Pages

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఏడవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
ఇత్యజేనానునీతేన భవేన పరితుష్యతా
అభ్యధాయి మహాబాహో ప్రహస్య శ్రూయతామితి

మహాదేవ ఉవాచ
నాఘం ప్రజేశ బాలానాం వర్ణయే నానుచిన్తయే
దేవమాయాభిభూతానాం దణ్డస్తత్ర ధృతో మయా

ప్రజాపతేర్దగ్ధశీర్ష్ణో భవత్వజముఖం శిరః
మిత్రస్య చక్షుషేక్షేత భాగం స్వం బర్హిషో భగః

పూషా తు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్
దేవాః ప్రకృతసర్వాఙ్గా యే మ ఉచ్ఛేషణం దదుః

బాహుభ్యామశ్వినోః పూష్ణో హస్తాభ్యాం కృతబాహవః
భవన్త్వధ్వర్యవశ్చాన్యే బస్తశ్మశ్రుర్భృగుర్భవేత్

నాకు పెద్దపట్టింపు లేదు ఈ విషయములో. పసిపిల్లలు చేసే తప్పులను పెద్దలు కట్టడి చేస్తారు గానీ అవి మనసులో భావించరు. నాకు వారు చేసిన పనికి కోపం లేదు. భగవంతుని మాయ ఆవరించి వారు ఆ పనులు చేస్తూ ఫలితాన్ని అనుభవిస్తారు. దక్షుని తల హోమం చేసిన మాట వాస్తవమే గానీ, ఆ యజ్ఞ్యములో చంపడానికి ఒక మేకను తీసుకు వస్తారు, ఆ మేక శిరోభాగమూ వృషణములూ తీసేసే మిగిలిన భాగాన్ని తీసి ఆ శరీరాన్ని వలిచి దాని హృదయ దేశములో ఉండే అపా అనే పల్చని పొర తీసి మంత్రములతో అభిమంత్రించి హోమం చేస్తారు. అది వాసన చూసిన వారికి పాపములు పోతాయి. ఆ మేక యొక్క తలను తీసి దక్షునికి అంటించండి. యజమానుల యొక్క పళ్ళతో (యజ్ఞ్యం చేసే యజమానులు) ఏదైనా తింటే అది పూషకు వెళ్ళిపోతుంది, అందుకే యజమానులు తాగాలి గానీ నమలకూడదు. పూష యజమాని దంతాలతో తింటారు. చేతులూ కాళ్ళూ ఊడిన వారికి అశ్వినీ దేవతల బాహువులూ పూష యొక్క హస్తములూ రక్షించాలి. ఈ అధ్వర్యువ్లు అందరూ ఎప్పటిలాగ ఉండాలని చేయించి అందరికీ స్వస్థత చేకూర్చాడు. అందరూ వారి వారి అవయములతో లేచారు. చూసి సంతోషించాడు. అందరూ పరమ శివున్ని ప్రశంసించారు.

మైత్రేయ ఉవాచ
తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీఢుష్టమోదితమ్
పరితుష్టాత్మభిస్తాత సాధు సాధ్విత్యథాబ్రువన్

తతో మీఢ్వాంసమామన్త్ర్య శునాసీరాః సహర్షిభిః
భూయస్తద్దేవయజనం సమీఢ్వద్వేధసో యయుః

యజ్ఞ్యములకు కావలసిన పనులన్నీ పూర్తిచేసి శంకరుడు చెప్పినట్లుగా ఋతిక్కులు మేక తలను తెచ్చి దక్షుని శరీరానికి ఉంచారు.

విధాయ కార్త్స్న్యేన చ తద్యదాహ భగవాన్భవః
సన్దధుః కస్య కాయేన సవనీయపశోః శిరః

సన్ధీయమానే శిరసి దక్షో రుద్రాభివీక్షితః
సద్యః సుప్త ఇవోత్తస్థౌ దదృశే చాగ్రతో మృడమ్

తలకాయ అంటించగానే శంకరుడు ఆయన వేపు కృపతో చూడగానే దక్షుడు బ్రతికాడు. నిదురించిన వాడు లేచినట్లు వెంటనే లేచి వెంటనే శంకరున్ని చూచాడు.

తదా వృషధ్వజద్వేష కలిలాత్మా ప్రజాపతిః
శివావలోకాదభవచ్ఛరద్ధ్రద ఇవామలః

శనర్కున్ని ద్వేషించ పాపముతో మురికి అంటిన దక్షుడు, శంకరుడు ఆయన్ను చూచిన చూపుతో పవిత్రుడయ్యాడు శరత్కాలములో నీటి మడుగువలె

భవస్తవాయ కృతధీర్నాశక్నోదనురాగతః
ఔత్కణ్ఠ్యాద్బాష్పకలయా సమ్పరేతాం సుతాం స్మరన్

విషయం అర్థమైంది దక్షునికి. ఆయన మీద ప్రేమతో భక్తితో నోట మాట పెగలక గొంతు బొంగురుపోయింది. తన కూతురు జ్ఞ్యాపకం వచ్చింది.

కృచ్ఛ్రాత్సంస్తభ్య చ మనః ప్రేమవిహ్వలితః సుధీః
శశంస నిర్వ్యలీకేన భావేనేశం ప్రజాపతిః

శంకరుని దృష్టితో వచ్చిన మనసుతో అతి కష్టం మీద మనసుని నిగ్రహించుకుని కల్మషం లేని స్వచ్చమైన భావనతో స్తోత్రం చేసాడు

దక్ష ఉవాచ
భూయాననుగ్రహ అహో భవతా కృతో మే
దణ్డస్త్వయా మయి భృతో యదపి ప్రలబ్ధః

స్వామీ! నా చేత అవమానింపబడ్డా మీరు నన్ను అనుగ్రహించారు. తప్పు చేసిన వారిని దండించడం అనుగ్రహమే.

న బ్రహ్మబన్ధుషు చ వాం భగవన్నవజ్ఞా
తుభ్యం హరేశ్చ కుత ఏవ ధృతవ్రతేషు

పరమాత్మ స్వరూపులనీ భక్తులనీ ఎవ్వరూ అవమానించలేరు. అలా ఒక వేళ ఎవరైనా చేసినా ఆ బాధ అవమానించినవారికే కానీ అవమానింపబడ్డవారికి కాదు.

విద్యాతపోవ్రతధరాన్ముఖతః స్మ విప్రాన్
బ్రహ్మాత్మతత్త్వమవితుం ప్రథమం త్వమస్రాక్
తద్బ్రాహ్మణాన్పరమ సర్వవిపత్సు పాసి
పాలః పశూనివ విభో ప్రగృహీతదణ్డః

నీవు ప్రపంచాన్ని కాపాడటానికీ, పరమాత్మ తత్వాన్ని వ్యాపింపచేయడానికి, వేదాలను ఆచరించే బ్రాహ్మణోత్తములను ముఖము నుండి సృష్టించావు. అలాంటి ధర్మ రక్షకులనూ ధర్మ పాలకులనూ ధర్మ వ్యాపకులనూ నీవే అన్ని ఆపదలలో ముందుండి కాపాడతావు, పశు పాలకులు పశువులని కాపాడినట్లు

యోऽసౌ మయావిదితతత్త్వదృశా సభాయాం
క్షిప్తో దురుక్తివిశిఖైర్విగణయ్య తన్మామ్
అర్వాక్పతన్తమర్హత్తమనిన్దయాపాద్
దృష్ట్యార్ద్రయా స భగవాన్స్వకృతేన తుష్యేత్

నీవే పరమాత్మవని తత్వము తెలియని నేను చెడు మాటలతో నిన్ను లెక్కించకుండా ఆక్షేపించాను. అలా నరకములో పడుతున్న వాడిని అయిన నన్ను చల్లని చూపుతో కాపాడావు.  నీకు సంతోషం కలిగించే పనులు మేము చేయగలమా? నీభక్తులను కాపాడగలిగానన్న సంతోషముతో నీవే సంతోషించాలి గానీ మేము చేసేవాటితో నిన్ను సంతోషింపలేము

మైత్రేయ ఉవాచ
క్షమాప్యైవం స మీఢ్వాంసం బ్రహ్మణా చానుమన్త్రితః
కర్మ సన్తానయామాస సోపాధ్యాయర్త్విగాదిభిః

ఇలా శంకరునికి క్షమాపణ చెప్పి  బ్రహ్మ అనుమతి తీసుకుని ఉపాధ్యాయులూ ఋత్విక్కులూ కలిసి ఆగిపోయిన యజ్ఞ్యాన్ని చేసారు

వైష్ణవం యజ్ఞసన్తత్యై త్రికపాలం ద్విజోత్తమాః
పురోడాశం నిరవపన్వీరసంసర్గశుద్ధయే

యజ్ఞ్యము యొక్క దోషం తొలగి పరిశుద్ధి చెందడానికి వైష్ణవ యజ్ఞ్యం చేసారు. భూత ప్రేత పిశాచాలతో వీరుని యొక్క సంబంధం వలన కలిగిన దోషం పోవడానికి త్రికపాలం (మూడు మొకుళ్ళలో గోధుమలు వేయించి నేయి కలిపిన దాన్ని పురోదాసం)వైష్ణవ యజ్ఞ్యాన్ని చేసారు

అధ్వర్యుణాత్తహవిషా యజమానో విశామ్పతే
ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూద్ధరిః

అధ్వర్యువు పరిశుద్ధమైన మనసుతో అర్పిస్తే స్వామి ఆవిర్భవించాడు.

తదా స్వప్రభయా తేషాం ద్యోతయన్త్యా దిశో దశ
ముష్ణంస్తేజ ఉపానీతస్తార్క్ష్యేణ స్తోత్రవాజినా

పరమాత్మ తన దివ్య తేజస్సుతో దిక్కులను ప్రకాశింపచేస్తూ అందరి కన్నులను చీకట్లు గమ్ముతూ స్తోత్రములే రెక్కలుగా గల గరుత్మంతునితో (గరుత్మంతునికి ఒక రెక్క ఋగ్వేదం ఇంకో రెక్క సామ వేదం. గరుడుడంటే వేదమే) అక్కడికి వచ్చాడు.

శ్యామో హిరణ్యరశనోऽర్కకిరీటజుష్టో
నీలాలకభ్రమరమణ్డితకుణ్డలాస్యః
శఙ్ఖాబ్జచక్రశరచాపగదాసిచర్మ
వ్యగ్రైర్హిరణ్మయభుజైరివ కర్ణికారః

పరమాత్మ నీల మేఘ శ్యాముడు, బంగారు రంగు కలవాడు, సూర్యుని కాంతిని తలదన్నే కిరీటముతో శొభించేవాడు, నల్లని ముంగురులు అనే తుమ్మెదలచే అలంకరించబడిన కుండలములతో శొభించేవాడు. హిరణ్యమైన శంఖమూ పద్మమూ శరమూ ధనసూ గదా ఖడ్గము చక్రమూ చర్మమూ ధరించిన అష్టభుజములు గలవాడు అయిన పరమాత్మ ఆవిర్భవించాడు. యజ్ఞ్యశాల పద్మమైతే, దానిలో పుప్పొడి ఉండే స్థానం యందు ఆవిర్భవించాడు

వక్షస్యధిశ్రితవధూర్వనమాల్యుదార
హాసావలోకకలయా రమయంశ్చ విశ్వమ్
పార్శ్వభ్రమద్వ్యజనచామరరాజహంసః
శ్వేతాతపత్రశశినోపరి రజ్యమానః

ఆయన రాకతో సకల చరాచర జగత్తు ఆనందములో తేలియాడుతుంది, ఎందుకంటే ఆయన నవ్వుతున్నాడు కాబట్టి. ఆయన ఎందుకు నవ్వుతున్నాడంటే అమ్మవారు వక్షస్థలములో ఉంది, దానికి ప్రాకారముగా అన్నట్లు వనమాల ఉంది. దైవ కృపనూ, ఔదార్యాన్ని చెప్పే చిరునవ్వుతో ప్రకాశించే కళ్ళతో ప్రపంచాన్ని ఆనందింపచేస్తూ, రెండు పక్కలా రెండు రాజహంసలు రెక్కలనూ ఊపుతూ ఉన్నాయి. రెక్కల చామరముతో వీస్తున్నాయి ఆ రెండు రాజ హంసలు. పైన చంద్రుడు శ్వేతాతపత్రం పట్టాడు.

తముపాగతమాలక్ష్య సర్వే సురగణాదయః
ప్రణేముః సహసోత్థాయ బ్రహ్మేన్ద్రత్ర్యక్షనాయకాః

ఇలా వేంచేసిన పరమాత్మను చూచిన దేవతలు బ్రహ్మ ఇంద్రియ యక్ష నాయకులందరూ లేచి నమస్కారం చేసారు.

తత్తేజసా హతరుచః సన్నజిహ్వాః ససాధ్వసాః
మూర్ధ్నా ధృతాఞ్జలిపుటా ఉపతస్థురధోక్షజమ్

పరమాత్మ తేజస్సుతో వారి తేజస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది. మాట్లాడటానికి మాటలు రావడం లేదు. తొట్రుబాటు పడుతున్నారు. రెండు చేతులూ శిరస్సు మీద ఉంచి జోడించి స్వామిని సమీపించారు

అప్యర్వాగ్వృత్తయో యస్య మహి త్వాత్మభువాదయః
యథామతి గృణన్తి స్మ కృతానుగ్రహవిగ్రహమ్

బ్రహ్మ రుద్రేంద్రాదులు ఎవరి అనుగ్రహముతో తరువాత పుట్టినవారో, ఎవరి అనుగ్రహముతో బుద్ధి వికసించిందో, ఆ పరమాత్మ దయతో ప్రత్యక్షమవ్వగానే అందరూ ఒక్కో స్తోత్రముతో స్తోత్రం చేసారు, వారి వారి బుద్ధికి అందినట్లు

దక్షో గృహీతార్హణసాదనోత్తమం
యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుమ్
సునన్దనన్దాద్యనుగైర్వృతం ముదా
గృణన్ప్రపేదే ప్రయతః కృతాఞ్జలిః

దక్షుడు పరమాత్మకు అర్ఘ్యమూ పార్ఘ్యమూ పూజా అర్పించి, సకల ప్రజాపతులకూ పతి అయిన స్వామిని స్తోత్రం చేస్తున్నారు. సునందుడు నదుడూ జయుడూ విజయుడూ మొదలైన పార్శ్వదులతో కూడిన స్వామిని చేతులు జోడించి వినయముతో ఇలా స్తోత్రం చేసాడు

దక్ష ఉవాచ
శుద్ధం స్వధామ్న్యుపరతాఖిలబుద్ధ్యవస్థం
చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్య మాయామ్
తిష్ఠంస్తయైవ పురుషత్వముపేత్య తస్యామ్
ఆస్తే భవానపరిశుద్ధ ఇవాత్మతన్త్రః

ప్రజాపతిని అయిన నేను సృష్టి చేస్తున్నాను. కానీ మేము నిమిత్త మాత్రులం. సృష్టి చేసేది నీవు. ఏ కల్మ్షం అంటని పరిశుద్ధుడవు నీవు. నీ దగ్గర, నీ లోకములో ఎవరి బుద్ధీ ఎవరి జ్ఞ్యానమూ ఎవరి శక్తీ పని చేయవు. సూర్యుడు గానీ చంద్రుడు గానీ అగ్ని కానీ ఎవరూ ప్రకాశించరు. నీ కంతితో వీరందరు ప్రకాశిస్తారు గానీ నిన్ను ప్రకాశింపచేసేవారెవ్వరూ లేరు. అన్ని బుద్ధులూ ప్రభావాలు శక్తులూ నీ దగ్గరకు వచ్చేసరికి తగ్గిపోతాయి. నీవు కేవలం జ్ఞ్యాన స్వఊపుడివి. ఏకం - ఏకమేవాద్వితీయం బ్రహ్మ. నీ దగ్గర తప్ప అభయం అనేది ఎక్కడా ఉండదు. నీవే అభయం.మాయను నీవే నిషేధిస్తావు. మాయను అంటకుండా ఉన్న నీవు ఆ మాయతోనే జగత్తుని సృష్టిస్తావు, ఆ మాయతో జగత్తులో జీవుడిగా జేరతావు. ఆ ప్రకృతిలో ఆ మాయలో నీవే ఉంటావు. అన్ని మురికులూ అంటినవాడివలే ఉంటావు కానీ నీకు ఏమీ అంటదు.

ఋత్విజ ఊచుః
తత్త్వం న తే వయమనఞ్జన రుద్రశాపాత్
కర్మణ్యవగ్రహధియో భగవన్విదామః
ధర్మోపలక్షణమిదం త్రివృదధ్వరాఖ్యం
జ్ఞాతం యదర్థమధిదైవమదో వ్యవస్థాః

ఈ శ్లోకం వీలైనంతగా రోజూ చదువుకోవాలి

సదస్యా ఊచుః
ఉత్పత్త్యధ్వన్యశరణ ఉరుక్లేశదుర్గేऽన్తకోగ్ర
వ్యాలాన్విష్టే విషయమృగతృష్యాత్మగేహోరుభారః
ద్వన్ద్వశ్వభ్రే ఖలమృగభయే శోకదావేऽజ్ఞసార్థః
పాదౌకస్తే శరణద కదా యాతి కామోపసృష్టః

ఈ సంసారం అనే అరణ్యం నుండి ఎప్పుడు బయటపడతాము? నీ పాదాలనే నావను ఎప్పుడు చేరతాము? మనమందరం బాటసారులం. సంసారమే బాటలో అందరూ బాటసారులం. భవాటవీ వర్ణనం అని రహూగణ భరత సంవాదములో ఉంటుంది. సంసారమనే అరణ్యం గురించి మూడు అధ్యాయాలలో ఉన్న భావాన్ని ఈ ఒక్క శ్లోకములో ఉంది.  ఈ సంసారమనే దారిలో పడ్డ మనకు రక్షగా ఎవరు లేరు. ఈ సంసారములోకి అందరూ ఒంటిగానే వస్తారు. ఇక్కడ ఏ రక్షణా లేదు (అశరణి).
ఆ దారి కూడా చాలా కష్టమైనది (ఉరుక్లేశములు). ఈ సంసారమంతా పెద్ద కష్టాలే. గర్భప్రవేశం గర్భవాసం జన్మ, వృద్ధాప్యం, వ్యాధి, మరణం. ఇదే సంసారం. అయినా అడుగేసుకుంటూ వెళదామంటే యముడు (మృత్యువు) అనే భయంకరమైన పాములు ఉన్నాయి. కొండల మీద నుండి పారే నీరు పాము కాటుకు మందు. అలాంటి నీరైనా దొరుకుతుందా సంసారములో. అక్కడ ఉండేవన్నీ ఎంద్డమావులే (విషయ మృగ తృష్ణ).శబ్దాది విషయములనే ఎండమావుల యందు ఉండే తృష్ణ.
శరీరం ఒక బరువు, ఇళ్ళు ఇంకో బరువు. పెద్దల దగ్గరకు వెళ్ళాలన్నా అడ్డు వచ్చేవి ఈ రెండే.అయిన వెళదామనుకుంటే ఉన్నవన్నీ గోతులే. ద్వంద్వాలనే గోతులు - శీతోష్ణ, సుఖ దుఖ, లాభ నష్ట, మాన అవమాన, క్షుత్ పిపాస. ఎలాంటి వాడైనా వీటిని తప్పించుకుని బయటకి పోలేడు.  దుష్టులనే కౄర మృగాలు. దుఃఖమనే దావాగ్ని వస్తుంది. మూర్ఖుల సాయం దొరుకుతుంది. ఇలా కోరికతో చుట్టుముట్టినవాడు, రక్షణ ఇచ్చేవాడివి అయిన నీ పాదాలకు ఎప్పుడు చేరతాడు. నీ అనుగ్రహం ఉంటేనే జేరతాడు

రుద్ర ఉవాచ
తవ వరద వరాఙ్ఘ్రావాశిషేహాఖిలార్థే
హ్యపి మునిభిరసక్తైరాదరేణార్హణీయే
యది రచితధియం మావిద్యలోకోऽపవిద్ధం
జపతి న గణయే తత్త్వత్పరానుగ్రహేణ

వరదా! ఉత్తమమైన పాదములయందు ఆశించే కోరికలను ప్రధానం చేసే నీ పాద పద్మములను కోరికలు లేనివారైన మునులు కూడా ఆశ్రయిస్తున్నారు . ఏమి అక్కరలేని వారి చేత కూడా నీవు పూజించబడతావు. "ఏ కోరికలు కలగకూడదని సేవిస్తారు"
అలాంటి నీ పాద పద్మములయందు మనసు లగ్నం చేసిన వాడిని అవిద్య ఆవరించదు, అజ్ఞ్యానం కమ్మదు. సాంసారిక విషయాలలో మునిగి ఉన్నవారు చేసిన ధూషణలు నేను లెక్క చేయను. నేను నిన్నే, నీ దయతో ధ్యానం చేస్తూ, జపం చేస్తూ ఉన్నాను. నిరంతరం నీ నామాన్నే జపిస్తూ ఉంటాను. 

భృగురువాచ
యన్మాయయా గహనయాపహృతాత్మబోధా
బ్రహ్మాదయస్తనుభృతస్తమసి స్వపన్తః
నాత్మన్శ్రితం తవ విదన్త్యధునాపి తత్త్వం
సోऽయం ప్రసీదతు భవాన్ప్రణతాత్మబన్ధుః

అతి గాఢమైన నీ మాయ చేత ఆత్మ జ్ఞ్యానం అపహరించబడి బ్రహ్మాదులందరూ కూడా నీ మాయన్ అనే చీకటిలో నిద్రపోతుంటారు. ఇప్పటికీ నీ తత్వాన్ని వారు కూడా తెలుసుకోలేకున్నారు. నీ తతవం నీవు అనుగ్రహిస్తేనే తెలుస్తుంది. నీవు ప్రణతాత్మబంధువ్వి. ఆశ్రయించినవారికి ఆత్మ బంధువువి.

బ్రహ్మోవాచ
నైతత్స్వరూపం భవతోऽసౌ పదార్థ భేదగ్రహైః పురుషో యావదీక్షేత్
జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయో మాయామయాద్వ్యతిరిక్తో మతస్త్వమ్

ఇపుడు సాక్షాత్కరించిన నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎంతమంది చూడగలరు? మేమంతా జ్ఞ్యానమున్నవారం, అర్థమున్నవారం, గుణవంతులం, మమ్మల్ని అందరూ ఆశ్రయిస్తారు. కానీ నీవు ఈ నాలిగింటికీ అవతల ఉన్నావు. నీవు జ్ఞ్యానానికీ, ధనానికీ, గుణాలకీ, "నేను అందరికీ ఆశ్రయిస్తున్నాను" అనే అభిమానానికీ అవతల ఉంటాడు. నిన్నాశ్రయించే గుణము అహంకారం ఉన్నంతవరకూ రాదు. అది తొలగే వరకూ నీవు మాకు కనపడవు. దేహాత్మాభిమాన పోయిన తరువాతే పరమాత్మ కనపడతాడు. అది కూడా పరమాత్మే పోగొట్టాలి.

ఇన్ద్ర ఉవాచ
ఇదమప్యచ్యుత విశ్వభావనం వపురానన్దకరం మనోదృశామ్
సురవిద్విట్క్షపణైరుదాయుధైర్భుజదణ్డైరుపపన్నమష్టభిః

నీవు అచ్యుతుడవు. నిన్ను ఆశ్రయించినవాడు జారిపడడు. సకల ప్రపంచాన్ని సృష్టించే నీ ఆకారం మనసుకూ కనులకూ రెంటికీ ఆనందాన్ని కలిగించేది. దేవతలను రక్షించడానికీ, రాక్షసులను సంహరించడానికి తగిన ఆయుధాలు ధరించిన అస్టభుజములు కలిగినందుకు మీ రూపం మాకు ఆనందాన్ని కలగచేస్తోంది.

పత్న్య ఊచుః
యజ్ఞోऽయం తవ యజనాయ కేన సృష్టో విధ్వస్తః పశుపతినాద్య దక్షకోపాత్
తం నస్త్వం శవశయనాభశాన్తమేధం యజ్ఞాత్మన్నలినరుచా దృశా పునీహి

నిన్ను ఆరాధించడానికే దక్షుడు ఈ యజ్ఞ్యాన్ని తలపెట్టాడు. ఆయన మీద క్రుద్ధుడైన పరమేశ్వరుడు ధ్వంసం చేసాడు. ప్రస్తుతం యజ్ఞ్యం శ్మశానములా ఉంది. హవిస్సులూ హోమాలూ మొదలైన మేధలు (పూజలు) ఆగిపోయాయి. పవిత్రమైన కాంతిగల నీ చూపుతో ఈ యజ్ఞ్యాన్ని ఉద్ధరించాలి.

ఋషయ ఊచుః
అనన్వితం తే భగవన్విచేష్టితం యదాత్మనా చరసి హి కర్మ నాజ్యసే
విభూతయే యత ఉపసేదురీశ్వరీం న మన్యతే స్వయమనువర్తతీం భవాన్

యమమూ నియమమూ ఇలా వేదాలాఉ స్మృతులూ బోధించిన అన్ని మార్గాలు అవలంబించిన మాకు కూడా సంసారమునుండి బయటపడటం చేతగావట్లేదు. వాటిని వదలలేకపోతున్నాము. నీవు ఇలాంటి కర్మబద్ధులైమైన వారందరిలో ఉంటావు. కరమలోనూ కర్తలోనూనీవే ఉన్నావు.అయినా నీకు రెండూ అంటవు.
అన్నిలోకాలవారు సంపద చేకూరాలని లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు. అలాంటి లక్ష్మి నీ వెంటపడుతూ ఉంటే నీవు ఆమెను లెక్కించటమే లేదు. అంటే సంపదలు కోరని వారికే సంసారాన్ని అంటదు.

సిద్ధా ఊచుః
అయం త్వత్కథామృష్టపీయూషనద్యాం మనోవారణః క్లేశదావాగ్నిదగ్ధః
తృషార్తోऽవగాఢో న సస్మార దావం న నిష్క్రామతి బ్రహ్మసమ్పన్నవన్నః

నీ క్థామృత నదిలో మా మనసనే ఏనుగు ఈదులాడుతోంది ఎందుకంటే కష్టమనే దావాగ్ని వలన మంటపుట్టి బాగా దప్పి గొని ఉంది. ఒక సారి దానిక్లో మునిగాక దావాగ్ని ఎక్కడ ఉందో గుర్తే లేడు. మళ్ళీ బయటకు వస్తే ఎక్కాడ ఆ దావాగని ముట్టుకుంటుందో అని మా మనసు అక్కడినుచి బయటకు రావట్లేదు. ఒకసరి పరమాత్మ దగ్గరకు వెళ్ళినవాడు బ్రహ్మ్హభావాన్ని పొందినట్లుగా బయటకు రావడం లేదు

యజమాన్యువాచ
స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః శ్రీనివాస శ్రియా కాన్తయా త్రాహి నః
త్వామృతేऽధీశ నాఙ్గైర్మఖః శోభతే శీర్షహీనః కబన్ధో యథా పురుషః

నీకు స్వాగాతం. మహానుభావా ప్రసన్నుడవు కా. నెకు నమస్కారం.నీవు శ్రీనివాసుడవు. అమ్మవారితో కలిసి మమ్ములను కాపాడు. నీవు లేకుణ్డా ఎన్ని అంగములతో చేసినా యజ్ఞ్య్హం శోభించదు తల లేని మొందేములాగ.

లోకపాలా ఊచుః
దృష్టః కిం నో దృగ్భిరసద్గ్రహైస్త్వం ప్రత్యగ్ద్రష్టా దృశ్యతే యేన విశ్వమ్
మాయా హ్యేషా భవదీయా హి భూమన్యస్త్వం షష్ఠః పఞ్చభిర్భాసి భూతైః

ఈనాటికి నీవు మాకళ్ళకు కనపడ్డావు. మా కళ్ళు చెడును మాత్రమే చూస్తాయి. వాటికి కనపడ్డావు. నిన్ను నీవూ చూస్తావు, మమ్మల్నీ చూస్తావు, ప్రపంచాన్నీ చూస్తావు/చూపుతావు. దృశ్యమూ ద్రష్టా ఒకఏ అని నీవు చూస్తావు. మేము అది రెండుగా చూస్తాము. ఇదంతా నీ మాయనే.నీవు ఐదుభూతాలకు కనపడే ఆరవ వాడిక్వి. యజ్ఞ్యములతో నీవు స్తోత్ర్మ్ చేయబడతావు. 

యోగేశ్వరా ఊచుః
ప్రేయాన్న తేऽన్యోऽస్త్యముతస్త్వయి ప్రభో విశ్వాత్మనీక్షేన్న పృథగ్య ఆత్మనః
అథాపి భక్త్యేశ తయోపధావతామనన్యవృత్త్యానుగృహాణ వత్సల
జగదుద్భవస్థితిలయేషు దైవతో బహుభిద్యమానగుణయాత్మమాయయా
రచితాత్మభేదమతయే స్వసంస్థయా వినివర్తితభ్రమగుణాత్మనే నమః

నీకు శత్రువూ లేడూ ప్రీతి  పాత్రుడూలేడుల్. సకల జగత్తుకూ ఆత్మగా ఉన్న నీ నుడి జగత్తుని విడిగా చూసేవాడు నిన్ను దర్శించలేడు.  ప్రపంచమూ పరమాత్మా వేరని భావించేవారికి నీవు సాక్షాత్కరించవు. మాకు ప్రపంచం వేరు నీవు వేరు అన్న అజ్ఞ్యానమున్నా నీవు ప్రసాదించిన రవ్వంత భక్తి ఉంది. అనన్య భక్తితో నిన్ను సేవించిన వారిని అనుగ్రహిస్తావు.నీవు భక్త వత్సలుడివి . పలురకములుగా మారే నీ మాయతో రాజసముతో సృష్టి, తామసముతో సంహారం, సాత్వికముతో రక్షణ చేస్తావు. దీనితోనే నీవే బ్రహ్మగా శివునిగా విష్ణువుగా భాసిస్తుంటే మీరు వేరనే భావం మాకు కలుగుతోంద్. అది కలిగించేవాడివీ తొలగించేవాడివీ నీవే. అలాంటి నీకు నమస్కారం.



బ్రహ్మోవాచ
నమస్తే శ్రితసత్త్వాయ ధర్మాదీనాం చ సూతయే
నిర్గుణాయ చ యత్కాష్ఠాం నాహం వేదాపరేऽపి చ

ఇక్కడ బ్రహ్మ అంటే వేదాలౌ. శ్రితసత్త్వాయ  సత్వ గుణాన్ని ఆశ్రయించిన, ధర్మాది అష్ట గుణాలకూ కారణమైన, హేయగుణములులేని వాడవైన నీవు ఎక్కడ ఉన్నవో నాకు కూడా తెలీదు, ఇతరులకూ తెలియదు

అగ్నిరువాచ
యత్తేజసాహం సుసమిద్ధతేజా హవ్యం వహే స్వధ్వర ఆజ్యసిక్తమ్
తం యజ్ఞియం పఞ్చవిధం చ పఞ్చభిః స్విష్టం యజుర్భిః ప్రణతోऽస్మి యజ్ఞమ్

నేను ఎంతో మంది చేసే యజ్ఞ్యములలో ఆజ్యముని మోస్తున్నాను. అది నీ తేజస్సు వల్లనే. దాని వలననే నా తేజస్సు పెరిగింది.
ఐదు రకములైన యజుర్వేద మంత్రాలతో ఆరాధించబడుతున్నావు. దేవ పితృ ఋషి అతిథి భూత యజ్ఞ్యాలతో  ఆరాధించబడేవాడివి నీవే. యజ్ఞ్యములో నాకు అగ్నిత్వాన్ని కల్పించినదీ నీవే. ఐదు రకముల సూక్తములతో ఆరాధించబడే నిన్ను నేను నమస్కరిన్స్తున్నాను.  ఏ ఏ దేవత ఏ పని చేసినా అది పరమాత్మ చేయించినదే అని ఈ స్తోత్రానికి అర్థం


దేవా ఊచుః
పురా కల్పాపాయే స్వకృతముదరీకృత్య వికృతం
త్వమేవాద్యస్తస్మిన్సలిల ఉరగేన్ద్రాధిశయనే
పుమాన్శేషే సిద్ధైర్హృది విమృశితాధ్యాత్మపదవిః
స ఏవాద్యాక్ష్ణోర్యః పథి చరసి భృత్యానవసి నః

ప్రళయములో సృష్టిని మొత్తం కడుపులో పెట్టుకుని మొదటివాడివైన నీవు నీటిలో ఆదిశెషుని మీద పురుషుడిగా నిదురించుచున్నావు. ఆ స్థితిలో కూడా నీ హృదయములో ఉన్న సిద్ధులందరూ నీ ఆధ్యాత్మిక స్థితిని స్తోత్రం చేస్తూ ఉంటారు. ప్రళయములో అన్ని నీలోదాచుకుని మొదటి పురుషుడిగా భాసించేనీవు ఆ స్తోత్రాన్ని వింటూ ఉండే నీవు మా కళ్ళకు కనపడ్డావంటే అది నీఎ సంకల్పమే , మా గొపదనం కాదు. సేవకులమైన మమ్ము కాపాడుతున్నావు

గన్ధర్వా ఊచుః
అంశాంశాస్తే దేవ మరీచ్యాదయ ఏతే బ్రహ్మేన్ద్రాద్యా దేవగణా రుద్రపురోగాః
క్రీడాభాణ్డం విశ్వమిదం యస్య విభూమన్తస్మై నిత్యం నాథ నమస్తే కరవామ

నీ అంశాంశాదులైన వారే మరీచులు, బ్రహ్మాదులూ. నీవు నృత్యం చేస్తావు. ఘట నృత్యం. ప్రపంచనం అనే కుండ మీద నీవు నృత్యం చేస్తున్నావు. అలాంటి నీకు నమస్కారం.

విద్యాధరా ఊచుః
త్వన్మాయయార్థమభిపద్య కలేవరేऽస్మిన్
కృత్వా మమాహమితి దుర్మతిరుత్పథైః స్వైః
క్షిప్తోऽప్యసద్విషయలాలస ఆత్మమోహం
యుష్మత్కథామృతనిషేవక ఉద్వ్యుదస్యేత్

నీ మాయతో ఈ శరీరములో ఒక ప్రయోజనాన్ని ఆశించి "నాదీ నేనూ"అనే అహంకారం కలవారమైన, మేముగా ఏర్పరచుకున్న అడ్డదారిలో పడి చెడు విషయాల మీద ప్రీతితో శరీరమే ఆత్మ అనే మోహములో ఉన్నాము. ఇలాంటి ఆత్మ మోహం తొలగిపోవాలంటే, మూర్చ పోవాలంటే అమృతపు చుక్కలు నోట్లోవేసుకున్నట్లు, నీ కథామృతాన్ని సేవించడమే మార్గం

బ్రాహ్మణా ఊచుః
త్వం క్రతుస్త్వం హవిస్త్వం హుతాశః స్వయం త్వం హి మన్త్రః సమిద్దర్భపాత్రాణి చ
త్వం సదస్యర్త్విజో దమ్పతీ దేవతా అగ్నిహోత్రం స్వధా సోమ ఆజ్యం పశుః

యజ్ఞ్యం హవిస్సు మంత్రం అగ్నిహోత్రుడు పాత్రలూ ఋత్విక్కూ అగ్నిహోత్రం స్వధా సోమరసం పశువూ అన్నీ నీవే. ఎందుకంటే ఇవన్నీ వచ్చినవి భూమిలోంచి. ఆ భూమిని నీవే దంష్ట్రలతో ఏనుగు పద్మాన్ని తీసినట్లుగా అందరూ నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటే పైకి ఉద్ధరించావు. అపుడు నీవు యజ్ఞ్యమూర్తివై ఉన్నావు.

త్వం పురా గాం రసాయా మహాసూకరో దంష్ట్రయా పద్మినీం వారణేన్ద్రో యథా
స్తూయమానో నదల్లీలయా యోగిభిర్వ్యుజ్జహర్థ త్రయీగాత్ర యజ్ఞక్రతుః

స ప్రసీద త్వమస్మాకమాకాఙ్క్షతాం దర్శనం తే పరిభ్రష్టసత్కర్మణామ్
కీర్త్యమానే నృభిర్నామ్ని యజ్ఞేశ తే యజ్ఞవిఘ్నాః క్షయం యాన్తి తస్మై నమః

నీవు ప్రసన్నుడవు కావలసింది.  మంచి అన్న ప్రతీదీ వదిపిపెట్టిన వాళ్ళం. నీ దివ్య నామాన్ని కెర్తన చేస్తే యజ్ఞ్యమ్య్లో వచ్చిన అన్ని విఘ్నాలూ తొలగిపోతాయి.

మైత్రేయ ఉవాచ
ఇతి దక్షః కవిర్యజ్ఞం భద్ర రుద్రాభిమర్శితమ్
కీర్త్యమానే హృషీకేశే సన్నిన్యే యజ్ఞభావనే

రుద్రుని చేత ధ్వంసం చేయబడిన యజ్ఞ్యాన్ని దక్షుడు పరమాత్మ దగ్గర ఉండగా, పరమాత్మను అందరూ స్తోత్రం చేస్తూ ఉంటే యజ్ఞ్య్నాన్ని పూర్తిగావించారు.

భగవాన్స్వేన భాగేన సర్వాత్మా సర్వభాగభుక్
దక్షం బభాష ఆభాష్య ప్రీయమాణ ఇవానఘ

అందరిభాగాలు తనవే అయిన పరమాత్మ యజ్ఞ్యములో తన భాగము తాను తీసుకున్నాడు. ప్రీతి చెందిన వాడిలా దక్షునితో మాట్లాడాడు.

శ్రీభగవానువాచ
అహం బ్రహ్మా చ శర్వశ్చ జగతః కారణం పరమ్
ఆత్మేశ్వర ఉపద్రష్టా స్వయన్దృగవిశేషణః

బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మేము ఈ జగత్తుకు కారణం. మేమే ఆత్మ, మేమే ఈశ్వరులం , చొసేవాళ్ళమూ మేమే. నాకెలాంటి గుణాలూ లేవు.

ఆత్మమాయాం సమావిశ్య సోऽహం గుణమయీం ద్విజ
సృజన్రక్షన్హరన్విశ్వం దధ్రే సంజ్ఞాం క్రియోచితామ్

సంసారములో ఉండీ కూడా ఆ దోషాలు అంటని వాడిని నేను. నేనే నా మాయను ఆశ్రయించి ఆయా గుణాలని తీసుకుంటాను . ఆయా గుణాలు తీసుకున్నప్పుడు ఏ గుణం తీసుకుంటే ఆ ఆకారం ధరించి ఆ పని చేస్తాను. ఆయా పనికి తగిన పేరును నేను వహిస్తాను. నేనే బ్రహ్మనూ రుద్రున్నీ విష్ణువునీ

తస్మిన్బ్రహ్మణ్యద్వితీయే కేవలే పరమాత్మని
బ్రహ్మరుద్రౌ చ భూతాని భేదేనాజ్ఞోऽనుపశ్యతి

ఇలా ఒక్కడినే అయిన నా యందు బ్రహ్మ రుద్రుడూ జీవుడూ లోకములూ పరమాత్మా వేరు అని అజ్ఞ్యానులు చూస్తారు

యథా పుమాన్న స్వాఙ్గేషు శిరఃపాణ్యాదిషు క్వచిత్
పారక్యబుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః

మనిషి, నేను వేరు నా తల వేరు, నా కాళ్ళు వేరు అని అనుకోరో ప్రపంచం వేరూ పరమాత్మ వేరని నావాడెవడూ అనుకోడు.

త్రయాణామేకభావానాం యో న పశ్యతి వై భిదామ్
సర్వభూతాత్మనాం బ్రహ్మన్స శాన్తిమధిగచ్ఛతి

గుణములని బట్టి ఉన్న పేరును బట్టి ఎవరైతే భేధాలను చూడరో వారు శాంతిని పొందుతారు. శాంతిని  పొందాలంటే వారంతా నా వారు అని తెలుసుకోవాలి. అంతా నేనే అని తెలుసుకున్నవాడు మాత్రమే శాంతిని పొందుతాడు

మైత్రేయ ఉవాచ
ఏవం భగవతాదిష్టః ప్రజాపతిపతిర్హరిమ్
అర్చిత్వా క్రతునా స్వేన దేవానుభయతోऽయజత్

ఇలా ప్రజాపతి పతిని ఆజ్ఞ్యాపిస్తే స్వామిని ఆరాధించి , అక్కడి దేవతలనూ, ఇక్కడి దేవతలనూ (భూ దేవతలు - బ్రాహ్మణులు). శంకరునికీ ఆయన భాగాన్ని ఇచ్చాడు. ఇతర దేవతలకు కూడా ఆయా భాగాలు ఇచ్చాడు

రుద్రం చ స్వేన భాగేన హ్యుపాధావత్సమాహితః
కర్మణోదవసానేన సోమపానితరానపి
ఉదవస్య సహర్త్విగ్భిః సస్నావవభృథం తతః

ఋత్విక్కులూ ఇతర బ్రాహ్మణులూ పరమాత్మ అనుగ్రహముతో అవభృత స్నానం చేసారు.

తస్మా అప్యనుభావేన స్వేనైవావాప్తరాధసే
ధర్మ ఏవ మతిం దత్త్వా త్రిదశాస్తే దివం యయుః

దేవతలు కూడా ధర్మం యందు  బుద్ధి ఉంచి తమ తమ లోకాలకు వెళ్ళారు

ఏవం దాక్షాయణీ హిత్వా సతీ పూర్వకలేవరమ్
జజ్ఞే హిమవతః క్షేత్రే మేనాయామితి శుశ్రుమ

దక్షుని పుత్రిక అయిన సతీ దేవి శరీరాన్ని విడిచిపెట్టి హిమవంతుని భార్య అయిన మేనకు పుట్టింది అని వింటున్నాము. మరో జన్మలో కూడా ఆమె శంకరున్నే వరించింది.

తమేవ దయితం భూయ ఆవృఙ్క్తే పతిమమ్బికా
అనన్యభావైకగతిం శక్తిః సుప్తేవ పూరుషమ్

ఏతద్భగవతః శమ్భోః కర్మ దక్షాధ్వరద్రుహః
శ్రుతం భాగవతాచ్ఛిష్యాదుద్ధవాన్మే బృహస్పతేః

ఇది దక్ష యజ్ఞ్య్నాన్ని ధ్వంసం చేసిన కథా. బృహస్పతి శిష్యుడైన ఉద్ధవుడి ద్వారా ఈ కథను విన్నాను.

ఇదం పవిత్రం పరమీశచేష్టితం యశస్యమాయుష్యమఘౌఘమర్షణమ్
యో నిత్యదాకర్ణ్య నరోऽనుకీర్తయేద్ధునోత్యఘం కౌరవ భక్తిభావతః

ఈ దక్ష యజ్ఞ్ గాధ పరమాత్మ చేష్టితం. కీర్తినీ ఆయువునీ ఇస్తుంది అన్నిపాపాలను పోగొడుతుంది. ఎవరు దీన్ని నిత్యమూ వింటారో చెబుతారో భక్తిభావముతో సంసారాన్ని విడిచిపెడతాడు
పాప రాశిని మర్దించేది ఈ చరితం. దీన్ని ఎవరు రోజు వింటారో చెబుతారో వారికి భక్తి కలిగి వారి పాపం పోతుంది. దక్ష చరిత్ర మనకు పరమాత్మ యందు భక్తిని కలిగిస్తుంది. పరమాత్మ ఏర్పరచిన వ్యవస్థను ఎవరు భంగపరచినా ఫలితం అనుభవించక తప్పదు. ఒక అంశతో సృష్టీ, ఒక అంశతో సంహారం, ఇంకో అంశతో స్థితీ చేస్తున్నాడు. వీరిలో ఏ ఒక్కరిని అవమానించినా ఆ అవమానం స్వామికే.