంభాలు మధ్య గా అనేకమగు ఆయుధాలు చేత బట్టుకొని ,వీరుల వలే 64 కళలు ఇక్కడ నివసిస్తారు , వీరికి వేరు వేరు లోకాలు ఉన్నాయి . తమ తమ లోకాలకు అధీశ్వరిణులు . తమ తమ వాహనాల పైన కూర్చున్నట్టి ఈ కళలు ఏంతో , శోభను కలిగి ఉన్నాయి . ఇవి -

పింగలాక్షి ,విశాలాక్షి , సమృద్ధి , బుద్ధి , శ్రద్ధ ,స్వధా , అభిఖ్యా , మాయా , సంఘ్యా ,వసుంధర త్రిలోకదాత్రీ ,
సావిత్రి, గాయిత్రి ,త్రిదశేశ్వరి ,సురూపా , బహురూపా , స్కన్దమాతా ,అచ్యుత ప్రియా , విమలా ,అమలా , అరుణీ ,ఆరుణీ , ప్రక్రుతి , వికృతి , సృష్టి , స్థితి , సంహృతి , మాతా ,సంధ్యా , పరమ సాధ్వీ ,హంసీ ,మర్దికా , వజ్రికా, దేవమాతా,భగవతీ ,దేవకీ,కమలాసనా,త్రిముఖీ , సప్తముఖీ , సురాసుర విమర్దిని , లంబోష్టి ,ఊర్ధ్వ కేశీ , బహుశీర్షా వృ కోదరీ ,రథ రేఖా , శశిరేఖా , గగన వేగా , పవనవేగా , భువనపాలా , మదనాతురా , అనంగా , అనంగ మథనా , అనంగ మేఖలా , అనంగ కుసుమ , విశ్వరూపా, సురాదికా ,క్షయంకరీ ,శక్తి అక్షోభ్య సత్య వాదిని , బహురూపా, శుచివ్రతా ఉదారా , మరియు వాగీశ్వరీ ,

ఈ కళ లన్ని, తమ ముఖమునుండి అగ్నిని ప్రజ్వలిస్తుంటాయి . మేము నీరు మొత్తముగా త్రాగేస్తాము అంటున్నాయి . ,అగ్ని మా ముందు నిలువలేడు ,వ్యువును మేము ఆపగాలము , ఈ కలలన్ని ఎప్పుడు కోపముతో ఉంటాయి . ఒక్కకొక్క శక్తికి లక్షలకొద్దీ బ్రహ్మాన్దాలను సంహరించా గలిగే శక్తి వీరికి ఉన్నది ,అన్ని రకాల ఆయుధాలతో వీరు ఉన్నారు వీరికి వంద వంద అక్షౌహిని సేనలు ఉన్నాయి . సశేషము …
om sree maatre namaha

మణి ద్వీప వర్ణన (4వ భాగము )


మని ద్వీప వర్ణన (4వ భాగము )

ఓం శ్రీ గురుభ్యో నమః , ఓం శ్రీ గణేశాయ నమః ,ఓం పరాంకాయై నమః . om shivaya namaha

సువర్ణ ప్రాకారము అయ్యాక , కుంకుమ వర్ణము గల పుష్ప రాగ మణి చే నిర్మితమైన ప్రాకారము ఉన్నది . ఏడూ యోజనాల వరకు పొడవు కలిగి ఉన్నది ,అక్కడి  భూమి ,వనాలు ఉపవనాలు అన్ని పుష్పరాగము వలే మెరుస్తూ ఉన్నాయి . అక్కడి ఇసుక రేణువులు కూడా పుష్పరాగము వలే ఉన్నాయి .  . ఎ రంగులతో అక్కడి ప్రాకారము నిర్మితమై ఉన్నదో అట్టి వర్ణముతోనే అక్కడి చెట్లు వనాలు ,నీరు , మంటపాలు , స్తంభాలు , పృథ్వీ , సరోవరాలు , మరియు తామర పూలు సహితము అదే రంగులతో అద్భుత శోభను కలుగ చేస్తున్నాయి , అంతే  కాదు , ఒక్కో ప్రాకారము మరో దాని కంటే లక్ష రెట్లు ఎక్కువ వెలుగును కలుగ చేస్తున్నాయి . ప్రతి ఒక్క, బ్రహ్మాండానికి ఉన్నట్టి ఇంద్రాది ది గ్పాలకులు ,ఒక సమాజముగా అక్కడ చేతుల్లో ఆయుధాలు ధరించి తిరుగాడుతుంటారు . ఈ మణి ద్వీపానికి తూర్పున,ఎత్తైన శిఖరాలతో కూడుకున్నట్టి  ,అమరావతి పురి ఉంటుంది , రకరకాల ఉపవనా లు తో ,ఏంతో  శోభను కలిగి ఉంది . .   . ఈ నగరము  దేవరాజు ఇంద్రు నిది , ఎంతో  శోభను కలిగిన ఈ  నగరము  ,స్వర్గము కంటే అద్భుత సౌoదర్యము కలిగి ఉంటుంది. వేల కొద్ది రేట్లు ఎక్కువ గుణాలతో కూడినట్టి  , ఈ నగరానికి అధిపతి ఇంద్రుడు ,ఐరావతమును ఎక్కి దేవసేన తో కూడి శోభాయమానముగా ఉన్నాడు . శచి దేవి తమ దేవాన్గానల వెంట శోభాయమానముగా ఉన్నది . మణి ద్వీపానికి ,ఆగ్నేయమున ,” స్వాహా , స్వదాలు “,అగ్ని దేవుని తో చేరి ఇక్కడ నివసిస్తుంటారు . మణి ద్వీపానికి దక్షిణమున యమరాజ పూరి ఉంది . సూర్యుని పుత్రుడు యమ ధర్మ రాజు , తమ చేతుల్లో విశాలమైనట్టి దండన చేసే యమ దండమును చేత బట్టి ,తమ సహా ధర్మ చారిణి తో చేరి అచట నివాసము ఉంటాడు . చిత్ర గుప్తుని నివాసము సహితము ఇక్కడే ఉంటుంది . నైరుతి లో రాక్షస నివాసము ఉంటుంది .  నైరుతి తమ శక్తులచే అక్కడ నివసితుంటాడు . పశ్చిమాన వరుణ  రాజు ఉంటాడు . మహా మత్స్యము ఈతని స్వారి . ఈ మహామత్స్యము పైన ఎక్కి , మధుమయ మధుపానము చేస్తూ,తమ గణాలచే , తమ భారతో ఇక్కడ నివాసముo టాడు . మణి ద్వీపానికి వాయవ్య కోణము లో,వాయు దేవుడు ఉంటాడు . ప్రానాయామమునందు   కౌశల్యుడు . ఈయన చుట్టూ యోగి జనులచేరి  ఉంటారు  . వాయుదేవుని స్వారి మ్రిగము . ఈయన్ శక్తి ఈయన తో ఉంటుంది మురుద్గణా లు వీరితో నే ఉంటాయి . మణి ద్వీపానికి ఉత్తర దిశగా యక్షుల సామ్రాజ్యము ఉంటుంది వీరికి స్వామి కుబేరుడు . ఈయన మూడు శక్తులు ఋద్ధి ,వృద్ధి , ప్రవృద్ధి చే ఉంటాడు . . మణి భద్ర , పూర్ణ భద్ర , మణిమాన్ ,మనణి కంధర ,మణి భూషణ,మణిమాలి మణి ధనుర్ధర , నవనిధులు, యక్షు సేనలు , తో సహా ఇక్కడ కుబేరుడు నివసిస్తాడు .   మణి ద్వీపానికి ఈశాన్యములో రుద్రా లోకం ఉంటుంది . అమూల్య మగు ర త్నాలచే నిర్మితము అగునట్టి , ఈ లోకము రత్నమయ లోకము , ఇక్కడ రుద్రుని నివాసముంటుంది . ఈయన క్రోధమయ నేత్రాలవలన రూపము క్రొధముగా ఉన్నట్లుంటుంది .  వీపు పైన బాణాలు, పెట్టుకునే అమ్ముల పొది , చేతులో ధనుస్సు పట్టుకొని అసంఖ్యాకమగు రుద్రుల నివాసము . సహయోగముగా ఉన్నట్టి రుద్రా గణాల ముఖము , క్రొధముగా ఉన్నాయి . నోటిలోంచి అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి . కొందరికి పది చేతులు మరి కొందరికి వందల కొద్ది చేతులు . మరి కొందరికి వేల కొద్ది చేతులు ఉన్నాయి . ఉగ్ర మోర్త రుద్రులకు పదేసి  కాళ్ళు ఉన్నాయి . వీరు అంతరిక్షములో మరియు భూలోకములో విహారము చేస్తుంటారు . రుద్రా ధ్యాయములో స్తుతించ బడ్డ శివుడు ఇక్కడే నివసిస్తాడు . కోట్ల కొద్ది రుద్రగణా లు , భద్ర కాళీలు మాత్రు గణాలు ,ఇక్కడే ఉంటారు . వీర భద్రుడు ఇక్కడే నివాసిస్తుంటాడు . వీరి శోభ విచిత్రము . వీరి మెడలో ముండ మాల ,చేతులకు సర్పాలు . భుజము పైన సర్పము అగు యఘ్యోపవీతము , శరీరము పైన వ్యాఘ్ర చర్మము , ఉత్తరీయముగా గజ చర్మము , సమస్త శరీరము పైన వీభూతి పులుముకొని , వీరి డమరూక ధ్వని చే దిక్కుల కు చెవుడు పట్టుకుందట !. వీరి అ ట్ట హాస సము తో  సమస్త ఆకాశము మారు మ్రోగుతుంటుంది . వీరిని ఎల్లప్పుడూ భూత గణాలు చుట్టు  ముట్టి ఉంటాయి .  ఈశాన దిక్కున ఉంటున్నందున శివునికి , ఈశానుడు అన్న పేరు వచ్చింది . ఓం శ్రీ మాత్ర నమఃఓం శ్రీ గురుభ్యో నమః , ఓం శ్రీ గణేశాయ నమః ,ఓం పరాంకాయై నమః . om shivaya namahaసువర్ణ ప్రాకారము అయ్యాక , కుంకుమ వర్ణము గల పుష్ప రాగ మణి చే నిర్మితమైన ప్రాకారము ఉన్నది . ఏడూ యోజనాల వరకు పొడవు కలిగి ఉన్నది ,అక్కడి భూమి ,వనాలు ఉపవనాలు అన్ని పుష్పరాగము వలే మెరుస్తూ ఉన్నాయి . అక్కడి ఇసుక రేణువులు కూడా పుష్పరాగము వలే ఉన్నాయి . . ఎ రంగులతో అక్కడి ప్రాకారము నిర్మితమై ఉన్నదో అట్టి వర్ణముతోనే అక్కడి చెట్లు వనాలు ,నీరు , మంటపాలు , స్తంభాలు , పృథ్వీ , సరోవరాలు , మరియు తామర పూలు సహితము అదే రంగులతో అద్భుత శోభను కలుగ చేస్తున్నాయి , అంతే కాదు , ఒక్కో ప్రాకారము మరో దాని కంటే లక్ష రెట్లు ఎక్కువ వెలుగును కలుగ చేస్తున్నాయి . ప్రతి ఒక్క, బ్రహ్మాండానికి ఉన్నట్టి ఇంద్రాది ది గ్పాలకులు ,ఒక సమాజముగా అక్కడ చేతుల్లో ఆయుధాలు ధరించి తిరుగాడుతుంటారు .ఈ మణి ద్వీపానికి తూర్పున,ఎత్తైన శిఖరాలతో కూడుకున్నట్టి ,అమరావతి పురి ఉంటుంది , రకరకాల ఉపవనా లు తో ,ఏంతో శోభను కలిగి ఉంది . . . ఈ నగరము దేవరాజు ఇంద్రు నిది , ఎంతో శోభను కలిగిన ఈ నగరము ,స్వర్గము కంటే అద్భుత సౌoదర్యము కలిగి ఉంటుంది. వేల కొద్ది రేట్లు ఎక్కువ గుణాలతో కూడినట్టి , ఈ నగరానికి అధిపతి ఇంద్రుడు ,ఐరావతమును ఎక్కి దేవసేన తో కూడి శోభాయమానముగా ఉన్నాడు . శచి దేవి తమ దేవాన్గానల వెంట శోభాయమానముగా ఉన్నది .మణి ద్వీపానికి ,ఆగ్నేయమున ,” స్వాహా , స్వదాలు “,అగ్ని దేవుని తో చేరి ఇక్కడ నివసిస్తుంటారు . మణి ద్వీపానికి దక్షిణమున యమరాజ పూరి ఉంది . సూర్యుని పుత్రుడు యమ ధర్మ రాజు , తమ చేతుల్లో విశాలమైనట్టి దండన చేసే యమ దండమును చేత బట్టి ,తమ సహా ధర్మ చారిణి తో చేరి అచట నివాసము ఉంటాడు . చిత్ర గుప్తుని నివాసము సహితము ఇక్కడే ఉంటుంది . నైరుతి లో రాక్షస నివాసము ఉంటుంది . నైరుతి తమ శక్తులచే అక్కడ నివసితుంటాడు . పశ్చిమాన వరుణ రాజు ఉంటాడు . మహా మత్స్యము ఈతని స్వారి . ఈ మహామత్స్యము పైన ఎక్కి , మధుమయ మధుపానము చేస్తూ,తమ గణాలచే , తమ భారతో ఇక్కడ నివాసముo టాడు .మణి ద్వీపానికి వాయవ్య కోణము లో,వాయు దేవుడు ఉంటాడు . ప్రానాయామమునందు కౌశల్యుడు . ఈయన చుట్టూ యోగి జనులచేరి ఉంటారు . వాయుదేవుని స్వారి మ్రిగము . ఈయన్ శక్తి ఈయన తో ఉంటుంది మురుద్గణా లు వీరితో నే ఉంటాయి .మణి ద్వీపానికి ఉత్తర దిశగా యక్షుల సామ్రాజ్యము ఉంటుంది వీరికి స్వామి కుబేరుడు . ఈయన మూడు శక్తులు ఋద్ధి ,వృద్ధి , ప్రవృద్ధి చే ఉంటాడు . . మణి భద్ర , పూర్ణ భద్ర , మణిమాన్ ,మనణి కంధర ,మణి భూషణ,మణిమాలి మణి ధనుర్ధర , నవనిధులు, యక్షు సేనలు , తో సహా ఇక్కడ కుబేరుడు నివసిస్తాడు .మణి ద్వీపానికి ఈశాన్యములో రుద్రా లోకం ఉంటుంది . అమూల్య మగు ర త్నాలచే నిర్మితము అగునట్టి , ఈ లోకము రత్నమయ లోకము , ఇక్కడ రుద్రుని నివాసముంటుంది . ఈయన క్రోధమయ నేత్రాలవలన రూపము క్రొధముగా ఉన్నట్లుంటుంది . వీపు పైన బాణాలు, పెట్టుకునే అమ్ముల పొది , చేతులో ధనుస్సు పట్టుకొని అసంఖ్యాకమగు రుద్రుల నివాసము . సహయోగముగా ఉన్నట్టి రుద్రా గణాల ముఖము , క్రొధముగా ఉన్నాయి . నోటిలోంచి అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి . కొందరికి పది చేతులు మరి కొందరికి వందల కొద్ది చేతులు . మరి కొందరికి వేల కొద్ది చేతులు ఉన్నాయి . ఉగ్ర మోర్త రుద్రులకు పదేసి కాళ్ళు ఉన్నాయి . వీరు అంతరిక్షములో మరియు భూలోకములో విహారము చేస్తుంటారు .రుద్రా ధ్యాయములో స్తుతించ బడ్డ శివుడు ఇక్కడే నివసిస్తాడు . కోట్ల కొద్ది రుద్రగణా లు , భద్ర కాళీలు మాత్రు గణాలు ,ఇక్కడే ఉంటారు . వీర భద్రుడు ఇక్కడే నివాసిస్తుంటాడు . వీరి శోభ విచిత్రము . వీరి మెడలో ముండ మాల ,చేతులకు సర్పాలు . భుజము పైన సర్పము అగు యఘ్యోపవీతము , శరీరము పైన వ్యాఘ్ర చర్మము ,ఉత్తరీయముగా గజ చర్మము , సమస్త శరీరము పైన వీభూతి పులుముకొని , వీరి డమరూక ధ్వని చే దిక్కుల కు చెవుడు పట్టుకుందట !. వీరి అ ట్ట హాస సము తో సమస్త ఆకాశము మారు మ్రోగుతుంటుంది . వీరిని ఎల్లప్పుడూ భూత గణాలు చుట్టు ముట్టి ఉంటాయి . ఈశాన దిక్కున ఉంటున్నందున శివునికి , ఈశానుడు అన్న పేరు వచ్చింది .ఓం శ్రీ మాత్ర నమః

మణి ద్వీప వర్ణన ,(పార్ట్ 3)


మణి ద్వీప వర్ణన ,(పార్ట్ 3)
om sree gurubhyo namaha ,
om sree ganeshaaya namaha 
om sree maatre namaha

అమ్మవారి మణి ద్వీపములో నున్నట్టి గాజు ప్రాకారము ,లో సంతాన వాటిక , దానికి స్వామి గ్రీష్ముడు అతని పత్నులు శుక శ్రీ , శుచిశ్రీ లు , అది , దేవతలు ,సిద్ధ పురుషులు ,తిరుగాడే స్థలము అని మనము చెప్పుకున్నాము , ఇక్కడి నీడలో, సంతప్తులగు,దుక్ఖము తో ఉన్నట్టి ప్రాణులు సేద తీరుతుంటారు .

ఆ పైన ఇత్తడి ప్రాకారము లో ,మలయగిరి వృక్ష వాటిక ఉంది . ఇక్కడ వర్ష్ ఋతువు ,తమ 12 శక్తులగు భార్యలతో నివసిస్తుo తాడు ,కొత్త పల్లవులతో తీగ లతలతో చక్కని వృక్ష సంపదలతో ఉండే ఈ వనము లో , దేవి కి యఘ్య -యాగాదుల కర్మలు చేసేటి వారు , దేవతలు , మరియు పుణ్యాల ను, దేవ తార్పాణ చేసేవారు , సత్కర్మలును కేవలము ధర్మమూ అన్న బుద్ధి ఆచరించేవారు , ఇక్కడ నివసిస్తారు . అని చెప్పుకున్నాము .

ఇప్పుడు పంచ లోహాలతో నిర్మితమైనట్టి ప్రాకారము ను గూర్చి చెప్పుకుంటున్నాము . ఇది ఏడు యోజనాల పర్యo తము ఉన్నది . దీనికి మధ్యగా మందార వృక్షాల వాటిక ఉన్నది .ఈ వనము , రకరకాల పువ్వులు ,రకరకాల చెట్లు , కమ్మని సువాసనలతో ,సుందరమైన వృక్ష సంపదలతో మిక్కిలి శోభను తెచ్చి పెట్టింది . పరమ పవిత్రుడు అగునట్టి , శరద్ ఋతువు దీనికి అధిష్టుడు . ఇతనికి ఇద్దరు భారాలు ఇషు లక్ష్మి,ఉర్జ లక్ష్మి . తమ అనుచరులు మరియు సిద్ధ పురుషులు తో ఇక్కడ వీరి నివాసము . ఏ డవ ప్రాకారము , వెండి ప్రాకారము . ఒక విశాలమైన శిఖరము , ఈ ప్రాకారానికి, ఉన్నట్టి శోభను మరింతగా పెo చుతున్నది . దీనికి మధ్యా భాగము లో పారిజాత వనా లు ఉన్నయి . రక రకాల పూవులు ,గుత్తులు గుత్తులుగా పూఛి , వింత శోభాలను చేకూర్చుతున్నది . వీటి సువాసన్ పది యోజనాల వరకు వ్యాపించి ఉన్నది . ఈ పుష్పాల తో దేవి అర్చనలు జరుగుతుంటాయి . ఇక్కడ దేవి గణాలుకు అమ్మవారికి యాఘ్య యాగాడులగు క్రతువులు జరుగుతుంటాయి , ఈ ప్రాకారమునకు స్వామి ,హేమంత ఋతువు . ఈయన , తమ చేతుల్లో ఆయుధాలు ధరుంచి నిల్చుంటాడు . ఈయన గణాలు సహితము , తమ చేతుల్లో ఆయుధాలు ధరించి నిల్చుంటారు .ఇక్కడ ,రాగ రాగిణుల
నాదము వినబడుతుంటుంది . మధుర రాగాలాపన జరుగుతుంటుంది . ఇయన శక్తులు ”సహశ్రీ ,సహస్య శ్రీ . భగవతి కృ చ్చ ., ఉపాసన జారుతుంది . వ్రతాన్ని ఆచరిస్తూ ఉండే ఉపాసకులు సిద్ధ పురుషులు కనపడుతుంటారు .

వెండి ప్రాకారము అయిన తరువాత ఎనమిదవ ప్రాకారము ,సౌవర్ణ శాల అని అంటారు .దీని పొడవు ఏడు యొజనాలు . ఇక్కడ కదంబ వనము ఉంది కదంబ పుష్పాల చే ఈ ప్రాకారము శోభాయమానముగా ఉన్నది . ఈ ప్రాకారము బoగారము తో చేయబడింది . పుష్పాలు పల్లవాలు దీని శోభను పెంచుతున్నాయి . ఇక్కడి అధిదేవతా గ్రీష్మ ఋతువు . ఈయన తమ పత్నుల,తప; శ్రీ మరియు తపస్యా శ్రీ ల తో కలిసి ఉంటూ తమ పనులు చేస్తుంటాడు .
om sree maatre namaha

మణి ద్వీప వర్ణన . (2వ భాగము )ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ శివ శక్త్యైక్య రూపిణ్యై నమః 
పార్ట్ 1 లో ముందుగ అమృతసాగరము ,తరువాతచతురస్రాకరముగా ఉన్నట్టి , లోహ ప్రాకారము , ఆపిన కాంస్య ప్రాకారము , ఆ తరువాత తామర ప్రాకారము అందులో వసంతుడు తమ ఇద్దరు పత్నుల సమేతుడిగా నివసిస్తుంటాడు . 
సుందరమైన శోభలతో ఉన్నట్టి ఈ వనము కో కిలల నినాదము తో గుంజిత మై ఉన్నది 

,.తామ్ర ప్రాకారము , తరువాత వచ్చేది,గాజు ప్రాకారము , దీని ఎత్తు ఏడు యోజనాలు . ఈ రెండు ప్రాకారాల మధ్యన సంతాన వాటిక ఉంది . ఇందులో అన్ని రకాల వృక్షాలు ఉన్నాయి .ఈ వనము లోని పుష్పాల సౌరభము పది యోజనాల వరకు ఉంది . నిరంతరుముగా వికసిo చే ఈ పూవ్వులు , సువర్ణమయ కాంతులచే శోభిల్లు తున్నాయి . అమృతము చే నిండిన రసాల పలాలు ,ఎంతో మధుర ముగా ఉంటాయి . ఈ వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు . అతనికి ఇద్దరు భార్యలు . శుక్ర శ్రీ , శుచి శ్రీ . ఇక్కడ, సంతాపమును కలిగినట్టి ప్రాణులు ఈ నీడలో తల దాచుకొని సేద తీరుతుంటారు . ఇక్కడి మూల - మూలలో సిద్ధ పురుషులు ఉంటారు . ఎల్లప్పుడూ సిద్ధ పురుషులు మరియు ,దేవతలు తో నిండి ఉంటుంది క్షేత్రము .
నిండి ఉంటుంది క్షేత్రము .

రాజా! ఈ గాజు ప్రాకారమును దాటాక ,ఇత్తడి ప్రాకారము వస్తుంది . దిని పొడవు ఏడు యోజనాలు పర్యంతం . ఈ రెండు ప్రాకారాల మధ్యన మలయ గిరి వృక్ష వాటిక ఉంది .మేఘాలపైన విహరించే వర్ష ఋతువు , ఇక్కడి అవసరాలను చూస్తూ ఉంటాడు . వీరి నేత్రాలు పింగల వర్ణము తోనూ ఉన్నాయి . . ఈయన మేఘాల కవచము తొడుక్కొని ఉంటాడు , వర్షము కురుస్తున్నప్పుడు విద్యుత్ తరంగాలు కలిగి నప్పుడు వచ్చీ ,ఉరుములే శబ్దాల ధ్వని . ఇంద్ర ధనుస్సు ఈయన ధనుస్సు . తమ గణాల సహకారముతో కురిపించే వర్షపు ధారలు ఈతని సహజ గుణం . “నభశ్రీ: ,నభ్యస్య శ్రీ , స్వరస్యా ,రస్య మాలిని ,అమ్బాదులా , నిరత్రి ,అభ్ర మంతి ,మేఘయంతికా ,వర్షయంతి,చిబుణికా ,వారి ధారా ,సమ్మతా. ఈ పన్నెo డు శక్తులు వర్ష ఋతువు భార్యలు .

ఈ ప్రాకారము ,నూతన పల్లవాలు ,లతలతో ఎల్లప్పుడూ నిమిడి ఉంటుంది . పలు రకాల వృక్షాలు తో శోభాయమానముగా ఉంటుంది . నదీ నదులు , ఇక్కడ ,చాలా వేగముగా ప్రవహిస్తుంటాయి ,ఇచట దేవతలు , సిద్ధ పురుషులు మరియు , దేవి కొరకు ,నిరతముగా యఘ్య యాగాదుల చేసే పురుషులుంటారు . వాపి , కోప తడాగాలు , చెరువులు , బావులు ,సరస్సులు మొదలగు త్రవ్వించి భగవద్ అర్పణము చేసే వారు (ఇలాంటి పుణ్య ప్రద మైన పనులు చేసి పుణ్య ఫలాన్ని భగవదర్పణ ము చేసే మాహానుభావులు ఇక్కడ ఉంటారు , ఎట్టి ఫలాపేక్ష లేకుండా మంచి పనులు చేసేవారు అన్నమాట ). ఓం శ్రీ మాత్రే నమః ..
సశే సము .....

మణి ద్వీప వర్ణన (part 1)

మణి ద్వీప వర్ణన (part 1)

ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః , ఓం పరామ్బికాయై నమః 
జనమేజయుడు , వ్యాసులవారిని ఓకే ప్రశ్న అడిగాడు , మహామునే !జగదంబ కథామృ తము , చాల ఆదరణీయము . మహిషాసురుణ్ణి చంపినా తరువాత మహాలక్ష్మి ఎటు వెళ్ళింది ?అని ,వైకుo ఠా నికా? లేక సుమేరు గిరి కా ? ఆ తల్లి ఎటు వెళ్లినట్టు ?అని అడుగగా,

" మణి ద్వీపము ,అత్యంత రమణీయము  , అమ్మవారికి అది క్రీడా స్థలము ,అక్కడకు వెళ్ళగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు స్త్రీగా మారవలసి వచ్చింది .  మళ్ళీ పురుషత్వము పొంది , తమ కార్యాలలో నిమగ్నులయ్యారు . ఆ పరమదామము అమృత సాగరము మధ్యన ఉన్నది . అక్కడ జగదంబా తీరు తీరు రూపాలలో విచరణ చేస్తుంది . దేవతలు స్తుతిo ఛినా అనoతరము అమ్మ కల్యానరూపిని అచటికే విచ్చేసింది . ఆమె మాయా శక్తి , మరియు సనాతన . ఆ దివ్య స్థలము లో అవిరామముగా కీర్తనలు జరుగుతుంటాయి . బ్రహ్మ లోకానికి పైన సర్వలోకం ఉంది , అదే మణి ద్వీపము . ఈ ద్వీపమున కు ఉన్నంత సౌo దర్య ము మరి ఎ ద్వీపానికి లేదు . 

అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి , తరంగాల ,చల్లని తుమ్పరలను మోసుకోస్తుంటాయి . 
గాలి వలన ఉవ్వెత్తున లేచే అలలు , ఆ ద్వీపానికి ఏంటో శోభను కలుగ చేస్తున్నది . 
అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి , తరంగాల ,చల్లని తుమ్పరలను మోసుకోస్తుంటాయి . 
గాలి వలన ఉవ్వెత్తున లేచే అలలు , ఆ ద్వీపానికి ఏంతో  శోభను కలుగ చేస్తున్నది . 

ఇక్కడి ఇసు,క రత్నాల  మయము . అందులో చిన్న- చిన్న శంఖు లు ఉన్నాయి . ఒడ్డున మత్సాలు ,ఒవ్వెతున లేచి పడే తరంగాలు , తమ వెంట అమృతపు నీటి తుమ్పరలను వేదజల్లుతుంటే ఆ ద్వీప శోభ చెప్పతరము కానిది . అనేక రకాలైన ధ్వజాలతో , అక్కడక్కడ 
తే లే నౌకలతొ , సుధా సాగరము శోభాయమానo గా ఉన్నది . ఈ సముద్రపు ఒడ్డున రత్నమయ వృక్షాలు వింత శోభను కలుగ చేస్తున్నాయి .

 తరువాత లోహముతో చేయ బడ్డ గోడ ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి . ఇట్టి లోహపు కోటలో అనేకానేక శస్త్రాలు ధరించిన ప్రహరీలు ఉన్నారు . వీరికి యుద్ధ సంబంధిత విశేష ఘ్యానము ఉన్నది . సమస్త విద్యలు తెలుసు . ఈ రక్షకులు ఎల్లప్పుడూ ఆనందముగా ఉంటారు . 

ఈ కోటకు నలుగు ద్వారాలు . ఈ గోడ చుట్టూ అనేక గణాలు ఉంటారు . వీరంతా దేవి భక్తులు . భగవతిని దర్శించటానికి దేవతలు విమానాలు ఎక్కి ఇక్కడికి వస్తు -పోతుంటారు . వందల కొద్ది వచ్చే విమాన ధ్వనులచే నిండి ఉంది . చాలా చోట్ల తీయని నీటి సరోవరాలు ఉన్నాయి .వనాలు , వృక్షాలు ratnaalavale merustu,vinta శోభను కలిగి ఉన్నాయి . ఇనుప కోట ,తరువాత కాంస్య పు కోట ఉన్నది . దీని శిఖరము ఆకాశాన్ని తాకుతున్నది . 

తేజానికి పూర్వ ప్రాకారానికoటే , వంద రెట్లు అధికముగా ఉన్నది . గోపురము మరియు ద్వారాల తో చాలా బాగున్నది . ఇక్కడ అన్ని రకాల జాతుల పూల వృక్షాలు , ఫలాల వృక్షాలు ఉన్నాయి . ఇక్కడ లభించని చెట్టే లేదు . అన్ని జాతుల మొక్కలు ఉన్నాయి . అనేక రకాల వనాలు , ఉపవనాలు ఎం తో శోభాయమానముగా ఉన్నాయి . అందమైన బావులు ఉన్నాయి . అక్కడి వనాలు కోయి ల పాటలతో , పక్షుల కిల కిలల తో మధుర నాదాన్ని వినిపిస్తున్నాయి . భ్రమరాల వింత ధ్వని ,శోభను కల్పిమ్పగా ఇక్కడి వృక్షాల నుండి మధుర తెనే రసాలు కురుస్తున్నాయి . 

అనేక విధాల పక్షుల అందాన్ని శోభను కలుగ చేయగా , అనేక విధాల రసవాహిని నదుల ధారలు, వృక్షాలు , ఏంతో శోభాయమానముగా ఉన్నవి . పావురాలు , పిచ్చుకలు , ఎన్నో జాతుల పక్షులు ఉన్నాయి . రామ చిలుకలు , హంసలు ,ఎగురుతుంటే చెట్లు అలికిడి చేస్తున్నాయి కాంస్య ప్రాకారము కాగానే , రాగి ప్రాకారము ఉంది .  ఈ ప్రాకారపు ఆకారము , చతుశ్రాకారము . ఈ రెండు ప్రాకారాలకు మధ్యన కల్ప వృక్షపు వాటిక ఉంది . వీటికి పూసే పూలు బంగారు వన్నెను కలిగి ఉంది . ఆ పూలు మెరుస్తుంటాయి . ఆకులు సహితము బంగారు వన్నె తో మిలమిల లాడుతుo తాయి . వాటి బీజాలు ,ఫలాలు రత్నాలు గా మెరుస్తున్నాయి . అట్టి వనాల సుగంధము నాలుగు దిశలలో పది యోజనాల వరకు వ్యాపించి ఉంది . 

అక్కడ ఎప్పుడు వసంత రుతు ఉంటుంది . అక్కడ పూలచే నిర్మింప బడిన పూల గొడుగులతో పూల సింహాసనము పైన వసంతుడు ఉంటాడు . “మధు శ్రీ “మాధవ శ్రీ “వారికి ఇద్దరు భార్యలు . కామదేవుని వంటి సౌoన్దర్యము కలిగిన ఈ దేవతలు పూల బంతి తో ఆడుతుంటారు . ఈ వాటిక నలు వైపులా తేనే ధారలు వడుస్తుంటాయి . పుష్పాల పైనుండి వీచే గాలులు అక్కడి కి పది యోజనాల వరకు సువాసనను మొసుకేళ్తుంది . గానాలు చేస్తూ గంధర్వులు ఇక్కడ తమ పత్నులతో విహరిస్తుంటారు . అనుపమ శోభలతో ఈ వనము మురిపింప చేయగా కోకిల ల నినాదముతో గుంజితమై ఉన్నది . 
om sree maatre namaha
ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః , ఓం 

పరామ్బికాయై నమః 
జనమేజయుడు , వ్యాసులవారిని ఓకే ప్రశ్న అడిగాడు , మహామునే !జగదంబ కథామృ తము , చాల ఆదరణీయము . మహిషాసురుణ్ణి చంపినా తరువాత మహాలక్ష్మి ఎటు వెళ్ళింది ?అని ,వైకుo ఠా నికా? లేక సుమేరు గిరి కా ? ఆ తల్లి ఎటు వెళ్లినట్టు ?అని అడుగగా,

" మణి ద్వీపము ,అత్యంత రమణీయము , అమ్మవారికి అది క్రీడా స్థలము ,అక్కడకు వెళ్ళగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు స్త్రీగా మారవలసి వచ్చింది . మళ్ళీ పురుషత్వము పొంది , తమ కార్యాలలో నిమగ్నులయ్యారు . ఆ పరమదామము అమృత సాగరము మధ్యన ఉన్నది . అక్కడ జగదంబా తీరు తీరు రూపాలలో విచరణ చేస్తుంది . దేవతలు స్తుతిo ఛినా అనoతరము అమ్మ కల్యానరూపిని అచటికే విచ్చేసింది . ఆమె మాయా శక్తి , మరియు సనాతన . ఆ దివ్య స్థలము లో అవిరామముగా కీర్తనలు జరుగుతుంటాయి . బ్రహ్మ లోకానికి పైన సర్వలోకం ఉంది , అదే మణి ద్వీపము . ఈ ద్వీపమున కు ఉన్నంత సౌo దర్య ము మరి ఎ ద్వీపానికి లేదు . 

అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి , తరంగాల ,చల్లని తుమ్పరలను మోసుకోస్తుంటాయి . 
గాలి వలన ఉవ్వెత్తున లేచే అలలు , ఆ ద్వీపానికి ఏంటో శోభను కలుగ చేస్తున్నది . 
అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి , తరంగాల ,చల్లని తుమ్పరలను మోసుకోస్తుంటాయి . 
గాలి వలన ఉవ్వెత్తున లేచే అలలు , ఆ ద్వీపానికి ఏంతో శోభను కలుగ చేస్తున్నది . 

ఇక్కడి ఇసు,క రత్నాల మయము . అందులో చిన్న- చిన్న శంఖు లు ఉన్నాయి . ఒడ్డున మత్సాలు ,ఒవ్వెతున లేచి పడే తరంగాలు , తమ వెంట అమృతపు నీటి తుమ్పరలను వేదజల్లుతుంటే ఆ ద్వీప శోభ చెప్పతరము కానిది . అనేక రకాలైన ధ్వజాలతో , అక్కడక్కడ 
తే లే నౌకలతొ , సుధా సాగరము శోభాయమానo గా ఉన్నది . ఈ సముద్రపు ఒడ్డున రత్నమయ వృక్షాలు వింత శోభను కలుగ చేస్తున్నాయి .

తరువాత లోహముతో చేయ బడ్డ గోడ ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి . ఇట్టి లోహపు కోటలో అనేకానేక శస్త్రాలు ధరించిన ప్రహరీలు ఉన్నారు . వీరికి యుద్ధ సంబంధిత విశేష ఘ్యానము ఉన్నది . సమస్త విద్యలు తెలుసు . ఈ రక్షకులు ఎల్లప్పుడూ ఆనందముగా ఉంటారు . 

ఈ కోటకు నలుగు ద్వారాలు . ఈ గోడ చుట్టూ అనేక గణాలు ఉంటారు . వీరంతా దేవి భక్తులు . భగవతిని దర్శించటానికి దేవతలు విమానాలు ఎక్కి ఇక్కడికి వస్తు -పోతుంటారు . వందల కొద్ది వచ్చే విమాన ధ్వనులచే నిండి ఉంది . చాలా చోట్ల తీయని నీటి సరోవరాలు ఉన్నాయి .వనాలు , వృక్షాలు ratnaalavale merustu,vinta శోభను కలిగి ఉన్నాయి . ఇనుప కోట ,తరువాత కాంస్య పు కోట ఉన్నది . దీని శిఖరము ఆకాశాన్ని తాకుతున్నది .

తేజానికి పూర్వ ప్రాకారానికoటే , వంద రెట్లు అధికముగా ఉన్నది . గోపురము మరియు ద్వారాల తో చాలా బాగున్నది . ఇక్కడ అన్ని రకాల జాతుల పూల వృక్షాలు , ఫలాల వృక్షాలు ఉన్నాయి . ఇక్కడ లభించని చెట్టే లేదు . అన్ని జాతుల మొక్కలు ఉన్నాయి . అనేక రకాల వనాలు , ఉపవనాలు ఎం తో శోభాయమానముగా ఉన్నాయి . అందమైన బావులు ఉన్నాయి . అక్కడి వనాలు కోయి ల పాటలతో , పక్షుల కిల కిలల తో మధుర నాదాన్ని వినిపిస్తున్నాయి . భ్రమరాల వింత ధ్వని ,శోభను కల్పిమ్పగా ఇక్కడి వృక్షాల నుండి మధుర తెనే రసాలు కురుస్తున్నాయి . 

అనేక విధాల పక్షుల అందాన్ని శోభను కలుగ చేయగా , అనేక విధాల రసవాహిని నదుల ధారలు, వృక్షాలు , ఏంతో శోభాయమానముగా ఉన్నవి . పావురాలు , పిచ్చుకలు , ఎన్నో జాతుల పక్షులు ఉన్నాయి . రామ చిలుకలు , హంసలు ,ఎగురుతుంటే చెట్లు అలికిడి చేస్తున్నాయి కాంస్య ప్రాకారము కాగానే , రాగి ప్రాకారము ఉంది . ఈ ప్రాకారపు ఆకారము , చతుశ్రాకారము . ఈ రెండు ప్రాకారాలకు మధ్యన కల్ప వృక్షపు వాటిక ఉంది . వీటికి పూసే పూలు బంగారు వన్నెను కలిగి ఉంది . ఆ పూలు మెరుస్తుంటాయి . ఆకులు సహితము బంగారు వన్నె తో మిలమిల లాడుతుo తాయి . వాటి బీజాలు ,ఫలాలు రత్నాలు గా మెరుస్తున్నాయి . అట్టి వనాల సుగంధము నాలుగు దిశలలో పది యోజనాల వరకు వ్యాపించి ఉంది . 

అక్కడ ఎప్పుడు వసంత రుతు ఉంటుంది . అక్కడ పూలచే నిర్మింప బడిన పూల గొడుగులతో పూల సింహాసనము పైన వసంతుడు ఉంటాడు . “మధు శ్రీ “మాధవ శ్రీ “వారికి ఇద్దరు భార్యలు . కామదేవుని వంటి సౌoన్దర్యము కలిగిన ఈ దేవతలు పూల బంతి తో ఆడుతుంటారు . ఈ వాటిక నలు వైపులా తేనే ధారలు వడుస్తుంటాయి . పుష్పాల పైనుండి వీచే గాలులు అక్కడి కి పది యోజనాల వరకు సువాసనను మొసుకేళ్తుంది . గానాలు చేస్తూ గంధర్వులు ఇక్కడ తమ పత్నులతో విహరిస్తుంటారు . అనుపమ శోభలతో ఈ వనము మురిపింప చేయగా కోకిల ల నినాదముతో గుంజితమై ఉన్నది . 
om sree maatre namaha

విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములువిద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు:-  ఆరు విధములైన విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు ఇక్కడ పొందుపరచుచున్నాను.  


  1.    మం\\ " ఓం  ఐం  హ్రీం  శ్రీం క్లీం సౌః   క్లీం  హ్రీం ఐం  బ్లూం స్త్రీం  నీలకరే  సరస్వతీ, ద్రాం ద్రీం క్లీం బ్లూంసః  ఐం హ్రీం  శ్రీం సౌః  హ్రీం స్వాహా " 
 ఈ మంత్రమును రాగిరేకుపై వ్రాసి ప్రతిష్ఠ గావించి షోడశోపచార పూజలుచేసి ఈ మంత్రమును ఏకా గ్రచిత్తుడై లక్షపర్యాయములు జపించి, వసకొమ్ములు, పిప్పలి, మోదుగ,సమిధిలతోటి పదివేల పర్యాయములు హోమము గానించి ఆరాగి రేకును తావీజునందు బెట్టి ధరించిన, పరమ మూర్ఖుడై యున్నను గొప్ప విద్యా వంతుదు కాగలడు విద్యను కలిగించి పాండిత్య ప్రకర్షమొనర్చుటయం దీ మంత్రము అమోఘమైనది.

 2    మం\\    మేథాం విద్యాం  బల  ప్రజ్ఞాంసంపదం పుత్రాపౌత్రికామ్ 
                     దేహిమే  శారదాదేవీ , స్మరామి ముఖ సంస్ధితామ్ ||
         ఈ శ్లోకమును ప్రతి నిత్యము 21 మార్లు పఠింపుచున్న దేవి బుద్ధి జాడ్యమును హరించి,విద్యా వినయ సంపదలనొసంగ గలదు.      


3.  మం\\   ఓం  " హీం హ్సైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌః   సరస్వత్స్యై స్వాహా "
       ఈ మంత్రమును వ్రతదీక్ష బూని 12 లక్షలు జపించిన సిద్ధింప గలదు. ఈ మంత్ర సిద్ధిని పొందిన నరుడు  కేవలం వినినంత మాత్రమున, చదివినంత మాత్రమున సర్వ విద్యలను అవగతము గావించు కొనగలడు. అన్ని భాషలు అతని ఆధినములై యుంటవి. విఙ్ఞాన ధురీణులైన మేధావులకు కలుగు సందేహములను గూడా ఈసిద్ధి నందినవాడు తేలికగా పరిష్కరింప గల సమర్ధుడు కాగలడు.
       ఈ మహాసరస్వతీ మంత్రసిద్ధినందిన వ్యక్తి. ఏ శిశువుకైనను జన్మించిన మూడు దినముల లోపల ఆవు నెయ్యి, తేనె కలిపి బంగారు పుల్లతో ఈ మంత్రమును ఆ శిశువు  నాలుకపై  వ్రాసి అభి మంత్రించిన ఆ శిశువు   13 సం\\లు వచ్చుసరికి గురువును మించిన విద్య పాండిత్యము గలవాడగును.  దీని మహిమ అనన్య సమాన్యమై యున్నది. దీనికి చింతామణి సరస్వతి మంత్ర మని గాడా పేరున్నది. విద్య పాండిత్యములతో బాటు తరగని ధనసంపదను సభాపూజ్యత కీర్తి ప్రతిష్ఠలు కూడా ఈ మంత్ర ప్రభావము వలన చేకూరగలవు.  

4.  మం\\  వాణీల పూర్ణనిశాక రోజ్జ్వలముఖీం కర్పూరకుంద ప్రభాం 
                చంద్రార్థాంకితమ స్తకాం నిజక రైస్సంచి భ్రతీమాదరాత్  
                 వర్ణాకుక్ష గుణం సుధాద్యకలశం విద్యాంచత్యుగస్తనీం 
                 దివ్యైరాభరణ్తే  ద్విభూషితతనుం  సింహాధిరూ ఢాంభజే ||
                ఈ శ్లోకమును ప్రతి నిత్యము క్రమము తప్పకుండా ప్రాతఃకాలంలో 18 మార్లు పఠింపుచున్న విద్యాభ్యాసము నందు గలగు శంకలు తొలగి, స్ఫూర్తి  ఙ్ఞాపకశక్తి, మేధాశక్తి అభివృద్ధి యగుటయే కాక విద్యాజయము నందగలరు.  

 5. మం\\ " ఓం హ్సీం విశ్వోత్తీర్ణ  స్వరూపాయ చిన్మయానంద రూపిణీ తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ  హ్సీం ఓం నమః "
                భక్తి ప్రపత్తులు గల్గి ఈ మంత్రమును శుచిగల ప్రదేశములో ఒక లక్ష పర్యాయములు జపించుట వలన మందబుద్ధి గలవారికి బుద్ధి వికాసమై, కఠినమైన విద్యాలుగూడా కరతలామలకము కాగలవు, పండితుడై సభలందు గౌరవము నందగలడు. 

6. మం\\ " ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛస్వాహా "
         ఈ మంత్రమును ఏకాంత ప్రదేశంలో కూర్చుని బ్రహ్మ చర్య దీక్షతో 11 రోజులు 11 వేలు జపించిన యెడల అపార మేధా శక్తి, బుద్ది సూక్ష్మత గ్రాహ్యత ప్రతిభ లభించి అన్ని విద్యలందు అఖండ విజయాన్ని పొందగలరు. 

షోడశ గణపతులు(Shodasa Ganapathulu)


షోడశ గణపతులు
విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో, వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం.

1. బాల గణపతి 
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో  అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో 
మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

2. తరుణ గణపతి:
ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను... పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః  అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో
 మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్

అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

4. వీరగణపతి 
ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

5. శక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం

పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

6. ద్విజ గణపతి 
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.

7. సిద్ధి (పింగల) గణపతి 

ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు
 చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి 
కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.

9. విఘ్న గణపతి 

గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు 
చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.

10. క్షిప్త గణపతి 
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....

దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
అనే మంత్రంతో స్తుతించాలి.

11. హేరంబ గణపతి

అభయ వరదహస్త పాశదంతాక్షమాల 

సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా

అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

12. లక్ష్మీ గణపతి 

బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్ 

పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే

గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి  వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

13. మహాగణపతి

ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన 
దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.

హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్

బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. విజయ గణపతి 
సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.

15. నృత్య గణపతి 

సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన 
దంతం ధరించి దర్శనమిస్తారు.

పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. ఊర్ధ్వ గణపతి 
కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.

కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి. 
- See more at: http://www.teluguone.com/devotional/content/shodasha-ganapathulu-84-8999.html#sthash.wxT7bFNs.dpuf

గణపతి ఏడవ అవతారము: విఘ్నరాజ అవతారము


గణపతి ఏడవ అవతారము: విఘ్నరాజ అవతారము

ధ్యానశ్లోకం: విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్యతే, 
మమతాసుర హంతా స విష్ణుబ్రహ్మేతి వాచక:. 

`శ్రీ గణేశుని విఘ్నరాజావతారము విష్ణు బ్రహ్మగా ప్రసిద్ధికెక్కింది. ఆదిశేషవాహనంగా వచ్చి మమతాసురుని సంహరించే అవతారం' 

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: ఒకానొకప్పుడు భగవతి పార్వతీదేవి ఆమె సఖులతో మాటలాడుతూ నవ్వగా.. ఆమె నవ్వునుండి ఒక పురుషాకృతి ఆవిర్భవించింది. అది చూస్తూ ఉండగానే పర్వతాకారమైనది. దానికి పార్వతీ దేవి మమతాసురుడు అని పేరుపెట్టి, అతనిని గణేశుని స్మరించవలసినదిగా ఆఙ్ఞాపించెను. పార్వతీదేవి అతనికి గణేశ షడక్షరీ మంత్రాన్ని ఉపదేసించెను. మమతాసురుడు తల్లి పార్వతీదేవికి నమస్కరించి తపస్సుకై అరణ్యమునకు వెళ్ళెను. అక్కడ అతను శంబరాసురుణ్ణి కలిసెను. శంబరాసురుడు మమతాసురునికి సమస్త ఆసురీవిద్యలను నేర్పెను. దానితో మమతాసురునికి అన్ని రాక్షస శక్తులు ప్రాప్తమయ్యేయి. అప్పుడు శంబరాసురుడు విఘ్నరాజుని ఉపాసించమని మమతాసురుని ఆదేశించెను. మమతాసురుడు అక్కడికక్కడే కూర్చుని విఘ్నరాజుకై కఠోర తపస్సు ప్రారంభించెను. కేవలము వాయువునే ఆహారంగా తీసుకుంటూ విఘ్నరాజుని ధ్యానిస్తూ జపిస్తూ తపస్సుచేయుచుండెను. అంతట విఘ్నరాజు ప్రత్యక్షంకాగా, మమతాసురుడు, "ప్రభూ! మీరు నాకు ప్రసన్నులైతే ఈ సమస్త బ్రహ్మాండ ఆధిపత్యాన్ని ప్రసాదించండి. యుద్ధంలో నాకు ఎప్పుడూ విఘ్నాలు రాకూడదు. భగవానుడైన శివుడైనా సరే నన్ను జయించలేకుండుగాక" అని కోరెను. ఈ వరములు దుస్సాధ్యములైనప్పటికీ తప:ప్రభావంవలన విఘ్నరాజు ప్రసాదించెను. వరములుపొంది మమతాసురుడు, శంబరుని వద్దకు వెళ్ళెను. శంబరుడు ఎంతో సంతోషించి తన రూపవతి ఐన కూతురు "మోహిని " ని ఇచ్చి మమతాసురునికి వివాహము చేసెను. ఈ విషయము తెలుసుకున్న శుక్రాచార్యుడు మమతాసురుని రాక్షస రాజుగా ప్రకటించెను. ఒకరోజు శుక్రాచార్యునితో మమతాసురుడు తను విశ్వవిజేత కావలెనని, అందుకు యుద్ధము చేసెదనని చెప్పెను. అంతట శుక్రాచార్యుడు సరేనని ఆశీర్వదించి, విఘ్నరాజు వలన వరములను పొందితివి కనుక అతనితో యుద్ధమునకు పోవలదని హెచ్చరించి పంపెను. తన వరదర్పంతో అన్ని లోకములనూ జయించి, దేవతలను బంధించి `ధర్మాచరణము ' అనే మాట ఎక్కడా లేకుండా చేసెను. పిమ్మట అందరు దేవతలూ కష్టనివారణ కొరకు విఘ్నరాజుని పూజించిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత వారికి విఘ్నరాజు ప్రకటితమై వారికి అభయమిచ్చెను. శేషవాహనారూఢుడై విఘ్నరాజు అవతరించి నారదుని దూతగా మమతాసురునియొద్దకు పంపెను. నారదుడు, శుక్రాచార్యుడు కూడా మమతాసురునితో విఘ్నరాజుకి శరణువేడవలసినదిగా చెప్పెను. అహంకారంతో మమతాసురుడు వారి మాటలను పెడచెవినపెట్టి యుద్ధమునకు వచ్చెను. శ్రీ విఘ్నరాజు తన యొక్క కమలమును రాక్షస సేన మధ్యలొ వేసెను. దాని వాసనతో సమస్త అసుర సేనలు మూర్ఛపోయి శక్తిహీనులయ్యాయి. అప్పుడు మమతాసురుడు భయముతో వణకుతూ విఘ్నరాజుని పాదములపై పడి శరణువేడెను. అంతట విఘ్నరాజు మమతాసురుని క్షమించి అధోలోకాలకు పంపివేసెను. దేవగణములు ముక్తిపొంది ప్రసన్నములాయెను. అన్ని వైపులా ధర్మము స్థాపించబడెను. 

మనము కూడా శెషవాహనారూఢుడైన శ్రీ విఘ్నరాజుని శరణుపొంది మమతాసురుని బారినుంది విముక్తి పొందెదము గాక. శ్రీ శేషవాహనారూఢాయ విఘ్నరాజాయ నమ:.

గణపతి ఆరవ అవతారము: వికటావతారము

గణపతి ఆరవ అవతారము: వికటావతారము


ధ్యానశ్లోకం: వికటో నామ విఖ్యాత: కామాసురవిదాహక:, 

మయూరవాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మృత:. 


ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: `వికట ' నామంతో విఖ్యాతుడైన ఈ గణపతి నెమలివాహనముగా గలవాడై సౌరబ్రహ్మగా కీర్తింపబడినాడు.


శ్రీమహావిష్ణువు జాలంధరుని సంహరించడానికై వృందాయొక్క తపస్సు భంగంచేసినపుడు అతని 

తేజస్సునుండి ఉద్భవించిన అత్యంత తేజశ్శాలి అయిన రాక్షసుడు `కామాసురుడు '. ఇతనుకూడా శుక్రాచార్యునియొద్ద మంత్రదీక్షతీసుకుని అరణ్యానికిపోయి ఘోరమైన తపస్సుప్రారంభించాడు. అన్నము, జలము కూడా త్యజించి, బ్రొటనవ్రేలిపై నిల్చుని అనేక సంవత్సరములు తపస్సుచేసేడు. ఆ తపస్సుతో అతని శరీరము శుష్కించినా తేజస్సు పెరిగి పెరిగి కైలాసములోని పరమేశ్వరుని రప్పించినది. ఆశుతోషుడైన పరమేశ్వరుడు కామాసురుడు కోరినట్లుగా తన తప:ప్రభావం వలన ఇవ్వవలసి వచ్చినది. శుక్రాచర్యుని వద్దకు వచ్చి వరప్రదానము గురించి చెప్పెను. అంతట శుక్రాచార్యుడు సంతుష్టుడై మహిషాసురుని కూతురైన `తృష్ణ 'ని ఇచ్చి కామాసురునికి వివాహం చేసేడు. అదేసమయంలో సమస్త రాక్షసులకు కామాసురుని అధిపతిగా ప్రకటించాడు. కామాసురుడు అత్యంత సుందరమైన `రతిద ' అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించసాగాడు. రావణుడు, శంబరుడు, మహిషుడు, బలి, దుర్మదుడు అనేవారిని సేనానాయకులుగా నియమించాడు. ఆ రాక్షసుడు భూమిపైన అందరు రాజులను జయించి, స్వర్గలోకాదులను కూడా తనవశమొనర్చుకొనెను. తన రాజ్యములో సమస్త ధర్మ కర్మలకు నష్టము వాటిల్లెను. అన్నివైపులా అసత్యము, కపటము రాజ్యమేలుతున్నాయి. దేవతలు, మునులు, ధర్మపరాయణులైన వారు భయంకరమైన కష్టములను అనుభవించసాగారు. అంతట `ముద్గల ' మహర్షి దేవతలను, మునులను ప్రేరేపించి మయూరేశ్వర క్షేత్రమునకుపోయి అచ్చట గల మయూరేశ్వరుని ఉపాసించమని చెప్పెను. వారు అదేవిధంగా ఉపాసించగా గణేశ భగవానుదు ప్రసన్నుడై మయూరవాహనముపై `వికట ' నామక గణపతిగా వచ్చి కామాసురుని నియంత్రించుటకు అభయమిచ్చి అంతర్ధానమయ్యెను. తరువాత కొన్ని దినములకు నెమలి వాహనారూఢుడై `వికట ' గణపతిగా వచ్చి దేవసేనలతోకూడినవాడై కామాసురునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. ఇరువురిమధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కామాసురుని పుత్రులైన `శోషణుడు ' , `దుష్పూరుడు ' వధింపబడ్డారు. అంతట వికటుడు కామాసురునితో..."నువ్వు శివవర ప్రభావంతో ఎన్నో అధర్మాలు చేస్తున్నావు. నీకు జీవించాలని ఉంటే దేవతలపై ద్రోహాన్ని విడిచిపెట్టి నన్నుశరణుపొందు 'మని చెప్పెను. ఆ మాటను పెడచెవిని పెట్టి కామాసురుడు వికటునిపై తనగదను విసిరెను. అది భగవానుడైన వికటుని స్పర్శించలేక మధ్యలోనేచూర్ణమైపోయెను. దానితో కామాసురుడు మూర్ఛపోయెను. వికటుని దృష్టి మాత్రముచేత కామాసురుని శక్తి అంతా క్షీణింపతొడగెను. కామాసురుడు అప్పుడు ఆలోచింపనారంభించెను.."ఈ అద్భుతమైన దేవుడు అస్త్రములు ప్రయోగించకుండానే నాకు ఈ దుర్దశ ప్రాప్తించినది. ఇక అస్త్రములు పట్టిన నా గతి యేమి '. ఈ విధంగా అలోచించి భగవానుడైన వికటుని శరణువేడుకొనెను. మయూరేశుడు కామాసురుని క్షమించెను. దేవతలందరూ భయముక్తులై భగవానుని స్తోత్రించి కామాసురుని బాధలు లేక విశ్వమును నిర్వహింపతొడగిరి. 


మనము కూడా వికటుడు, మయూరేశుడునైన గణేశుని ప్రార్థించి కామాసురునినుండి విముక్తి పొందెదముగాక. శ్రీ వికటాయ నమ:, శ్రీ మయూరేశాయ నమ:.


గణపతి ఐదవ అవతారము: లంబోదరావతారము


గణపతి ఐదవ అవతారము: లంబోదరావతారము

ధ్యానశ్లోకం: లంబోదరావతారో వై క్రోధాసుర నిబర్హణ:, 
శక్తిబ్రహ్మాఖుగ: సద్యత్ తస్య ధారక ఉచ్యతే.

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: శ్రీ విష్ణువు మొహినిగా అవతరించినపుడు భగవాన్ శివుడు మోహితుడయ్యెను. అపుడు కామారి ఐన శివతేజస్సునుండి నల్లనిరంగులో ఒక రాక్షసుడు ఆవిర్భవించెను. ఆ రాక్షసుడు శుక్రాచార్యునియొద్దకురాగా, శుక్రాచార్యుడు క్షణము ధ్యానించి ఆ రాక్షసునికి క్రోధాసురుడు అని పేరుపెట్టెను. పిదప శంబరదైత్యుని కుమార్తైన `ప్రీతి 'ని ఇచ్చి వివాహంచేసాడు. గురువుగారియొద్ద సూర్యమంత్రాన్ని తీసుకుని క్రోధాసురుడు తపస్సు చేయసాగాడు. దానిఫలితంగా సూర్యునినుండి అనేకవరములుపొంది విజయగర్వంతో శుక్రాచార్యునియొద్దకురాగా, క్రోధాసురుని `ఆవేశపురాని 'కి రాజుగా పట్టాభిషిక్తునిచేసెను. వరబలగర్వంతో క్రోధాసురుడు అన్ని లోకాలని ఆక్రమించసాగాడు. చివరకు సూర్యునిపై కూడా దండెత్తేడు. వరమిచ్చినకారణంగా సూర్యుడుకూడా తనలోకంవిడిచిపెట్టవలసివచ్చింది. అప్పుడు దేవతలందరూ గణేశునికై ఆరాధనలు చేసేరు. అంతట గణేశుడు `లంబోదరావతారం'తో వారికి ప్రత్యక్షమై అభయాన్నిచ్చాడు. దేవసేనలు తనతోరాగా క్రోధాసురునిపై యుద్ధానికి బయలుదేరి అనేక రాక్షస సేనలను సంహరించెను. పిమ్మట లంబోదరునకు, క్రోధాసురునికి భీకరయుద్ధంజరిగింది. లంబోదరుని ప్రతాపానికి నిలువలేక క్రోధాసురుడు లంబోదరును పాదాలపైపడి రక్షించమనివేడుకొనెను. సహజంగా కృపామూర్తి అయిన లంబోదరుడు క్రోధాసురుని క్షమించెను. అంతట క్రోధాసురుడు శాంతుడై, అధోలోకాలకుపోయి శాంతజీవనం గడపసాగాడు. దేవతలందరూ లంబోదరుని స్తుతించి వారివారి నెలవులకు వెళ్ళారు. మనము కూడా లంబోదరుని అనుగ్రహంతో క్రోధాసురున్ని జయిద్దాం. ...

"శ్రీ లంబోదరాయ నమ:"

గణపతి నాల్గవ అవతారము: గజాననావతారము


గణపతి నాల్గవ అవతారము: గజాననావతారము

ధ్యానశ్లోకం: గజానన: స విఙ్ఞేయ: సాంఖ్యేభ్య: సిద్ధిదాయక:, 
లోభాసురప్రహర్తా వై ఆఖుగశ్చ ప్రకీర్తిత:

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: ఒకసారి దేవతలయొక్క కోశాధ్యక్షుడు కుబేరుడు కైలాసానికి వచ్చి పార్వతీపరమేశ్వరుల దర్శనంచేసేసమయంలో పార్వతీదేవి సౌందర్యానికి ముగ్ధుడైచూడగా శ్రీ పార్వతీదేవి అది గ్రహించి కోపోద్రిక్తదృక్కులను కుబేరునివైపు ప్రసరించెను. దానితో భయభీతుడైన కుబేరునినుండి లోభాసురుడు ఉత్పన్నమయ్యేడు. ఆ రాక్షసుడు శుక్రాచార్యునివద్ద పంచాక్షరీవిద్యగైకొని కఠోర తపస్సుచేయసాగాడు. తప:ఫలంగా అనేకవరాలనుపొంది, మానవులను, దేవతలను, మునులను పీడించి భూలోకం, స్వర్గలోకాలను కైవశం చేసుకున్నాడు. అంతేకాక వైకుంఠకైలాసాదిలోకాలనుకూడా వరదర్పంతో తనవిగా చేసుకున్నాడు. అపుడు దేవతలు భయముతో ఎమీతోచని పరిస్థితిలో `రైభ్య 'మునిని ఆశ్రయించారు. రైభ్య ముని ఆదేశానుసారం గణేశుని ఉపాసించసాగారు. దానికి ప్రసన్నుడై, `గజానన ' పేరుగల అవతారము దాల్చి మూషిక వాహనంతో వారికి ప్రత్యక్షమై దేవతలకు అభయమిచ్చి శివుని దూతగా లోభాసురునియొద్దకు పంపాడు. పరమశివుడు గజాననుని ప్రతాపమును, వీరత్వమును లోభాసురునికి తెలియజేసి, తనని శరణువేడమనెను. లేనియెడల గజాననుని చేతిలో లోభాసురుని నాశనము తప్పదని హెచ్చరించెను. దానిని శుక్రాచార్యుడు కూడా సమర్థించి శ్రీ గజాననుని శరణువేడమని లోభాసురునితో చెప్పెను. దానితో లోభాసురుడు పశ్చాత్తప్త హృదయంతో శ్రీ గజాననుని పాదాలపై పడెను. శరణాగతవత్సలుడైన గజాననుడు లోభాసురుని క్షమించి తనను స్మరించువారిచెంతకు రావలదని హెచ్చరించి అధోలోకాలకు పంపించివేసెను. ఆ నాటినుండి అందరూ లోభాసురుని బాధలు లేక సుఖముగానుండిరి. 

మనముకూడా గజాననుని ప్రార్థించి లోభాసురుని బాధలనుండి విముక్తినొందెదము. శ్రీ గజాననాయ నమ:.

గణపతి మూడవ అవతారము: మహోదరావతారము.


గణపతి మూడవ అవతారము: మహోదరావతారము.

ధ్యానశ్లోకం: మహోదర ఇతి ఖ్యాతో ఙ్ఞానబ్రహ్మప్రకాశక:, 
మోహాసురస్య శతృర్వై ఆఖువాహనగ: స్మృత:.

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: రాక్షస గురువైన శుక్రాచార్యుని శిష్యులలో ఒక శిష్యుడు మోహాసురుడు. గురువుగారి అదేశంతో మోహాసురుడు సూర్యుని ఉపాసించి సర్వత్రా విజయం చేకూరేలా వరాన్ని పొందేడు. దానితో దైత్యరాజుగా పట్టాభిషిక్తుడై సకల లోకాలను, దేవతలను క్షోభింపసాగాడు. మోహాసరుడు తన భార్య "మదిర"తో సుఖజీవనం సాగించసాగాడు. మోహాసురునివలన వర్ణాశ్రమధర్మాలు, సత్కర్మలు అన్నీక్షీణించసాగాయి. దు:ఖితులైన దేవతలు, ఋషులు సూర్యునివద్దకు చేరి మొఱపెట్టుకున్నారు. ఆ విపత్తికరపరిస్థితులను చూసి సూర్యభగవానుడు వారికి గణేశుని ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి గణేశుని ప్రసన్నముచేసుకోవలసిందిగా ఆదేశించాడు. వారి ఉపాసనకు సంతుష్టుడైన గణేశుడు `మహోదరు 'నిగా ఎలుకవాహనంతో వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇంతలో నారదముని మోహాసురునితో మహోదర ఆవిర్భావంగురించి చెప్పి, అతని శక్త్రిసామర్థ్యాలను కీర్తించాడు. శుక్రాచార్యుడు కూడా మోహాసురునితో మహోదరుని శరణువేడడమే ఉచితమైనదని చెప్పాడు. అదే సమయంలో శ్రీమహావిష్ణువు మహోదరుని దూతగా మోహసురుని వద్దకువచ్చి, మహోదరుని శరణుజొచ్చి, దేవతలు మునులయొక్క ధర్మజీవనానికి ఆటంకపరచకుండా ఉండవలసనిదిగా హెచ్చరించాడు. అలా ఐతే మహోదరుడు క్షమిస్తాడు లేకపొతే యుద్ధంలో తనప్రాణాలనుతీయడం తథ్యమనిచెప్పాడు. దానితో మోహాసురుని అహంకారంతొలగి, మహోదరుని దర్శనం అనుగ్రహించవలసిందిగా వేడుకున్నాడు. అంతట మహోదరుని దర్శించుకుని గద్గదకంఠముతో అనేకస్తోత్రములు చేసి తన అఙ్ఞానమును మన్నించి తనను రక్షించవలసినదిగా వేడుకున్నాడు. అంతేకాక ఆనాటినుండి మోహాసురుడు దేవతలవద్దకుగానీ, మునులవద్దకుగానీ పొరపాటుగాకూడావెళ్ళనని, మహాత్ముల ధర్మకార్యములకు విఘ్నములు కలిగించనని చెప్పి మహోదరుని శరణుజొచ్చాడు. సహజ కృపాళువు అయిన మహోదరుడు మోహాసురుని క్షమించి తనపై భక్తిని అనుగ్రహించాడు. దానితో దేవతలు, ఋషులు, మానవులు అందరూకూడా ధర్మపరాయణులై సుఖముగా జీవించసాగారు. ...మనము కూడా మహోదరుని ఆశ్రయించి మోహాసురునిబాధలు తొలగించమని వేడుకుందాము. "శ్రీ మహోదరాయ మమ:"

గణపతి రెండవ అవతారము: ఏకదంతావతారము.


గణపతి  రెండవ అవతారము: ఏకదంతావతారము.

ధ్యానశ్లోకం: ఏకదంతావతారౌ వై దేహినాం బ్రహ్మధారక:, 
మదాసురస్య హంతా స ఆఖువాహనగ: స్మృత:

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: చ్యవన మహర్షినుండి ఒకానొక సందర్భంలో మదాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించేడు. ఆ రాక్షసుడు 14 భువనాలకు ఆధిపత్యంకోసం శకిమంత్రంతో దేవిని ఉపాసించాడు. ఆ తపస్సుకి ఫలితంగా అనేకశక్తులను పొంది 14 భువనాలను ఆక్రమించుకున్నాడు. చింతాక్రాంతులైన దేవతలు మదాసురుని నశింపజేసి ధర్మసంస్థాపనానికి ఉపాయం చెప్పమని సనత్కుమార మహర్షిని వేడుకున్నారు. మహర్షి దేవగణములకు ఏకదంతుని మంత్రోపదేశం చేసి సాధన చేయవలసినదిగా ఆదేశించాడు. వారి సాధన ఫలితంగా ఆఖు (ఎలుక) వాహనారూఢుడై గణపతి ఏకదంతావతరంగా ఆవిర్భవించాడు. పాశము, అంకుశము మొదలుగాగల అనేక ఆయుధములతో విరాడ్రూపంతో యుద్ధభూమిలో అడుగుపెట్టి అనేక దైత్యసైన్న్యాన్ని క్షణంలో నశింపజేసాడు. మదాసురుడు యుద్ధంలో ధనుర్బాణాలతో ఏకదంతుని ఎదుర్కొనగా తన పరశువుతో రాక్షసుని ధనుర్బాణాలను నశింపజేసి పాశముతో మదాసురుని బంధించగా, రాక్షసుడు మూర్చ్చిల్లి, కాసేపటికి తేరుకుని ఏకదంతుని శరణుజొచ్చి రక్షించమని వేడుకున్నాడు. శరణత్రాణతత్పరుడైన ఏకదంతుడు మదాసురునితో, ఏకదంతుని స్మరణ, పూజ జరిగే ప్రదేశాలకు ఎన్నడూ ప్రవేశించవద్దని చెప్పి మదాసురుని కుడా నియంత్రించి అధోలోకాలకు పంపించివేసాడు. 

......శ్రీ ఏకదంతాయ నమ:...మనలో మదము ఏకదంతుని అనుగ్రహం వలన నశించుగాక.

గణపతి మొదటి అవతారము: వక్రతుండావతారము.


గణపతి  మొదటి అవతారము: వక్రతుండావతారము.

ధ్యానశ్లోకం: వక్రతుండావతారశ్చ దేహానాం బ్రహ్మధారక:, 
మత్సరాసురహంతా స సింహవాహనగ: స్మృత:

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: దేవరాజైన ఇంద్రుని పొరపాటువలన మత్సరాసురుడనే రాక్షసుని జననం జరిగింది. రాక్షస గురువైన శుక్రాచార్యులు ఇచ్చిన మంత్రోపదేశంతో కఠోరమైన తపస్సు చేసి అనేక వరాలను పొంది అశేష సేనాబలంతో మూడు లోకాలనూ జయించాడు. దేవతలు కూడా ఈ రాక్షసుని బాధలకు తాళలేక తరుణోపాయం గురించి తపస్సు చేయగా, వారికి భగవాన్ శ్రీ దత్తాత్రేయస్వామివారు ప్రత్యక్షమై వక్రతుండుని ఉపాసనావివరములు తెల్పి అతనిని ప్రసన్నము చేసుకోవలసినదిగా అదేశించెను. దేవతల ఆరాధనకు సంతసించిన గణపతి వక్రతుండునిగా సింహవాహనుడై వారిముందు ప్రత్యక్షమై మత్సరాసురునిపై యుద్ధానికి అనేక సేనలతో బయల్దేరేడు. యుద్ధం 5 రోజులుగా కొనసాగింది. ఆ యుద్ధంలో మత్సరాసురుని పుత్రులైన `సుందరప్రియుడు ' మరియు `విషయప్రియుడు ' అనబడే అసురులు వధింపబడ్డారు. పుత్రుల వధ తెలుసుకున్న మత్సరాసురుడు యుద్ధభూమిలో అడుగుపెట్టేడు. 14 భువనాలనూ భయపెట్టిన ఆ మత్సరాసురుడు, వక్రతుండుని దర్శించగానే భయముతో వణుకుతూ శరణువేడి రక్షించమని ప్రార్థించాడు. దయామయుడైన వక్రతుండుడు మత్సరాసురునితో వక్రతుండుని భక్తులజోలికి రావద్దని నియంత్రించి అధోలోకానికి పంపివేసాడు. ఆ నాటినుండి దేవతలందరూ స్వతంత్రులై వక్రతుండుని సేవిస్తూ వారి వారి విధినిర్వహణలు కొనసాగించారు.

....కాస్త అలోచనాబుద్ధితో ఈ కథ చదివితే ఇందులో అంతరార్థం తేటతెల్లమవుతుంది. మన ఇంద్రియాలకి అధిపతే ఇంద్రుడు. వాటినుండి పుట్టినవాడే మత్సరాసురుడు. అసురునిచే బాధలుపడుతున్న ఇంద్రియాలు (దేవతలు) గురువైన దత్తాత్రేయుని శరణువేడగా సద్గురుని ప్రసాదం వల్ల వక్రతుండావతారం జరిగి, మొదటిగా విషయ, సుందర ప్రియత్వాలని నాశనంచేసి మత్సరాసురుని నియంత్రించాడు. కాబట్టి మనం కూడా వక్రతుండుని శరణువేడి మాత్సర్యగుణాన్ని పోగొట్టుకుందాము. "శ్రీ వక్రతుండాయ నమ:" ...మనలో మాత్సర్య గుణం వక్రతుండుని అనుగ్రహం వలన నశించుగాక.

అయిదు కొండల స్వామిఅయిదు కొండల స్వామి
ఏడుకొండల స్వామి వెంకన్నయితే అయిదు కొండల స్వామి అయ్యప్పని చెబుతారు. ఆంధ్రావనిలో ఏడుకొండల స్వామిని తెలియని వారుండరు. జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండల వేంకటేశ్వర స్వామిని దర్శించని ఆంధ్రుడుండడంటే అతిశయోక్తి కాదు.
కేరళ రాష్ట్రంలో శబరిమల అయ్యప్పస్వామి అయిదు కొండలైన అళుదామేడు, కరిమల, నీలిమల, అప్పాచిమేడు, శబరిగిరి శిఖరాలపై ఉన్నాడని పంచాద్రి నిలయునిగా స్వామిని కీర్తిస్తారు.
దేశంలో ఏ తీర్థయాత్రకూ లేని యాత్రా నియమావళి శబరిమల యాత్రకు నిర్దేశించారు. తిరుపతి వేంకటేశ్వరుని దర్శించాలంటే మన వీలును బట్టి సంవత్సరంలో 365రోజులలో ఏదో ఒకరోజు కుటుంబసమేతంగా వెళ్ళి దర్శించి రావచ్చు.
శబరిమల అయ్యప్ప దేవాలయం సంవత్సర కాలంలో కొన్ని రోజులు మాత్రమే అంటే మండల పూజ పేరుతో నవంబరు 16 - 17 తేదీలలో(వృశ్చికలగ్నం) తెరచి మరల డిసెంబరు 24వతేదీనాడు మూసివేస్తారు. మరల జ్యోతి దర్శనమని చెప్పి జనవరి 2వతేదీ నాడు తెరచి 20వ తేదీనాడు దేవాలయాన్ని మూసివేస్తారు. నెల పూజల పేరుతో ప్రతినెలా అయిదు రోజుల పాటు (సుమారు 16-21 తేదీల మధ్య) దేవాలయం తరచి పూజానంతరం తిరిగి మూసివేస్తారు. కొందరు భక్తులు ఆసమయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందని శబరిమల వెళ్ళి స్వామిని దర్శించుకు వస్తున్నారు.
కేరళలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలైన ఓణం, విషు, ఉత్తర ఫల్గుణి మొదలైన సందర్భాలలో కూడా దేవాలయం అయిదు రోజుల పాటు తెరచి ఉంచుతారు. ఆసమయంలో ఎక్కువగా కేరళీయులే వెళ్ళి దర్శనం చేసుకుంటారు. నవంబరు, డిసెంబరు, జనవరి మాసాలు (కార్తికం, మార్గశిరం) దీక్షకు, యాత్రకు వాతావరణం అనుకూలంగా ఉండడంవల్ల భక్తులు ఆకాలంలోనే లక్షల సంఖ్యలో శబరిమల యాత్ర చేసి వస్తారు.
శబరిమల యాత్రకు వెళ్ళాలంటే 41రోజులు ముందుగా ముద్రమాలను గురుస్వామి ద్వారా మెడలో ధరించి దీక్షను ప్రారంభిస్తారు. దీక్షా వస్త్రాలుగా నలుపు లేక కాషాయ వస్త్రాలు ధరిస్తారు.
దీక్షలో తల, ముఖం క్షవరం పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ రెండు పూటలా చన్నీటి స్నానం తలకు చేసి, నుదుట విభూది, చందనం, కుంకుమ ధరించి ఇంట్లో నిత్యం దీపారాధన చేసి అయ్యప్ప పూజ చేయాలి. లేకుంటే కనీసం అయ్యప్ప శరణు ఘోష (108నామాలు)నైనా చెప్పుకొని ప్రతిరోజు ఏదో ఒక దేవాలయానికో, భజనకో వెళ్ళి సత్కాలక్షేపం చేయాలి.
నేలపై కొత్త చాప వేసుకొని, తలదిండు లేకుండా నిద్రించాలి. ఒకపూట భోజనం, రాత్రిపూట అల్పాహారం సేవించాలి. సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి. అసత్యమాడరాదు. దానధర్మాలు విరివిగా చేయాలి. మాంసాహారం భుజించరాదు. పొగత్రాగడం, జూదమాడడం, మద్యం సేవించడం, గుట్కా, కారాకిళ్ళీ, వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. తరచు సత్సంగాలలో పాల్గొంటూ వ్యర్థ ప్రసంగాలు చేయకుండా దైవ చింతనలోనే కాలక్షేపం చేయాలనేది దీక్షాలక్ష్యం.
1977 వరకు శబరిమల అయ్యప్పస్వామి గురించి పలువురు ఆంధ్రులకు తెలియదు. విజయవాడలో గొల్లపూడి, హైదరాబాద్ బొల్లారంలో అయ్యప్పస్వామి దేవాలయాలు నిర్మించడం, కొందరు స్వాములు తమిళులు, కేరళీయులతో యాత్ర చేసి వచ్చిన తరువాతే ఆంధ్రరాష్ట్రంలో అయ్యప్ప స్వామి ప్రాచుర్యం పెరిగింది.
శబరిమల యాత్రకు వయసులో ఉన్న స్త్రీలకు (10-50ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారికి) అనుమతి లేదు. పదేళ్ళలోపు బాలికలను, యాభైయేళ్ళ దాటిన స్త్రీలను మాత్రం శబరిమల యాత్రకు అనుమతిస్తారు.
శబరిమల వెళ్ళడానికి అడవులు, కొండలపై నడచి వెళ్ళాలి. దారిలో మరుగు సదుపాయాలు లేకపోవడం స్త్రీలకుండే నెలసరి బహిష్టు సమస్య, స్వాముల బ్రహ్మచర్యదీక్ష మొదలైన కారణాల వల్లనే స్త్రీలకు ప్రవేశం కల్పించలేదనిపిస్తుంది.
దీక్షలో తరచుగా పూజ, భజన కార్యక్రమంలో పాల్గొనడం, చెప్పులు లేకుండా నడవడం, దేవాలయాలు సందర్శించడం వలన ఆధ్యాత్మిక చింతన పెరిగి ఉత్సాహంగా ఉంటారు.
శబరిమల యాత్రకు ఇరుముడి జీవం క్వంటిది. ఇరుముడి లేకుండా శబరిమల వెళ్తే అక్కడ ఉన్న పదునెట్టాంబడి(18పవిత్రమైన మెట్లు) ఎక్కడానికి అనుమతించరు. పరశురామ నిర్మితమైన పదునెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించడానికే దీక్ష, ఇరుముడి ఏర్పాటు చేశారు.
రెండు అరల సంచిలో ముందు భాగంలో ఆవునెయ్యి నింపిన టెంకాయ, పూజా ద్రవ్యాలు ఉంచి వెనుక భాగంలో తినుబండారాలు, ఇతర సామగ్రి ఉంచి కట్టిన మూటనే ఇరుముడి అంటారు.
ముద్రకాయలో ఉన్న ఆవునేతితో స్వామివారికి అభిషేకం చేసి, పూజా ద్రవ్యాలను స్వామి వారికి సమర్పిస్తారు. అందుకే ఇరుముడిని ఎంతో పవిత్రంగా శిరస్సుపై పెట్టుకొని యాత్రకు బయలుదేరుతారు. ఎరుమేలి నుండి 70కిలోమీటర్ల దూరమైనా, పంబాతీరం నుండి 6కిలోమీటర్ల దూరమైనా తలపై ఇరుముడి మోసుకుంటూ అడవులలో కొండలపై నడచి స్వాములు శబరిమల చేరి అయ్యప్పస్వామిని దర్శించి రావడం ఈయాత్రలో గొప్ప విశేషం.
ఇంత పవిత్రమైన దీక్షను కొందరు స్వాములు ఇష్టం వచ్చినట్లు సడలించి వారికి అనుకూలంగా మార్చుకొని శబరిమల యాత్రకు కళంకం తెస్తున్నారు. శబరిమలలో పక్కా వసతి గృహాలు, భోజన ఫలహారశాలలు, ఫోను సౌకర్యం, సెల్ ఫోన్లు వచ్చాక శబరిమల స్వరూపం మారిపోయింది. భక్తి సన్నగిల్లుతోందని చెప్పడానికి బాధాకరంగా ఉంది.
పూర్వపురోజులలో శబరిమల యాత్రకు వెళితే ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంటి సంగతులు, బయట విషయాలు తెలిసేవి కావు. అందువలన యాత్ర సఫలీకృతమై పరమాత్ముని కృపకు పాత్రులయ్యేవారు.
స్వామి శరణం! ఓం స్వామియే శరణమయ్యప్ప

Popular Posts