Pages

Saturday, 20 July 2013

లౌకిక బంధాలకు అతీతం గీతాసారం


నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారా యణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.

శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
kris58శ్లోకంః ఆచార్యాః పితరః పుత్రాః
తథైవ చ పితామహాః
మాతులాః శ్వశురాః పౌత్రాః
స్యాలా స్సంబంధిన స్తథా 

ప్రాణాల్ని తృణ ప్రాయంగా ఎంచి యిక్కడ నిలచిన వారిలో గురువులు, తండ్రి సములు, పుత్ర సములు, అలాగే తాతలు, మామలు, మనుమలు, బావమరుదులు ఒకరేమిటి అన్ని విధముల బంధుత్వము కలవారు ఉన్నారు. 
శ్లోకంః ఏతాన్‌ న హంతుమిచ్ఛామి
ఘ్నతోపి మధుసూదన!
అపి త్రైలోక రాజ్యస్య
హేతోః కిన్ను మహీకృతే 

మధుసూదనా! నీవు భక్తరక్షణ కోసం మధువనే రాక్షసుని సంహరించి మథుసూధనుడవయ్యావు. నేనీ బంధువధ చేయుటకెట్లు అంగీకరించుచున్నావు? ఇటువంటి బంధువధ వలన సంపాదించు త్రైలోకాధిపత్యము కూడా నాకు అవసరం లేదు. అటువంటిది ఈ చిన్న భూమండలాధిపత్యం కోసం ఈ పని చేయను. యుద్ధము చేయని నన్ను ఒకవేళ కౌరవులు చంపివేసినా సరే, నేను మాత్రం వారిని చంపదలచుకోలేదు.