Pages

Sunday, 16 June 2013

అంబ పలుకు జగదంబ పలుకు

నహి దుర్గాసమం జ్ఞానం నహి దుర్గా సమోజపః
నహి దుర్గా సమా పూజా నహి దుర్గా సమం తపః
దసరా వచ్చిందంటే అమ్మవారి ఆలయాలన్నీ కళకళలాడుతూ, భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటారుు. ఇంటింటా కనుల విందుగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పండుగలో ఆధ్యాత్మికత ఎంతో, సాంప్రదాయం కూడా అంతగానే ఉంటుం ది. అలాగే ఆచారం ఎంతో, సంస్కృతి వైభవం కూడా అంతే ఉం టుంది. హిందూలకు ఎన్ని పండుగలున్నా దసరా అంత పెద్ద పం డుగ మరొకటి లేదు. యావద్భారతదేశం ఈ పండుగ ఘనంగా జరుపుకుంటుంది. శ్రీమహావిష్ణూవులా విభిన్న అవతారాలతో అనేక రూపాలతో, వివిధ అంశలతో సృష్టిని కపాడేది దుర్గామాత ఒక్కతే! త్రిమూర్తుల్ని శాసించగల తల్లి ఆదిపరాశక్తి. ఆమె దుర్గగా కూడా కొనియాడబడుతోంది.

మనిషి బహుముఖ ప్రజ్ఞాప్రతిభతో రాణించాలంటే, జవసత్వం, జ్ఞానసత్వం రెండూ కావాలి. జవసత్వ శారీరకం, జ్ఞానసత్వం మానసికం ఈ రెండూ ఉంటేనే ప్రతిభ పరిపూర్ణమవు తుంది. ఈ రెండు వక్తులను ఇవ్వగల శక్తి ఆరిపరాశకిే్తక ఉంది. హిందూ సమాజంలో విష్ణూమూర్తికి ఎంత ఆదరణ ఉందో, శివుడికీ అంత ఆదరణ ఉంది. ఈ ఇద్దరి కన్నా ఎక్కువ ఆదరణ ఉన్న దేవత దుర్గామాత
.

Untit69పండిత పామరజన రజీుంజకంగా దేవీమహిమలు, వైభవాలు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం. విష్ణువును కొలిచేవారు వైష్ణవులు అయితే, శివుని కొలిచే వారు శైవులు అయ్యారు. బ్రహ్మను కొలిచేవారు బ్రాహ్మణులైతే, శక్తిని కొలిచేవారు శాక్తికేయులు అయ్యారు. మంత్ర, యంత్ర, తంత్ర, జప, తప, యోగ విధులలో అమ్మకు పూజాధికాలు ఉండడం ఆమెకు గల ఆదరణకు తార్కాణం. అసలు అమ్మా అన్న మాట పుట్టింది ఈ అమ్మ కోసమే! నోరులేని పశువులు కూడా అంబా అనడం అమ్మ మహత్తుకు నిదర్శనం. శూన్య బ్రహ్మను నాదబ్రహ్మను చేసిందీ, స్పష్టతలేని ఆదిమానవుని స్వరపేటికకు సప్తస్వరాలనిచ్చి రక్షించినదీ అమ్మే! దేముడూ లేదు, దెయ్యం లేదు అనివాదించే వాళ్ళుకూడా ఈ సమస్త సృష్టినీ ఏదో ఒక శక్తి నడిపిస్తుందని అంటారు. 

వాళ్ళు చెప్పే అబ్‌స్ట్రాక్ట్‌ ఫోర్సే మనం ఆకారం కల్పించిన శక్తి. సృష్టిని నడిపించినా, వ్యక్తిని నడిపించినా ఆ వెనుక ఉండే చోదక శక్తి ఒకటే అదే ఆదిపరాశక్తి అని అన్నారు. ‘ప్రతీ విజయం వెనుక ఒక స్ర్తీ ఉంటుంది’ అన్న సూక్తి ఒకటుంది. ఆ స్ర్తీ భౌతిక నేత్రాలకు ఆడది అయితే, ఆధ్యాత్మిక దృష్టితో చూసినపుడు ఆదిపరా శక్తి అవుతుంది. మగవాడికి విజయాలనందించే తల్లి కనుకనే ఆమె ‘విజయ’ అయ్యింది. ఆపేరుతోనే మన రాష్ట్రంలో విజయవాడ అనే మహానగరం వెలసింది. కాళికా స్వరూపం ఆమె ఆకారాల్లో ఒకటి. ఆ కాళి పేరుతో ‘కాళికట్ట’ అనే మరో మహానగరం ఏర్పడి కాలక్రమంలో కోల్‌కత్తాగా మారింది. ముంబాదేవి కూడా అమ్మవారి అవతారమే. ఈ పేరుతో వెలసిన ముంబై మనదేశానికి ఆర్ధిక రాజధానిగా నిలుస్తోంది. అమ్మ ఐశ్వర్యప్రదాయిని. ఇక ఢాకినిగా పూజలందుకునే తల్లి వెలసిన ఊరు ఢాకాగా మారి బంగ్లాదేశ్‌కు 

రాజధానిగా విరాజిల్లుతోంది. ఇలా ఇప్పటికీ ఆమె పేరుతో ప్రభ వెలిగిపోతున్న ప్రాంతాలు, ప్రదేశాలు, నగరాలు అనేకం ఉన్నాయి. ఈ లోకాన్ని నడిపించేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటారు పెద్దలు. సృష్ణి, స్థితి, లయ కారకులయిన ఈ ముగ్గురు దేవుళ్ళకి విధినిర్వహణలో చేదోడు వాదోడుగా ఉండి సహకరించేది మాత్రం ఆదిపరాశక్తే. ఆమే మహాలక్ష్మి, అమే సరస్వతి, ఆమే పార్వతి. అందుకే దసరా నవరాత్రులో అమ్మవారి దశవిధావతారాల్లో లక్ష్మి, డుర్గ, సరస్వతి అవతారాలను ప్రత్యేకించి చూస్తాం. 
సృష్టిని నడిపించే తత్త్వంగా ఆమెను శక్తి అని, సృష్టికి అతీతంగా వ్యవహరించే శక్తిగా ఆమెను పరాశక్తి అని, యావద్విశ్వానికే ఆది మూలంగా ఉన్నందున ఆమెను ఆదిశక్తి అని పిలుస్తారు. 

ఆమె పేరును ఆది-పరా-శక్తిగా విడదీస్తే ఆమె ఆదిశక్తి, పరాశక్తి, ఆదిపరాశక్తి అని తెలుస్తుంది. ఆ ఆది పరా శక్తి స్థూల స్వరూపం అర్ధమవుతుంది. ఆమె బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మాత్రమే తన సేవలు పరిమితం చేసి తనను దూరపు మొక్కులు మొక్కమని కోరదు. ఆమె జగన్మాత. అమ్మలకు అమ్మ. అమ్మలను గన్నయమ్మ. ముగురమ్మల మూలపుటమ్మ. ఆమెతో మనకు చాలా సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆమె లేకుంటే, మనజీవితం ఒక్కక్షణం కూడా సాగదు. జీవజాలానికి ఆమె అందించే సేవలు అంత కీలకమైనవి. ఆమె మనతో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆమె అనంత విభూతులను గమనించాలి. ఇవి మనకు ‘యాదేవి సర్వభూతేషు’ స్తోత్రంలో కనబడతాయి. 

ఆ తల్లి మనలో బుద్ధి రూపంగా, నిద్రారూపంగా, క్షుద (ఆకలి) రూపంగా, ఛాయా (నీడ) రూపంగా, శక్తి రూపంగా, తృష్ణ రూపంగా, క్షాంతి రూపంగా, కాంతి రూపంగా, శాంతి రూపంగా, భ్రాంతి రూపంగా, శ్రద్ధా రూపంగా, దయా రూపంగా, లక్ష్మీ రూపంగా, వృత్తి రూపంగా, తుష్టి రూపంగా, మాతృ (అమ్మ) రూపంగా, ఉంటుంది. ఈ అన్ని రూపాలకి చైతన్యాన్ని కలిగించేది శక్తి. శక్తి అనే మాటకు ‘శక్యతే ఇతి శక్తిః’ అని వ్యుత్పత్తి. శక్తి వలస మనకు కలిగేది శక్యం. అంటే చేతనయ్యే లక్షణం. మనకు ఏపని చేయడానికీ శక్తి లేకపోతే, నాకు శక్యం కావడం లేదంటాం. దాన్నే వశపడటంలేదు, వల్లకావడంలేదు, చేతకావడంలేదు అని కూడా అంటాం. అలాంటి చేవనిచ్చేది, సత్తా కలిగించేది అమ్మ. మనలో కలిగే కోరికలకు అమ్మే మూకారణం. ఆమె ఈ జీవాళిలో తృష్ణా రూపంగా ఉంటుంది. 
Maaaమనలో ఉండే కాంతికి, శాంతికి ఆమె కారణం. మనం చేసే వృత్తి కూడా ఆమె విభూతియే. అందుకే దసరానాడు మనం వాడే పరికరాలు, ఆయుధాలు, వాహనాలకు పూజచేస్తాం. వాహనం కూడా దుర్గ స్వరూపం అని పెద్దలు చెప్తారు. మనకు కలిగే తృప్తి, భ్రాంతి కూడా అమ్మ అంశాలే. మనం కోరుకునే భోగభాగ్యాలకు, సకల సంపత్తులకు సంకేతం అయిన అక్ష్మీరూపంగా కూడా అమ్మే మనతో ఉంటుంది. వీటిలో అన్నీకాని, కొన్నికాని అందరితో ఉండవపోవచ్చు. ఆమె అంతకే పరిమి తమైతే అమె అందరికీ అమ్మ కాలేదు. ఆ సత్యం తెలిసిన తల్లి కనుకనే అందరికీ అమ్మగా అవతరించింది. మాతృరూపేణ సంస్థిత. అమ్మ లేకుండా పుట్టడం దాదాపుగా అసాధ్యం. కాని, ఒకనాడు అయోనిజలు పుట్టారు. 

ఈనాడు టెస్ట్‌ ట్యూబ్‌ బేబీలు పుడుతున్నారు. ఏరకంగా పుట్టినా ఆమెను కాదని ఉండే అవకాశం ఉండకుండా చేస్తూ ఆమె ఆకలిగా, నిద్రగా, నీడగా కూడా మనను అంటిపెట్టుకునే ఉంది. వీటిని ఎవ్వరూ తప్పించుకోలేరు. కాదని జీవించనూలేరు. ఇలా అనేక అంశలుగా, అనేక అంశాలుగా అమ్మ ఏదో ఒక రూపంలో మన అందరిలోను ఉంటుంది. అటు దేవతలను, ఇటు సమస్త జీవరాశులను ఇలా కమ్ముకుని ఉండడం, కలుపుకుని వెళ్ళడం, అందరికీ లోపలా, బైటా నిండివుండడం ఎవరికీ సాధ్యంకాదు. ఆమెను అనుకరించడం, అనుసరించడం కూడా కష్టమే కనుక ఆమెను దుర్గా అని పిలిచారు. దుర్గా అనే మాటకు ‘దుఃఖేన గమ్మత ఇతి దుర్గ’, ‘దుఃఖేన గంతు శక్యతే దుర్గా’ అని అర్ధం చెప్పారు వేదకోవిదులు. దుర్గా అనే పదం ఏర్పడాలంటే, దుకార, ఉకార, రకార, గకార, ఆకారాలు కావాలి. వీటిలో ప్రతి అక్షరం ఒకొక్క శక్తితో ఉన్నాయి. 

దైత్యనాశార్థ వచనో దకారః- శతృ నాశన గుణానికి దకారం ప్రతీక ఉకారో విఘ్ననాశస్య వాచకః- ఉకారం విఘ్నాలను నాశనం చేసే శక్తికి ప్రతీక
రేఫో రోగఘ్నవచ ః- రకారం రోగనాశనానికి ప్రతీక
గశ్చ పాపఘ్నవాడక ః- గకారం పాపనాశనానికి ప్రతీక
భయ శత్రుఘ్న వచనః ఆకారం ః- ఆకారం భయం, శత్రునాశనానికి ప్రతీక
ఈమె చైతన్య స్వరూపిణి కనుక ఆమెను మహాచితి అని కూడా పిలుస్తారు. 14లోకాల్నీ కడుపులో పెట్టుకుని కాపాడే వాడు పరమాత్మ అయితే, వారికి ఆహార కొరత రానీయకుండా కాపాడే అన్నపూర్ణ ఈ తల్లి. అంటే సకల జీవజాలాలకీ ఆహారభద్రతను కలిగించేది ఈ దుర్గే.