Pages

Tuesday, 11 June 2013

సౌభాగ్యంగా ‘గడప’ డానికి కావలసినదేది..?



ఏ గృహానికయినా గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వా రానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారా లు బిగించబడ వు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు.

అలంకరణలో భాగంగా...
గడప చాలా ప్రాధాన్యత కలిగినది. ఇంట్లో ఆయా గదులకు గడపలు లేకున్నా సరేకానీ తప్పనిసరిగా గృహం సింహద్వారా నికి గడప నిర్మించుకోవాలి. గడప ఉన్నప్పుడే ఆ గడపని శుద్ధిచేసుకుంటూ ఉంటాం. ఆ గడపను పసుపు, కుంకుమ లతో, బియ్యంపిండితో అలంక రించుకుంటూ ఉంటాం. మన సంస్కృతంలో ప్రధానమైన భాగం గడపకి అలంకరణం. పసుపులో యాంటీబయటిక్‌ గుణం ఉంది. అందుకని సాధా రణంగా మనం ఆయా వీధుల గుండా అనేక పరిసరాలలో సంచరించి ఎన్నో లక్షల బ్యాక్టీరి యాలను మన చెప్పు లకు,మన కాళ్లకు అంటించుకుని గృహం లోకి ప్రవేశిస్తుంటాము.

యాంటీ బ్యాక్టీరియా...
ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధిచేసినటు వంటి ఆ గడపలోకి అంతకన్నా ముందు చక్కని ఆవుపేడతో కల్లాపి చల్లినటువంటి వాకిళ్లలోకి మనం అడుగుపెట్టినప్పటినుంచి మన కాళ్లను ఈ ఆవుపేడలో ఉండే యాంటి బయటిక్‌, గడపకు ఉండే పసుపు అలంకర ణలు మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధిచేస్తాయి. అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్లనుండి దూరం చేస్తాయి.

ఇంటికి శ్రీరామరక్ష...
్ఞఅందుకనే ఆ గడపకి పసుపు, కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. దీని లోని ప్రాధాన్యత ఏమి టంటే.... రోగాలను దరిచేయనీయకుండా మన గూటిని అపరిశు భ్రతకు తావులేకుండా ఉంచుకోవడానికే ఇంటి కి గడప ఉండాలంటారు మన పెద్దలు. అయితే తప్పనిసరిగా గృహం యొక్క అన్ని ద్వారాలకు గడపలు ఉండాల్సిన అవసరం ఉంది. ఐతే కొన్ని సాధ్యం కాని పరిస్థితి లో మిగతా గదుల కు లేకున్నా...సింహద్వా రపు గుమ్మానికి తప్ప నిసరిగా గడప ఉండ వలెను. అంతేగాదు ప్రతిరోజూ...ఆ గడపను శుద్ధిచేసు కోవాలి. అప్పుడే ఆ ఇంటికి గడప శ్రీరామ రక్ష.
homeమనం ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్‌ అవుతు న్నాం... అప్పుడు పాత ఇంట్లో ఉన్న సోఫాల ని, బీరువాలని, డైనింగ్‌ టేబుల్‌ లాంటి వాటిని తీసుకుపోతాం. కొత్త ఇంట్లో కొత్త వస్తువుల్ని కొనుక్కుని జీవించాలనే నియమం ఎలాగైతే లేదో పాత ఇల్లు కూల్చినపుడు ఆ టేకు ద్వారా లని, కిటికీలని చెడిపోకుండా ఉన్నవాటిని... నాణ్యత కలిగినటువంటివాటిని తీసుకుని కొత్త ఇంటికి నిర్మాణం చేసుకో వచ్చును. ఏ దోషమూ లేదు. 

వాడుకోవడానికి అనుకూలంగా ఉంటే...
సూక్ష్మక్రిముల ద్వారా ఆయా కిటికీలు, ద్వారా లు రంధ్రాలుపడి లోపల బోలుగామారి చెడి పోయివుంటాయి. అలాంటివాటిని ఎలాగో వదిలేయాల్సివస్తుంది. కాబట్టి అలాంటి చక్క లు ఉంటే తీసిపారేసి కార్పెంటర్‌ సలహామేర కు వాటిని వాడుకోవచ్చు.

పునాదిరాళ్లను వాడుకోవచ్చు...


కర్రవస్తువులు ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వాటిని కొత్త ఇంటి నిర్మాణానికి వాడుకోవచ్చు. పునాది రాళ్లను కూడా వాడుకోవచ్చు. దోషమనేది ఉన్నది అం టే ఆ గృహ నిర్మాణ పద్ధతులను బట్టి వుం టుంది. ఈశాన్యం తెగిపోయినట్లుగానో... ఆగ్నేయంలో గొయ్యిని పెట్టో, నైరుతిలో ద్వా రాలు పెట్టో రకరకాల నిర్మాణ శైలి ద్వారా నో... ఆ గృహంలో అశుభాలు కలుగు తాయే తప్ప గృహానికి ఉపకరించే వస్తు సామాగ్రి, రాళ్లు తదితర సామాగ్రి ద్వారా జరగదు.

విరిగిపోయిన ఇటుకలు వాడద్దు...
అలాగే నాణ్యమైన పాత ద్వారాల ద్వారా ఏరకమైన అశు భం జరగదు. అయితే పాత ఇంటికి సం బంధించి ఇటుక లు మాత్రం పనికి రావు. కొంత మంది ఇళ్లు కూలగొట్టి... ఇటు కలను అన్నీ కలిపి పేర్చు కుంటుం టారు. ఆ ఇటుకలతో ఒక సవ్యమైన స్థితిలో గోడలు రావు. కాబట్టి పాత ఇంటి రాళ్లను, పాత ఇంటి కర్ర సామాగ్రిని, పాత ఇంటి చెడిపోని వస్తు సామాగ్రిని నూతన ఇంటి నిర్మాణానికి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ను. అందులో ఎటువంటి దోషమూ లేదు.