Pages

Saturday, 31 August 2013

దృష్టిమాంద్యాన్ని నివారించే "క్యారెట్లు"


* కంటి జబ్బులు, ముఖ్యంగా దృష్టి మాంద్యంతో బాధపడేవారికి "క్యారెట్లు" దివ్యౌషధంగా పనిచేస్తాయి. వయసు పెరిగేకొద్దీ చూపు మందగించటం సాధారణం. అయితే బీటా కెరోటిన్, జింక్, విటమిన్ ఏ, సీలు శరీరానికి అందినట్లయితే 60 సంవత్సరాలు దాటినా 35 శాతం మేరకు దృష్టిమాంద్యాన్ని నివారించవచ్చు. ఇందుకు క్యారెట్లు చక్కగా తోడ్పడతాయి.

* విటమిన్ ఏ పుష్కళంగా లభించే క్యారెట్లను ఆహారంగా 
తీసుకోవటంవల్ల థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ సి, జీలు కూడా శరీరానికి అందుతాయి. అంతేగాకుండా శరీరానికి ఉపయోగపడే పన్నెండు రకాల ఖనిజ లవణాలను క్యారెట్లు అందిస్తాయి. పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్‌లతోపాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ లాంటి ఖనిజాలు కూడా క్యారెట్లలో మెండుగా లభిస్తాయి.

* క్యారెట్లలో లభించే క్యాల్షియం చక్కటి సమతౌల్యాన్ని అందిస్తుంది. దీనివల్ల పళ్లకు, ఎముకలకు మంచి బలం కలగటమేగాకుండా, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కళ్లు, చర్మం, వెంట్రుకలు, పళ్లు.. ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ప్రతిరోజూ ఆహారంలో క్యారెట్లు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. క్యారెట్లలో ఉండే ఫైటో కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యారెట్లలో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

* క్యారెట్లలోని బీటా కెరోటిన్ విటమిన్ ఏ తయారీకి దోహదపడుతుంది. కంటిలోని రెటీనా పొరలో ఉండే "ఫొటోరెపెస్టార్స్" కాంతిని గ్రహించిన తరువాత అది తిరిగి పునరుత్తేజం పొందేందుకు విటమిన్ ఏ చాలా సహాయపడుతుంది. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి వస్తుంది. కళ్లు తరచుగా పొడిబారి దురదగా ఉంటాయి. కాబట్టి విటమిన్ ఏ లోపం రాకుండా ఉండేందుకు ఆహారంలో క్యారెట్లు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తపడాలి.