Pages

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన (14 వ భాగము )

ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీ పరామ్బికాయైయ్ నమో నమః .

ఇంతకు ముందు మనము జగత పిత , భువనేశ్వరుని రూపాన్ని తలుచుకున్నాము . శుద్ధ స్ఫాటికమణి లా , దేదివ్యమానముగా ,వెలిగుతూ , ఆయన శ్రీ విగ్రమునుండి దివ్యా కాంతులు సమస్త లోకాలను ప్రకాశింప గా , ఆయనకు వామాన్గము న ఉన్నట్టి మన అమ్మ ,భువనేశ్వరీ దేవి , ఏంతో మనోహరముగా ప్రకాశిస్తున్నది . చక్కని మంద హాసము తో , కనులలో ప్రేమ తొణికిసలాడుతూ ఉన్నట్టి తల్లి ,సన్నని నడుముకు రత్నాలు తాపిన వడ్డాణము ,

శ్రీ చక్రమును పోలి నట్టి భుజకీర్తులను , పెట్టుకున్నది , చెవులకు , కర్ణ పుష్పములు , వింత కాంతులీనుతూ ఆమె ముఖ కమలానికి మరింత శోభ చేకూర్చ గా ,ముచ్చట గొలిపే శోభ ను వర్ణిoప తరమా !

అమ్మవారి లలాట కాంతి వైభవం అర్ధ చంద్రున్ని తిరస్కరిస్తున్నదా ? అన్నట్టున్నది . దొండ పండు వంటి పెదాలు , మo దహాసము చేసినప్పుడు , చక్కు మని మెరిసేటి ,చక్కని పనువరుస , కుంకుమ కస్తూరి తిలకము , పెట్టుకొని అమ్మ అద్భుతముగా శోభయమానురాలిగా ఉన్నది .

చంద్ర సూర్యుల వంటి ఆకారము కలిగిన ముకుటాన్నిధరించిoది అందులో రత్నాలు పొదిగి ఉన్నాయి . శుక్ర తారను పోలినట్టి నాసికా భరణము ,అమ్మ తేజానికి మరింత అందాన్ని , జోడించింది .
దివ్యమగు చూడమణి శిరస్సుకు , శోభను చేకూర్చింది . కoఠాన్ని ముత్యాల హారాలతో అలకరించింది .ఆ అమ్మా యొక్క దేహమునుంది దివ్య సుగాదాలు (దేవతల శ్రీములోనుండి దివ్య సుగంధాల పరిమళాల వాసనలు వస్తాయి దివ్య గంధా అన్న పేరు . )

చంద్రిని వలే వెలిగే ముఖము పైన, ముంగురులు వచ్చి పడుతున్నాయి . కమల దళాల వంటి మూడు నేత్రాలు ,ఎనలేని శోభ కలుగ చేయగా , మారాగా , పద్మరాగ కాంతి వెదజల్లే ఆమె శరీర ఛాయా, చేతులకు కంకణాలు ,సమస్త ఆభరణాల కాంతి అంత ఆమె పాదాల నుండి ప్రసరిచే వెలుగు రేఖలత . ఎంతటి దివ్య జ్యోతి !అమ్మ సర్వ మంగళ !

తమ బరువైన ఉరొజల భారము వలన అమ్మ బద్ధకించినదా !అన్నట్టు ఉన్నది ఆమె వాలకం . సృగార రసము చే అమ్మ సంపన్నురాలుగా ఉన్నది . సుకుమారమైన శరీరము ,సమస్త సౌo దర్యానికి ఆధార భూత నిష్కపటముగా ఉంది ఆ కరుణామూర్తి .