Pages

Sunday, 11 August 2013

మహాలక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉంటుంది.?



తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, గోవులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పూలు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలలో కొలువుంటుంది.

ఇంకా దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లల్లో బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మి నివసిస్తుంది.