Pages

Monday, 13 January 2014

భగవద్గీత ఓ కల్పవృక్షం. దానిని నాటినది శ్రీకృష్ణపరమాత్మ. పోషించి పెంచినది వ్యాసభగవానుడు. ఉపనిషత్తులే గీతకు బీజం



గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం 
వేదవ్యాసవివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్ /
నానాశాస్త్రరహస్యశాఖమరతిక్షాంతిప్రవాళాంకితం 
కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినామ్ //

భగవద్గీత ఓ కల్పవృక్షం. దానిని నాటినది శ్రీకృష్ణపరమాత్మ. పోషించి పెంచినది వ్యాసభగవానుడు. ఉపనిషత్తులే గీతకు బీజం. వైరాగ్య సహనములే గీతాకల్పతరువు యొక్క చిగురుటాకులు. నానాశాస్త్రములు దాని శాఖలు. శ్రీకృష్ణ పాదపద్మమునందలి పూర్ణభక్తియే దాని పుష్పం. జాతి లింగ ఆశ్రమ భేదములేక యెవ్వరు దానిని భక్తితో ఆశ్రయింతురో వారు తప్పక ముక్తులగుదురు. 

ఇటువంటి కల్పతరువును ఏ ఫలం ఆశించి ఆశ్రయిస్తే ఆ ఫలం మాత్రమే సిద్ధిస్తుంది. కామ్యఫలం ఆశిస్తామో, జ్ఞానఫలం ఆశిస్తామో మన అభిమతంపై ఆధారపడి ఉంటుంది.