Pages

Saturday, 29 June 2013

శ్రీ సిద్ది వినాయకుడు - అయినవిల్లి

శ్రీ సిద్ది వినాయకుడు - అయినవిల్లి
అత్యంత పురాతనమైన శ్రీ విఘ్నేశ్వర ఆలయములలో అయినవిల్లి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. ఇది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి అత్యంత చేరువలో ఉన్నది.

పూర్వము దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞము నిర్వర్తించే ముందు ఈ వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్రపురాణమును బట్టి తెలియుచున్నది. తొలుత ఈ ఆలయ నిర్మాణము దేవతలే చేసారని పెద్దలు చెబుతూ ఉంటారు.

ప్రతినిత్యం శ్రీ స్వామి వారికి శివాగమ ప్రకారం విశేషార్చనలు సహస్రాధికములుగా నారికేళ ఫలోదకములతో అభిషేకములు చేయించుకుని వేలాది మంది భక్తులు శ్రీ స్వామి కృపా పాత్రులు అవుతారు. భక్తుల కోర్కెలను తీర్చటంలో శ్రీస్వామి ప్రత్యక్ష నిదర్శనాలు చూపిస్తారు. అత్యంత సంతృప్తులైన భక్తులు వేయి నూట పదహార్ల వరకు నారికేళములతో అభిషేకములు చేయించుకుని మొక్కులు సమర్పించుకుంటారు.

ఇక ప్రతి మాసం  ఉభయ చవితి తిధులు దశమి, ఏకాదశి,'వినాయక చవితి, నవరాత్రులలోను' శ్రీ స్వామి వారి వైభవములు  వర్ణింపలేము. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణములో శివకేశవులకు భేదము లేదని చాటిచెపుతున్నట్లు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి, శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ విశ్వేశ్వరాలయం ప్రక్క ప్రక్కనే ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా శ్రీకాలభైరవ స్వామి కొలువై ఉన్నారు. ఇది భక్తులు తప్పక దర్శించకోగల పుణ్యక్షేత్రం.

గణపతి పూజ, ఉపాసన...

గణపతి పూజ, ఉపాసన...
గణపతి పూజ ఉపాసన విధానాలు చాలా వున్నవి. గణపతి దీక్షను పొంది గణపతియే పరబ్రహ్మం అని  మొట్ట మొదటి గాణాపత్యులచే దీక్షను అందుకోవాలి. దీక్షా సంస్కారానంతరం గణపతి మంత్రోపదేశం పొంది, శ్రద్ధగా అనుస్ఠానం చేయాలి. గురుశిష్యులిద్దరూ శుద్ధాత్ములై వుండి, పరాన్న భోజనం చేయరాదు. త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అభ్యక్ష భోజనం నిషిద్ధం. గురుద్రోహి చింతన మనసులోకాని, కలలో కాని రారాదు.

గణాపత్యంలో ఆరు ముఖ్య భేదాలున్నవి. మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, స్వర్ణ గణపతి, నవనీత గణపతి, సంతాన గణపతుల్ని పూజిస్తారు. ఒక్కొక్క గణపతికీ ప్రత్యేక పూజా విధానాలున్నవి. తంత్రసారంలో ఈ పూజా విధానాలన్నీ వివరించబడ్డాయి.

గణపతిని లింగరూపంలోను, సాలిగ్రామ, యంత్ర, కలశ, లేదా విగ్రహ రూపంలోను పూజించే సంప్రదాయమున్నది. గణపతి సాలగ్రామాలు చాలా అరుదు. తంజావూరు జిల్లాలోని తిరునల్లూరులో గణపతి సాలగ్రామానికి పూజ జరుగుతున్నది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పూరులో గణేశ లింగం ఒకటి వున్నదని, డా.గురురాజ భట్టుగారు తెలిపారు. లింగంపై గణేశ యంత్రం చెక్కబడి యున్నది.

నిత్యదేవతార్చనలోను, పంచాయత తనంలో పూజించే గణపతి ప్రీతీకకు శోణభద్ర గణపతి అని పేరు. ఎరుపు వన్నె కలిగి ఎనిమిది కోణాల అంగుష్ఠ ప్రమాణం గల ఈ శిలాప్రతీక శోణభద్రా నదిలో లభిస్తుందని ప్రతీతి.

పంచాయతనం అంటే అయిదు దేవతల్ని ఏకంగా పూజించుట అని అర్థం. ఆదిశంకరులు వివిధ దేవతా పథములను అనుసరించే వారి మధ్యగల వైషమ్యాలను తుదముట్టించి, అన్ని పథముల వారు అనుసరించదగ్గ ఈ పూజా పద్ధతిని అమలు పరచినారు. విష్ణు, శివ, శక్తి, గణపతి, ఆదిత్యుడు, వీరే ఈ అయిదు దేవతలు. పంచాయతన పూజలో విష్ణువు ప్రధాన దేవత అయినప్పుడు మధ్యలో విష్ణు సాలిగ్రామాన్ని ఈశాన్యంలో శివుడు, ఆగ్నేయంలో ఆదిత్యుడు, వాయవ్యంలో అంబిక, నైరుతి భాగంలో గణపతి సంకేతాను ఉంచి పూజిస్తారు. ఈ రీతిగా ప్రధానదేవత ఏదియో ఆ దేవత సంకేత కేంద్రానికి వచ్చినప్పుడు కేంద్రంలో వున్నదేవతా సంకేతం, ఆ దేవత స్థానానికిపోతుంది. 


శ్రీ గణేశ సూక్తము

శ్రీ గణేశ సూక్తము
హరిః ఓం నిసీదగణపతే గణేఘత్వా మహుర్వి ప్రాతమం కవీం ! నరు తేత్వత్క్రియతే కించనారే
మహామర్కం మఘవని చిత్ప్రమార్చ ! అభిఘానోమ ఘనన్నాద మానాన్స్ ఖే
బోధివాసుపతే సఖీనాం ! రణంకృధిరణకృత్సత్య శుష్మాభకై చిదా
భజరాయే అస్మాన్ ! అనూన ఇంద్రక్షుమం చిత్ర గ్రాభ్రంసం గృభాయ! మహా హస్తీ
దక్షిణేన ! విద్యాహిత్వా తులికూర్మింతు విదేష్ణంతువీ మఘం ! తునిమాత్రమవోభిః
నహిత్వా శూరదేవా సమర్తాసోదిత్సంతం! బీమనగాం వారయంతే ! ఏతోన్వింద్రస్త
వామేశానం వస్వస్వరాజం ! వరాధనా మరిపన్నః ప్రస్తోషదుపగానిష ఛ్రవత్సా
మగీయమాన ! అభిరాధనాజిగురత్ ! అనోభ్ర దక్షిణే నాభిసవ్యే నపమృశ ! ఇంద్రం
మనోవసోర్నిర్భాక్ ! ఉపక్రమస్వాభర ధృభర ధృషతా ధృష్టోజనానాం ! అదాశూర్షరస్యవేదః
ఇంద్రంయ ఉనుతే అస్తివా జోవిప్రేభిన్స్ నిత్వః ! అస్మాభిస్సుతం సనుహీః నద్యోజు
వసైవాజా అస్మభ్యం విశ్వశ్చంద్రాః వసైశ్చ మక్షూజడంతే !!

దోషాలను తొలిగించుకోవాలంటే....




జీవితం పాపపుణ్యాల సంగమం. జీవనం మంచిచెడుల కలయిక. మనకు తెలియకుండా కొన్ని పాపపుణ్యాలు చేస్తాం. మంచిచెడులను చేస్తాం. మనం చేసే పాపలకి, చెడులకి మన చుట్టూ ఎన్నో దోషాలు చుట్టుముట్టుకుంటాయి. అలాంటి సమయం వచ్చినప్పుడు మనం ఆ దోషాలను తొలగించుకోవాలని, వాటికి మనం దూరంగా ఉండాలని, అనుకుంటాము కదా ! అందుకోసం మనకు తెలిసిన పూజారులను, పంతుల్ని కలుసుకుంటాం. వాళ్ళు చెప్పింది చేస్తాం.
మనకు మన పురాణ కథలు గాని, పూజరులుగాని, పంతుళ్ళు గాని, మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదని చెబుతుంటారు. అవును. వాళ్ళు చెప్పేది నిజమే. మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే గణేశారాధన చేయాల్సిందే. ఇప్పుడు మనం విభిన్న రూపాలు కలిగిన మన గణపతిని ఏ రూపంలో ఉన్నప్పుడు ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుంది, మనకు కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాం. -

* సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
* చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
* కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
* బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.
* గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
* శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.
* శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
* రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.
* కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.
* ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.
* పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.
* పాలరాయితో చేసిన గణపతిఅని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.
* స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.

శ్రీ గణేశ పంచరత్నం ...



ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కళాధరా వతంసకం విలాసి లోకరక్షకం
అనాయకైక నాయకం వినాశితేభదైత్యకం
సతాశుభాశునాశకం నమామి తం వినాయకం

నట తరాతిభీకరం నవోదితార్క బాస్వరం
సమత్సురారి నిర్ఘరాన్ సతాధికాపదుద్ధరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం త మాశ్రయే పరాత్పరం నిరంతరం
సమస్త లోక శంకరం నిరస్తదైత్యుకుంజరం

దరేతరోదరం వరం వరేభవక్తమక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం
అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం

పురారి పూర్వనందనం సురారి సురారి గర్వచరణం
ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణవారణం

నితాంతకాంతదంతకాంతి మంతకాంతకాత్మజం
అచింత్యరూప మంతహీన మంతరాయకృంతనం
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
త మేకదంత మేవ తం విచింతయామి సంతతం

మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరం
అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాయితాయ రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్
శ్రీ శంకరాచార్య కృత గణేశ పంచరత్నం సంపూర్ణం

Friday, 28 June 2013

హనుమంతునికి ఇష్టమైన పువ్వులేంటో తెలుసా?


జానకీ శోక నాశనుడు ఆంజనేయుడు. ఆయనకు మొల్ల, పొన్నపువ్వు, మొగలి, పొగడ, నందివర్ధనము, మందారము, కడిమి, గజనిమ్మ, పద్మము, నల్లకలువ, ఎర్ర గన్నేరు, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, కనకాంబర, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడు పువ్వులంటే చాలా ఇష్టం 

అలాగే మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, జిల్లేడు, సురపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం వంటి పుష్పాలతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. 

ఇంకా పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, రుధ్ర జడ, తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఇష్టమని పండితులు అంటున్నారు. ఈ పుష్పాలతో స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని వారు చెబుతున్నారు.

జ్యోతిర్లింగాలు ఎన్ని అవి ఎక్కడ ఉన్నాయి....?


ద్వాదశ జ్యోతిర్లింగాలు శివజ్యోతి ప్రతిరూపాలు. మహిమాన్వితాలు. గుజరాత్‌లోని సముద్రతీరంలో సోమనాథ క్షేత్రం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాతీరంలో మల్లికార్జునుడున్నాడు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు కొలువయ్యాడు. 

మధ్యప్రదేశ్‌కు వాయువ్యంగా దాదాపు రాజస్థాన్‌కు అనుకుని ఉంటుంది. నర్మదాతీరంలో ఓంకార క్షేత్రంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 77 కిలోమీటర్ల దూరం. 

కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్‌లోని బదిరీనాథ్ సమీపంలో వెలిశాడు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో వెలసిన జ్యోతిర్లింగం భీమశంకరుడు. నాసిక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వరుడు కొలువయ్యాడు. కాశీలోని జ్యోతిర్లింగం విశ్వనాథుడు. జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ ప్రాంతంలో వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. 

నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్‌లోని ద్వారక సమీపంలో ఉంది. తమిళనాడులోని రామేశ్వరంలో రామేశ్వరుడు ఉన్నాడు. మహారాష్ట్రలోని దౌలతాబాద్ దగ్గర ఘశ్మేశ్వరుడి పేరుతో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు.

ఆంజనేయ స్వామిని మీరెలా పూజిస్తారు.. ఇదిగోండి ఫార్ములా!

ఆంజనేయ స్వామిని ఎప్పుడు.. ఎలా పూజించాలో మీకు తెలుసా.. తెలియనట్లైతే ఈ కథనం చదవండి. ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, స్థిరత్వానికి చిహ్నమూర్తి హనుమంతుడు. అలాంటి హనుమంతుడిని చైత్రమాసాన అంజనీమాత జన్మనిచ్చిన రోజు హనుమజ్జయంతి నాడు పూజిస్తే శుభఫలితాలుంటాయి. అలాగే వారాల్లో శనివారం, మాసంలో వచ్చే అమావాస్య నాడు హనుమంతుడిని కొలిచే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

హనుమంతుడిని పూజించడానికి ఆయన పటం ఎంచుకోండి. పువ్వులు, పండ్లు, బియ్యం, దీపం, మిఠాయిలు, మట్టికుండ అవసరం. హనుమజ్జయంతి రోజున గోధుమలు, పప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపుకొమ్ములు, బంగాళాదుంపలు, ఏదైనా ఆకుపచ్చని కూరగాయల్ని బ్రాహ్మణులకు దానం చేయాలి. 

హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని ఓ ప్రదేశంలో వుంచి అలంకరించాలి. దీపం వెలిగించి పువ్వులు, పండ్లు, బియ్యం సమర్పించి పూజ చేయాలి.

ఇకపోతే.. హనుమంతుడికి సిందూరం అంటే మహాప్రీతి. సీతమ్మ తల్లిని నుదుటిపై సిందూరం పెట్టుకునే సంగతిని ఆరాతీయగా, శ్రీరాముడి అనుగ్రహం కోసమని సమాధానమిచ్చిందని, శ్రీరాముడి కోసం హనుమంతుడు శరీరం అంతా సిందూరం అద్దుకున్నాడని చెప్తారు. 

అనేకమంది భక్తులు బ్రాహ్మణులకు సిందూరం దానం చేస్తారు. హనుమంతుడిని పూజించేటప్పుడు హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడం మంచిది. హనుమజ్జయంతి రోజున మిఠాయిలను నైవేద్యం పెడితే శుభం కలుగుతుందని విశ్వాసం.

శివునికి మాత్రమే అభిషేకం చేస్తారు...మిగతా దేవుళ్ళకు చేయరు ఎందుకని?

అభిషేకమంటే శివునికి అమావాస్య పూర్వకంగా నమక, చమక, పురుషసూక్త  మంత్రాలతో చేసేది. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు ఏకాదశ 

(పదకొండు సార్లు నమకం చెబుతూ) రుద్రాభిషేకం చేస్తారు. పదకొండుసార్లు కుదరకపోతే 

ఏకవారం చేయవచ్చు.

శివునికి చేసేదే అభిషేకం. మిగిలిన దేవీదేవతలకు మంత్రపూతంగా స్నానం 

చేయించడం జరుగుతుంది. ఆయా దేవతలకు చేసే పదహారు రకాల 

ఉపచారాలలో స్నానం కూడా ఒకటి.

12 రాశుల జాతకులు ధరించాల్సిన నవరత్నాల గురించి తెలుసుకోవాలనుందా..


 మేషం- మేషరాశి జాతకులు పగడాన్ని ధరించాలి. ఈ జాతకులు పగడపు రత్నాన్ని ధరించడం ద్వారా దైవ కటాక్షం లభిస్తుంది. కోపం తగ్గుతుంది. అదృష్టం కలిసొస్తుంది.

 వృషభ రాశికారులు.. వజ్రాన్ని ధరించాలి. వజ్రాన్ని ధరించడం ద్వారా సుఖసంతోషాలు, మంచియోగం లభిస్తుంది. ఇంకా వజ్రాధరణతో వృషభ జాతకులకు ప్రత్యేక ఆకర్షణ, తేజస్సు లభిస్తుంది

వృశ్చిక లగ్నకారులు పగడం ధరించాలి. దీన్ని ధరించడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. ఆగ్రహం తగ్గిపోతుంది. అదృష్టం చేకూరుతుంది. సకల సంతోషాలు చేకూరుతాయి. 


. మిథునం : జాతిపచ్చను ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈ రత్నాన్ని ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి వుంటుంది. అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

కర్కాటక జాతకులు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సకలసంపదలు లభిస్తాయి. వాణిజ్యపరంగా, ఆరోగ్యపరమైన సమస్యలుండవు.

 సింహం- కెంపును ధరించాలి. రూబీ అనే ఈ రత్నాన్ని ధరించడం ద్వారా అదృష్టవంతులవుతారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

కన్యారాశి జాతకులు జాతిపచ్చను ధరించడం మంచిది. దీన్ని ధరించడం ద్వారా వాణిజ్యపరంగా ముందడుగు వేస్తారు. అదృష్టాన్నిస్తుంది. సంకల్పాలు నెరవేరుతాయి. 

తులా రాశి జాతకులు (Diamond) వజ్రాన్ని ధరించడం ద్వారా వాహనాల కొనుగోలు చేస్తారు. రావాల్సిన ఆస్తులు వస్తాయి. తేజస్సు లభిస్తుంది. మంచి యోగం చేకూరుతుంది. వృశ్చిక లగ్నకారులు పగడం ధరించాలి. దీన్ని ధరించడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. ఆగ్రహం తగ్గిపోతుంది. అదృష్టం చేకూరుతుంది. సకల సంతోషాలు చేకూరుతాయి. 

ధనుస్సు- కనక పుష్య రాగం (Yellow Shappire): ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులు కనకపుష్యరాగాన్ని ధరించాలి. పసుపు రంగులో ఉండే ఈ రత్నాన్ని ధరించడం ద్వారా సిరిసంపదలు చేకూరుతాయి. మానసిక ప్రశాంతనిస్తుంది. ఆస్తులు చేకూరుతాయి. 

మకర రాశి - నీలం (Blue Shappire): మకర జాతకులు నీల రత్నాన్ని ధరించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. సిరిసంపదలు వెల్లివెరుస్తాయి. దైవానుగ్రహం లభిస్తుంది.

 కుంభం - నీలం (Blue Shappire): కుంభ రాశి జాతకులు కూడా నీల రత్నాన్ని ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దైవానుగ్రహం లభిస్తుంది. 

మీనం - కనక పుష్య రాగం (Yellow Shappire) : మీన రాశి జాతకులు ఈ రత్నాన్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంత చేకూరుతుంది. సకలసంపదలు చేకూరుతాయి.

Thursday, 27 June 2013

దురితక్షయకారిణి లోకసంరక్షిణి లోకమాత రూపాల్లో విలక్షణమైన రూపం దుర్గ


లోకమాత రూపాల్లో విలక్షణమైన రూపం దుర్గ. 

దుర్గమమగు ఏ కార్యానై్ననా సుగమం చేయగల చల్లని 

తల్లి కనుకనే ఆమెని దుర్గా అని అంటారు. దుర్గా దుర్గతి 

నాశిని అని అమ్మను స్తుతించటంలో కూడా ఒక 

అంతరార్ధం ఉంది . దుర్గం అంటే దేహం.ఈదేహంలో ఉండే 

శక్తే దుర్గ. అదే ప్రాణశక్తి. ప్రాణం ఉంటేనే దేహం ఉన్నట్లుగా 

దుర్గాదేవి అనుగ్రహం ఉంటేనే ఈలోకం నిలచి ఉంటుంది. 

దుర్గా రూపంలో ఒకొక్క అంశానికీ ఒకొక్క సంకేతం ఉంది. 

సర్వజ్ఞులైన పండితోత్తములకు మాత్రమే విశిధమయ్యే ఈ 

రూపలావణ్య విశేషాలు వారి ద్వారానే లోకానికి 

వెల్లడయ్యాయి.

దుర్గాదేవి దశభుజాలు:
 పంచప్రాణ, పంచోపప్రాణాలు దశప్రాణాల కు, పంచజ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. 

సింహవాహిని : ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉంటుంది. సింహం కామానికి సంకేతం. దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూ డదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది. అలాగే అమ్మ చేతి లో సంహరించబడిన దున్నపోతు రూపంలో ఉండే మహిషుడు క్రోధానికి ప్రతీక. క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం. ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కనుక అమ్మకుచేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే. మనలో అట్టి దుర్గాతత్వాన్ని పెంపొందించు కోవటమే ప్రాణాయామం ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం.

కుడి, ఎడమల శక్తి స్వరూపాలు: ఇక దుర్గ పక్కన ఉండేది లక్ష్మీదేవి. ఈమె ధనశక్తి. స్థితికారిణి. ఆశక్తిఉండాలి. దానిసూచిస్తూ లక్ష్మీదేవి గుడ్ల గూబను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరోపక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక. అది అత్యవసరం. అజ్ఞానం వీడి సత్‌జ్ఞానంతో ఉండాల ని చెప్పటమే దాని అర్ధం. ఆవిడ వాహనం హంస. హంస, పాలనీ నీటినీ వేరుచేసి కేవలం పాలని మాత్రమే స్వీకరిస్తుంది. 

కుమార స్వామి: ఇంకోపక్క నుండే కుమారస్వామి దేవసేనాని, ఆయన వీరత్వానికి ప్రతీక. వీరత్వంతో ఆత్మరాజ్యస్థాపన చేయాలి. నెమలి లైంగిక సంబంధంలేని బ్రహ్మచర్యానికి గుర్తు. అటువంటి బ్రహ్మచర్యం పాటించడం వలన, నెమలి కన్నువంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది. 

గణపతి: ఇటువంటి సాధనలో సిద్ది గణపతి స్థానం ఏమిటంటే, అకార ణంగా అన్నింటినీ నాశనం చేసే లక్షణం ఎలుకది. సిధ్ధికి భంగం కలుగ కుండా ఉండాలంటే ఆఎలుకను అదుపులో ఉంచుకోవాలి. అందుకు సర్వసమర్ధుడు మూలాధార చక్రానికి అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడు. అందుకే సాధనలో ముందుగా చైతన్యాన్ని పొందేది మూలాధార చక్రమే.

పరమేశ్వరుడు: ఆన్నింటికీ అధిష్టాతగాఉన్న శివుడు త్యాగమునకు, అద్వైతస్థితికి ప్రతీక కాగా ఆయన చేతిలో డమరుకం ప్రణవనాదం. త్రిశూలం సత్వరజస్తమోగుణాలకు గుర్తు, వృషభము అంటే ధర్మం. అదే ఆయనవాహనమైన నంది. అది నాలుగుకాళ్లపై ఉంటుంది. ఇలాపరివార సహితంగా దుర్గాతత్వం మానవునకు మార్గదర్శకమై జీవితగమ్యాన్ని సూచిస్తుంది.

దుర్గా దుర్గతి నాశిని అని అమ్మను స్తుతించటం లో ఒక అంతరార్ధం తెలుసుకుందాం .



దుర్గా దుర్గతి నాశిని అని అమ్మను స్తుతించటం లో ఒక అంతరార్ధం తెలుసుకుందాం . దుర్గం అంటే శరీరం .ఈశరీరంలో ఉండే శక్తే దుర్గ . అదే ప్రాణశక్తి . ప్రాణం ఉంటేనే దేహం ఉన్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం వలన మాత్రమే విశ్వమంతా నిలచిఉంది.
దుర్గాదేవి దశభుజాలు ,పంచప్రాణ,పంచోపప్రాణాలు దశప్రాణాలకు ,పంచజ్ఞానేంద్రియాలకు,పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం .దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది ..అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక .క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం .ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకుచేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే . మనలో అట్టి దుర్గాతత్వాన్ని పెంపొందించుకోవటమే ప్రాణాయామం ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం.
ఇక దుర్గ పక్కన ఉండే లక్ష్మీదేవి ధనశక్తి. ఆశక్తిఉండాలి కానీ దివాంధం గుడ్లగూబలా కన్నూమిన్నూకానని స్థితి పనికిరాదు .దానిసూచిస్తూ లక్ష్మీదేవి గుడ్లగూబను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరో పక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక .అది అత్యవసరం .అసత్ జ్ఞానం వీడి సత్ జ్ఞానంతో ఉండాలనేదానికి సంకేతం ఆవిడ వాహనం హంస.ాది నీటినివీడి పాలనుమాత్రమే స్వీకరిస్తుంది . ఇంకోపక్కనుండే కుమారస్వామి దేవసేనాని ,ఆయనవీరత్వానికి ప్రతీక.ాట్టివీరత్వంతో ఆత్మరాజ్యస్థాపన చేయాలి . నెమలి లైంగిక సంబంధంలేని బ్రహ్మచర్యానికి గుర్తు .అట్తిబ్రహ్మచర్యమందుండుటచే నెమలికన్నువంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది. ఇట్టి సాధనలో సిద్ది గణపతి స్థానం.
అకారణంగా అన్నింటినీ నాశనం చేసే లక్షణం ఎలుకది . సిధ్ధికి భంగం కలుగకుండా ఉండాలంటే ఆఎలుకను అదుపులో ఉంచుకోవాలి . ఆన్నింటికీ అధిష్టాతగాఉన్న శివుడు త్యాగమునకు,అద్వైతస్థితికి ప్రతీక కాగా ఆయన చేతిలో డమరుకం ప్రణవనాదం. త్రిసూలం సత్వరజస్తమోగుణాలకు గుర్తు,వృషము అంటే ధర్మం .అదే ఆయనవాహనమైన నంది. అది నాలుగుకాళ్లపై ఉంటుంది .ఇలాపరివార సహితంగా దుర్గాతత్వం మానవునకు మార్గదర్శకమై జీవితగమ్యాన్ని సూచిస్తుంది.

పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీ కృష్ణ భగవానుడి రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడుశ్రీ కృష్ణుడు వ్రతకథతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.

పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీ కృష్ణ   భగవానుడి రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడుశ్రీ కృష్ణుడు  వ్రతకథతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.

14Feaసప్తమి తిథిన సూర్యోదయానికి ముందే నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. ఈ తర్వాత శక్తికొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రథాన్ని చేయించి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్యప్రతిమను పెట్టాలి. ఒక కొత్త గుడ్డను పరిచి దానిమీద ఈ రథాన్ని ఉంచాలి. సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్లీ పూజలు చేసి దానధర్మాలు, వ్రత పారాయణ అనంతరం రథాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి.

పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్నివైద్యాలు చేయించినా ఫలింతం లేకపోయే సరికి క్రాంత ధర్శనులైన ఋషూలను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషూలు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కొద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరిదశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథ సప్తమి వ్రతాన్ని చూసాడు అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్యం కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషూలు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండిబయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషూలు రథసప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు.

Lord-Suryfమాఘ శుద్ధ షష్ఠినాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది, చెరువు, నుయ్యి ఇలా ఏదో ఒకచోట స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య ఆలయానికి వెళ్లి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. ఈ తర్వాత శక్తికొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రథాన్ని చేయించి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్యప్రతిమను పెట్టాలి. ఒక కొత్త గుడ్డను పరిచి దానిమీద ఈ రథాన్ని ఉంచాలి. సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్లీ పూజలు చేసి దానధర్మాలు, వ్రత పారాయణ అనంతరం రథాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంభోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషూలు చెప్పిన విషయాన్ని కృష్టూడు ధర్మరాజుకు చెప్పాడు.ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో చేయడం కనిపిస్తుంది.

‘‘యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మను తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ’’
ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా, భుజాలమీదా, మోచేతి మడతలమీద, అరచేతుల్లోనూ (మొత్తం ఏడు) జిల్లేడాకులు ఉంచుకుని పై పద్యం చదువుతూ సూర్యుడికి నమస్కరించి స్నానం చేయడం మన సంప్రదాయం. గత ఏడు జన్మలలోనూ నేను చేసిన పాపాలను, రోగాలను, శోకాలనూ, మకర రాశిలోని సప్తమి హరించు గాక అని దీనర్థం. ఆ రోజున హిందువులంతా సూర్యుణ్ణి పూజించి ఆరు బయటక సూర్యకాంతి పడే ప్రదేశంలో పిడకల మంట మీద పరమాన్నం వండి దాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. చిక్కుడు కాయలతో రథం తయారు చేసి దినకరుడికి సమర్పించుకుంటారు.ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే..

రథ సప్తమి నాడు స్నానం చేసేటప్పుడు పలించే శ్లోకం

శ్లో యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ

రథ సప్తమినాడు స్నానం ఏసేటప్పుడు జిల్లేడు ఆకు, రేగు పండు తల మీద ఉంచుకుని ఈ శ్లోకం పఠిస్తే ఏడు జన్మలనుంచి వెన్నంటి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి.

పురాణాల ఆధారంగా : ఈరోజు సూర్య జయంతి. ఏడు గుర్రాలు కలిగిన ఏకచక్ర రథంపై రెండు చేతులా తెల్లటి పద్మాలు ధరించి ఉషస్సమయాన ఉదయించే ప్రత్యక్ష నారాయణుడి పుట్టినరోజు. రామాయణ, భారతాలకు సూర్యుడితో గట్టి సంబంధమే ఉంది.రాముడిది రఘుపంశం. అంటే ఆయన సూర్యవంశజుడన్న మాట! అగస్త్యుడు శ్రీ రాముడికి బోధించిన మంత్రాలే ఆదిత్య హృదయంగా ప్రాచుర్యం పొందాయి. తనను పండుగా భావించి మింగేయబోయిన చిన్నారి హనుమంతుడికి గురువుగానూ రామాయణంలో కనిపిస్తాడు సూర్యుడు.అటు భారతంలోనూ కర్ణుని పాత్ర గురించి ప్రత్యేకంగా ఎప్పనక్కరలేదు. దుర్వాస మహాముని నుంచి మంత్రోపదేశం పొందిన కుంతికి ముందుగా గుర్తొచ్చింది సూర్యుడే. సత్రాజిత్తుకు శమంతకమనిని, ధర్మరాజుకు అక్షయపాత్రనూ, ఇచ్చింది భాస్కరుడే.

ఈ రోజు ఖగోళపరంగా:- సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని చెప్పవచ్చు, ఈరోజెనుంచే భూమి సూర్యుడికి దగ్గరవటం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది.

దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యం పెడితే..

ఎవరికైతే బాగా నీరసం, నిస్సత్తువ ఉంటుందో అటువంటి వారు నేరేడు పండును దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే జబ్బులు దూరం అయి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. నేరేడు పండును శ్రీ శనైశ్ఛర స్వామికినైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు నయం అవుతాయి. పూజ చేసిన తరువాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే రోగ బాధలు కలగవు. నేరేడు పండునుు శనైశ్చర స్వామికి ప్రియమైన నల్ల పువ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు ఉండవు. నేరేడు పండును దేవుని పేరిట పూజించి బిక్షగాళ్ళకు దానం చేస్తే దారిధ్ర్యం దరిచేరదు. భోజనంతోపాటు నేరేడు పండును వడ్డిస్తే మీకు ఎప్పుడూ మృష్టాన్న భోజనం లభిస్తుంది. నేరేడు పండును పుణ్య క్షేత్రాల్లో యోగ్య బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత లభిస్తుంది. నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చు.  

Wednesday, 26 June 2013

‘‘ దేవుడున్నాడు ’’ అనేవారూ ‘ దేవుడు లేడు ’ అనే వారిలో ఎవరు పరిపూర్ణులు !

దేవుడున్నాడు అనే వారినీ, వేదాలను, దైవాన్ని నమ్మడం వలన మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారినీ ‘ ఆస్తికులు ’ అంటారు. దేవుడు లేడు అనే వారినీ, వేద ప్రమాణాన్ని అంగీకరించ కుండా, ధర్మశాస్త్రాలను విశ్వసించని వారినీ ‘‘ నాస్తికులు’’ అంటారు. ఇక ఆస్తికులు, నాస్తికులు వీరివురిలో ఎవరు పరిపూర్ణులు అని ప్రశ్నిస్తే ఇద్దరూ కారనే చెప్పాలి ఎందుకంటే.... ఒక ప్రక్క ఆస్తికులుగా ఉంటూనే తన స్వార్థం కోసం ఇతరులకి హాని తలపెట్టేవాడు పరిపూర్ణమైన ఆస్తికుడెలా అవుతాడు. అలాగే నాస్తికుడిగా జీవిస్తూ, నైతిక విలువలు పాటిస్తూ, ధర్మబద్దంగా నడిచే వారిని పూర్తిగా నాస్తికులనీ అనలేము, కాబట్టి దీనిని బట్టి చూస్తే వీరిద్దరిలో ఎవరూ పరిపూర్ణులు కారని తెలస్తుంన్నది.  

చితాభస్మాన్ని నియమానుసారం ధరిస్తే..?

చితాభస్మం... ఉజ్జయినిలోని శ్రీ మహాకాల అనే జ్యోతిర్లింగానికి చితాభస్మంతో అభిషేకాన్ని చేస్తారు. చితాభస్మాన్ని కాపాలికులు, మాంత్రికులు, అఘోరీలు, శవసాధకులు, ప్రేతాత్మలను పూజించేవారు. వామచారులు, వామ వర్గాలకు చెందిన వారు ఉపయోగిస్తారు. మాంత్రికుల్లో ఒక నమ్మకం వుంది. తమ గురువుల చితాభస్మాన్ని మాత్రమే వారు ఉపయోగిస్తారు. దీన్ని వాడటం ద్వారా తమ గురువుల ఆత్మ తమతోనే ఉంటుందని నమ్మకం. నియమానుసారం చితాభస్మాన్ని ధరిస్తే ప్రేతాత్మలు భస్మధారణ చేసిన వారి మాటను ఎప్పుడూ వింటూనే ఉంటాయని మంత్ర రహస్యాల్లో వివరించబడి ఉంది. అయితే శ్రీ మహాకాల జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన భస్మం ప్రసాదంగా మారుతుంది. ఇది ఎటువంటి హానీ కలిగించదు. ఇది క్షేత్ర మహిమ అంటూ పండితులు చెబుతున్నారు.

అనివార్యమైన మార్పు గీతాసారంతోనే

అనివార్యమైన మార్పు గీతాసారంతోనే
geetaనేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.

(ద్వితీయోధ్యాయం- సాంఖ్యాయోగం)


శ్లోకంః వేదావినాశినం నిత్యం
య ఏన మజ మవ్యయమ్‌
కథం స పురుషః పార్థ !
కం ఘాతయతి హంతికమ్‌ 


ధీమంతులగు పృథువంశమున జన్మించిన అర్జునా!వివేకము కోల్పోకుము. ఆత్మలు నశించవని, త్రైకాలికాభాధ్యములనీ జన్మాదులు లేనివగుటచే స్థిరరూపము కలవని తెలుసుకున్నవాడు ఎవ్వడూ ఆత్మలను ఏ శస్త్రాదులచేతనూ చంపించు ప్రయత్నము చేయడు. స్వయముగను యుద్దాదులలో ఆ యుద్దములలో చంపు ప్రయత్నము చేయడు. కనుక బుద్దిమంతుడు చేయు యుద్ధాది క్రియల్లో అతడు చంపుతున్నది కానీ, చంపునది కానీ పాపదుష్టమైన వరీరములనేయని గుర్తుంచుకొనుము. ఆత్మయొక్క యదార్ధ స్థితి నీకు తెలియక భ్రమపడి, భీష్మ ద్రోణాదుల ఆత్మలనే చంపుచున్నానని శోకము చెందుచున్నావు. అది విడువుము.
శ్లోకంః వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ 


తెలివైనవాడు ధరించగా శిధిలమైన వస్తమ్రులను వదలివేయును. వాడుటకు వీలగు కొత్త వస్త్రాలను తిరిగి ధరించును. పాత వస్తమ్రును విడుచుట గానీ, నూతన వస్తమ్రును ధరించుటకు గానీ చింతింపడు. సంతోషమునే పొందును. అట్లే కర్మానుభవమునకై లభించిన శరీరము, ఆ భోగము పూర్తికాగానే దాని వయసుతో నిమిత్తము లేకుండా శిథిలమైనదిగ పరిగణింపబడును. మరో కర్మానుభవమున శరీరము పనికిరాదన్నమాట. వానిని వదలి నూతన కర్మానుభవమున కనువగు మరొక నూతన దేహమును పొందును. ఇది ధర్మ యుద్దము. ఇందు మరణించిన వారందరికీ రమణీయ దేహము లభించుట నిశ్చయము. కనుక, ఇకపై దేహమే లభింపక ప్రళయములో ఆత్మమగ్గిపోవలసి యుడునేమోయనికానీ, ఒకవేల లభించినా, ఇప్పటి శరీరాలకంటే చెట్టు, పక్షి, ఇత్యాది నీచ శరీరములు లభించునేమోననే బెంగకానీ నీకవసరం లేదు. ఆనందించవలసిన యుద్ధ సమయంలో శోకించుచున్నావు.

నుదుట బొట్టు పెట్టుకొంటాము. ఎందుకు?

దైవభక్తి గల భారతీయులు ప్రత్యేకించి వివాహితులు ఐన స్త్రీలు నుదిటి మీద తిలకము లేదా బొట్టు పెట్టుకొంటారు.  ప్రతి రోజు స్నానము చేసిన తరువాత మరియు ప్రత్యేక సందర్భాలలోనూ, పూజ చేసే ముందర,  తరువాత,  లేక దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు తప్పక బొట్టు పెట్టుకుంటారు.  చాలా తెగలలో వివాహితులైన స్త్రీలు ఎల్లా వేళలా నుదుట కుంకుమ పెట్టుకొనే కనిపించాలనే ఆదేశము ఉంది.   వైదిక పద్దతులను ఆచరించే వారు మంత్ర ప్రార్ధనలతో కుంకుమ ధరిస్తారు.  మహాత్ములకు మరియు దైవ ప్రతిమలకు ఆరాధనా సూచకంగా బొట్టు / తిలకం ధారణ జరుపుతాము.  తిలకము వేరు వేరు రంగులలోను, రూపాలలోను ఉంటుంది. 

నుదిటి పైన బొట్టు ఎందుకు?

నుదుటి  పైన బొట్టు - ధరించిన వారిలోనూ, ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది.  దైవ చిహ్నము గా గుర్తించ బడుతుంది.  

మునుపటి  కాలములో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు.  పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు.  క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుట ధరించే వాడు.  వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు.   శూద్రుడు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించెవాడు. 

విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్నీ, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్నీ, దేవీ భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు. 

భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మన నుదుట పెట్టబడుతుంది.   జ్ఞాపక శక్తికి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య నున్న ప్రదేశములో తిలకము పెడతాము.  యోగ పరిభాషలో ఈ ప్రదేశము ఆజ్ఞా చక్రముగా చెప్పబడుతుంది.  నేను భగవంతుని గుర్తున్చుకొండును గాక! ఈ భక్తీ భావన నా అన్ని కార్య కలాపాలలోనూ వ్యాపించుగాక! నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక! అనే ప్రార్ధనతో తిలకము పెట్టుకోబడుతుంది.  మనము ఈ ప్రార్ధనాయుతమైన వైఖరిని తాత్కాలికముగా మరచిపోయినా, ఇతరుల నుదుటి పైనున్న బొట్టు మనకు వెంటనే మన ప్రార్ధనను గుర్తుకు చేస్తుంది.   అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవ్రుత్తులనుంచి, వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది. 

మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము  విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది.  అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది.  తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది.  శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది.  కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది.  బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందీ లు అలంకార ప్రాయమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు. 

భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది.   మరియు ఎక్కడ ఉన్నా సులభంగా మనల్ని గుర్తించడానికి సహాయపడుతుంది. 

ఆధ్యాత్మికతతోనే అన్నీ సాధ్యం

మనిషిని, సమాజాన్నీ కూడా సక్రమ మార్గంలో నడిపించేది ఆధ్యాత్మికం ఒక్కటే. ఆధ్యాత్మిక భావాల వల్ల భక్తి తత్పరత ఏర్పడుతుంది. అప్పుడే మానవుని ఆలోచనలు రుజుమార్గంలో పయనిస్తారుు. స్వలాభాపేక్ష కోసం పరితపించే అలవాటు పోరుు సమాజశ్రేయస్సుని కాక్షించే ఒక అద్భుతమైన భావాలు అంకురిస్తారుు. అందుకు భక్తి ఎంతో తోడ్పడుతుంది. భక్తి అనేది ఏ విధంగానైనా ఉండవచ్చు. ఇష్టదైవం మీద, గురువు మీద, చేసే పనిలో ఇలా ప్రతి అంశంలోను భక్తిని జోడిస్తే ఫలితాలు అందరికీ అందుతారుు. ఉదాహరణకి, మంచి మనసుతో ఒక పండ్లమెుక్కని నాటితే దాని ఫలాలు అందరూ పంచుకుంటారు. అలాగే భక్తిభావంతో చేసే పని తాలూకు ఫలితం అంతటా ప్రతిఫలిస్తుంది. 


07Feaచీకటిలో ఒక దీపాన్ని వెలిగిస్తే, ఆ దీపం వెలుగు దాని శక్తిని బట్టి ప్రసరిస్తుంది. పెద్ద దీపం మరింత దూరం ప్రసరిస్తుంది. ఆ వెలుగు, దీపం వెలిగించిన వారికే కాకుండా అందరికీ దారి చూపెడుతుంది. అదే విధంగా ఎంత ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకుంటే, అంత భక్తి పెరుగుతూవుంటుంది. దానివల్ల మన చుట్టూ ఉన్నవారు కూడా భక్తి తత్పరత అలవరచుకుంటారు. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా? అనేది ముఖ్యం కాదు. మనకి భక్తి ఉందా లేదా అనేదే ముఖ్యం. ఈ భక్తి మనం చూపించే పద్ధతి మీద ఆధారపడి ఫలితాల్నిస్తుంది. పెద్దల పట్ల భక్తి ఉంటే, వారి ప్రేమని మనకి పంచుతారు. మన శ్రేయస్సుని కోరతారు. దేవుడి మీద భక్తివుంటే, దైవత్వాన్ని పొందుతారు. చేసే పనిమీద భక్తి ఉంటే, విజయాన్ని సాధిస్తారు. కనుక భక్తిని కూడా మనం వినియోగించుకునే విధానంలో ఉంటుంది.


అయితే అన్నిటి యందు, అందరి యందు భక్తి కలిగివుండటం చాలా అవసరం. ఇది ఎంతో ఉత్తమమయిన లక్షణం. ఆధ్యాత్మిక భావాలు ఉన్నచోట ప్రతికూల (నెగెటివ్‌) ఆలోచనలకి తావుండదు. మంచి విషయాను రక్తి, బుద్ధికుశలత, కష్టపడే స్వభా వం, అందరికీ మేలు చేయాలనే తలంపు వంటి మంచి కార్యాల వైపు మనసు పరుగులిడుతుంది. మనపూర్వులు అటువంటి తలం పుతోనే దానధర్మాలు చేయడం, అతిధుల్ని ఆదరించడం, అన్న సత్రంలు నిర్మించడం వంటి సామాజిక సేవలు అందించేవారు.అటువంటివారు లౌకిక పరమైన సంపదలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే, వారిని ‘ఆ‚..! ఏముంది? ఉన్నదంతా దానధర్మాలకి తగలేసాడు. ఇప్పుడు దరిద్రంతో బాధపడుతున్నాడు’ అంటూ విమర్శించేవారు. నిజానికి వారు ఎన్నటికీ దరిద్రులు కాదు. దారిద్య్రం అనేది సంపదలో ఉండదు. 

అది కేవలం మనసులోనే ఉంటుంది. పది ఊళ్ళు కొనగల సంపద ఉన్నా, సాటివాడికి మెతుకు విదల్చలేని ఆ సంపన్నుడే దరిద్రుడుగా పిలవబడతాడు. దానికి నిదర్శనమే కుచేలుని వృత్తాంతం. తినడానికి తిండి లేకపోయినా, సంపన్నుడైన శ్రీకృష్ణపరమాత్మకి ఇంట్లో కటాకటీగా మిగిలిన గుప్పెడు అటుకులు పెట్టాడు. అందుకు ప్రతిగా భగవంతుడు కనుక అష్టైశ్వర్యాల్నీ ప్రసాదించాడు.మనం ఏదైనా చేయగలుగుతున్నాం అంటే అందుకు చైతన్యం ఆ భగవంతుడే. చూడగలుగుతున్నాం అంటే ఆ శక్తి భగవంతుడే. అందుకే మహానుభావులు అంటారు. అహం వదలమని. అహం అంటే నేను, నాది అనే భావన. మనలో భగవంతుడు అనే చైతన్యం లేకపోతే అవయవాలు పనిచేయవు. కాబట్టి ఇది నేను చేసాను. ఇది నాది, దీనిని నేను సాధించాను, అనే భావాలు మనిషిని అధోగతి పాలుచేస్తాయి. అందుకే యోగులు - యోగ సమాధిలో నీలో నిన్ను దర్శించుకో అని చెప్తారు. అలా మనమీద మనమే భక్తితో మనల్ని లోపల దర్శించుకోగలిగితే కనిపించేది భగవత్స్వరూపమే. దానికి తిరుగులేదు. అప్పుడే ‘అహం బ్రహ్మోస్మి’ అనేదానికి అర్ధం అవగతం అవుతుంది. ఇక్కడ అహం బ్రహ్మోస్మి అంటే నేనే బ్రహ్మని అని అనుకోవడం ఒకటైతే, నేను అనేది కేవలం బ్రహ్మ మాత్రమే అని తెలుసుకోవడం మరొకటి. 

ఇక ఇవన్నీ అలా ఉంచితే, ఆధ్యాత్మికత అలవరచుకోవడం ఎలా? అనే అనుమానం కొందరికి రావచ్చు. ఇది నమ్మకం, అపనమ్మకం అనే రెండు స్వభావాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే భగవంతుడున్నాడా లేడా అన్నది ముఖ్యం కాదని పైన చెప్పడంలో ఉద్ధేశ్యం అదే. అయితే ప్రతిమనిషిలోను ఆధ్యాతికత ఉంటుంది. దానిని ఎవరికి వారు తెలుసుకోవలసి ఉంటుంది. దేవుడు లేడని వారించేవారికి కూడా ఆధ్యాత్మికత వారికి తెలియకుండానే ఉంటుంది. ఏ విధంగా అంటే, ఒక దీనుడో, పండు ముసలిదైన ఒక బిచ్చగత్తో, నాస్తికునికి ఎదురుపడ్డారనుకోండి జాలితో జేబులోంచి ఎంతో కొంత ఇచ్చి సంతృప్తి పడతాడు. ఒక మనసుకి జాలి కలగడం కూడా ఆధ్మాత్మిక ప్రభావమే. అదే ఆ ఆధ్యాత్మికత లేనట్లైతే, తనముందు నిలబడిన దీనుని చూసి, నిస్సహాయంగా బతకడం ఎందుకు చావు అంటూ ఒక్కపోటు పొడవచ్చుగా? మరి ఆ పని ఎందుకు చేయలేదు? దేవుడు లేడు అన్నవాడు ఆ పనిచేయడానికి ఎవరికి భయపడుతున్నాడు? సమాజానికా! అయితే ఈ నాస్తికుడికి సమాజం మీద భక్తి ఉన్నట్టే. భక్తి ఉంటే ఆధ్మాత్మికత ఉన్నట్టే. ఇలా అనేక విషయాల్లో మనం సామరస్యంగానే వ్యవహరిస్తాం. 

అందుకే ‘దైవం మానుష రూపేణ’ అన్నారు. ప్రతి మనిషిలోను భగవంతుడు ఉంటాడు. కానీ మనిషిని అహంకారం అనే పొర కమ్మేసి, ఆత్మలో ఉన్న పరమాత్మ మసకబారిపోతాడు. కాబట్టి మనలో నిభిడీకృతమై ఉన్న ఆధ్యాత్మిక తరంగాల్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేయడం మొదలు పెడితే, సాధ్యాసాధ్యాల గురించిన చింత ఎవరికీ ఉండదు. మన ఈ ప్రయత్నం వల్ల సత్సంగం ఏర్పడుతుంది. సమాజంలో మంచి తరంగాలు ప్రసరించి నవసమాజం వృద్ధిచెందుతుంది.


అందుకే దాచుకుని తినడం కన్నా పంచుకుని తినడంలో ఎంతో తృప్తి ఉంటుంది. ఆ తృప్తే భక్తికి పరాకాష్ట. అందుకే మన పెద్దలు అంటారు ‘పెట్టే గుణం ఉన్నవాడికే పుచ్చుకునే అర్హత ఉంటుంది’ అని. అలా చేయడం వల్ల మనకి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అసలు భగవంతుని అనుగ్రహం కలగాలంటే, ఆయనకి పూజలు, యజ్ఞాలు చేయనవసరం లేదు. ఆయన చెప్పినదాన్ని పాటిస్తే చాలు. ఆయన ఇష్టపడే మంచి పనులు మనం నిత్యం చేస్తూవుంటే చాలు. అదే మహా యజ్ఞం కూడా. ఇవే ఆధ్యాత్మికానికి నిలువెత్తు నిదర్శనాలు

కార్యోన్ముఖులు కావాలంటే గీతాధ్యయనమే మార్గం

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి. 

శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
శ్లోకంఃయది మాం అప్రతీకారం
అశస్త్రం శస్తప్రాణయంః
ధార్తరాష్ట్రా రణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్‌
 
నిరాయుధుడనై, ప్రతీకారము చేయక వారిపై జాలితో నిలచిన నన్ను కౌరవులు బండగుండెతో ఆయుధాలతో నియమాన్ని అతిక్రమించి నన్ను వధించినా అది నాకు మరీ మంచిది. నాకు వీర స్వర్గం కలుగుతుంది. అది కూడా నాకు క్షేమమే కానీ వారికి అదే కలిగినచో ప్రయోజనం ఏమిటీ? నిరపరాధిని నన్ను చంపుట వలన వారు ఘోర నరకము నందెదరు. అది నాకు క్షేమతరము. ఆ విధంగానే కానిమ్ము. 
సంజయ ఉవాచ
శ్లోకంఃఏవ ముక్త్వా ర్జున స్సంఖ్యే
రథోపస్థ ఉపావిశత్‌
విసృజ్య సశరం చాపం
శోక సంవిగ్న మానసః 


సంజయుడు చెప్పుచున్నాడు ధర్మసంస్థాపన చేయదలచిన శ్రీకృష్ణునితోనే వీరధర్మము పాటించవలసిన అర్జునుడు దానిని విడిచిపెట్టాడు. అతని హృదయం శోకం తో చలించింది. కారుణ్యం నిండింది. చేతను న్న ధనుర్భాణాల్ని కింద పారవేసి, నిలువజాలక రధములోనే కూలబడిపోయాడు. అని ధృతరా ష్ర్టునికి సంజయుడు వివరించుచున్నాడు.

శుచీంద్రం ఇది దత్తాత్రేయ క్షేత్రం. (అడుగడుగున గుడి)



తిరునల్వేలి
తమిళనాడులోని తిరునల్వేలికి 60 కి.మీ. దూరంలో సముద్రపు అంచున తిరుచందూర్‌ వుంది. ఇక్కడి సుబ్రహ్మన్యేశ్వర స్వామి అత్యంత సంపన్నుడు. తారకాసుర సంహారం తర్వాత అతని తమ్ముడు శూరపద్ముడు పారిపొతే కుమార స్వామి వెంబడిస్తే, వాడు మామిడి చెట్టుగా మారి పోయాడు. స్వామి, బల్లెంతో చెట్టు చీల్చి వాణ్ని చంపేశాడు. అప్పుడు ఆ చెట్టులో ఒక భాగం నెమలిగా, రెండో భాగం కోడిగా మారాయి. ఆ రెండిటిని కుమార స్వామి వాహనాలుగా చేసుకొన్నాడు. ఆయన ఆయుధం, ఆయనకు చిహ్నంగా పూజలందు కొంటోంది ఇక్కడ. ఇక్కడి శరవణ భవుడైన కుమార స్వామికి ఉదయం పది గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు విభూతితో అభిషేకం రెండు సార్లు జరగటం విశేషం. సముద్రపు ఒడ్డున ఒక బావిలో తియ్యని నీరు లభించటం మరో గొప్ప విచిత్రం.

తంజావూరు
భారతీయ శిల్ప కళా వైభవానికి గొప్ప ఉదాహ రణ తంజావూరు. ఇక్కడి అతి ప్రాచీన సరస్వతీ మహల్‌ అనే పెద్ద గ్రంధాలయం వుంది. ప్రపంచ భాషల పుుస్తకాలన్నీ ఇక్కడ లభిస్తాయి. పురాతన గ్రంధాలన్నీ ఇక్కడే దొరుకుతాయి. పరిశోధకుల పాలిటి కల్ప వృక్షం ఈ గ్రంధాల యం. ఇక్కడి బృహదీశ్వరాలయం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. బృహత్‌ అంటే చాలా పెద్దది అని అర్ధం. బృహదీశ్వరలింగం నల్లరాతితో చేయబడి,16 అడుగుల ఎత్తు, 21 అడుగుల కైవారం కలిగి ఉంటుంది. ఆరు అడుగుల ఎత్తు పుునాది మీద నిర్మించిన గొప్ప ఆలయం. ఇక్కడి నంది పందోమ్మిదిన్నర, ఎనిమిదిన్నర, పన్నెండు అడుగుల కొలతలతో 25 టన్నుల బరువుం టుంది. లేపాక్షి తర్వాత పెద్ద నంది ఇదే. నంది వున్న చోటు నుంచి 50 గజాల దూరంలో ఆల యం వుండటం మరీ విశేషం. ఆలయం వంద గజాల పొడవు, యాభై గజాల వెడల్పు వున్న పెద్ద ఆలయం. విమానం ఎత్తు 216 అడుగులు తో 14 అంతస్తులతో ఎంతో అద్భుతంగా ఉం టుంది. చిట్ట చివరి శిఖరమే 20 అడుగుల ఎత్తు, 100 అడుగుల చుట్టు కొలత వున్న ఏకశి లగా. ఉంటుందంటే, యెంత పెద్ద ఆలయమో మనం ఇట్టే ఊహించవచ్చు.

Tuesday, 25 June 2013

జగన్నాథ రథయాత్రలో ఆ మంత్రంతో విష్ణువును స్మరిస్తే..?


పూరీ జగన్నాధునికి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్రలో పాల్గొని- "త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుపం భవేదిదం విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్యం స చరాచరమ్" అనే మంత్రాన్ని జపిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.

 రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 

ప్రతి సంవత్సరం జూలై నెలలో పూరీలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూన్ 21న ఆ స్వామికి, బలభద్రునికి, సుభద్రాదేవికి రథయాత్ర జరుగుతుంది.

 పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు విష్ణుమూర్తిని పై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.

కాత్యాయని వ్రతాన్ని ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి ?




కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించవచ్చు. వివాహము రద్దైన వారు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు. వివాహము అయి విడాకులు తీసుకున్నవారు, తరచూ వివాహ ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించే వారు ఈ వ్రతాన్ని అనుసరించవచ్చు.

 ఇంకా మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు, కుజదోషము జాతక చక్రములో వున్నవారు, ఆర్థిక స్తోమత లేక వివాహమునకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చును. స్త్రీ జాతక చక్రములో రాహుకేతు దోషములు కలవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. 

వ్రతాన్ని ఎలా ఆచరించాలి.. నియమాలేంటి ? మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి. మంగళవారం కృత్తిక నక్షత్రమైతే ఇంకా మంచిది. నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి,నాగుల చవితి పర్వ దినములలో ఈ వ్రతము ఆచరించవచ్చును. దేవినవరాత్రులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును.

 బంగారముతో కానీ, పసుపు కొమ్ములతో కానీ వారి శక్తానుసారముగా మంగళ సూత్రములు కలశమునకు అలంకరించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యముగా సమర్పించాలి. ఏడు చెరుకు ముక్కలను (తొక్క తీసినవి) కూడా నైవేద్యముగా సమర్పించాలి. 

వ్రతము పూర్తీ చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి మీద వుంచి పిదప ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని ఆశీర్వాదము తీసికుని రాత్రి భోజనము చేయాలి.

 మంగళ వారములు భక్తితో జరుపవలెను. మధ్యలో ఏ వారమైన ఆటంకము వచ్చినచో ఆ పై వారము జరుపుకోవచ్చు. ఇలా ఏడు వారాలయ్యాక ఏడో మంగళవారము ఉద్యాపన జరుపుకోవాలి.

 ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటి పోయాలి. అలా కానీ వారు ఉదయం ముత్తైదువుల గృహమునకు వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తలస్నానమునకు ఇచ్చి రావాలి.

 ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు, ఏడు చెరుకు ముక్కలు, ఏడు రవికలు వాయనమిచ్చి (ఒక్కరికి చీర ఇచ్చి ) వారిచే అక్షతలు వేయించుకుని ఆశీర్వాదము పొందాలి

 ముందుగా పసుపుతో గణపతిని చేసి గణపతికి పూజ చేయాలి. తరువాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలశమును వుంచి కలశములో పవిత్రమైన నీరుసగము పోయాలి.

 అమ్మ వారి విగ్రహము (ఉన్నచో ) లేదా ప్రతిమగా రూపాయి వుంచాలి. ఇంటిలో తూర్పు వైపున ఈశాన్య దిక్కున శుభ్రము చేసి ముగ్గులు వేసి ఎర్ర కండువ పరిచి దాని మీద బియ్యంపోయవలెను

. బియ్యం పైన రాగి చెంబు కానీ , ఇత్తడి చెంబు కానీ ఉంచి టెంకాయను వుంచి దానిపై ఎర్రని రవిక కిరీటంలా పెట్టాలి. (కలశస్థాపన చేయాలి). ఈ వ్రతములో ఎర్రని పువ్వులు ఎర్రని అక్షతలనే వాడటం శ్రేష్ఠం. వ్రతము అయిన తరువాత వండిన భోజన పదార్దములు నైవేద్యం పెట్టాలి. షోడశోపచార పూజ జరుపుకోవాలి. వ్రత మండపములో పార్వతీపరమేశ్వరుల ఫోటో ఖచ్చితముగా ఉండాలి. 

సాయం కాలము ఈ వ్రతము ఆచరించవలెను. పగలంతా ఉపవాసము ఉండవలెను. వ్రతము పూర్తి అయిన తరువాత భోజనము చేయాలి. వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేయాలి.

 పగలు నిద్రపోరాదు. చివరి వారములో పుణ్య స్త్రీలకు దక్షిణ తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకములను సమర్పించాలి. ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకములను ఇచ్చిన చాలా మంచిది.

చిరు నవ్వు నవ్వినా ముఖం తిప్పుకునేవారి పట్ల ప్రేమగా ఎలా ఉండాలి?



ప్రేమించేందుకు వ్యక్తిత్వం, దాని విధి.. విధానమంతా ప్రకటించాల్సిన 

అవసరం లేదు. మీరు అభిమానించడాన్ని, ప్రేమించడాన్ని ఎదుటి 

వ్యక్తులు 

గుర్తించాలని అనుకున్నారంటే.. మీకు అనురాగ స్వరూపం సరిగా 

తెలియదన్నమాట. పూర్తిగా అర్థం కాలేదని చెప్పొచ్చు. 

ఎవరూ కూడా ప్రేమను ఎదురు చూడరు. అలాగే, ప్రతిఫలాన్ని ఆశించరు. 


ఎదుటివాళ్లు మీ మీద ప్రేమ కలిగి వుండాలనే నిబంధన ఏమీ లేదు. 

వెయ్యి 

మందికి సేవ చేసినా ఇంట్లో ఇద్దరికి వండిపెట్టినా అదే ప్రేమను మీరు 

గుర్తించగలిగారు. ఇతరులను ప్రేమించడం చాలా తెలివైన విషయమని 

గ్రహిస్తే చాలు. ఇంతకుమించి మరొకటి లేదు.

Monday, 24 June 2013

దేవతలు బ్రహ్మను స్తుతించి అభీష్టాల్ని నెరవేర్చుకున్న స్తోత్రము (కాశీ ఖండములోనిది)


brahmaదేవతలు బ్రహ్మను స్తుతించి అభీష్టాల్ని నెరవేర్చుకున్న స్తోత్రము
(కాశీ ఖండములోనిది)
నమో హిరణ్యరూపాయ బ్రహ్మణే బ్రహ్మ రూపిణే!
అవిజ్ఞాత స్వరూపాయ కైవల్యాయామృతాయ చ!!
యన్న దేవా విజానంతి మనో యత్రాపి కుంఠితం!
న యత్రవాక్‌ ప్రసరతి నమస్తస్మై చిదాత్మనే!!
యోగినో యం హ్రుదాకాశే ప్రణిధానేన నిశ్చలాః!
జ్యోతీరూపం ప్రపశ్యంతి తస్మై శ్రీబ్రహ్మణే నమః!!
కాలాత్‌ పరాయ కాలాయ స్వేచ్చయా పురుషాయ చ!
గుణత్రయ స్వరూపాయ నమః ప్రకృతి రూపిణే!!
విష్ణవే సత్త్వరూపాయ రజోరూపాయ వేధసే!
తమసే రుదర్రూపాయ స్థితిసర్గాంతికారిణే!!
నమో బుద్ధి స్వరూపాయ త్రిధాహంకృతయే నమః!
పంచతన్మాత్ర రూపాయ పంచ కర్మేంద్రియాత్మనే!!
నమో మనః స్వరూపాయ పంచబుద్ధీంద్రియాత్మనే!
క్షిత్యాది పంచరూపాయ నమస్తే విషయాత్మనే!!
నమోబ్రహ్మాండ రూపాయ తదంతర్వర్తినే నమః!
అర్వాచీన పరాచీన విశ్వరూపాయ తే నమః!!
అనిత్య నిత్య రూపాయ సదసత్పతయే నమః!
god-brahmaసమస్త భక్త కౄఎపయా స్వేచ్చావిష్కృత విహ్రహ!!
తవ నిశ్వసితం వేదాః తవ స్వేదోఖిలం జగత్‌!
విశ్వాభూతాని తే పాదః శీర్షో ద్యౌ: సమవర్తత!!
నాభ్యా ఆసీదంతరిక్షం లోమాని చ వనస్పతిః!
చంద్రమా మనసోజాతః చక్షో: సూర్యస్తవ ప్రభో!!
త్వమేవ సర్వం త్వయిదేవ సర్వం స్తోతా స్తుతిః స్తవ్యః ఇహ త్వమేవ!
ఈశ త్వయావాస్యమిదం హి సర్వం నమోస్తు భూయోపి నమో నమస్తే!!

ఈ స్తోత్రముతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరిని స్తుతించినా సంతసింతురు. ఇది సర్వసిద్ధుల్నీ ప్రసాదించే స్తోత్రము. పుత్ర, పౌత్ర, పశు, సంపదలు కల్గును. ఆయురా రోగ్య సౌభాగ్యములు, నిర్భయత్వము కలుగుతాయి. యుద్ధమునందు విజయము కలుతుంది. ఐహికాముషి్ష్మక భోగములను, అక్షయమగు మోక్షమును పొందుతారు.

దేహానికి శిరస్సు చాలా ప్రధానమైనది. ఇంద్రియాలన్నిటికన్నా కళ్ళు ప్రధానమైనవి. రసములన్నిటికీ లవణం (ఉప్పు) ప్రధానం. నదులన్నిటికీ నీరు ప్రధానం.

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
షణ్ణాం రసానాం లవణం ప్రధానం భవే న్నదీనా ముదకం ప్రధానం దేహానికి శిరస్సు చాలా ప్రధానమైనది. ఇంద్రియాలన్నిటికన్నా కళ్ళు ప్రధానమైనవి. రసములన్నిటికీ లవణం (ఉప్పు) ప్రధానం. నదులన్నిటికీ నీరు ప్రధానం. 

31Feaమానవ శరీరానికి ఇంద్రియాలు అన్నీ ఉండవలసినదే. అప్పుడే శరీరానికి చైతన్యం కలుగుతుంది. లేకపోతే జఢత్వంతో నశిస్తుంది. అయితే ఆ ఇంద్రియాల్ని ప్రేరేపించే మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవడం ద్వారానే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈ మనసు అనే కనిపించని తత్వాన్ని బుద్ధి ప్రేరేపిస్తూవుంటుంది. ఆ బుద్ధి కర్మననుసరించి నడుస్తూవుంటుంది. అందుకే ‘బుద్ధీ కర్మానుసారిణీ’ అని పెద్దల ఉవాచ. దేహానికి శిరస్సు, ఇంద్రియాల్లో కళ్ళు, రసాల్లో లవణం, నదులకి నీరు ముఖ్యమైనట్టే మానవ జీవితానికి కొన్ని ఆచారవ్యవహారాలు, సంప్రదాయం, సాధన వంటి కొన్ని గుణాలు ప్రధానంగా ఉంటాయి. వాటిని అనుసరించే కర్మలు ముడిపడివుంటాయి.

మనకున్న ఇంద్రియాల్ని సక్రమంగా వినియోగించుకుంటూ, సత్కర్మల్ని ఆచరించడమే మానవ ధర్మం మరి దేహబ్రాంతిని విడిచిపెట్టమని పురాణాలు చెప్తున్నాయి. అంటే దేహాన్ని అలక్ష్యం చేయమని కాదు. దేహావసరాలు తప్పకుండా తీర్చవలసినదే. దేహాన్ని అనునిత్యం కాపాడుకుంటూ ఉండవలసినదే. దేహంలో జీవాత్మ ఉన్నంతకాలం దానిని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అది అందులో మనగలుగుతుంది. దేహం అపవిత్రమైనా, దానిని నిర్లక్ష్యం చేసినా దేహం అనారోగ్యానికి గురయ్యి, జీఆత్మ అందులో మనలేక కాలవ్యవధి తీరకుండానే తప్పుకుంటుంది. అందుకే దేహం దేవాలయంగా మార్చగలగాలి. అందుకు ఇంద్రియాల సహకారాన్ని తీసుకోవాలి. ఇంద్రియాలు సహకరించాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. బుద్దిని లాక్కుపోయే కోరికలనే గుర్రాల పగ్గాలు ఒడిసి పట్టుకుంటేనే మనసు అదుపులోకి వస్తుంది. ఇదంతా అంచెలంచెలుగా చేయవలసిన సాధన. ఈ సాధన సమకూడేది కేవలం ధ్యానం అనే ప్రక్రియ వల్లే సాధ్యం. దానినే నేడు మనం మెడిటేషన్‌ అని పిలుస్తున్నాం.

tghదీనిని బట్టి మెడిటేషన్లో మనం చేయవలసినదేమిటీ..? దాని ద్వారా మనంపొందవలసినదేమీటీ..? అనేది కొంతవరకూ తెలిసినట్టే. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసే మెడిటేషన్‌ అనే ధ్యానం నిజమైన ధ్యానం కాదు. ధ్యాన యోగులు అరుదుగా ఉంటారు. వారిని అన్వేషించి వారి వద్ద ఈ క్రియని అభ్యసించవలసి వస్తుంది. అలా అసలైన ధ్యాన సముపార్జన కోసమే, శంకర భగవత్పాదులు, రామానుజులు, యోగివేమన వంటి మహనీయులు గురువుని వెతుక్కుంటూ దేశదేశాలూ తిరిగారు. గురుసుశ్రూషలు చేసారు. సంకల్పసిద్ధిని పొందారు. కనుక మానవ శరీరం, దానితో పాటు సకలేంద్రియాలు, కరణాలు అన్నీ జీవాత్మ ఉన్నంతకాలం ఉండవలసినదే. దేనినీ భక్తి పేరుతో పేరుతో విడిచిపెట్టకూడదు. అలాచేస్తే అది మూఢభక్తి అవు తుంది. శరీర ధర్మానికి అవరోధం కలిగించినా భగవంతుడు మెచ్చడు. అయితే ఈ శరీరం మాత్రం శాశ్వతం అనుకోవడమే పొరపాటు. ఇతర వ్యాపకాలకోసం దీనికి లేనిపోని హంగులు కూర్చడం దేహభ్రాంతి అవుతుంది. దేహం మీద వ్యామోహం లేకుండా ఈ దేహం అవసరాన్ని గుర్తెరిగిన వాళ్ళు దేహాన్ని దేవాలయంగా మలచుకోగలుగుతారు.

అందుకే రాముడు, శ్రీకృష్ణుడు పుట్టారు అని అనం. అవతరించారు అంటాం. అంటే ఆ రూపాన్ని ఆ పరమాత్మ అవసరార్ధం ధరించాడు. అంతేకానీ ఈ జీవిత చక్రంలో బందీలుగా పుట్టడం, పెరగడం, కనిపించకుండా పోవడం వంటి లౌకిక విషయాలతో ఈ పరమ ‘ఆత్మ’కు పనిలేదు. అవతరించడం అంటే అవధరించడం అనే మరో మాటకూడా ఉంది. అవ+ధరించడం అంటే అనుకున్న దేహాన్ని ధరించడం అని అర్ధం. అంతేకానీ మానవ ప్రేరితమైన శరీరాలతో వారికి పనిలేదు.

azxsdదేహం దేవాలయం అయినప్పుడే ఈ జీవాత్మ శాశ్వతత్వాన్ని పొందుతుంది. పరమాత్మగా రూపాంతరం చెందుతుంది. చిరంజీవి అంటే సశరీరంగా ఉన్నవాళ్ళు అని కాదు. జననమరణాలు జయించి శాశ్వతత్వాన్ని పొందిన ఆత్మనే చిరంజీవి అంటారు. అటువంటి ఆత్మకి పరమాత్మ అదిపతిగా ఉంటాడు. అందువల్ల కోరిన దేహాన్ని సంతరించుకోగల శక్తి సామర్ధ్యాలు ఆ ఆత్మకి కలుగుతాయి. అంటే అటువంటి ఆత్మ ఏ శరీరంలోను ప్రవేశించే అవసరం ఉండదు. ఏ రూపంలో కోరుకుంటే ఆరూపాన్ని ధరించగల శక్తి ఉంటుంది. భగవంతుడు చెప్పేది కూడా అదే. తనను ఏరూపంలో కొలిస్తే ఆరూపంలోనే దర్శనమిస్తాను అంటాడు. ఏ పేరుతో పిలిస్తే ఆపేరుతోనే పలుకుతాననడంలో ఆంతర్యం ఇదే. ఇక శరీర ధర్మాల్ని నడిపించేది కోరిక. మరి కోరికలుండకూడదు. అని కూడా పెద్దలు చెప్తూవుంటారు కదా! నిజమే, కానీ కోరిక అనేది లేకపోతే దేహానికి చలనం ఉండదు.

బుద్దిని ప్రేరేపించేవి కోరికలే. అసలు కోరిక లేని జీవి అం టూ ఉండదు. భగవంతుడు కూడా దుష్టసంహారార్ధం అవతరిస్తాను అనే కదా చెప్పాడు. దుష్టుల్ని సంహరించాలి అనేది ఆయన కోరికే కదా..! నాకు ముక్తిని ప్రసాదించు అని భగవంతుని వేడుకోవడం కూడా ఒక కోరికే. మునులు తపస్సులు చేసినా, యాగాలు చేసినా, దేవుడు అవతారం దాల్చినా అన్నీ కోరుకున్నట్లు నడుస్తున్న చర్యలే. అయితే, ఈ కోరికలు లోక కళ్యాణ ప్రదంగా ఉండాలి తప్ప అన్ని కోరికలూ కోరికలు కావు. అవి కేవలం ఆశలే.

కోపేశ్వరుడు శాంతమూర్తి

మహారాష్ట్రలోని మరుగున పడ్డ మహనీయ క్షేత్రమిది. ఈ శైవ క్షేత్రం చేరటా నికి రైల్లో కొల్హాపూర్‌గానీ, మీరజ్‌గానీ, సాంగ్లీ కానీ చేరుకుని తర్వాత రోడ్డు మార్గాన ప్రయాణం చేయాలి. ఈ ప్రదేశాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ప్రయివేటు వాహనాలు సరేసరి. ఇక్కడి శిల్పకళారా మమైన కోపేశ్వర మందిరం ప్రతి ఒక్కరూ చూడవలసినది. దీన్ని శిలాహర్‌ వంశానికి చెందిన గండరాది త్యుడు, రెండో భోజుడు క్రీ.శ. 1109-1180 మధ్యలో నిర్మించినట్లు తెలిపే శాసనాలు దొరికాయి.
KHIDR3దగ్గర దగ్గర 104 ’పొడవు, 65’ వెడల్పు. 55’ ఎత్తుతో ఉన్న ఈ బృహన్మందిరంలో ప్రధానంగా నాలుగు భాగాలు ఉన్నాయి. స్వర్గమంటపం, సభామంటపం, అంతరాళ కక్ష్య, గర్భగృహం అడుగడుగునా కళ్లు చెదిరేలా శిల్పసంపద నిక్షిప్తమై ఉంది. స్వర్గ మంటపం గుండ్రంగా 36 వ్యాసంతో ఉంది. చుట్టూ కప్పుకి ఆధారంగా పన్నెండు స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం మీదా రాజవంశీయుల శిల్పాలు అందంగా అమర్చారు. మంటపం మధ్యలో 14 వ్యాసం కలిగిన నల్లని శిల ఉంది. తలపైకెత్తి గోపుర గవాక్షం చూస్తే అద్భుతంగా ఆకాశం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసపు తొలిరోజు (ఉగాదినాడు) ఈ గవాక్షంలోంచి సూర్యకిరణాలు నేరుగా కోపేశ్వర స్వామిని సృ్ఫశిస్తాయి. 

ఇంత అద్భుతంగా దేవాలయ గవాక్షాన్ని మలచిన మధ్యయుగాల నాటి ఆలయ నిర్మాతలు ఎంతటి విజ్ఞానవంతులో! దీని తర్వాతది సభామంటపం-యాభై అడుగుల చదరం. లోపలి కక్ష్యలో 12, బయటి కక్ష్యలో 20 స్తంభాలున్నాయి. 20 నుంచీ 25 పొడవుండే ఏకశిలా స్తంభాలివి. వీటికి అనేక పార్శ్యాలు న్నాయి. సభామండపం పై కప్పు మీద విరిసిన పద్మం 3డి పద్ధతిలో ఆవిష్కృతమై అద్భుతంగా ఉంది. ఈ మండపం అంతా ఫలపుష్పాలతో, పూర్ణకుంభాలతో నిండి శిలాహార రాజవంశీయుల కళాభిరుచికి అద్దం పడుతోంది. గాలి వెలుతురుల కోసం ఎక్కడికక్కడ గవాక్షాలు ఉన్నాయి. 

20 చదరపు అంతరాళ కక్ష్య దాటి వెళ్లితే గర్భగృహం ఉంది. అందులో దక్షిణాముఖుడైన ఈశ్వరుడు కంచు సర్వభూషణంతో దర్శనమిస్తాడు. ఇంతటి మహోన్నత ఆలయాన్ని మరుగున పడనీయకుండా బ్రతికించుకోవటం మన కర్తవ్యం. పదుగురినీ తీసుకువెళ్లి పరిచయం చేస్తే ఆలయానికి భక్తులు పెరుగుతారు, భక్తుల రాకపోకతో ఆలయన్ని ఆదరించి నిలపాలన్న ఆరాటమూ పెరుగుతుంది. ఇది మన బాధ్యత. మనని కరుణించి అనుగ్రహిస్తాడు మన వరపదాత ఆ పరమేశ్వరుడు.

పుత్రుల వలన కాదు సగ్గతి లభించేది, స్వయంగా మనం చేసుకొన్న సత్కర్మల ద్వారా ప్రాప్తిస్తుంది.


bit
పుత్రుల వలన కాదు సగ్గతి లభించేది, స్వయంగా మనం చేసుకొన్న సత్కర్మల ద్వారా ప్రాప్తిస్తుంది.పుత్రులు కలుగగనే సద్గతి లభిస్తుందనే భావన సరియైనది కాదు, నేడు పాండవుల వంశము లేదు. ఐతే వారందరికి సద్గతి లభించనట్లేనా! నేడు శ్రీరామచంద్రుని సూర్యవంశం, శ్రీకృష్ణ భగవానుని చంద్రవంశం కూడా లేదు. ఐతే వారంతా దుర్గతి పాలయ్యారా! అట్లా ఎన్నటికీ జరగదని మనందరికీ తెలుసు. కాని పుత్ర ప్రాప్తి కొరకు ఇంత పిచ్చి ఎందుకు మనలను మనమే ఉద్దరించుకునే దానికి పుత్రుడే ఉద్ధరించాలనే ఆశదేనికి? నేటి వాతావరణములోని పిల్లలు శ్రద్ధలేని వారు. అట్లాంటి వారు మరల ఎట్లా ఉద్దరించగలరు? కనుక నేడే నీ బాగోగుల గురించి నీకు నీవే ఆలోచించుకో.. కుటుంబ వృద్దికి మగపిల్లవాడైనా, ఆడపిల్లైనా ఒకటే. ఇవ్వనీ ఐహిక బంధాలే. అందుకే శ్రీశంకర భగవత్పాదులు ఇలా అన్నారు.

మాతా నాస్తి పితా నాస్తి
నాస్తి బంధు సహౌదరః
అర్ధం నాస్తి గృహం నాస్తి
తస్మాత్‌ జాగ్రత జాగ్రతాః

త్రేతాయుగ యాగ భూమి ఒంటిమిట్ట

కడప జిల్లాలో ఒంటి మిట్ట గ్రామం ఉంది. దీనినే ఏకశిలా నగరం అంటారు. ఇది మహర్షులకు తపోధనులకు యజ్ఞ, యాగాలకు త్రేతాయుగంలో ప్రసిద్ధి చెందింది. ఋషుల తపస్సుకు తరచుగా రాక్షసులు భంగం కలిగించి, విఘ్నం చేసే వారు. శ్రీ రాముడు సీతా దేవి, లక్ష్మణ సమే తుడై ఒంటిమిట్టకు వచ్చాడు. ఆయన కోదండం ధరించి, పిడి బాకుతో రాక్షస వధ చేసి ఋషుల తపస్సును నిరాటంకంగా జరగటానికి దోహదం చేశాడు.

onti1ఋషులు యాగ సమాప్తి అయిన తర్వాత సీతా రామ లక్ష్మణులను అర్చించారు. వారి మూర్తులను ఏక శిలపై మలిచి అప్పటి నుండి పూజాదికాలు నిర్వహించారు. అందుకే ఏక శిలా నగరం అయింది.. అప్పటికి అంజనేయస్వామితో రాముడికి పరిచయం కలగలేదు. అందువల్ల హనుమ మూర్తి ఉండదు. ద్వాపరయుగంలో జాంబవంతుడు ఈ ఏక శిలా మూర్తులను ఆగమ విధానంలో ప్రతిష్టించాడు. అందుకని దీన్ని జాంబవంత ప్రతిష్ట, కపిల వానర ప్రతిష్ట అని కూడా అంటారు.స్థల పురాణం : ఆ నాడు బాగా పేరు పొందిన ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు బందిపోటు దొంగలు ప్రయాణీకులను దోచుకొని బంగారం మొదలైన వాటిని దగ్గరలో ఉన్న కొండ గుహలో దాచుకొనేవారు. ఆ గుహలో ఉన్న సీతారాములు వారికి దర్శన మిచ్చి దొంగతనం మానేసి గౌరవ ప్రదమైన జీవితం గడపమని ఆదేశించారు. అంతే, వారిలో మార్పు వచ్చి దొంగతనాలు మానేసి దివ్య జీవనం సాగించారు. శ్రీరామునికి అత్యంత భక్తులై, ఆ మూర్తులకు గర్భాలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఈ బంది పోటు దొంగల పేరు మీద ఈ గ్రామానికి ఒంటి మిట్ట అనే పేరు వచ్చింది అని ఇక్కడివారు చెప్తారు.

చారిత్రిక గాధ : ఆలయ శిలా శాసనాలను పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఈ దేవాలయాన్ని మూడు దశల్లో నిర్మించారని తెలుస్తోంది. ముందు గర్భాలయ నిర్మాణం, తర్వాత ముఖ మండపం, మూడవ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేసారు. రెండవ శిలా శాసనం ప్రకారం 1558లో ఒంటి మిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని రధం నిర్మించటానికి, బ్రహ్మోత్సవ నిర్వహణకు ,ప్రహరీగోడల నిర్మాణానికి దానిని వినియోగించాలని తెలిపాడు. విజయ నగర చక్రవర్తి సదాశివ రాయల ముఖ్య మంత్రి గుత్తియేరా తిరుమల రాజు కుమారుడు నాగరాజదేవ నాగరాజు విరాళం అందజేసినట్టు కూడా చారిత్రక ఆధారాల మూలంగా తెలుస్తోంది. ఏదిఏమైనా, ఈ ఆలయం చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న చక్కని దేవాలయం.

జీవుడి మనసు శక్తిమంతమైన దేవత. దానిలో పుట్టే ప్రతి ఆలోచనా దేవతే.





మరణమంటే మార్పే. మార్పు చెందేది దేహమే. ఇంతకాలం దేహంలోనే వుండి కంటికి కనబడక, మనసుకు అనబడక, దేనికీ లోబడక, పరిణామమెరుగని ఆత్మ, పరమచరమంగా వెలుగుతున్నా, అది శాశ్వతమని శాస్త్రాలు ఘోషిస్తున్నా, మనిషి మరణం దుఃఖాన్నే కలిగిస్తున్నది, మిగులుస్తున్నది. దశరధుడు మరణించినపుడు రామచంద్రుడు దూరంగా వున్నాడు. ఇంద్రజిత్ దెబ్బకు లక్ష్మణుడు మూర్చపోతే తమ్ముడికేమౌతుందోనని ఖేద పడ్డాడు. 

హనుమ సంజీవని తెచ్చేదాకా రాముడు పడిన పరివేదన దుర్భరం. ఎవరి మరణమూ కృష్ణుణ్ణి ప్రభావితం చేసిన సందర్భం లేదు. తల్లి ప్రాణ నిర్గమన వేళ శంకర భగవత్పాదుల నిరామయ స్థితి, అద్వైత భావస్థితే! రమణ మహర్షి తల్లి అళగమ్మ మరణించగానే "అంతా అయింది. ఎవరి పనిలో వాళ్లముందాం'' అంటూ "అంటుకోవటానికి ఏముంది?'' అంటూ సహజస్థితిలో నిలకడ చెందటం, లోకానికి పరిచయమే.

అది సహజ పరిణామం

మరణాన్ని సహజ పరిణామంగా భావించటం జ్ఞానుల సాధనా స్థితి. అది లోకానికి అనుసరణీయం. మాతృమూర్తిగా, వాత్సల్యామృత వర్షిణిగా, అమ్మగా లోకంలో ఎందరికో ప్రేమను పంచిన అమ్మ, "మిమ్మల్నందర్నీ కని లోకంలో తల్లులకు పెంపుడిచ్చాను'' అని ప్రకటించిన అమ్మ, వేదాంతాన్ని కేవలం బోధించిందా? ఆచరించిందా? అని చూస్తే అమ్మ ఆచరించినదంతా వేదాంతమే. అనుకున్నదానికి, అయినదానికి మధ్య తేడాలేని రీతి అది. అమ్మ కన్న బిడ్డ హైమ మరణం సమకాలీన అధ్యాత్మ చరిత్రలో ఒక పరమాద్భుత దైవఘటన.

రాజకుమారుడు కలకాలం జీవించాలట. తండ్రి పాప భారాన్ని, కరిగేదాకా మోయటానికి. మునికుమారుడు ఎక్కువ కాలం జీవించనక్కరలేదట. మునివన్నీ పుణ్యకార్యకలాపాలు కనుక. ఆతడి పుత్రుడు అనుభవించటానికి ఏమీ లేదు కనుక. సాధు పురుషుడి పుత్రుడు జీవించి వున్నా అపేక్షలు లేకుండా వుంటాడు. 

మరణానంతరమూ కలకాలం జీవించి వుంటాడు. వేటగాడి కొడుకు అటు మరణించనూ లేక, యిటు జీవించనూ లేక నిత్య యాతనకు గురౌతుంటాడు. మరణాన్ని గురించి మరణానంతర జీవితాల గురించి పురాణ కాలం నుండీ ఆధునిక వైజ్ఞానిక యుగం వరకు ఆలోచనలు సాగుతూనే వున్నయ్. అంతు చిక్కినట్లున్నా అంతుపట్టని రహస్యం యిదొకటే!

స్పందనలు కానరాని జ్ఞాని

ఎందరెందరివాడో ఈ జీవుడు, ఎవరికి ఏమౌనో ఈ జీవుడు అని అన్నమాచార్యులవారు, తనువుతో బంధాలు తనువుతోనే తెల్లవారుతయ్ అని తేల్చేస్తారు. ఇంతవరకు తెలుసుకోవటం సులభమే. దీన్నంతా స్వయంగా అనుభవించవలసి వస్తే సాధకులకీ, సాధారుణలకీ, మధ్య వుండే తేడా స్వల్పమే. జ్ఞాని మాత్రం దీనికి భిన్నంగా వుంటాడు. స్పందనలు కానరాని వైఖరి అది. అవతారమూర్తుల విషయం వీటన్నిటికీ పూర్తి భిన్నం. 

వారికి ప్రపంచంలో జరిగేదంతా వేడుకే. ఏదీ అంటదు. మాతృశ్రీ అమ్మ కుమార్తె హైమ, అసాధారణ కన్యక. మానవ సంబంధాల పట్ల, జీవుల పట్ల, అందరి పట్ల, అన్నిటి పట్ల ఆమె స్పందనలన్నీ తీవ్రంగా, సహజంగా, కరుణాభరితంగా, ప్రేమపూరితంగా, అతి మానుషంగా వుండటం హైమను ప్రత్యేకంగా నిలిపినయ్. ఆమె మంచితనం, నెమ్మదితనం, ప్రశాంతవదనం అందరికీ ఒక ప్రసన్నతా ప్రసాదనం. కాలగమనంలో ఆమె మరణించటం ఒక ఆఘాతం. 

నిజానికి మానవజన్మే ఒక ఆఘాతం. ఎందరో బిడ్డలకు మాతృమమకారాన్ని అవ్యాజంగా పంచిన అమ్మకు, అది ఆఘాతమా? వేడుకలో ఒక భాగమా? అని విచారించినపుడు, అమ్మ ఆ సందర్భంలో చూపించినదంతా అవతారస్పర్శే! "ఆమె మంచితనం కన్నా, బయటకు కనిపిస్తున్న దానికన్నా, ఆమె పడిన ప్రళయ బాధే నన్ను చలింపచేసింది. బాల్యంలో స్తన్యం ఎలా యిచ్చానో, సమాధిగతము అలాగే చేశాను. క్రియలకు అంత్యం వుందిగానీ చైతన్యానికి అంతెక్కడ?'' అంటూ అమ్మ అనటం వెనుకదాగినదంతా అచలమే. జీవుడికే రాక, పోక. 

ఆత్మకు ఉండటమే అసలు స్థితి.క్రితం రాత్రి వరకు సమాధి సంబంధిత కార్యకలాపాలలో, బిడ్డ మరణాన్ని, వెనక్కు నెట్టి ఒక గ్రం«థావిష్కరణ కార్యక్రమాన్ని యధాతథంగా జరిపించటం, అందరితోపాటు తీర్థం కోసం చేయిచాపటం, శుభలేఖనందుకుని ఆశీర్వదించటం, ఏమీ జరగనట్లే దైనందిన కార్యక్రమాలను నడిపించటం...యివన్నీ అమ్మ సహజంగా ధరించిన దైవీతత్వమే. పాంచభౌతిక దేహం ధరించినా, లోకంతో ముడిపడి సంచారం సాగినా, మహాత్ముల జీవితమే, మహికి సందేశం. ప్రతి సంఘటనను యధాతథంగా కాక, దాని వెనక దాగిన అంతరార్థాన్ని గ్రహించి స్ఫూర్తిని పొందాలి.
గురువును, మహాత్ములను అనుకరించకూడదు.

అనుసరించకుండా వుండకూడదు.
అనుసరిస్తూ, ఆచరిస్తూ, అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ, స్వస్వరూపాను సంధానం కోసం తీవ్ర ప్రయత్నం చేయాలి. అదే సాధనం. సూర్యుడి నుండీ సూర్యకిరణం, చంద్రుడి నుండీ సువర్మా కిరణం, బంగారం నుండి బంగారం వచ్చినట్లు, అమ్మ నుండి వచ్చి, అమ్మలో లయమైన హైమ, అమ్మ కంటే భిన్నమా? అమ్మకు అనంత సృష్టికి వున్నది, అభేదమే!

ఐహికానుబంధాలే నిర్బంధాలు

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
krishnaశ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
శ్లోకంః న కాంక్షే విజయం కృష్ణా!
న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద !
కిం భోగై ర్జీవితేన వా 

శ్రీకృష్ణా నాకు బంధువధ వల్ల పొందే విజయం అవసరం లేదు. బంధువధతో పొందే రాజ్యమూ వద్దు. రాజ్యంలో ఉండే సుఖాలూ వద్దు. గో, గోప, గోపికలను రక్షించి రాజ్యం పొంది గోపాలుడవైతివే, నా బంధువులను చంపి పొందే రాజ్యంతో నాకేమి పని? సుఖములతో ఏమి పని? అసలీ జీవితముతో ఏమి పని?
శ్లోకంః ఆచార్యాః పితరః పుత్రాః
తథైవ చ పితామహాః
మాతులాః శ్వశురాః పౌత్రాః
స్యాలా స్సంబంధిన స్తథా 

ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఇక్కడ నిలచిన వారిలో గురువులు, తండ్రి సములు, పుత్ర సదృశులు, అట్లే తాతలు, మామలు, మేనమామలు, మనుమలు, బావమరుదులు ఇటొకరేమిటీ అన్ని విధముల బంధుత్వము కలవారూ ఉన్నారు.