Pages

Sunday, 21 July 2013

నిమజ్జనం ఎరుగని మట్టి గణపతి


Ganaగద్వాల్‌కి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణ పురంలోని పరిమళాపురం (పళ్ళా బుజుర్గ్‌) ప్రాంతంలో 13వ శతాబ్థంలో వెలిసిన మట్టివినాయకుడు ప్రతి నత్యం పూజలు అందుకుంటు న్నాడు. నిమజ్జనం ఎరుగని వినాయకుని పూజిస్తే తమ మొక్కులు తీరుతా యని ఇక్కడి భక్తుల విశ్వాసం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తు న్నారు. అయితే ఈ వినాయకునికి ఓ ప్రత్యేకత ఉంది. మట్టితో రూపొందించిన ఈ విగ్రహం 707 సంవత్స రాలైనా ఏమాత్రం చెక్కుచెదరకుండా నాటికీ, నేటికీ ఒకేలా ఉండటం విశేషం. నవరాత్రి ఉత్సవాలు ముగిసిన వెంటనే అన్ని విగ్రహాలను నిమజ్జనం చేయడం అనేది అన్ని చోట్లా ఒక విధానం, కానీ, ఈ మట్టి వినాయకుని మాత్రం నిమజ్జనం చేయకుండా నిత్య పూజలకు ఉంచుతారు.

గణంజయ దీక్షితులు ఇంట్లో వెలసిన ఈ వినాయకుడు 13వ శతాబ్ధం నుంచీ పూజలు అందుకుంటూ కొలి చిన వారికి కొంగుబంగారంగా ఉంటుంన్నాడు. ఈ స్వామికి వంశపారపర్యంగా అర్చిస్తున్న ఆ వంశీయుల్లో ఇప్పటి తరం వారైన అణ్ణప్ప దీక్షితులు పూజాదికాలు కొనసాగిస్తున్నారు. వినాయక చవితి నుంచి ప్రత్యేక పూజాకార్యక్రమాలు అయినా సత్య వినాయక వ్రతం, బిల్వార్చన, మహాభిషేకం, యజ్ఞాలు, హోమాలు అనంత చతుర్ధశి దాకా నిర్వహిస్తారు. అనంతరం కూడా ప్రతి సోమవారం, ప్రతి సంకష్ట చతుర్ధశి పర్వది నాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంతటి పురాతన వినాయక మట్టి విగ్రహం రాష్ట్రంలో మరెక్కడా లేదు. దీనిని గుర్తించి మరింత శ్రద్ధ వహిస్తే ఇదొక పుణ్యక్షేత్రంగా అవుతుంది.