Pages

Tuesday, 2 July 2013

చైతన్యంతోనే ఉన్నతి

Chaitaa


ఈ సృష్టిలో ప్రతీది ప్రత్యేకమైన ప్రాణ శక్తి ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. (ఈ సృష్టిలో ప్రతి వస్తువు, జీవి ఏర్పడేందుకు వివిధ రూపాలలోకి బదిలీ అయ్యే విశ్వంలోని శక్తి ఇదే). ఒక చెట్టుకు లేక జంతువుకు లేదా మనిషికి లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా కు కారణం వారిలో స్పందించే ప్రాణ శక్తి ఫ్రీక్వెన్సీలో తేడాలే. మనం కొందరు వ్యక్తుల సాహచర్యాన్ని ఇష్టపడడం లేక కొందరి సమక్షంలో అసౌకర్యంగా భావించడానికి కారణం ఈ వ్యక్తిగత ప్రాణ శక్తి ఫ్రీక్వెన్సీలలో తేడాలే. మన ప్రాణ శక్తి ఫ్రీక్వెన్సీ పరిధిలో ఉన్న వస్తువులు, వ్యక్తులతోనే సంబంధాన్ని నెరపగలిగే మనం, మనకన్నా ఉన్నతమైన లేక తక్కువ స్థాయిలో ఉన్నవారితో సంబం ధాలను ఏర్పరచుకోలే కపోవడానికి కారణమూ ఈ ఫ్రీక్వెన్సీలో తేడాయే.

సర్వవ్యాప్తమైన ప్రాణశక్తిని వ్యక్తి సామర్ధ్యాన్ని అభివ్యక్తి లోకి తీసుకువచ్చే సామర్ధ్యమే చైతన్యం. ఈ విశ్వంలో మనుగడలో ఉన్న అన్నింటికీ రూపాన్ని ఇచ్చేం దుకు ప్రాణశక్తితో చైతన్యం ఐక్యం అవుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో మిమ్మల్ని తయారు చేసేది చైతన్యమే. మీ ప్రత్యేక భౌతిక స్థితిని ప్రాణశక్తి ఇస్తుండగా, మీ ఆలోచనలు ఒక రూపాన్ని సంతరిం చుకునేందుకు చైతన్యం వాటిని క్రమబద్ధం చేస్తుంది. ప్రతి ఆలోచనా సమర్ధవంతమైన అభివ్యక్తే. ఆలోచిస్తున్న వ్యక్తి చైతన్యపు స్థాయి అతడి ఆలోచనలను వ్యక్తీకరించే సామర్ధ్యంతో ప్రత్య క్షానుపాతాన్ని కలిగి ఉంటుంది. వ్యక్తి పరిణామ స్థాయి ఎంత ఉన్నతంగా ఉంటే అంత వేగంగా అతడి ఆలోచనలను అభివ్యక్తమవుతాయి. 

దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక కంపెనీలో సిఇఒ ఒక విలాసవం తమైన కార్యాలయంలో కూ ర్చొని కంపెనీకి అవసరమైన ప్రణాళికను కొద్ది గంటలలో రూపొందిస్తాడు. సిఇఒ ఆలోచనలకు వాస్తవ రూపం ఇచ్చేందుకు వర్ణపటం మరో చివర ఉన్న కార్మికుడు తన జీవితంలో అనేక గంటలు శ్రమిస్తాడు. ఇది చైతన్య చలనం కారణంగా. సిఇఒ, భౌతిక శ్రామికుడు చైతన్యపు స్థాయిలలో భారీ అంతరం ఉన్నది. సిఇఒ చైతన్యం స్థాయి శ్రామికుడి చైతన్యపు స్థాయికన్నా ఉన్నతంగా ఉండడంతో అతడి ఆలోచనా శక్తి కూడా అంతే ఉంది. విజయవంతమైన, విఫలమైన వ్యక్తుల మధ్య తేడా వారి చైతన్యపు స్థాయిల్లో తేడానే. 

చైతన్యం స్థాయిని ఎలా పెంచుకోవాలి? శరీరంలోని ప్రాణశక్తి ఫ్రీక్వెన్సీ సూక్ష్మతరం అయినప్పుడు చైత న్యం పెరుగుతుంది. యోగ అంతిమ ప్రయోజనం, లక్ష్యం అదే. ప్రాణ శక్తి ఫ్రీక్వెన్సీలను మార్చడం ద్వారా చైతన్యాన్ని పెంచడమే దాని లక్ష్యం. అష్టాంగ యోగలోని ఎనిమిది అంగాలనూ పొందుపరచిన సనాతన క్రియ- శరీరంలోని స్థూల ప్రాణాన్ని శుభ్రపరచి, చైతన్యపు స్థాయిని పెంచుతుంది. నిత్య సాధన వల్ల శరీరంలో సూక్ష్మ మార్పులు అభివ్యక్తమవ్వడమే కాక చైతన్యపు స్థాయి కూడా పెరగడం ప్రారంభమవుతుంది. ఉన్నత స్థాయిలో చైతన్యం కలిగిన గురువుతో సంబంధం, సాధకుడి శరీరంపై ప్రతిబింబించడం ప్రారంభించి అతడు/ఆమెలోని శారీరక అసమతులతలు తొలగడమేగాక వారిని ఒక సమతుల స్థితికి తెచ్చేందుకు దోహదం చేస్తుంది. 

సాధారణంగా భౌతిక, ఆర్థిక, మానసిక లేక ఉద్వేగపూరితమైన గందరగోళాలే ఈ అసమతులతలకు దారి తీస్తాయి. ఈ గందరగోళాలు సద్దుమణిగిన తర్వాత అద్భుతమైన కాంతి, అంతర్గత భౌతిక శక్తి, ఉన్నతమైన చైతన్యపు స్థాయితో ఫలితాలు కనిపిస్తాయి. చైతన్యపు స్థాయి ఉన్నతంగా ఉన్నప్పుడు దేనినైనా మరో మాటలో చెప్పాలంటే ప్రతిదానినీ సాధించవచ్చు. ఈ కారణం వల్లనే రాజులు కూడా యోగులను గౌరవిస్తారు, పూజిస్తారు. ధనికులను, నిరుపేదలను సమానంగా ఆకర్షించే సామర్ధ్యం యోగికి ఉం టుంది. అంతేకాదు, తన దగ్గరకు కోరికలతో వచ్చే వారికి వాటిని మంజూరు చేసే సామర్ధ్యం యోగులకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉచ్ఛరించే ప్రతిపదం అభివ్యక్తమయ్యే స్థాయికి ఆయన చైతన్యం చేరి ఉంటుంది. వరాలు, శాపాలు పని చేసేది ఇలాగే. ప్రకృతిలోని భౌతిక, సూక్ష్మ శక్తులపై యోగి ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. 

ఆయనకు రెండు ప్రపంచాలూ అందుబాటులో ఉం టాయి. ఆయన మాయ పరిధికి ఆవల ఉంటాడు . ఆయనకు ఇవ్వడం మాత్రమే తెలిసినందున వ్యక్తుల భౌతిక స్థాయి లేక సం పదతో ప్రభావితం కాడు. నిజమైన యోగి ఎవరినీ దేని కోసమూ అడగడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది ఆయనకు అందుబాటులో ఉంటుంది. కానీ ఆయన దానితో ప్రభావితం కాడు. యోగా అంటే వేగంగా శ్వాస క్రియలను చేయడమో లేక తలకిందులుగా నిలబడడమో కాదు. అది సాధకుడి ఆధ్యాత్మిక అన్వేషణకే కాదు భౌతిక జీవితాన్ని కూడా ఉద్దేశించిన సంపూర్ణ శాస్త్రం. 

ఎందుకంటే యోగ భౌతిక, ఆధ్యాత్మిక స్థితులను విడదీయదు. గురువు మార్గదర్శనంలో ఉన్నత మైన చైతన్యం ద్వారా మనం దరం ఉన్న ఈ భౌతిక ప్రపంచంపై ఆధిపత్యం సంపాదించవ చ్చు. యోగా అనేది చైతన్యానికి సంబం దించిన అంశం. మీరు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత త్వరగా మీ సంకల్పం అభివ్యక్తమవుతుంది. అందుకే దైవిక చైతన్యం అత్యంత శక్తివంతమైంది. సర్వవ్యాప్తమైంది. అది సంకల్ప మాత్రం చేతనే తక్షణమే అభివ్యక్తమవుతుంది