Pages

Monday, 15 April 2013

బృహత్సంహిత ' లో ఏ నక్షత్రం వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు?



౧. అశ్విని : చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియభాషనులు.   

౨. భరణి : దృడ నిశ్చయులు , సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు.


౩. కృత్తిక : ప్రక్యతులు, తేజస్సులు.  
౪. రోహిణి : సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్దిరమతి , సురూప.

౫. మృగశిర : చపలులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు.   

౬. ఆరుద్ర : గర్వితులు, కృతఘ్నులు, అయిన వారిని ప్రేమించే వారు. 

౭. పునర్వసు : మంచి స్వభావం కలవారు, అల్ప సంతుష్టులు , రోగులు.

౮. పుష్యమి : శాంతస్వభావం కలవారు. పండితులు, ధర్మ పరాయణులు.  


౯. ఆశ్లేష : సర్వ భక్షకులు, కృతఘ్నులు,  అమాయకులు , సున్నితత్వం కలవారు. 

౧౦. మాఘ : భోగులు, ధనవంతులు, పిత్రు భక్తులు, మహొద్యమ కారులు.   

౧౧. పూర్వఫల్గుణి :  ఎప్పుడు ప్రియ వచనములు పలుకు వారు. దాతలు, ద్యుతిమానులు, రాజసేవకులు.  

౧౨. ఉత్తరఫల్గుణి : భోగులు, సుఖములు కలవారు, విద్య ప్రాప్తి కలవారు.

౧౩. హస్త :  ఉత్సాహవంతులు , చోర స్వభావం కలిగి ఉంటారు. 
౧౪.చిత్త :  మీననేత్రులు. గడసరులు.
౧౫. స్వాతి : కృపాళులు , ప్రియ వాక్కు కలవారు, ధర్మశ్రితులు . 
౧౬. విశాఖ   :  ఈర్ష బుద్ధి కలవారు. ద్యుతులు, మాన్యవచనులు.
౧౭. అనురాధ : విదేశీ యానం కలవారు, ధర్మాత్ములు. 
౧౮. జ్యేష్ఠ : పలువురు మిత్రులు కలవారు, సంతృప్తి కలవారు, కోప స్వభావం కలవారు.   
౧౯. మూల : లక్ష్మి పుత్రులు , సుఖపడువారు,  స్ధిర మనసు కలవారు. 
౨౦. పూర్వషాడ : సౌహర్ర్ధ  హృదయం కలవారు, ఇష్ట పూర్వకంగా పని చేయువారు, కళలను ఇష్టపడు వారు.   
౨౧. ఉత్తరాషాడ : ధార్మికులు, బహు మిత్రులు కలవారు,  కృతజ్ఞత కలిగిన వారు .   
౨౨. శ్రవణం : ఉదార స్వభావం కలవారు, ఖ్యాతి   పొందేడివారు , ధనవంతులు.
౨౩. ధనిష్ట : దాతలు, ధన లబ్దము కలిగిన వారు, సంగిత ప్రియులు.
౨౪. శతభిషం : సాహసికులు, కోప స్వభావం కలవారు, వ్యసన పరులు.  
౨౫. పూర్వాభాద్ర : సంతోషమును తృప్తిగా అనుభవించలేని వారు,  ధనవంతులు, దాతలు.
౨౬. ఉత్తరాభాద్ర : ఎక్కువ సంతానం కలవారు, ధార్మికులు, జితశత్రులు , వక్తలు.
౨౭.రేవతి : శూరులు, శుచివంతులు, సుభగులు,  సంపూర్ణంగులు .