Pages

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన (12వ భాగము )

ఓం శ్రీ గురుభ్యో నమః , 
ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీ పరామ్బికయై నమః

అనేక రకాలైనటువంటి , మహాలక్ష్మిలు ఇక్కడ నివసిస్తున్నారు . అనేమగు కుబేరులు జగదమ్బ యొక్క కోశాగారాన్ని పరి రక్షణ చేస్తున్నారు . వరుణుని కి సంబంధిత కోణము లో రతీ దేవి , తో పాటుగా కామదేవుడు నివసిస్తున్నాడు . కామ దేవుని చేతి లో పాశము , అంకుశము , ధనుస్సు , అలo కార యుతముగా ఉంటాయి . శృంగారాలు ఇక్కడ నివసిస్తాయి . ఈశాన కోణము లో విఘ్నేశ్వరుడు తమ లాంటి గణే శులతో నిండి ఉంటాడు . తమ విభూతులు ,ఐశ్వర్యాలతో పాటుగా ఉంటాడు . బ్రహ్మ ప్రభుతి తమ విభూతులను సహితము బ్రహ్మ గా పేర్కొన్నారు . జగదంబకు ఇక్కడా సేవలు జరుగుతుంటాయి .

మహామరకత మని ప్రాకారము తరువాత్ , ప్రవరాల ప్రాకారము వస్తుంది . ఇక్కడ పంచ మహాభూతాల స్వామి నివసిస్తుంటాడు . ఇకాడి ప్రభలు . పగడాల ప్రాకారము . . వీరు తమ చేతుల్లో ఆయుధాలు ధరించి , నిల్చుంటారు . ఇవి ఐదు శక్తులు , వీరి పేర్లు , హల్ల్రేఖ , గగనా , రకటా , కరాలికా , మహోచ్చుష్మా . ఇక్కడి శక్తులు , కించిత్తు గర్వము తో ఉంటారు .ఈ దేవతలు కించిత్తు సౌoదరయ గర్వముతో ఉన్నారు. .

ఈ ప్రవ రాల ప్రాకారము అయ్యాక ,నవ రత్న ప్రాకారము వస్తున్నది . ఈ రత్నాలు అనేక యోజనాలవరకు వ్యాపించి ఉన్నాయి రంగు రంగుల ప్రభలతో ప్రకాశించే వీటి శోభ చెప్ప రా నిది . తొమ్మిది రంగుల రత్నాలు చక్కని వన్నెలతో చేముకు - చేముకు మంటూ ప్రకాశించగా చక్కని కాంతి సౌo దర్య వర్ణనను మనము చేయ గలమా ?

ఆగమ ప్రసిద్ధ దేవతలు ఇక్కడ నివసిస్తుంటారు . 7 కోట్ల మహా మంత్రం దేవతలు ఇక్కడ ఉంటారు . కోటి సూర్యుల వలే ప్రకాశమును చిoదించే ,వీరి అద్భుత లావన్యాలు చెప్పరానివి . మాహావిద్యల సమస్త అవతారాలు ఇక్కడే ఉంటాయి . శ్రీ దేవి రూపాలు అన్ని ఇక్కడే నివసిస్తాయి .

తొమ్మిది రత్నాల ప్రాకారము అయ్యాక వచ్చేది చింతామణి ప్రాకారము . ఇందులో ఒక అద్భుతమైనట్టి గుడి ఉంది . దీనిలో సూర్యుని వలే , చంద్రుని వలే , విద్యుత్తూ వలే వెలుగొందే అద్భుత మగునట్టి స్తంభాలు ఉన్నాయి . వీటి ప్రభల వెలుగులో మరో వస్తువే కనపడుట లేదు . ఇక్కడి వస్తువు లన్ని చింతామణి చే నిర్మితము . అయినవే !ఇక్కడ ప్రవహించే నదులన్నీ సుధా సింధు లో లీనమవుతున్నాయి . ఈ ప్రాకారానికి విశిష్ట శక్తి భువనేశ్వరీ దేవి . ఈ తల్లి భువనేశ్వరుని వామ భాగాన ఉన్నది .” ఆమె సాంగత్యమే , ఆ యన అక్కడ ఉన్నాడు .”అని పరాశాక్తికి కోటాను కోటి వందనాలు .”అమ్మ !నీకు జయము తల్లి “

om sree maatre namaha

sree shivaa shiva shaktyaikya roopini,
lalitaambikaayai namo namaha