శ్రీ రాముడు కోసం కొన్ని వివరములు
శ్రీరాముని జన్మతిథి - చైత్ర శుద్ధ నవమి.
శ్రీరాముని జన్మనక్షత్రము - పునర్వసు (నాల్గవ పాదము)
శ్రీరాముని జన్మలగ్నము - కర్కాటకము
01) శ్రీరాముని తల్లిదండ్రులు - దశరథ మహారాజు, మహారాణి కౌసల్య.
02) శ్రీరాముని సోదరులు - భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు
03) శ్రీరాముని వంశగురువు - Vasishtha మహాముని
04) శ్రీరాముని అస్త్రవిద్యాగురువు - విశ్వామిత్ర మహాముని
05) శ్రీరాముని పినతల్లులు - సుమిత్ర, కైకేయి
06) శ్రీరాముని మామ - జనక మహారాజు
శ్రీరాముడు విశ్వామిత్రుని నుండి స్వీకరించిన మంత్రములు -
బల, అతిబల
శ్రీరాముడు విశ్వామిత్రుని నుండి స్వీకరించిన దివ్యాస్త్రములు -
దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం,
ఐంద్రాస్త్రం, వజ్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, పైనాకాస్త్రం, నారాయణాస్త్రం, క్రౌన్చాస్త్రం,
వారుణాస్త్రం,
శైవశూలం, బ్రహ్మశిరం, ఐషీకం, హయశిరము,
ధర్మపాశం, కాలపాశం, వరుణపాశం, శుష్కాశని, ఆర్ద్రాశని,
వర్షణం, శోషణం, సంతాపనం, విలాపనం, మదనం, తామసం, సౌమానం,
సంవర్తం, మౌసలం,
సత్యాస్త్రం, మాయాధరాస్త్రం,
కంకాళము, ముసలము, కాపాలము, కంకణము, (ఈ నాలుగు
ఆసురాస్త్రములు)
ఆగ్నేయాస్త్రం (శిఖరం), వాయవ్యాస్త్రం (ప్రథనం), వైద్యాధరాస్త్రం (నందనం),
గాన్ధర్వాస్త్రం (మానవం)
సౌరాస్త్రం (నిద్రను కలిగించేది, నిద్రను పోగొట్టేది), సౌరాస్త్రం (ఇతరుల
తేజస్సును హరించే తేజః ప్రభం),
సౌమ్యాస్త్రం (శిశిరం), పైశాచాస్త్రం (మోహనం), త్వష్ట్రాస్త్రం (సుదామనం),
మానవాస్త్రం (శీతేషువు),
మోదకి, శిఖరి, (ఈ రెండు గదలు)
రెండు శక్తి అస్త్రాలు,
ఒక దివ్య ఖడ్గం
సంత్యవంతము, సత్యకీర్తి, ధృష్ట్రము, రభసము, ప్రతిహారతరము, పరాక్ ముఖము, అవాక్ ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, సునాభకము,
01) తాటకా వృత్తాంతము,
02) సిద్ధాశ్రమ వృత్తాంతము,
03) కుశనాభ మహారాజు యొక్క పుత్రికల వృత్తాంతము, విశ్వామిత్రుని యొక్క వంశ వృత్తాంతము,
05) గంగానదీ వృత్తాంతము, కుమారసంభవ వృత్తాంతము, సగరమహారాజు చేసిన అశ్వమేథ యాగ వృత్తాంతము, గంగావతరణ వృత్తాంతము,
06) క్షీరసాగరమథన వృత్తాంతము,
07) సప్తమరుత్తుల యొక్క జన్మ వృత్తాంతము,
08) అహల్యా వృత్తాంతము,