Pages

Friday, 31 May 2013

గృహంలో పూజచేసేటప్పుడు మంత్రపుష్పాన్ని చదవండి......!?



దేవాలయంలో పూజ చేసేటప్పుడు, ఇంట్లో దేవతార్చన చేసే సమయంలోనూ మంత్ర పుష్పాన్ని తప్పకుండా చదవడం మంచిది. పవిత్రమైన మంత్రపుష్పాన్ని చదవడంలో ఓ రహస్యం ఇమిడి ఉంది. అదేమిటంటే.. భగవంతుడు నా శరీరంలోనే ఉన్నాడు. పరమాత్మ, నేను ఒక్కటే అనే అద్వైత భావం కలగడం కోసం మంత్ర పుష్పాన్ని చదువుతారని పురోహితులు చెబుతున్నారు. 

మన శరీరంలో నాభికి పైభాగంలో హృదయ కమలం ఉంది. దానికి పైభాగాన అగ్నిశిఖలా పసుపురంగులో వడ్లగింజ మొనలా దేవదేవుడు అణురూపంలో ఉన్నాడని వర్ణించబడింది.

చేతిలోకి మంత్రపుష్పాలను తీసుకుని మంత్ర పుష్పం చదవిన తర్వాత ఆ పుష్పాలను భగవంతునికి సమర్పించి, నమస్కరించి ఆ పూలను మన శిరస్సు మీద వేసుకుంటే దైవశక్తి మనస్సులోకి ప్రవేశిస్తుంది. ఇంకా మంత్రపుష్పం చదవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెబుతున్నారు.