Pages

Friday, 12 April 2013

మనిషి తప్పక తీర్చాల్సిన ఋణాలేవి?


పరిపుర్ణమైన ఆలోచనలతో ధర్మ సంబంధిత, గృహ 

సంబంధిత సుఖాలకై  మానవ జన్మ ఇచ్చినందుకు 

తొలుత దేవఋణాన్ని  పూజలు, యాగాల  ద్వార 

తీర్చాలి. యజ్ఞయాగాదులు చేయటం ద్వార దేవఋణం  

తీరటంతో పాటు పరిసరాల్లోని అనేక క్రిముల వల్ల 

వ్యాపించే అంటురోగాలు సహితం దూరమవుతాయి. 

                       ఆ తరువాత   నవమాసాలు మోసి 

లాలించి, పెంచి పెద్ద చేసిన తల్లి ఋణాన్ని, 

విద్యాబుద్దులు నేర్పించి, వివాహాది కార్యాలను చేసి మీ 

ఇష్టనుసరంగా బతికే స్వేచ్చ ఇచ్చిన తండ్రి ఋణాన్ని  

అనగా తల్లి, తండ్రి ఋణాన్ని వయసు మళ్ళినపుడు 

వారు ఏ పని చేసుకోలేని స్థితికి వచ్చినపుడు అన్ని 

తనే అయి తీర్చుకోవాలి. ఆపై  ఆచార్య ఋణం అనగా 

సమస్త జ్ఞానాన్ని, సభ్యతా  సంస్కారాలు  నేర్పించిన 

గురువులు ఆచార్య దేవులను దానం ద్వార, వినయం 

ద్వార సేవించాలి,తీర్చుకోవాలి.