Pages

Saturday, 22 June 2013

'ఏకోనారాయణోహరిః' అన్నారు గదా ! మరి ఇతర దేవతల సంగతేమిటి ?






నేటి కాలంలో తరచుగా తలెత్తే ధర్మ సందేహం ఇది. ఉపనిషత్ సారమైన భగవద్గీత, ఉపనిషత్ సమన్వయ రూపమైన రామానుజ దర్శనము ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. మహోపనిషత్తు, సుచాలోపనిషత్తు, నారాయణోపనిషత్తులు 'ఏకోవావై నారాయణ ఆసిత్, నబ్రహ్మానేశానః' ప్రళయ సమయంలో నారాయణండొక్కడే ఉండెను. బ్రహ్మ, రుద్రాదులు లేరనినవి. ' అధపురుషోహవై నారాయణ్కో కామయత' అపుడా నారాయణండు చేతన నా చేతన సృష్టికి సంకల్పించెను.

'యతోవం ఇమాని భూతాని జాయన్తే, యేన జాతాని జీవన్తి, యత్ప్రయన్త్యభి సంవిశన్తి అని పై తైత్తరీయోపనిషత్ మున్నగు ప్రమాణములందు, 'ఆయత్' శబ్ధవాచ్యుడు నారాయణుడే అ, అతని నుంచి శరీరంతో కూడిన ప్రాణులన్నీ పుడుతున్నాయని, ప్రళయ సమయంలో అతని యందే విలీనమవుతున్నాయని, మోక్షంలో అతని సాయుజ్యాన్ని పొందుతున్నాయని చెపుతున్నాయి.

' ఫలమత ఉపపత్తేః' అనే బ్రహ్మ సూత్రంలో చతుర్విధ పురుషార్థముల ప్రసాదించువాడు నారాయణుడే అని నిశ్చయిం, రామానుజులు మోక్షార్థం అతనినే సేవిస్తారు. ఇక తైత్తరీయంలోని నారాయణానువాకం అంతా నారాయణ పరత్వమును చాటుతున్నది. ఈ అర్థాలనే గీత సమర్థిస్తున్నది. 13వ అధ్యాయంలోని 26 వ శ్లోకంలో భగవానుడు ఇలా ప్రకటిస్తున్నాడు.

యావత్ సంజాయతే కించిత్! సత్త్వం స్థావర జంగమమే ! క్షేత్రం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ! స్థావర జంగమ రూపములైన ప్రాణులన్ని నేను గావించు ఈ ప్రకృతి పురుష సంయోగం వల్లనే పుడుతున్నాయని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి దేవాదిదేవుడైన శ్రీ మన్నారాయణుని, ఆయన అవతారాలను మాత్రమే శ్రీ వైష్ణవులు ఆరాధించాలి, అయితే అన్యదేవతలను వారు ద్వేషించరాదు. వారిని అతిథులుగా ఆదరించి, గౌరవించాలి. ఎందువల్ల? వారందరూ పరమాత్మకు శరీరభూతులు, ఆరాధకులు.