Pages

Saturday, 22 June 2013

ఆత్మానాత్మ వివేకానికి గీతాసారం

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా 

చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి 

సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా 

శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ 

అవగతమౌతాయి.
14geeta(ద్వితీయోధ్యాయం- సాంఖ్యాయోగం)
శ్లోకంః అశోచ్యాన్‌ అన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాంవ శ్చ భాషసే 
గతాసూ నగతాసూంశ్చ
నానుశోచంతి పండితాః 
అర్జునా! దుఃఖింపదగని వవాటిని గురించి ఇంతవరకు నీవెంత శోకించితివి? ఇచ్చట నిలచిన వీరులందరూ శరీరము, ఆత్మ అను రెండు కలసియున్నవారు. నీకిది తెలిసియున్నచో, ఈ బంధువధ చేయుట ఎట్లు అని అడిగియుండవు. నరకము పొందుట, పిండములను గైకొనుట తర్పణములు స్వీకరించుట అంటూ గొప్ప వాదములు చేయుచున్నావు. శరీరము, ఆత్మ ఈ రెంటిలో శరీరములో ఏఇ చేసినా ప్రాణములు శాశ్వతముగ నిలుపలేవు. ప్రాణములు పోయి నశించునవి శరీరములు. ఆత్మకు ప్రాణములతో పనియేలేదు. కనుక ఆత్మనుండి ప్రాణముపోవుట అనేది సంభవించదు. ఆత్మలు జ్ఞానమును స్వరూపముగ కలవి, నశించనివి. శరీరము, ఆత్మల గురించిన జ్ఞానముగల బుద్ధిమంతులు, నీవలె ఈ రెంటిలో దేనిని గురించియు శోకించరు. 
శ్లోకంః దేహినోస్మిన్‌ యథాదేహే
కౌమారం మౌవనం జరా 
తథా దేహాంతర ప్రాప్తిః
ధీర స్తత్ర న ముహ్యతి 
అర్జునా! నీవు ధరించినదానిని దేహమందురు. నీవిందున్నప్పుడు మొదట ఈ దేహము బాలుని వలెనున్నది. బాల్య శరీరము పోయి యువక శరీరమైనది, మౌవనము పోయి ముసలితనము వచ్చినది. లోపలి నీకు మాత్రం మార్పురాలేదు. శరీరము మాత్రము పూర్వపు అవస్థలను వదలి, ఉత్తరావస్థలను పొందుచున్నది. నీవు దానికి వగచుటలేదు. ఆయా అవస్థలు కలగకుండా నిలుపుటలేదు. ఇది దేహధర్మమని గుర్తించి ఆనందించుచున్నావు. అట్లే పూర్వదేహము విడిచి మరో దేహము ధరించుట కూడా సహజము. దానిని ఆపలేవు. దుఃఖించకూడదు. దానికొరకు ఎదురుచూడవలెను. జనన మరణాలు శరీరానికే గానీ, ఆత్మవగు నీకు కాదు. ప్రస్తుత దేహమును వదలుట మరణమందురు. కొత్త దేహమును ధరించుట జనన మందుదు. బుద్దిమంతుడు మారుచుండు దేహధర్మములను మారని ఆత్మతో ముడివేసి ఆత్మ నశించునో యని దుఃఖించడు, భ్రమచెందడు.