Pages

Tuesday, 19 March 2013

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ (DurgaMatha)

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

అసలు అమ్మ అంటే మాములు మానవుడికే ప్రాణము,అభిమానము. మరి ఈ జగత్ కే సర్వ రూప ధారిణి అయిన దుర్గ అంటే ఇంకేంత. దుర్గమమైన మహిషాసురుని దునుమాడుటకు ఆవతరించిన రూపము దుర్గ. మనిషిలోని మహిష ప్రవృత్తి అనగా పశుప్రవృత్తి తో రాక్షస సమానుడు అవుతున్నాడు. మరి ఇంతటి ప్రవృత్తిని వదలటము అంటే దుర్గమము కాబట్టి మీరు దుర్గను ఆశ్రయించండి.అమే అమ్మలా మీకు అన్నికాలాల్లో మహత్త్వ,కవిత్వ,పటుత్వ,సంపదల్. మహత్త్వ ఈ పదానికి అర్థము దైవ సంభంధమయిన  మోఅమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

అసలు అమ్మ అంటే మాములు మానవుడికే ప్రాణము,అభిమానము. మరి ఈ జగత్ కే సర్వ రూప ధారిణి అయిన దుర్గ అంటే ఇంకేంత. దుర్గమమైన మహిషాసురుని దునుమాడుటకు ఆవతరించిన రూపము దుర్గ. మనిషిలోని మహిష ప్రవృత్తి అనగా పశుప్రవృత్తి తో రాక్షస సమానుడు అవుతున్నాడు. మరి ఇంతటి ప్రవృత్తిని వదలటము అంటే దుర్గమము కాబట్టి మీరు దుర్గను ఆశ్రయించండి.అమే అమ్మలా మీకు అన్నికాలాల్లో మహత్త్వ,కవిత్వ,పటుత్వ,సంపదల్. మహత్త్వ ఈ పదానికి అర్థము దైవ సంభంధమయిన  మోక్ష, అనుగ్రహ లాంటి ఫలితాలు. కవిత్వ ఈ పదానికి సకలవిద్యలు , పటుత్వ ఈ పదానికి అర్ధము ఈ దేహానికి శారీరక సంపూర్ణ ఆరొగ్యము, సంపదల్ ఈ పదానికి అర్ధము అష్ట ఐశ్వర్యాలు  సమకూర్చగలదని. ఎలా ఓక శిశువుకు తల్లి ఎలా సమస్తము తాను ఆయి వ్యక్తుడిగా తీర్చి దిద్దుతుందో అలా. అందుకే ఈ పద్యములో "అమ్మ" అన్న పదము 12 సార్లు పునరావృతమయినది.                

మరి ఈ 12 ఏమిటి అంటే, ఈ 12 భచక్రము లొ గల రాశులకు సంకేతము.అనగా సకల సృష్టి తన ఆధినములొ వున్నదని తనను ఆశ్రయించినవారిని తల్లిలా కాపాడతానని మనకు అభయము.
క్ష, అనుగ్రహ లాంటి ఫలితాలు. కవిత్వ ఈ పదానికి సకలవిద్యలు , పటుత్వ ఈ పదానికి అర్ధము ఈ దేహానికి శారీరక సంపూర్ణ ఆరొగ్యము, సంపదల్ ఈ పదానికి అర్ధము అష్ట ఐశ్వర్యాలు  సమకూర్చగలదని. ఎలా ఓక శిశువుకు తల్లి ఎలా సమస్తము తాను ఆయి వ్యక్తుడిగా తీర్చి దిద్దుతుందో అలా. అందుకే ఈ పద్యములో "అమ్మ" అన్న పదము 12 సార్లు పునరావృతమయినది.                

మరి ఈ 12 ఏమిటి అంటే, ఈ 12 భచక్రము లొ గల రాశులకు సంకేతము.అనగా సకల సృష్టి తన ఆధినములొ వున్నదని తనను ఆశ్రయించినవారిని తల్లిలా కాపాడతానని మనకు అభయము.