Pages

Tuesday, 30 July 2013

జ్ఞాపక శక్తి లోపించకుండా...


brain_600x450జ్ఞాపకశక్తి అనేది మన నిత్య జీవితంలో ప్రతి పనికి అవసరం. ఇది లోపిస్తే ప్రతి పనికి అంతరాయం. ఏదైనా విషయం గుర్తుంచుకున్నప్పుడు వెంటనే గుర్తుకు రాకపోవడాన్ని జ్ఞాపకశక్తి లోపంగా వ్యవహరిస్తారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లలో నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు వెంటనే తేవడమే జ్ఞాపకశక్తి.

లక్షణాలు:
సరైన సమయంలో చదివింది గుర్తుకు రాకపోవడం.
వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం.
కొందరు కొన్ని విషయాలు ఒకటి రెండు రోజులు తర్వాతనే మరచిపోవడం.
కొంతమంది గృహిణులు బజారుకు వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేసామో, లేదో, గ్యాస్‌ ఆఫ్‌ చేసామో లేదో అని ఆందోళన పడటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తమకు జ్ఞాపకశక్తి లోపించిదేమో అని ఆందోళన చెందడం సహజం. అలా కాకుండా చేసే పని మీద దృష్టి సారించి ఏకాగ్రతతో చేయుట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వలన మానసికి ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ‘జ్ఞాపకశక్తి’ మెరుగు పడుతుంది.

చికిత్స:
హోమియోలో జ్ఞాపకశక్తి లోపాన్ని నివారించడానికి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ మందులను ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక, శారీరక అలవాట్లను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞాపకశక్తి లోపానికి గల కారణాలైన భయం, మానసిక ఒత్తిడి, నెగటీవ్‌ ఆలోచనలు ఉంటే వాటి నుండి బయట పడేందుకు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి.

మందులు:

ఎనకార్డియం: 
జ్ఞాపకశక్తి లోపానికి ఈ మందు బాగా పని చేస్తుంది.
పిల్లలు చదివింది పరీక్షలకు ముందు గుర్తుకు రాక బాధపడుతుంటారు.
ఇటువంటి వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

ఎకోనైట్‌:
వీరు తేదీలను మరిచిపోతారు.
మానసిక ఒత్తిడి వల్ల, టెన్షన్ల వల్ల జ్ఞాపకశక్తి తగ్గినట్లయితే ఆరంభ దశలో ఈ మందు బాగా పని చేస్తుంది. అలాగే వీరు చల్ల గాలిలో తిరగడం వలన ముక్కు బిగుసుకొనిపోయి, తుమ్ములు, గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతాయి.
వీరికి ఆందోళన, దాహం విపరీతంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండి జ్ఞాపకశక్తి లోపంతో బాధపడే వారికి ఈ మందు ఆలోచించదగినది.

సిక్యుట విరోస:
వీరు మందమతులు.
వీరి పేరును సైతం మరిచిపోతారు.
చివరకు తమ ఇంటి నెంబరును, ఫోను నెంబరును కూడా మరిచిపోతారు.
ఇలాంటి వారికి ఈ మందు బాగా పని చేస్తుంది.

సల్ఫర్‌: 
వీరు పేర్లను మరిచిపోతారు.
వీరికి మానసిక శక్తి తక్కువ, బద్ధకస్తులు.
వీరు మతి మరుపుతో పాటు, చర్మ వ్యాధి, మలబద్ధకంతో బాధపడుతుంటారు.
వీరికి పరిశుభ్రతపై పట్టింపు ఉండదు, అపరిశుభ్రంగా ఉంటారు.
వీరు చూడటానికి సన్నగా ఉంటారు.
కుదురుగా ఒక చోట నిలబడలేరు, వంగి నడుస్తుంటారు.
ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.