Pages

Sunday, 14 April 2013

వినాయక చవితి పత్రిలో ఎన్ని ఆరోగ్య రహస్యాలున్నాయి ?



వినాయక చవితి వచ్చిందంటే పిల్లలకి, పెద్దలకి ఎంతో 

హడావిడి. పూజలో ఉపయోగించే పత్రి వాసనలను 

సంవత్సరంలో ఒక్కసారైనా ఆఘ్రాణించాలని, కనీసం ఓ 

గంటైనా వాటి వద్ద ఉండాలని విఘ్నదిపతి   పూజలో 

పత్రిని చేర్చారు. ఆ పత్రిలో ఔషధ గుణాలు ఎన్నో .
      

 వాటి సుగుణాలను తెలుసుకోమని చెప్పటమే పెద్దలు  

వినాయక చవితి పర్వదినాన  పత్రి వాడమని 

చెప్పటంలో పరమార్ధం. 
  • మాచి పత్రం నులి పురుగులను హరించి అతి 
  • దప్పికను నివారిస్తుంది.  

  • మునగాకు కఫాన్ని , వాతాన్ని తగ్గించి శ్వాసని  
  • క్రమబద్దం చేస్తుంది.  

  • బిల్వాపత్రము మీదుగా పిల్చే గాలి తగిలినంతనే 
  • చర్మ రోగాలు నశిస్తాయి. ఈ ఆకులతో పూజించటం 
  • ద్వారా  గాలి ఆడని దేవాలయాల్లో, గృహాలలో 
  • దుర్వాసనలు తొలగి  భక్తులకి పవిత్రమైన భావన 
  • కలుగజేస్తాయి. 

  • గరిక ముక్కు సంబంధిత  వ్యాధులను 

  • అరికడుతుంది. ఉమ్మెత్త ఆకులు వెంట్రుకలకు 

  • బలాన్ని, నిగారింపును తెస్తాయి.

  • తులసి ఆకుల గూర్చి ఎంత చెప్పిన ఇంకా మిగిలే 
  • ఉంటాయి. ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఈ 

  • తులసి ఆకుని వినాయకుని పూజలో వాడకూడదు.

  • మామిడాకుల్లో   పుండ్లు తగ్గించే గుణముంది. 
  • గన్నేరు ఆకు ద్వారా అనేక శరీర దురదలను 
  • తగ్గించవచ్చు.   

  • విష్ణుక్రాంత పత్రం అనేక  వ్యాధులకు 

  • క్రిమిసంహరకంగా  పనిచేస్తుంది. 

  • దానిమ్మ ఆకు తింటే చర్మం కాంతి 

  • వంతమవుతుంది.   దేవదారు ఆకు వెక్కిళ్ళను, 

  • వాపులను తగిస్తుంది. 

  • మరువం సువాసనలకు శ్వాస రోగాలు, చెవి 

  • సంబంధిత వ్యాధులు  నయమవుతాయి. 

  • వావిలకు తలకు  పెట్టుకుంటే తలనొప్పి 

  • మటుమాయమవుతాయి. 

  • జాజి పత్రం తినటం ద్వారా kantam  మధురంగా 

  • తయారై  పలుకులు వెన్నెల చినుకుల్లా 

  • అవుతాయి. తీగగరికను కడుపులోని వికారాలను 

  • తగ్గించేందుకు వాడతారు. 

  • జమ్మి ఆకు అతిసారాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకు రసం 

  • జుట్టు కుదుళ్ళను  బలంగా చేస్తుంది. 

  • రావి చెట్టు కింద చదువుకుంటే  జ్ఞాపక శక్తి పెరిగి 

  • ఏకసంతాగ్రాహి  అవుతాడు. మద్ది ఆకు ద్వారా 

  • వాతాకఫాలను తగ్గించవచ్చు. జిల్లేడు ఆకు తలపై 

  • పెట్టుకొని స్నానం చేస్తే జలుబు తగ్గుతుంది.     
     
                                  అంతటి  మహాశక్తివంతమైన , 

పవిత్రమైన ఆకులను ఒక్కొక్కటి స్పర్శించటం ద్వారా 

ఎంతో మేలు కలుగుతుందని పూర్వం ఋషులు ఈ 

మహా పూజ విధానాన్ని ఏర్పరిచారు.