Pages

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన . (2వ భాగము )



ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ శివ శక్త్యైక్య రూపిణ్యై నమః 
పార్ట్ 1 లో ముందుగ అమృతసాగరము ,తరువాతచతురస్రాకరముగా ఉన్నట్టి , లోహ ప్రాకారము , ఆపిన కాంస్య ప్రాకారము , ఆ తరువాత తామర ప్రాకారము అందులో వసంతుడు తమ ఇద్దరు పత్నుల సమేతుడిగా నివసిస్తుంటాడు . 
సుందరమైన శోభలతో ఉన్నట్టి ఈ వనము కో కిలల నినాదము తో గుంజిత మై ఉన్నది 

,.తామ్ర ప్రాకారము , తరువాత వచ్చేది,గాజు ప్రాకారము , దీని ఎత్తు ఏడు యోజనాలు . ఈ రెండు ప్రాకారాల మధ్యన సంతాన వాటిక ఉంది . ఇందులో అన్ని రకాల వృక్షాలు ఉన్నాయి .ఈ వనము లోని పుష్పాల సౌరభము పది యోజనాల వరకు ఉంది . నిరంతరుముగా వికసిo చే ఈ పూవ్వులు , సువర్ణమయ కాంతులచే శోభిల్లు తున్నాయి . అమృతము చే నిండిన రసాల పలాలు ,ఎంతో మధుర ముగా ఉంటాయి . ఈ వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు . అతనికి ఇద్దరు భార్యలు . శుక్ర శ్రీ , శుచి శ్రీ . ఇక్కడ, సంతాపమును కలిగినట్టి ప్రాణులు ఈ నీడలో తల దాచుకొని సేద తీరుతుంటారు . ఇక్కడి మూల - మూలలో సిద్ధ పురుషులు ఉంటారు . ఎల్లప్పుడూ సిద్ధ పురుషులు మరియు ,దేవతలు తో నిండి ఉంటుంది క్షేత్రము .
నిండి ఉంటుంది క్షేత్రము .

రాజా! ఈ గాజు ప్రాకారమును దాటాక ,ఇత్తడి ప్రాకారము వస్తుంది . దిని పొడవు ఏడు యోజనాలు పర్యంతం . ఈ రెండు ప్రాకారాల మధ్యన మలయ గిరి వృక్ష వాటిక ఉంది .మేఘాలపైన విహరించే వర్ష ఋతువు , ఇక్కడి అవసరాలను చూస్తూ ఉంటాడు . వీరి నేత్రాలు పింగల వర్ణము తోనూ ఉన్నాయి . . ఈయన మేఘాల కవచము తొడుక్కొని ఉంటాడు , వర్షము కురుస్తున్నప్పుడు విద్యుత్ తరంగాలు కలిగి నప్పుడు వచ్చీ ,ఉరుములే శబ్దాల ధ్వని . ఇంద్ర ధనుస్సు ఈయన ధనుస్సు . తమ గణాల సహకారముతో కురిపించే వర్షపు ధారలు ఈతని సహజ గుణం . “నభశ్రీ: ,నభ్యస్య శ్రీ , స్వరస్యా ,రస్య మాలిని ,అమ్బాదులా , నిరత్రి ,అభ్ర మంతి ,మేఘయంతికా ,వర్షయంతి,చిబుణికా ,వారి ధారా ,సమ్మతా. ఈ పన్నెo డు శక్తులు వర్ష ఋతువు భార్యలు .

ఈ ప్రాకారము ,నూతన పల్లవాలు ,లతలతో ఎల్లప్పుడూ నిమిడి ఉంటుంది . పలు రకాల వృక్షాలు తో శోభాయమానముగా ఉంటుంది . నదీ నదులు , ఇక్కడ ,చాలా వేగముగా ప్రవహిస్తుంటాయి ,ఇచట దేవతలు , సిద్ధ పురుషులు మరియు , దేవి కొరకు ,నిరతముగా యఘ్య యాగాదుల చేసే పురుషులుంటారు . వాపి , కోప తడాగాలు , చెరువులు , బావులు ,సరస్సులు మొదలగు త్రవ్వించి భగవద్ అర్పణము చేసే వారు (ఇలాంటి పుణ్య ప్రద మైన పనులు చేసి పుణ్య ఫలాన్ని భగవదర్పణ ము చేసే మాహానుభావులు ఇక్కడ ఉంటారు , ఎట్టి ఫలాపేక్ష లేకుండా మంచి పనులు చేసేవారు అన్నమాట ). ఓం శ్రీ మాత్రే నమః ..
సశే సము .....