Pages

Tuesday, 2 April 2013

వజ్రాసనం చేయండిలా


వజ్రాసనం చేయండిలా



పెద్దగా అభ్యసించక పోయినా చూసి నేర్చుకునేటంత సులువైన ఆసనం ఈ వజ్రాసనం. కాని, దీని ఉపయోగాలు మాత్రం వర్ణనాతీతం. ఎక్కువగా జపనీయులు కూర్చునే పద్దతి ఈ వజ్రాసనమే. అలాగే బౌద్ధులు చాలా వరకూ ఈ ఆసనంలోనే కూర్చుని కనిపిస్తారు. ఆసనాలలో ఇది రాజా వంటిది అని చెప్పవచ్చు. ఈ ఆసనాన్ని అన్ని సమయాల్లోను వినియోగించుకోవచ్చు. భోజనానంతరం కాసేపు కూర్చోదలచుకుంటే, ఈ ఆసనంలో హాయిగా కూర్చోవచ్చు. తిన్నది క్షణాల్లో జీర్ణమైపోయి. మళ్ళీ తినడానికి సిద్ధంగా ఉండవచ్చు. అంటే జీర్ణశక్తిని ఈ ఆసనం క్షణాల్లో పెంపొందిస్తుంది. ఈ ఆసనానికి ముందస్తుగా గట్టి నేల మీద ఒక మెత్తటి కంబళీ గాని, ఒత్తైన దుప్పటి గానీ పరిచుకుని, కాళ్ళు పూర్తిగా జాపాలి. ఒకసారి పాదాలు కుడివైపుకి, ఎడమవైపుకి ఒకే సంఖ్యలో (అంటే ఇటు 5సార్లు, అటు 5సార్లు) తిప్పి, రెండు కాళ్ళని మడిచి పూర్తిగా పిరుదుల కిందికి వచ్చేలా మడచి పెట్టాలి. మన పృష్టభాగం కాలి మడమల మీదకి ఆనుతుంది. ఆ తరువాత రెండు వెూకాళ్ళ మధ్య బెత్తెడు దూరం ఉండేలా మన అరచేతిని మధ్యలో పెట్టి అంత దూరం ఉండేలా జరుపుకోవాలి. ఇక నడుము నిటారుగా ఉంచి, రెండు చేతులు వెూకాళ్ళ మీద నిటారు ఉంచుకోవాలి. లేదా నమస్కార ముద్రలో ఉంచాలి. ఉచ్ఛ్వాశ నిశ్వాసలు క్రమబద్దం చేసుకుంటే కనీసం 5 నిముషాలు కూర్చుంటే, నడుం నొప్పి దరిచేరదు. వెూకాళ్ళ నొపðలు, భుజాల నొపðలు రాకుండా నివారిస్తుంది. ఉదర సంబంధ వ్యాధుల్ని అరికడుతుంది. నరాల గుంజుడు, తలనొప్పి, మొదలైన రుగ్మతలకి ఇది మంచి ఉపశమనాన్నిస్తుంది. ఈ భంగిమలోనే, చేతులు వెనక్కి మడిచి నెమ్మదిగా తలని వంచి నేలకి ఆనించి అంతే నెమ్మదిగా లేచి యథాస్థితికి వచ్చి ఆ తరువాత నెమ్మదిగా తలని ఎంత వెనక్కి వాల్చగలిగితే అంత వెనక్కి వాలుస్తూ క్రమ పద్దతిలో ఈ ఎక్సర్‌సైజ్‌ చేస్తే స్పాంజ్‌లైటిస్‌ చాలా వరకూ తగ్గిపోయి చాలా ఉపశమనాన్నిస్తుంది. నడుముకు సంబంధించిన రుగ్మతలు వెంటనే ఉపశమిస్తాయి. అయితే, ఈ ఆసనాన్ని పాటించదలుచుకున్న ఆడవారైనా, మగవారైనా సిగరెట్‌ తాగే అలవాటుని మానుకోవాలి. గర్భిణి స్త్రీలు ఈ ఆసనం వేయకూడదని కొందరు అంటున్నారు. అలాగే తాగుడు అలవాటు ఉన్నవారు కూడా ఈ ఆసనం వేయడం పనికిరాదు.