Pages

Thursday, 11 July 2013

సంతాన వరప్రదారుుని కల్యాణి

aKalyaa

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అమ్మవారికి నరబలులు ఇవ్వడం ఆచారంగా ఉండేది. నాగరికత పెరిగిన తరువాత ఈ మానవ త్యాగాలు అంతరించి నిత్య పూజలతో కల్యాణేశ్వరి దేవిని పూజిస్తున్నారు. దేశం నలుమూలల నుంచీ ఎందరో భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూవుంటారు. ఈ ఆలయ నిర్మాణాన్ని ఆకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పంచకోట రాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. సంతానం కోసం పరితపించే దంపతులు ఈ కల్యాణేశ్వరి అమ్మవార్ని దర్శిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇప్పటికీ భక్తుల విశ్వాసం. ఎన్నో ఏళ్ళ కిందట నిర్మించినా, ఈ ఆలయం సరికొత్త కాంతులతో నిత్యనూతనంగా ఉంటుంది.