Pages

Monday, 7 October 2013

భగవంతుని ముందు దీపం వెలిగిస్తే అహంభావం ఆవిరవుతుంది…!









దీపం జ్ఞాన చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్యజ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయంసంధ్యవేళ ఒకటి, రెండుసార్లు దీపారాధన చేయడం హైందవ ఆచారం. కొన్ని ఇళ్ళల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని “అఖండ” దీపం అంటాము.

అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది. దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుంది. అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తాము.
విద్యుత్‌దీపాల సంగతిని పక్కనుంచితే సంప్రదాయబద్దంగా వెలిగించే నూనే దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువుగా ఉంటుంది. దీపపు కుందిలో పోసే నెయ్యి లెదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్థం చేసుకోవాలి.