సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Wednesday, 10 April 2013
ఉగాది -ఈ పండుగకు జాతీయ స్ఫూర్తితో కూడా సంబంధం ఉన్నది.
భగవాన్ శ్రీరాముడు :
భారతీయుల దృష్టిలో శ్రీరాముడు ఆదర్శ రాజు, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పతి, ఆదర్శ పురుషుడు. భారతీయతే ఆయనగా అవతరించిందంటే అది సనాతన సత్యం. అందుకే భారతీయులకు, మానవ ధర్మమైన సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి వ్యక్తికీ "అంతా రామమయం - జగమంతా రామమయం" అయి నిలిచింది. అటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం ఉగాది రోజే జరిగింది. శ్రీరాముడి నవరాత్రులు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి.
ధర్మరాజు పట్టాభిషేకం :
ధర్మరాజు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదే. కౌరవులు అధర్మపరులై, ధర్మమూర్తులైన పాండవులను కించపరిచినప్పుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవుల నోడించిన ధర్మరాజు తన పట్టాభిషేకానికి ఉగాదినే ఎంచుకున్నాడు. ధర్మానికి విజయం లభించిన రోజది.