Pages

Tuesday, 30 July 2013

గదులలో నిత్య ఉపయోగ వస్తువులు ఉంచు స్థానములు

తూర్పులో : టి.వి, టేపురికార్డరు, రేడియో, వి.సి.ఆర్, డ్రెస్సింగ్ టేబుల్, షోకొరకు పెట్టుకొను బొమ్మలు వస్తువులు పెట్టుకొను స్థానము.

ఆగ్నేయములో: వంట చేసుకొనుట 8'-10' సైజులో వంట గది ఉన్నచో, వంట రుచికరము, ఆరోగ్యకరము.

ఆగ్నేయ-దక్షిణము మధ్యలో : నూనెలు, గ్యాస్ సిలిండర్, కిరసనాయిలు డబ్బాలు పెట్టుకొను స్థలము.

దక్షిణములో: బంధువులు, మరియు పిల్లల పడక స్థలము.

నెరుతిలో : ఇనుప సామానులు, ఆయుధములు, పెట్టిన గృహరక్షణ కలుగును.

నెరుతి-పడమర మధ్యలో: పిల్లల చదువులు, పెద్దలు మాట్లాడుకొనుటకు మంచిది.

పడమరలో : భోజనము చేయు స్థలము ఆయుషు వృద్ధి యగును.

పడమర-వాయువ్యము మధ్యలో : ఉపయోగించినప్పుడు శబ్ధము వచ్చే వస్తువులు ఉపయోగించుట, రోలు, గ్రైండరు, వాషింగ్ మిషన్, ఏర్ కూలర్ మొదలగునవి ఉంచు స్థలము.

వాయువ్యములో : పనికిరాని చెత్త వస్తువులు ఉంచు స్థలము. వాయువ్యము-ఉత్తరము మధ్యలో : భార్యా భర్తల పడక స్థలము గది కొలత 10' - 11' ఉన్నచో భార్యా భర్తలకు అనుకూలత ఉండగలదు.

ఉత్తరములో : డబ్బులు, బంగారం వస్తువులు ఉంచినచో ధన లాభము కల్గును.
 ఉత్తర- ఈశాన్యములో: మందులు పెట్టుకొను స్థలము, జబ్బులు త్వరలో నయమగును.

ఈశాన్యములో: పూజ చేసుకొను స్థలము. పూజ గది కొలత 6' - 6' ఉన్నచొ పూజ ఫలించును. ఎట్టి పరిస్థితిలోను ఆగ్నేయము పడక గది, ఈశాన్యము వంట చేయుట పనికి రాదు. తూర్పు, ఈశాన్యము, ఉత్తరము, భాగములందు నీళ్ళ హౌసులు, బావి, బొరింగ్, నీటి తొట్లు ఉండ వచ్చును. హాలు ఉండ వలసిన కొలతలు 16' - 10' ఉన్నయెడల అనుకూల సంభాషణలు జరుగ గలవు.