Pages

Saturday, 8 June 2013

గోవు,విశిష్టత


భగవంతుడు మనుషూలను పుట్టించడానికి పూర్వమే మన బతుకు చక్కగా సాగడానికి గోమాతను పంపించాడు. ఆ తల్లి కరుణాకటాక్షాలతో సకల సంపదలతో మన భారతావని పూర్వం అత్యంత వైభవంగా విరాజిల్లింది. సకల వేదాలు, పురాణాలు, సకల శాసాత్రలు గోమాతను కొనియాడారుు. ఆమెను ప్రత్యక్ష దైవంగా ఈ దేశం స్వీకరించింది. హిందూ సంప్రదాయంలో గోపూజ ప్రధానమైనది. గోవు శరీరంలో సమస్త దేవతలు నెలకొని వున్నారని మన పురాణాలు చెప్తున్నారుు. గోవును నడిచే దేవాలయంగా చెప్పుకోవచ్చు. శుభకార్యాలయాల్లో గోవు మూత్రాన్ని వాడతారు.

గోవు ఆశ్చర్యకరమైన ప్రయోగశాల అన్నారు పెద్దలు. ఆవుపాలు, పెరుగు, నెరుు్య, మేధో సంపత్తిని వృద్ధి చేస్తుంది.సింహాచలం, వేములవాడ, తిరుపతి లాంటి చాలా పుణ్యక్షేత్రాల్లో ఆవులను, కోడేలను దేవునికి సమర్పించుకోవడం ఆనవారుుతీ. అరుుతే ఇలా వచ్చిన ఆవుల నిర్వహణ ఆలయాలకు తలకు మించిన భారంగా మారింది. రెండు రోజుల క్రితం సింహాచలం ఆలయంలో పరిధిలోని గోషాలలో గోవులు మృత్యువాతపడ్డారుు. ఆలయాల పరిస్థితే ఇలా ఉంటే కరవు సమయంలో రైతు పశువులను ఎలా పోషిస్తాడన్నది ప్రశ్నార్థకం.
ప్రాణులలోకెల్లా సర్వోత్కృష్టమైనది భారతీయ గోసంతతి. ఆవు కాకుండా మరే పశువు పాలలోనైనా పాషాణం(ఆర్సెనిక్‌) ఉంటుందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెబుతోంది. ఆవుపాలు పసుపుపచ్చగాను, గేదెపాలు తెల్లగాను ఉంటాయి. అందువలన వీటిని బంగారము, వెండి అంటారు. ఆవుపాలు దాని మూపురంగుండా స్రవించి లభిస్తాయి. మూపురంలో స్వర్ణనాడి ఉంది. ఆవు దూడ పుట్టిన మూడురోజులకే గం తులేస్తుంది. అదే గేదె దూడ 30 రోజుల వరకు మత్తుగా పడిఉంటుం ది. ఈ కారణంగానే ఆవుపాల వలన శరీరంటో స్ఫూర్తి కలుగుతుంది.

పేడతో ఉపయోగాలు

    • పేడవలన ప్రపంచంలో సర్వశ్రేష్టమైన జీవశక్తి కలిగిన సేంద్రీయ ఎరువు తయారు కొబడుతున్నది. పేడ నుండి గ్యాసు పోయిన తర్వాత నిజానికి మిగిలిన ఆ మడ్డిలోనే ఎరువులను తయారుచేసే గుణాలెన్నో ఉంటాయి.
    • ఏనిమల్‌ వెల్‌ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా వారి ప్రకారం ఒక ముసలి ఆవు ద్వారా సంవత్సరానికి 4500 లీటర్ల బయోగ్యాసు, 80 టన్నుల సేంద్రీయ ఎరువు, 200 లీటర్ల సేంద్రీయ కీటక నివారణ ఔషధం లభ్యమవుతాయి.
    • పిడకలు కాల్చడం వలన 6 కోట్ల 80 లక్షల టన్నుల పంటచెరకు ఆదా అవుతోంది. ఇంత పంటచెరకు అంటే 15 సంవత్సరాల వయస్సు కలిగిన 14 కోట్ల చెట్లన్నమాట. ఆశ్చర్యం! ఊహించని ఎంత పెద్ద ఆదాయమిది.

      కదిలే శక్తికేంద్రం ఆవు
      మన దేశంలో నేడు గ్యాస్‌, విద్యుత్‌ కొరత చాలా ఉంది. మన వద్ద లభించే తక్కువ ఖరీదు సాధనాల ద్వారా కాక భారీ వ్యయంతో కూడిన సాధనాల ద్వారా గ్యాసును నేడు మనం ఉత్పత్తి చేసుకొంటున్నాం. విదేశీ భావదాస్యంలో మునిగిన మనం మనదైన గోవంశం అందించే గోమయం, గోమూత్రంలోని అద్భుత శక్తిని అవహేళన చేశాం. గోమయంచేత గ్యాసు ఉత్పత్తిని భారీగా చేపట్టవచ్చు. అలా బయటికి వచ్చే మడ్డి పదార్థం ఎంతో విలువైన సేంద్రీయ ఎరువుగా పంటలకు ఉపయోగించవచ్చు. గోమయ, గోమూత్రాలతో గ్యాసు ఉత్పత్తిని ప్రారంభిస్తే దానివలన ఎంతో వంటచెరకు, పిడకలు మిగిలిపోతాయి. పరిశోధనచేసి గ్యాసును సిలిండర్లలో నింపి దేశవ్యాప్తంగా సరఫరాలు కూడా చేపట్టవచ్చు.

      ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎలాగూ లేవు. కనీసం ఒక్కొక్కరు కాకపోయినా నాలుగు కుటుంబాలు కలిసి పాలిచ్చే పదిగోవులు ఉంచే ఏర్పాటుచేసి చక్కగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యిలతో తమతమ కుటుంబాలలో చక్కని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుభవించవచ్చు దానితోపాటు తమ చుట్టుపక్కల పర్యావరణ కాలుష్యం లేకుండా చూసుకోవచ్చు. పశ్చిమదేశాల్లో మన సాయూహిక జీవన విధానం ఎడల ఆకర్షణ పెరుగుతోంటే, మనమేమో ఇక్కడ పక్క ఇంటివారిని కూడా చూసి, పలకరించము. ఒకరంటే ఒకరికి పడని వైఖరి సిటీల్లో వేళ్లూనుకుపోయింది. ఎంతసేపూ డబ్బు చుట్టూ మనిషి తిరుగుతున్నాడే తప్పించి, పుట్టినందుకు జీవితాన్ని సార్థకం చేసుకునే మార్గం అన్వేషించడం మానేశారు. ఈ ధోరణి మారినప్పుడే నగరాల్లో దొంగతనాలు, దాడులు, హత్యలు తగ్గుతాయి.

      గో సంరక్షణకు మనం ఏమి చేయాలి?
    • ఆవు ప్రాముఖ్యతను తెలియజేసే సాహిత్యాన్ని చదివి తెలుసుకోవాలి.
    • రోజూవారీ జీవితంలో గోఉత్పత్తులు, పాలు, నెయ్యి, సబ్బులు, షాంపూ, పండ్లపొడి, అగరవత్తులు.. ఇలాంటి వినియోగ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి.
    • గోమూత్రం ద్వారా తయారయ్యే మందులను ఇంట్లోని సభ్యులందరూ వాడేట్లు ప్రోత్సహించాలి.
    • దేవాలయం, ధర్మకర్తలు, భక్తులు ప్రతి దేవాలయం ఒకటి రెండు ఆవులను పోషించేట్టు చూడాలి.
    • రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయ విధానాలను, గోఆధారిత వ్యవసాయ విధానాలను రైతులు చేపట్టేట్టు చూడాలి.
    • గోవధ, తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.


    • గోమూత్రంతో లాభాలు
      క్రిమి నియంత్రణ; నివారణ ఔషధాలు తయారవుతున్నాయి. గోమూత్రంలో వేప, జిల్లేడు, తులసి, మారేడు, కానుగ మొదలైన ఒక రకపు ఆకులు 15 రోజుల నానబెట్టి రాగి పాత్రలో మరగించాలి. సగంవరకు దిగిన తర్వాత సీసాలలో పోసి పెట్టుకోవాలి. ఒక లీటరు ఈ ద్రవంలో 100 లీటర్లు నీరు కలిపి పంటపై పిచికారీ చేస్తే కీటకాలు లేకుండాపోతాయి. అలా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. గోమూత్రంలో 10 రెట్లు నీరు కలిపి చెట్లు, మొక్కలపై పిచికారీ చేస్తే కీటకాల నుంచి వాటిని రక్షించవచ్చు.