బట్టలుతికిన నీళ్ళు కాళ్ళమీద పోసుకుంటే
పుట్టింటివారికి కీడట జాగ్రత్త
మన మహిళామతల్లులు కొందరు బట్టలుతికిన తరువాత ఆ నీళ్లను కాళ్లమీద
గుమ్మరించుకుంటారు. అలాచేయటంవలన ఆమె పుట్టింటివారికి కీడుజరుగుతుందని
పెద్దలు చెబుతుంటారు. అందువలన మీరు జాగ్రత్తవహించాలని సోదరీమణులను
కోరుతున్నాను.
ఆ ! మరీ ఛాదస్తం .నీళ్ళు కాళ్లపై పోసుకోవటమ్ తో కూడా కీడా
? మరీ మూఢనమ్మకాలని కొట్టిపారేయకండి. మనవాళ్లు ఏదిచెప్పినా దానివెనుక
శాస్త్రీయ కారణాలుంటాయి . ఆలోచించే ఓపికా పరిశీలించే శ్రద్దాలేక ఈవిజ్ఞానం
తెలియని సోమరిపోతులు చేసిన దుష్ప్రచారలతో మనం మన
పెద్దలమాటలన్నీఅబద్దమేమోనన్న అపనమ్మకంలో మునిగిపోయాం మరి .
విషయమేమిటంటే
సహజంగా విడిచిన గుడ్డలలో దుమ్ముధూళీ కణాలలో నిండుగా క్రిములు
చేరిఉంటాయి.మధ్యతరగతి దిగువతరగతి ఆడవాళ్ళు స్వయంగా ఇంటిలోని బట్టలు
ఉతుక్కుంటారు .అయితే సహజంగా వీరి పాదాలు పగుళ్ళు ఉంటాయి. ఎక్కువగా
నీటిలోనూ తడుస్తుంటాయి . బట్టలుతుకిన నీళ్లలో నిండుగా క్రిములుంటాయి
.ఆనీటిని కాళ్లమీదపోస్కుకుంటే ఆపగుళ్లద్వారా శరీరం లోకి ప్రవేశించే అవకాశం
ఉంది . అలా చేరి ఆమె రోగగ్రస్తమయితే ఆమెను భర్త ఆమెను పుట్టింఇకి
వెళ్లగొట్టే అవకాశం ఉంది .ఇది ఆమెపుట్టింటికి కీడేకదా !?
మామూలుగా అలా
చేయొద్దని చెబితే పట్టించుకోని స్త్రీలు పుట్టింటికి కీడు అంటే మాత్రం
శ్రధ్ధచూపుతారని పెద్దలు ఇలా చెప్పి ఉంటారు . ఇంతటి వైజ్ఞానిక
దృష్టి,దాన్ని తరతరాలవరకు ఆచరించేలా సాంప్రదాయాలను ఏర్పరచిన మన పెద్దలకు మరో సారి నమస్కరిద్దాం.