Pages

Saturday, 27 July 2013

గొంతు నొప్పా..ఇలా చేయండి



పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు జలుబు, గొంతునొప్పి, దగ్గు, తలదిబ్బడ, లోజ్వరంతో బాధపడుతుంటారు. వీటన్నింటి నుంచి ఉపశమనం పొందాలంటే డాక్టర్లనో, మెడికల్‌షాపులనో ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనో తయారు చేసుకోవచ్చు. నల్లతుమ్మబంక, కాసు, పట్టికను చూర్ణంచేసి మాత్రలుగా చేసుకొని వాడితే జలుబు, గొంతునొప్పి పూర్తిగా మటుమాయం అవుతుంది.

50 గ్రాముల నల్లతుమ్మబంక, 50 గ్రాముల కాసు, తగినంత మోతాదులో తీసుకొని మూడింటిని వేరువేరుగా చూర్ణం చేయాలి. ఈ మూడింటి చూర్ణాన్ని ఒక పాత్రలోకి తీసుకొని కొద్దిగా నీటితో తడిపి బాగా కలుపాలి. ఆ తరువాత దానిని చిన్న చిన్న మాత్రలుగా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున తీసుకొని నోటితో చప్పరించడం గానీ, లేదా దవడకు పెట్టుకోవడం వల్ల జలుబు, గొంతు నొప్పి, దగ్గు తగ్గుతుంది. మాత్రను దవడకు పెట్టుకోవడంవల్లపళ్ళు, చిగుర్లు కూడా గట్టిగా తయారవుతాయి.