Pages

Wednesday, 19 June 2013

వాస్తు విషయాలు




  1. ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫోటోలు అమర్చరాదు. దేవుళ్ళ ఫోటోలను అమర్చాలి. వీలుంటే వినాయకుని ఫోటో అమర్చాలి.
  2. ఇంటి గోడలు కట్టేట్టపుడు తాపీ మేస్త్రీలు,పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తువుంటారు.వాటిని అవసరం తీరగానే ఆకన్నాలు మూసెయ్యాలి.
  3. వాయువ్యం పెరిగిన,మూతపడిన ఇంకే వాయువ్య దోషాలు ఉన్న వాయువ్యంలో వాయు పుత్రుడైన హనుమంతుని ఉంచి పూజించిన ఆ దోషాల తీవ్రత తగ్గును.
  4. తూర్పు ఈశాన్యం,ఉత్తర ఈశాన్యం,పడమర వాయువ్యం,దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం,ఉత్తర వాయువ్యం,పడమర నైరుతి,దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు దోషపూరితం.
  5. బీరువాలు నైరుతి యందుంచి, ఉత్తరమునకు తెరుచునట్లు ఉంచాలి.
  6. తూర్పు మరియు ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లను పెంచరాదు.
  7. మూడు పసుపు కొమ్ములు,పసుపు దారంతో షాపు గుమ్మానికి వ్రేలాడదీయండి. దృష్టి దోషం పోతుంది మరియు వ్యాపారాభివృద్ధి ఉంటుంది.
  8. పడమట వైపు స్తలం కొనుక్కొన్న భార్యకు అనారోగ్యం,నష్టం కలుగును.
  9. ఈశాన్యంలో బరువు ఉంచరాదు. పడమర వైపు, దక్షిణం వైపు బరువులు ఉంచవచ్చును.
  10. దేవాలయాల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించరాదు. ఉండరాదు.
  11. పాముల పుట్ట ఉన్న స్థలం కొనరాదు. కొని పుట్ట తొవ్వి తీసుకోవచ్చు అనుకొంటే, ఆ కుటుంభానికి తరతరాలుగా నాగ దోషం పట్టుకొంటుంది. దాని వలన సంతాన నష్టం జరగటం, కుంటి, గుడ్డి, మూగ, చెముడు పిల్లలు జన్మించుట, ఆ పిల్లలు ఆకాలంలో మరణించుటం జరుగుతుంది