Pages

Wednesday, 25 September 2013

మంత్రాలు నాకు తెలిసి రెండు రకాలు...ఒకటి--వేద మంత్రాలు.. రెండు.. దేవతా మంత్రాలు.. నిజానికి ఇవి కూడా వేదాలనుంచీ వచ్చినవే !



మంత్రాలు నాకు తెలిసి రెండు రకాలు...ఒకటి--వేద 
మంత్రాలు.. రెండు.. దేవతా మంత్రాలు.. నిజానికి ఇవి కూడా వేదాలనుంచీ వచ్చినవే ! వేద మంత్రాలు శబ్ద ప్రధానమైనవి. వాటి స్వరాల వల్ల కలిగే ప్రకంపనలు అవి ఉఛ్ఛరించినవారి శరీరములో నాడులను , ముఖ్యముగా మేధస్సును ప్రచోదింపజేస్తాయి. వ్వాటి వలన మనిషి కి ఒక సకారాత్మకమైన శక్తి కలుగుతుంది. మంత్రాలకు అంత ప్రభావం ఉంది కాబట్టే అవి వినబడుతున్నప్పుడుకూడ మనస్సు అన్నీ మరచిపోయి వాటిలో నిమగ్నమవుతుంది.. మంత్రముగ్ధులు కావడం అంటే అదే...స్వరముతో పాటు ఆ అక్షర రాశి లో మనకు వేరే ఇతర విధాలుగా పొందలేని పురుషార్థాలు సిద్ధిస్తాయి............ఇక.. దేవతా మంత్రాలు..... .

మనిషికి కావలసిన వేర్వేరు కోరికలను , పురుషార్థాలను తీర్చడానికి భగవంతుడు వేర్వేరు శక్తి రూపాలను కలిగి ఉంటాడు.. ఉదా॥ విద్య కు బృహస్పతి , సరస్వతి , జ్నానానికి చండీ , ధనానికి లక్ష్మి , కుబేరుడు ఇలా... ఒక్కొక్క శక్తి ని మనం ఒక దేవతగా ఆరాధిస్తాం. ఆయా దేవతలు మంత్రాధీనులు. మంత్రం తో ఆ దేవతలను వశం చేసుకొని ఆ యా కోరికలను పొందవచ్చు. ఆ మంత్రాలు గురువు ద్వారా ఉపదేశం పొంది నిష్ట గా , శాస్త్రోక్తం గా జపించి సిద్ధి పొందవచ్చు. ....
అష్టోత్తరాలు వంటివి మంత్రం స్వరబద్ధంగా జపింఅలేని వారికి ఉపయోగపడుతాయి. మంత్రమైతే డైరెక్టు గా ప్రధాన మంత్రిని కోరినట్టు.. అష్టోత్తరాలు ఉత్తరం ద్వారానో , టెలిఫోన్ , మెయిల్ ద్వారానో కోరినట్టు. ..
మంత్రార్థాలు కేవలం సంస్కృత భాష తెలిసినంత మాత్రాన ఒక పట్టాన అర్థం కావు. అవి జపిస్తూ జపిస్తూ ఉండగా మన మేధస్సు కొంచం కొంచం గా వాటి నిజమైన అర్థాన్ని తెలుసుకుంటుంది..అదికూడ ఆయా దేవతల అనుగ్రహం ఉంటేనే ...