Pages

Friday, 31 January 2014

ప్రధమ స్కందం - మొదటిశ్లోకం (ఇతర అన్వయం)



ప్రధమ స్కందం - మొదటిశ్లోకం (ఇతర అన్వయం)
జన్మాద్యస్య యతోऽన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్
తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః
తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోऽమృషా
ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి

భాగవత ప్రారంభశ్లోకమైన దానికి అద్వైత విశిష్టాద్వైత వ్యాఖ్యానాలే కాక ఇతర అన్వయాలు కూడా ఉన్నాయి

గాయత్రీ మంత్ర వ్యాఖ్యానం: 
ఇదే శ్లోకానికి గాయత్రీ మంత్ర పరమైన వ్యాఖ్యానం ఉంది 

సత్యంపరం ధీమహి: సూర్య భగవానునికి యేడు కిరణాలు. మూడు కన్నులు ఐదు శిరస్సులు. 
సవితు: వరేన్యం బర్గ: దీమహి: - సూర్య భగవానుని అత్యుత్తమమైనటువంటి కాంతి ధ్యానిస్తున్నాము. సవితా అంటే సకల జగత్తుని సృష్టించి రక్షిస్తున్నాడు సమ్హరిస్తున్నాడు కాబట్టి ఆ శక్తి కలవాడు సవిత. ఈ మూడే జన్మాది యద్య యత:
స్వేన ధామ్నా - అంటే దివ్యమైన తేజస్సు అంటే భర్గహా.
జన్మాది అస్య యత: అనే దానికి సవితా అనేది సవితా అనే దానికి అన్వయం అవుతుంది
ధామ్నా స్వేన నిరస్త కుహకం - అంటే తన దివ్యమైన తేజస్సు. భర్గ: అంటే తేజస్సు
పరం అంటే వరేణ్యం
ధియో యోన: ప్రచోదయాత్: అంటే మా బుద్ధిని ఎవరు ప్రచోదిస్తున్నారో. దీనికి తేనే  బ్రహ్మ బృధా సరిపోతుంది. అంటే ధియో యోన: ప్రచోదయాత్. బ్రహ్మకు ఎవరు ప్రేరేపించి వేదాలని అనుగ్రహించారోభాగవత ధ్యాన శ్లోకం గాయత్రీ మంత్రం యొక్క అర్థాన్నే చెప్పింది. సృష్టిని సృష్టించి రక్షించే పరమాత్మ తేజస్సును ధ్యానిస్తున్నాను. ఆ తేజస్సు భగవంతుని మనం చేరడానికి కావల్సిన ఉత్తమ బుద్ధిని ప్రసాదిస్తుంది.   


కృష్ణాన్వయం

ఈ శ్లోకం కృష్ణ పరమాత్మనే చెప్తుంది. సత్యం పరం ధీమహి. పరమాత్మ సత్యం యందే ఉన్నాడు.  
పరమాత్మ సత్య స్వరూపుడు. సత్య నేమి (సత్యమే అంచుగా కలవాడు), సత్యానికే సత్యం. 
సత్యం పరం ధీమహి అన్నమాట - పరం కృష్ణం ధీమహి
ఆద్యస్య జన్మ యత: పరమాత్మ పుట్టుకు ఎక్కడినుంచి 
అన్వయాత్ ఇతరత: ఒక చొట పుట్టి ఇంకో చోటికి వెళ్ళాడు. ప్రతీసారి ఇంకోచోటికి వెళ్తూనే ఉంటాడు. మధురలో పుట్టి బృందావనంలో పెరిగి ద్వారకకు ఎందుకు వెళ్ళాడు - అర్థేషు అభిజ్ఞ్యా - యేమి చెయ్యాలో తెలిసిన్వాడు కాబట్టి 

తేనే బ్రహ్మ బృదా ఆది కవయే:  చిన్నవాడిగా ఉన్నప్పుడే  బ్రహ్మగారికే తత్వం చెప్పాడు. 
ముహ్యంతి యత్ సూరయ: ఎంతోమంది జ్ఞ్యానులు కూడా మోహం పొందారు. ఇంద్రుడు కాళీయుడు బలరాముడు అందరూ మోహం చెందారు. వీళ్ళందరూ సూరయ: (అంటే జ్ఞ్యానులే )
తేజో వారి ..... యధా వినిమయ: రాసలీలలో కృష్ణ పరమాత్మ దగ్గరగా ఉన్నాపుడు యమునా నది చల్లబడి రాయి అయ్యింది, చంద్రుడు కృష్ణుని అందాన్ని చూసి కళావిహీనుడయ్యాడు
యత్ర త్రిసర్గ: ....: ఇక్కడకూడ మధుర బృందావనం ద్వారకలో ఉన్నాడు
ధామ్నా స్వేన ...కుహకం:  అంతమంది రాక్షసులను తన దివ్యమైన తేజస్సుతో సమ్హరించాడు


భాగవత పరమైన అన్వవ్యం

ఇవన్నీ కాకుండా భాగవతమే ఈ శ్లోకానికి వ్యాఖ్యానం
ఆద్యస్య - మొదటిపురుషుడు పరమాత్మ. ఈయన ఆవిర్భావం మనకు భాగవతమే. ఇక్కడినుంచే ఆవిర్భవించాడు. 
అవయాత్ ఇతరత: భాగవతంలోనే కృష్ణ తత్వం సంపూర్ణంగా ఉంది
అర్థేషు అభిజ్ఞ్య: సంసారంలో ఉన్నవాళ్ళకు భగవంతుని యందు భక్తి యేమి చెప్తే మొలకెక్కుతుందో అది తెలిసినది భాగవతం. తక్కిన పురాణాల్లో లేని విషయం భాగవతంలో ఉంది. యెలా అంటే

నిమ్నగానాం యథా గఙ్గా దేవానామచ్యుతో యథా వైష్ణవానాం యథా శమ్భుః పురాణానామిదమ్తథా
కావాలి కావాలి అనే కోరికి ఉన్నకొద్దీ కోరిక భగవానుని మీదే ఉంటుంది. ఫలముని ఆశించకుండా భగవంతుని సేవించమని చెప్పిన గ్రంధం భాగవతం. అందుకే భాగవతం ఉత్తమోత్తమం  తపస్సు దానం యగ్న్యం వ్రతం యేమీ అవసరంలేదు. ఇదే అర్థేషు అబిజ్ఞ్యా
తేనే బ్రహ్మ బృదా ఆది కవయే- వ్యాస భగవానునికి నారదుడు చెప్పిన భాగవతం అధ్యయనం చేస్తే ఈ జగత్తంతా నశ్వరం అశాశ్వతం అని తెలుస్తుంది (యత్ర త్రిసర్గ:మృష). భక్తి పరిపక్వమైతే జగత్తు అంతటా పరమాత ఉన్నాడని అనుభవమవుతుంది.
తేజోవారిమృదాం యథా వినిమయో  - పురాణాల్లో ఇది సాత్విక పురాణం. తామస పురాణాలను కూడ తెలియక సాత్విక పురాణంగా భ్రమపడతారు.. అందువల్ల పరమాత్మ స్వరూపం సరిగా తెలియదు
ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం ఇలాంటి భాగవతం తన జ్ఞ్యాన జ్యోతితోటి పరమాత్మ స్వరూపంతోటి అన్ని రకాల కపటములను నిర్మూలిస్తుంది.
ఇటువంటి భాగవతాన్ని 'సత్యం పరం ధీమహీ' ధ్యానం చేస్తున్నాను.

శృంగారపరమైన అన్వయం

శృంగారం రస రాజు అంటాం. ఆద్యస్య యద్యత: అంటే మొదటి రసం యొక్క జన్మ యే భావన వల్ల కలిగింది. అదే శృంగార రసం. అదే ఎందుకు అవ్వాలి. అన్వయాత్ ఇతరత: ఇతరముల (విభావ అనుభావ సాత్విక వ్యబిచార సమ్యొగాలనే భావలతో యేరప్డే రసం) యొక్క సహకారంతో యేర్పడిన రసం. 
అర్థేషు అభిజ్ఞ్యా :  అర్థములు మూడు రకాలు 
1. వ్యాక్యార్థం 2. లక్ష్యార్థం (''వాడు నిప్పులాంటి మనిషి ' అనడం) 3. వ్యంగ్యార్థం 
శృంగారం ఈ మూడు అర్థాలలో ఉపయోగపడుతుంది సమన్వయ పడుతుంది - అంటే అర్థేష్వభిజ్ఞ్యా
అర్థేషు అభిజ్ఞ్యా :అంటే మూడు అర్థాలు ధ్వని రసం గుణం; గుణాలు అలంకారములు రీతులు ; వ్యాక్యార్థం లక్ష్యార్థం వ్యంగ్యార్థం . రసం అనుభవించడానికి ఉపకరించే అన్ని అర్థములయందు అభిజ్ఞ్య: 
స్వరాట్: స్వయం రాజతే. అన్నిటికీ శృంగారమే మూలం. అందుకే శ్రంగారం స్వరాట్. 
తేనే బ్రహ్మ బృదా ఆది కవయే: రసం అంటే పరమాత్మ. రసోవై స: నాట్య శాశ్త్రం రచించిన భరత ముని ఆదికవి. రసబ్రహ్మను భరతునికి ఉపదేశించింది శృంగారమే
ముహ్యంతి యత్ సూరయ: చాలా మంది జ్ఞ్యానులు మోహపడింది శృంగారంవల్లనే
తేజోవారిమృదాం యథా వినిమయ: ఈ శృంగారంలో తేజస్సు జలము భూమి ఉన్నాయి. శృంగారమే హాస్యం కరుణ కూడా అవుతుంది. 
పరమాత్మ మీద కాకుండా మనలో శరీర మనస్సు బుధ్ధులలో కలిగేది రసంకాదు రసాభాసం. 
సత్వ రజో తమో గుణాలతో కలిగే ఈ రసం మృష - క్షణికం. అదే ఈ రసం గుణాతీతుడైన (త్రిసర్గ:)పరమాత్మ మీద కలిగితే అది నిత్యం
ఇదే పరం సత్యం. అలాంటి దాన్ని ధీమహి