మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని, శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్దవయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం . పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది. గ్ర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి .
ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు
తీసుకోవాలి :
- మాంసాహారులకు లభించే మాంసకృత్తులు, అధిక శాతం మరియు నాణ్యమైన అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.
- శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి పొందవచ్చు.
- ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్ధాలు ,జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.
- వృక్షాల ద్వారా లంభించే ఆహారంలో సొయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి.
- 16–18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కే.జీల బరువు బాలురకు రోజుకు 78 గ్రాముల మాంసకృత్తులు అవసరం. అదే విధంగా 16 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కే.జిల బరువు బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరం.
- గర్బవతికి రోజుకు 65 గ్రాములు ఒక రోజుకు
- పాలిచ్చే తల్లులకు/బాలింతలకు 6 నెలల వరకు 75 గ్రాములు 1 రోజుకు
ఆహార పదార్ధాలు
|
ప్రతి 100 గ్రాములకు లభించే మాంసక్రత్తులు /గ్రాముల్లో
|
సోయాబీన్స్
|
43.2
|
శెనగ పప్పు, పప్పు, మినపప్పు, పెసరపప్పు ఎర్ర పప్పు, కందిపప్పు
|
22
|
వేరుశెనగపప్పు, బాదం పప్పు,జీడిపప్పు
|
23
|
చేపలు
|
20
|
మాంసము
|
22
|
ఆవు పాలు
|
3.2
|
గేదె పాలు
|
4.3
|
కోడిగుడ్డు ( సుమారు 44 గ్రాములు)
|
13.3 (ఒక గుడ్డుకు)
|
|