“సర్వశాస్త్రమయీ గీతా” సకల శాస్త్రసారమే గీత అని వ్యాసుడు మహాభారతంలోని భీష్మపర్వంలో పేర్కొన్నాడు. ఎందుకంటే శాశ్రాలన్నీ వేదాలనుండి ఏర్పడ్డాయి. వేదాలు బ్రహ్మముఖం నుండి వెలువడ్డాయి. అటువంటి బ్రహ్మ పద్మనాభుడిగా పిలువబడే భగవంతుని నాభి కమలం నుంచి ప్రభవించాడు. ఈ రీతిని గమనిస్తే భగవంతునికి, శాస్త్రానికి మధ్య చాలా అంతరం ఉండి. కాని భగవద్గీత విషయంలో – భగవద్గీతను శ్రవణ, కీర్తన, పఠనాదులు ద్వారా మననం చేస్తూ వుంటే ఇతర శాస్త్రాలతో పని లేదు. ఎందు చేతనంటే అది సాక్షాత్తు పద్మనాభుడైన శ్రీ విష్ణుభగవానుని ముఖ కమలం నుండి ప్రభవించినది అని వ్యాసుడు పేర్కొన్నాడు.