Pages

Monday, 13 January 2014

తిరుమల వేంకటేశ్వరుని హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం


దివ్యమంగళకరం శ్రీవేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞానప్రబోధకరం.
ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే  వేంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం.
హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం :-
'సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా -
కుడిహస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతుమాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయహస్త సందేశం ఇస్తుండగా, ఎడమచేతితో నాభి క్రిందస్థానం చూపిస్తూ, ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయంచెయ్యమన్న సందేశముంది. 
కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమచేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ.