Pages

Wednesday, 31 July 2013

బాబా చెప్పిన ఆనంద రహస్యం


భగవంతుడి వద్ద మనందరి కోసం మంచి ప్రణాళిక ఉంది. ప్రాణాలతో ఉన్నామూ అంటే మనం సాధించాల్సిన పనులేవో ఇంకా ఉన్నట్టే. అవేమిటో తెలుసుకోవటమే జీవిత పరమావధి. కానీ మనం ఏం చేస్తున్నాం? వల్లమాలిన కోరికలు కోరి భగవంతుడ్ని విసిగిస్తున్నాం. కోరికలు తీరితే పొంగిపోతున్నాము. తీరకుంటే కుంగిపోతున్నాము. లేదంటే దేవుడిలా చేశాడని రుసరుసలాడుతున్నాం. కష్టం, సుఖం అనేవి మనం అనే విషవలయాన్ని సృష్టించుకుని బతుకును నరకం చేసుకుంటున్నాము. 
నిజానికి కష్టం, సుఖం అనేవి మనం సృష్టించుకున్న భావనలు. అవి మనవైఖరిని భట్టే కలుగుతుంటాయి. ఉన్నదాంతో తృప్తిపడక అందని వాటి కోసం అర్రులు చాస్తూ మనమే మనసును అశల పుట్టచేసుకుంటున్నాము. బావిలో నీరు ఊరినట్టు ఒక కోరిక తీరగానే మరో కోరిక పుట్టుకొస్తాయి. మనం వాటి చుట్టునే తిరుగుతూ అదే జీవితమనే భ్రమలో బతికేస్తున్నాం. మనసు శద్ధమైతే కష్టసుఖాలకు అతీతంగా అనందంగా ఎలా బతకవచ్చో, దిగులు, చింతను వదలి చేసే పనిని ఎంత అనందంగా చేయవచ్చో చిన్నపిల్ల ద్వారా బాబా చెప్పించారు. దాసుగుణ బాబాకు పరమ భక్తుడు. ఈశోపనిషత్‌ను మరాఠిలోకి అనువదించాని సంకల్పించాడు. అదంత సులభం కాదని గ్రిహంచి వెంటనే బాబా వద్దకు వెళ్లాడు. ఈ శోపనిషత్‌లోని భావలు తనకు అర్థం కావటం లేదని వివరించి చెప్పమని కోరాడు.

తొందరపడకు, విల్లేపార్లే అనే ఊర్లో కాకా సాహెబ్‌ దీక్షిత్‌ ఇంట్లో ఓ పని పిల్ల ఉంది. అంతా నీకు అర్థమయ్యేలా చెబుతుంది. అని బాబా దాసుగుణకు సూచించారు. ఈ శోపనిషత్‌నే మంత్రోపనిషత్‌ అని కూడా అంటారు. అందులోని భావాలు అర్థం చేసుకోవటం, వివరిచండం మహా మహా పండితులకే సాధ్యం కాదు. అలాంటిది ఓపని పిల్ల చెప్పటం ఏమిటి ? బాబా తమషా చేస్తున్నారా ? అని మనసులో అనుకున్న దాసుగుణ బాబాపైనే భారం వేసి విల్లే్లపార్లేలోని కాకా ఇంటికి వెళ్లాడు. అక్కడ నిండా పన్నెండుళ్లెయినా లేని పని పిల్ల చిరిగిన మాసిన బట్టలతో ఉండటం గమనించాడు. ఆమెను చూడగానే పేదరికంలో ఉందని అర్థమైంది. అయితేనేం.. ఆపాప తన స్థితి పట్ల ఎలాంటి దిగులు లేకుండా ఆడుతూ పాడుతూ పని చేస్తోంది. ఆ బాలికకు దాసుగుణ ఎర్రని చీరను ఇచ్చాడు. మర్నాడు అ బాలిక ఇచ్చిన చీరను కట్టుకుని వచ్చింది. నిన్నటి మాదిరిగానే ఆమె ముఖం అంనందంతో వెలిగిపోతోంది.

ఆరోజు తోటి పిల్లలతో కలసి అడిపాడింది. అందరిలోనూ ఆ కొత్త బట్టలతో కొత్తగా మెరిసింది. కొద్దిసేపటికి మళ్లీచిరిగిన బట్టలతోనే బాలిక పనికి వచ్చింది. పని చేస్తూనే ఎర్రని చిర ఎంత బాగుంది. దానిపై జరీ ఇంకా బాగుంది. చేతి అల్లిక పని మరింత అద్బుతంగా ఉంది. అనే భావన వచ్చే పాటను పాడుతోంది. అప్పుడు కూడా ఆమె ముఖంలో ఎప్పుడూ ఉండే అనందం ఉంది. దిగులు, చింత అనేవి లేవు. శ్రద్ధగా, అంకిత భావంతోఆమె తన పని చేసుకోవటం చూసి దాసుగుణ అబ్బురపడ్డాడు. సుఖ దుఃఖాలు, అనంద సంతోషాలు మనసుకు సంబంధించినవి. మనసులో ఎలా భావిస్తే అవి అలాగే కనిపిస్తాయి.

ఇదే ఈశోపనిషత్‌ రహస్యం. ఆ రహస్యాన్ని బాబా దాసుగుణకు చిన్న పనిపిల్ల ద్వారా చెప్పించారన్నామాట. ఉందనుకోవటం, లేదనుకోవటం, అన్నీ మనలోని భావాలే. భగవంతుడు మన అర్హతకు తగినంతే ఇస్తాడు. దానితో తృప్తిపడాలి. దానిని ఆనందంగా అనుభవించాలి. దిగులు చింతతో జీవితాన్ని దుర్బరం చేసుకోకుడదు. పనిపిల్ల మాదిరిగా అంకిత భావంతో పనిచేయటమే మన కర్తవ్యం. పనిపిల్ల తన దుర్బర స్థితిని కష్టమని భావించలేదు. కాబట్టే హాయిగా ఉండగలిగింది. అంటే మన వైఖరిని బట్టే కష్టసుఖాలు కలుగుతాయి