Pages

Saturday, 21 September 2013

తెలుగు వారు చంద్ర గమనాన్ని అనుసరించి మాసాలు లెక్కిస్తారు. అమావాస్య తర్వాతి రోజు (పాడ్యమి) నుండి అమావాస్య దాకా ఒక మాసం.


ఇలా 12 మాసములు ఒక సంవత్సరం గా లెక్క 

పెడతారు. అయితే సంవత్సరం అంటే సూర్యుని 

గమనాన్ని బట్టి లెక్కించాలి కనుక కొన్ని 

సంవత్సరాలలో 12 బదులుగా 13 నెలలు లెక్కిస్తారు. 

(ఇంగ్లీష్ కాలెండరు లో లీప్ ఇయర్ లా ). అలాంటి 

సంవత్సరాలలో ఏదో ఒక మాసాన్ని రెండు సార్లు 

లెక్క 

వేస్తారు. ఇలా వచ్చే మాసాన్ని అధిక మాసం 

అంటారు. ఈవిధం గా చాంద్రమానం తో సౌర 

మానాన్ని 

కలిపి తెలుగు క్యాలెండర్ రూపొందుతుంది.

రెండు నెలలు (మాసాలు) కలిపి ఒక ఋతువు. ఈ 


ఋతువుల ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రతి ఋతువులో 

ప్రకృతి వివిధ రూపాలలో మనకు కనిపిస్తుంది. (ఈ 

ఋతువులకు ఆంధ్ర దేశాన్ని అనుసరించి పేరు 

పెట్టారు. భూమి పై ఇతర ప్రాంతాలలో ఇలాగే 

ఉండాలని 

లేదు)
  1. చైత్ర, వైశాఖ మాసములు వసంతఋతువు - చెట్లు 
  2. చిగురిస్తాయి
  3. జేష్ఠ , ఆషాడ మాసములు గ్రీష్మఋతువు - ఎండలు కాస్తాయి
  4. శ్రావణ, భాద్రపద మాసములు వర్షఋతువు - వానలు కురుస్తాయి
  5. ఆశ్వయుజ, కార్తిక మాసములు శరత్ఋతువు - చక్కటి వెన్నెల కాస్తుంది
  6. మార్గశిర, పుష్య మాసములు హేమంతఋతువు- రాత్రులు మంచు కురుస్తుంది
  7. మాఘ, ఫాల్గుణ మాసములు శ శిర ఋతువు - ఆకులు రాలు కాలము