Pages

Tuesday, 20 August 2013

ఎక్కిళ్లు ఆగాలంటే........


ఎక్కిళ్లు వస్తుంటే అవి ఆగడానికి ప్రయత్నపూర్వకంగా 

కాసేపు ఊపిరి బిగబట్టాలి. అయితే అది శ్వాసక్రియను 

ఆపేంత కాకూడదు. కాసేపటి తర్వాత శ్వాస తీసుకుని, 

మరోసారి బిగబట్టాలి. ఇలా కాసేపు చేస్తే ఎక్కిళ్లు 

ఆగుతాయి. 


గబగబా ఊపిరి తీసుకుంటూ ఉండాలి. ఒక రెండు 

నిమిషాల పాటు ఇలా చేయాలి. ఎక్కిళ్లు ఆగాక మళ్లీ 

మామూలుగా ఊపిరి తీసుకోవాలి. 

మోకాలిని ఛాతీ వరకు తీసుకుని దాన్ని కాసేపు ఛాతీకి 

ఆనించి ఉంచాలి. అకస్మాత్తుగా భయపెట్టడం వంటి 

చర్యతో ఎక్కిళ్లు ఆగుతాయి. అయితే అది అంత మంచిది 

కాదు. కాబట్టి ఎక్కిళ్ల మీదనుంచి దృష్టి మళ్లించడానికి 

ప్రయత్నించాలి. 

ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలతోనూ ఎక్కిళ్లు ఆగకపోతే అవి రావడానికి కారణాలు కనుక్కునేందుకు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.