Pages

Friday, 19 July 2013

ఇతిహాసాలలో దుర్గాలాస్యం



దసరా దేవీనవరాత్రుల నేపథ్యంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవీ నవరాత్రుల పరామార్ధాలన్నీ ఎంతో ప్రాచీనమైనవని చారిత్రికాధారాలు తెలుపుతున్నాయి. ఆర్యుల ప్రవేశానికి ముందుకాలంలో ద్రావిడులలో స్త్రీకి దేవ్యారాధన విస్త్రృతంగా ఉండేది. నేటికీ గ్రామసీమల్లో దేవతలుగా స్త్రీలనే ఆరాధించడం కనబడుతుంది. ‘నవరాత్రులు’ సందర్భంగా ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు తొమ్మిదిరోజులు ‘దేవిని’ శక్తిని భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తారు. ఈ తొమ్మిదిరోజులకు ‘దేవీ నవరాత్రులు’ అన్న పేరు ప్రశస్తమై నిలిచింది. ఈ దేవీ నవరాత్రులనే శరన్నవరాత్రులుగా పేర్కొనడం జరిగింది.

శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసే సందర్భంలో రావణుని సం హారం కష్టతరం కావడంతో ఆ సమయంలో తనకు విజయం సంప్రాప్తించాలని ‘దేవిని’ పూజించినట్లుగా చెబుతారు. ఆ పూజ ఆశ్వీ యుజ శుద్ధ ప్రథమ (పాడ్యమి) మొదలుకుని నవమి వరకు తొమ్మిది రోజులు చేశారని పదవరోజు ‘‘దశమి’’ నాడు రాముడికి రావణసంహా రం జరిగి విజయం లభించిందని పురాణ కథ. మన పురాణాలు పరిశీలి స్తే ‘దేవి’ మహాకాళి, మహామాయగా అవతరించి మధుకైటభులను సంహరించినం దున ‘మహిషాసుర మర్దిని’, ‘మహాసరస్వతిగా’, దేవి ఫాలం నుండి పుట్టినటువంటి చాముండ, శుంభ నిశుంభులను, రక్తబీ జుని వధించిందని, నందుని ఇంట పుట్టిన ‘నంద’ కంసుడు ఈమెను చంపేందుకు పైకి ఎగురవేయగా ఆమె నీ ప్రాణాన్ని హరించడానికి నీ ప్రాణ శుత్రువు (శ్రీకృష్ణుడు) నందుడి ఇంట్లో పెరుగుతున్నాడని హెచ్చ రించి మాయమవుతుంది. 

ఇంకా ‘రక్తదంతి’ అవతారంలో రాక్షసులను చీల్చివేయడం వల్ల ఈ పేరుతో కొలుస్తారు. ‘శాకంబరి’ ఒకపడు కరువు ఏర్పడగా పూజలందు కున్నది. దుర్గ ‘దుర్గముడు’ అనే రాక్షసుని వధించి నందువల్ల దుర్గగా పిలవబడుతోంది. ‘మాతంగి’ అవతారంలో ‘అరుణు’ డనే రాక్షసుడిని భ్రమరాలు (తుమ్మెదల ) సాయంతో చంపడం వల్ల భ్రమరి అనే పేరు పొందింది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు కలశ స్థాపన చేసి దేవీ మూర్తిని దానిలో ఆవాహనం చేసి, నవరాత్రి వరకు దీక్ష తో దేవీ పూజ చేస్తారు. ఆ రాత్రితో దీక్ష పరిసమాప్తమవుతుంది. కలశం పై రవికల గుడ్డ పెట్టిన కొబ్బరికాయ ఉంచి పూజ చేస్తారు . దశమినాడు ఉదయం ‘దేవీ’ ప్రస్థానం జరుగుతుంది. 

సప్తమినాడు మూలా నక్షత్రం రోజు సరస్వతీ పూజతో నవమి రోజున లోహాభిసారికమంటే రాజ చిహ్నా లను, గజాస్వాదులను, చాపఖడ్గాధ్యాయుధాలను పూజించటం, ఇదే కొన్ని ప్రాంతాలలో ఆయుధ పూజగా జరుపుతారు. రాజరిక వ్యవస్థలో దేవి ఉపాసన: మహాభారతంలో కూడా దేవీ ప్రసక్తి రెండు పర్యాయాలు వచ్చింది. పాండవులు విరాటరాజు కొలువుకు వెళ్ళబోయే ముందు, యుధిష్టిరుడు ‘దుర్గను’ ప్రార్ధించడం మొదటిది.

ఇంద్రకీలాద్రిపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ బెజవాడ కనకదుర్గమ్మ : 
దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమై కృత యుగం నాటి కోవెల బెజవాడ దుర్గమ్మ కొలువుండే ప్రధానాలయంబంగారుగోపురంతో ఉంటుంది. శ్రీ చక్ర అధిష్టాన దేవత, పరమ పవిత్రమైన ఇంద్ర కీలాద్రి మీద ఇంద్రాది దేవతల కోరిక మీద దుర్గాదేవి మహిషాసుర మర్దని స్వరూపంతో స్వయంభుగా వెలసి కోరిన వారికి కొంగు బంగారమై 

‘‘బెజవాడ దుర్గమ్మ’’ గా కీర్తి పొందుతున్నది.

 కనకదుర్గ క్షేత్రంలో దర్శనీయ స్థలాలు:


అమ్మవారి ఆలయానికి ఉత్తర భాగంలో వున్న అత్యంత ప్రాచీనమైన ఆలయం మల్లేశ్వరస్వామి వారి ఆలయం. అమ్మవారి భర్త అయిన పరమేశ్వరుడుగా వెలిసిన ఈ పవిత్రమైన ఆలయంలో అమ్మవారిని దర్శించిన ప్రతి ఒక్కరూ విధిగా మల్లేశ్వర స్వామివారిని తప్పకుండా దర్శించాలి. క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, నాగేంద్రుడి పుట్ట, విఘ్నేశ్వరుడు, నటరాజస్వామి సుబ్రహ్మణ్యేశ్వరాలయం, పార్వతీపర మేశ్వరుల కల్యాణం జరిపే మంటపం ఉంటుంది. 

ఈ దసరా ఉత్సవాల్లో దేశం నలుమూలల నుండి దుర్గమ్మని దర్శించుకోవాలని తపన పడతారు. లోకకం టకుడైన దుర్గమాసురుడి సంహారానంతరం ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ మహారౌద్రంగా వుండేదట. అటువంటి రౌద్ర స్వరూపిణిని పరమశాంతి స్వరూపిణిగా మార్చాలనే సంకల్పంతో శ్రీ ఆదిశంకరాచా ర్యులవారు ఇక్కడికి వచ్చి అమ్మవారి సన్నిధిలో శ్రీ చక్ర యంత్రాన్ని స్వయంగా ప్రతిష్ఠించారు. అంతే ఆనాటి నుంచి దుర్గమ్మ భక్తులకు శాంతి స్వరూపిణిగా మారి దర్శనమిస్తున్నది.

శ్రీ చక్ర రాజ నిలయా శ్రీమత్త్రిపుర సుందరీ
శ్రీ శివా శివ శకె్తైక్య స్వరూపిణీ లలితాంబికా 


అని లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పినట్లుగా సృష్టి స్థితి లయ కారిణి అయిన ఆదిశక్తి మన దుర్గమ్మ పవిత్రమైన లలితా స్వరూపిణిగా నిత్యం లలితా సహస్ర నామాలతోనే అర్చించటం జరుగుతోంది. దసరా నవరాత్రుల్లో దుర్గమ్మ దర్శనం శుభకరం.