సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
సాక్షాత్తు వైకుంఠనాధుడైన శ్రీమన్నారాయణుడు.. దుష్టశిక్షణ,
శిష్టరక్షణార్ధం స్వయంగా త్రేతాయుగాన ఎత్తిన అవతారమే శ్రీరామావతారం. సకల
దేవతలకు ఆదిమూలం.. సకల జగాలకు ఆరాధ్యదైవం అయిన అంతటి శ్రీహరిమూర్తియే
స్వయంగా శ్రీరామునిగా భువికి యేతెంచినాడని పురాణాలు తెలుపుతున్నాయి.
భువిలో నరుడి వలే తనే స్వయంగా కష్టసుఖాలను అనుభవించినట్లు ఈ రామావతారంలోని
అంశాలు మనకు తెలుపుతాయి. అంతటి మహిమాన్వితుడైన శ్రీరాముడ్ని పూజిస్తూ
జపించే ధ్యానమే ఈ మంత్రం. ఈ మంత్రం అందరికి శుభాలను చేకూర్చడమే కాకుండా..
అన్యాయం కాని.. ఎలాంటి విషయాలైనా సరే మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని జపించి
కోరుకుంటే అది నేరవేరుతుందని భక్తుల విశ్వాసం.
సహస్రనామార్చనలకు... సకల మంత్రాలకు ఈ మంత్రం సమానమైనదని భావిస్తారు. ఒక్క
శ్రీరామ మంత్రం చాలు ఎన్ని అడ్డంకులనైనా సంతోషంగా, తేలికగా ఛేదించగలరని..
ప్రతీతి.