Pages

Saturday, 17 August 2013

రామావతారంలో ఏకపత్నీ వ్రతం పాటించి; కృష్ణావతారంలో బహుభార్యలను పొందడములో అంతర్యం ఏమిటి?


రాముడు, కృష్ణుడు యిరువురూ కారణజన్ములు. రామావతార లక్ష్యం వేరు; కృష్ణావతార లక్ష్యం వేరు. రాముడు నరుడుగా వున్న నారాయణుడు. కృష్ణావతారంలో కృష్ణుడు సాక్షాత్ నారాయణ స్వరూపం మరి నరుడేమో అర్జునుడయినాడు. రామావతారంలో శ్రీరాముడు తాను నరుడిగానే సంచరించారు. మరి శ్రీకృష్ణావతారంలో తాను సాక్షాత్ నారాయన స్వరూపంగా ప్రకటించిన సందర్భాలు అనేకం. ఇక రామావతారంలో ఏకపత్నీవ్రతం పాటించి శ్రీకృష్ణావతారంలో బహుభార్యలను పొందడంలో అంతర్యం ఏమనగా శ్రీరాముడు అరణ్యవాస కలంలో దండకారణ్యంలో సంచరిచేటప్పుడు మునులు మునికాంతులు శ్రీరాముని చూచి మోహించిరి. అందులకు మీ కోరిక రాబోవు కృష్ణావతారులో తీర్చగలను అని వారిని రామావతారంలో వుండగా అనుగ్రహించిరి. అందులకు గాను మునులు గోపికలుగాను మునిపత్నులు గోవులుగాను జన్మించిరి. ఈ విషయం వాల్మీకి చరిత-గర్గ సంహిత గోలోక ఖండం వంటి వాటిలో వివరింపబడినది.