Pages

Tuesday, 13 August 2013

కడుపులో మంటగా ఉంటే....?


చాలామంది ఉన్నట్లుండి కడుపులో మంట పుడుతోందంటూ కుర్చీలో అలాగే వాలిపోతుంటారు.
దీనికి అసిడిటీయే కారణం. అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే...
సరిగా నిద్ర లేకపోవడం.
ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం.
ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం.
ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం.
ఉండాల్సిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. రుచిగా ఉందని ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా జరుగదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది.
సమయానికి భోజనం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు.

అసిడిటీ మరియు గుండెల్లో మంటను అదుపు చేసేందుకు కొన్ని చిట్కాలు :
అసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడిన ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
యాపిల్ పండు రసం, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది
పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి.
తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది.
ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. భోజనం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించకండి.
మద్యపానం, ధూమపానం అలవాటుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించండి.
తులసి ఆకులను ఉదయంపూట తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.