నవరాత్రుల తరువాత వినాయక ప్రతిమను సమీపంలోని
చెరువులోనో, లేదా కుంటలోనూ నిమజ్జనం చేయడం
కూడా ఆచారంగానే వస్తున్నది. చెరువులు, కుంటలు
లేని
చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి,
ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక, 23 గంటలకు
తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను
జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని
ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు,
ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం
వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం.