Pages

Thursday, 20 June 2013

జాతకం లేని వారికి శాంతులు

జాతకం లేని వారికి శాంతులు



  1. ఈ శీర్షిక జాతకం లేని వారికి చాలా ఉపయోగపడుతుంది. అంటే పుట్టిన సమయం లేని వారికి. ఐతే జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును. ఆదిత్య హృదయం: ఇది సూర్యునికి సంభందించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పటించుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐ స్వర్యాలను పొందుతారు. మరియూ మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది.పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుండి, దుహ్ ఖముల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పటించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాదించాడు.
  2. రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం: జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే "రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం" నలుబై ఒక రోజులు పారాయణ చేస్తూ ,నవగ్రహాలకు రోజూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి. చివరి రోజు కందులు,యెర్ర గుడ్డ,ధనము దక్షిణగా పెట్టి,కుజునకు మీపేరు మీద అష్టోత్తరం చేఇంచండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.
  3. మీకు వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ, అప్పులు వసూలుకాకుండా ఉండటం జరుగుతోందా? ఐతే మీరు "విష్ణు సహస్ర నామ స్తోత్రం" నలుబై ఒక్క రోజులు పారాయణ చెయ్యండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేఇంచండి. మీ భాదలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.
  4. మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా? ఐతే మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయిన్చండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేఇంచండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేఇస్తే ఇంకా మంచిది. (లేదా)" సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.
  5. వివాహం ఆలస్య మవుతోందా? ఐతే మీరు "రుక్మిణి కల్యాణం" పారాయణ చెయ్యండి. (లేదా) నలుభై ఒక్క రోజులు ,రోజుకి నలుభై ఒక్క ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చెయ్యండి.ఐతే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.
  6. ధనమునకు ఇబ్బంది పడుతున్నారా? ఐతే ధన కారకుడైన సాయి బాబా పారాయణ నలుభై ఒక్క రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు,అరటి తొక్కలు,ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. నలుభై ఒకటవ రోజు బూంది ఒకకిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి.
  7. డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ: ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు "ఏకన్యాస రుద్రాభిషేకం" చెయ్యండి. అలాగా ఎనిమిది మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేఇంచండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి.
  8. ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ "శ్రీ సూక్తము" పారాయణ చేయవలెను.
  9. హనుమాన్ చాలీసా : హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం "హనుమాన్ చాలీసా". ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిరి. ఈ హనుమాన్ చాలీసాను దినమునకు పదకొండు పర్యాయములు చొప్పున మండలం(నలుభై రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని నూట ఎనిమిది పర్యాయములు పటించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ మూడు వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును.