Pages

Wednesday, 24 April 2013

తల్లి తండ్రి వివాహం గురించి పట్టించుకోక పోతే ఆ కన్య ఏమి చేయాలి?



  • వివాహ వయస్సు దాటి మూడు సంవత్సరాలు గడచినా ,  ఆ ప్రసక్తి  ఎత్తకపోతే  ఆ యవ్వనవతి స్వయముగా  వివాహం చేసుకోవచ్చు.
  • సరియైన కాలంలో వివాహక్రియ జరగనప్పుడు  ఆ కన్య తను ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకోనవచ్చునని  యజ్ఞవల్కుడు  చెప్పాడు.
  • తననే కావాలని కోరినవాడు, అందగాడు,  నెమ్మది స్వబావం కలవాడు, చదువుకున్నవాడు ,  దోషములు  లేనివాడు  అయిన పురుషుణ్ణి  చేసుకున్న స్రీ సుఖపడుతుంది.
  • కన్యకు వివాహం చేయునపుడు  వరుడు పురుషుడో , కాడో  విచారించాలి.  మాటలు, చూపుల ద్వారా అది తెలుస్తుంది.
  • మాటల ద్వారా నిర్ణయించుకున్న  వరుడు దోషములున్న వాడు అని తెలిస్తే  ఆ వివాహం మానిన  అధర్మం కాదు.
  • నిశ్చితార్దమైన  తర్వాత ఏదైనా జరిగినప్పుడు, వివాహం ఇరువురికి తప్పదు. అదే  వధువరులలో  ఎవరికీ ఇష్టం లేకపోయినా  వివాహం ఆపితే  అధర్మం కాదు.   
  • తండ్రి కన్య దానం చేయలేని స్ధితిలో  ఉన్నపుడు  సోదరుడు గాని, మేనమామ గాని తన వారెవరైనా చేయవచ్చు.  తల్లికి కూడా కన్యాదానం  చేయు అర్హత కలదు.