Pages

Tuesday, 27 August 2013

కీరదోస రసంలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే?


అందంగా కనిపించాలంటే ఖరీదైన సౌందర్య ఉత్పత్తులే వాడాల్సిన అవసరంలేదు. అందుబాటులో ఉండే వంటింటి వస్తువులే అందుకు ఎంతో ఉపయోగపడతాయి. తాజా కీరదోసను రసంగా చేసుకొని దానిలో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కాసిని పచ్చిపాలూ కలిపి ఫ్రిజ్‌లో పదిహేను నిమిషాలు ఉంచాలి.

తరువాత దానిలో ముంచిన దూదితో ముఖాన్ని తుడిస్తే మురికి తొలగిపోతుంది. ఇది సహజమైన టోనర్ లా పనిచేస్తుంది. గుప్పెడు ద్రాక్షపళ్లను రసంగా చేసుకుని, దానిని చెంచా ముల్తానీ మట్టీ చెంచా గంధం పొడి చేర్చి మెత్తగా కలపాలి. దాన్ని ముఖానికి పూతలా వేసి పావుగంటయ్యాక చన్నీళ్లతో కడు కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే ముఖం తాజాగా మారుతుంది.