- ఇంటి ఇల్లాలు ఇంట్లోని కుటుంబసభ్యులందరికంటే ముందే నిద్ర లేచేది.
- రాత్రి ధరించిన వస్త్ర భూషణాలను వదిలి స్వీయ కార్యాలను పూర్తి చేసుకొని, పనిచేయటానికి వీలైన వస్త్రాలను ధరించేది.
- ఆపై ఇల్లు ఊడిచి , పేడతో కల్లాపి చల్లి ముగ్గులు వేసేది. అభ్యంగన స్నానం అనంతరం పూజాదికాలు పూర్తి చేసేది.
- వంటింటిని శుభ్రం చేసి, కావలసిన పరికరాలన్నీ శుక్తి చూర్ణం, నార వంటివాటితో శుభ్రపరచుకునేది.
- పగటి ఎండలో ఎండిన కట్టెలతో వంట ప్రారంబించేది.
- నూనెలు, మజ్జిగ వంటి వాటితో వంటకములు చేసి భర్త కొరకు ఎదురుచూసేది.
- భర్తకి ఇష్టమైనవి, ప్రీతికరమైనవి మాత్రమే వండేది. వంట పూర్తయ్యాక, ముఖము, కాళ్ళుచేతులు శుభ్రపరచుకొని ఆభరణాలు దరించి గంధం, తాంబూలములతో వినయవిదేయతలతో వడ్డించేది.
- ఇంట్లో పెద్దవారి చికిత్సకి అవసరమైన ఔషధాలను అందించేది.
- భర్త సోదరుల, సోదరిమణుల అవసరాన్ని గమనించి ఏర్పరచేది.
- బోజననంతరం కొంత విశ్రాంతి తీసుకొని, పాడిగేదల పనులన్నీ చూసేది.
- ధనాన్ని, సమయాన్ని వృధా చెయ్యక రాత్రి బోజనాన్ని సిద్ధం చేసి ఆపై భర్త వద్దకు చేరి సపర్యలు చేసేది.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼