Pages

Monday, 24 March 2014

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదిహేడవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
యతశ్చాన్తర్హితోऽనన్తస్తస్యై కృత్వా దిశే నమః
విద్యాధరశ్చిత్రకేతుశ్చచార గగనే చరః

స లక్షం వర్షలక్షాణామవ్యాహతబలేన్ద్రియః
స్తూయమానో మహాయోగీ మునిభిః సిద్ధచారణైః

కులాచలేన్ద్రద్రోణీషు నానాసఙ్కల్పసిద్ధిషు
రేమే విద్యాధరస్త్రీభిర్గాపయన్హరిమీశ్వరమ్

విద్యాధర పతి అయిన చిత్రకేతువు పరమాత్మ వెళ్ళిన దిక్కుకు నమస్కారం చేసి ఒక లక్ష సంవత్సరాలు తన శక్తి తొలగిపోకుండా సిద్ధ చారణులచే స్తోత్రం చేయబడుతూ పర్వత ప్రాంతములలో విద్యాధర స్త్రీలతో కలిసి పరమాత్మను గానం చేస్తూ పరమాత్మను గానం చేయిస్తూ కాలం గడిపాడు.

ఏకదా స విమానేన విష్ణుదత్తేన భాస్వతా
గిరిశం దదృశే గచ్ఛన్పరీతం సిద్ధచారణైః

ఆదిశేషువిచ్చిన కామగమనమైన విమానములో సంచరిస్తూ ఒక సారి కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ సిద్ధులూ చారణులూ ఉన్నారు

ఆలిఙ్గ్యాఙ్కీకృతాం దేవీం బాహునా మునిసంసది
ఉవాచ దేవ్యాః శృణ్వన్త్యా జహాసోచ్చైస్తదన్తికే

తన ముందు కూర్చున్న సనకాదులకు తత్వోపదేశం చేస్తున్నాడు. ఈయన కూడా అది విన్నాడు. శంకరుడు పార్వతీ దేవిని ఆలింగనం చేసుకుని తత్వోపదేశం చేస్తుంటే

చిత్రకేతురువాచ
ఏష లోకగురుః సాక్షాద్ధర్మం వక్తా శరీరిణామ్
ఆస్తే ముఖ్యః సభాయాం వై మిథునీభూయ భార్యయా

జటాధరస్తీవ్రతపా బ్రహ్మవాదిసభాపతిః
అఙ్కీకృత్య స్త్రియం చాస్తే గతహ్రీః ప్రాకృతో యథా

ప్రాయశః ప్రాకృతాశ్చాపి స్త్రియం రహసి బిభ్రతి
అయం మహావ్రతధరో బిభర్తి సదసి స్త్రియమ్

శ్రీశుక ఉవాచ
భగవానపి తచ్ఛ్రుత్వా ప్రహస్యాగాధధీర్నృప
తూష్ణీం బభూవ సదసి సభ్యాశ్చ తదనువ్రతాః

ఇత్యతద్వీర్యవిదుషి బ్రువాణే బహ్వశోభనమ్
రుషాహ దేవీ ధృష్టాయ నిర్జితాత్మాభిమానినే

శ్రీపార్వత్యువాచ
అయం కిమధునా లోకే శాస్తా దణ్డధరః ప్రభుః
అస్మద్విధానాం దుష్టానాం నిర్లజ్జానాం చ విప్రకృత్

న వేద ధర్మం కిల పద్మయోనిర్న బ్రహ్మపుత్రా భృగునారదాద్యాః
న వై కుమారః కపిలో మనుశ్చ యే నో నిషేధన్త్యతివర్తినం హరమ్

ఏషామనుధ్యేయపదాబ్జయుగ్మం జగద్గురుం మఙ్గలమఙ్గలం స్వయమ్
యః క్షత్రబన్ధుః పరిభూయ సూరీన్ప్రశాస్తి ధృష్టస్తదయం హి దణ్డ్యః

నాయమర్హతి వైకుణ్ఠ పాదమూలోపసర్పణమ్
సమ్భావితమతిః స్తబ్ధః సాధుభిః పర్యుపాసితమ్

అతః పాపీయసీం యోనిమాసురీం యాహి దుర్మతే
యథేహ భూయో మహతాం న కర్తా పుత్ర కిల్బిషమ్

శ్రీశుక ఉవాచ
ఏవం శప్తశ్చిత్రకేతుర్విమానాదవరుహ్య సః
ప్రసాదయామాస సతీం మూర్ధ్నా నమ్రేణ భారత

చిత్రకేతురువాచ
ప్రతిగృహ్ణామి తే శాపమాత్మనోऽఞ్జలినామ్బికే
దేవైర్మర్త్యాయ యత్ప్రోక్తం పూర్వదిష్టం హి తస్య తత్

సంసారచక్ర ఏతస్మిఞ్జన్తురజ్ఞానమోహితః
భ్రామ్యన్సుఖం చ దుఃఖం చ భుఙ్క్తే సర్వత్ర సర్వదా

నైవాత్మా న పరశ్చాపి కర్తా స్యాత్సుఖదుఃఖయోః
కర్తారం మన్యతేऽత్రాజ్ఞ ఆత్మానం పరమేవ చ

గుణప్రవాహ ఏతస్మిన్కః శాపః కో న్వనుగ్రహః
కః స్వర్గో నరకః కో వా కిం సుఖం దుఃఖమేవ వా

ఏకః సృజతి భూతాని భగవానాత్మమాయయా
ఏషాం బన్ధం చ మోక్షం చ సుఖం దుఃఖం చ నిష్కలః

న తస్య కశ్చిద్దయితః ప్రతీపో న జ్ఞాతిబన్ధుర్న పరో న చ స్వః
సమస్య సర్వత్ర నిరఞ్జనస్య సుఖే న రాగః కుత ఏవ రోషః

తథాపి తచ్ఛక్తివిసర్గ ఏషాం సుఖాయ దుఃఖాయ హితాహితాయ
బన్ధాయ మోక్షాయ చ మృత్యుజన్మనోః శరీరిణాం సంసృతయేऽవకల్పతే

అథ ప్రసాదయే న త్వాం శాపమోక్షాయ భామిని
యన్మన్యసే హ్యసాధూక్తం మమ తత్క్షమ్యతాం సతి
ఇలా అన్నాడు. శంకరుడు లోకగురువు. జీవులకు తత్వం బోధిస్తున్నాడు. ఇలాంటి శంకరుడు కూడా భరయను కౌగిలించుకుని కూర్చి మాకు తత్వం చెబుతున్నాడు. జఠాధరుడైన వాడు ప్రాకృతమైన పామరుడిలా ఎలా ఉన్నాడు. పామరుడు కూడా రహస్యముగా ఏకాంతముగా భార్యతో ఉంటాడు గానీ సభలో ఉంటాడా? మరి శంకరుడు ఎలా ఉన్నాడు ఇలా? శంకరుడు అది విని ఒక చిరునవ్వి నవ్వి మౌనముగా ఉన్నాడు. ఆయన చెప్పిన దాన్ని వినే ఋషులు కూడా మౌనముగా ఊరుకున్నారు గానీ భర్తను అధిక్షేపించగానే పార్వతీ అమ్మవారు ఊరుకోక "లోకానికి ధర్మం చెప్పే మహానుభావుడు, సిగులేని మాలాటి వారికి ధర్మం చేప్పేవాడు వచ్చాడు. బ్రహ్మకూ బ్రహ్మ పుత్రులకూ సనకాదులకూ కుమార్స్వామికీ మొదలైనవారికి ఈ ధర్మం తెలియదు. ఈయనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన వీరందరి చేత ధ్యానించబడే మహిమ గల శ్రీమన్నారాయణుని పాదములను ధ్యాఇంచే వీడు జ్ఞ్యానులని పరిహైసించి దుష్టుడై కొత్త బాష్యం చెబుతున్నాడు. ఇటువంటి వాడు వైకుంఠం వెళ్ళడానికి అర్హుడు కాడు. వైకుంఠములో అందరు సాధువులే ఉంటారు. నీవు రాక్షస యోనిలో చేరి రాక్షసునిగా పుట్టు. మళ్ళీ ఇలాంటి మహానుభావులకు నీవు అవమానం చేయకూడదు. పుత్రా! నీకు గుణపాఠం చెప్పడానికే ఇలా చేస్తున్నాను. "
ఇలా శపిస్తే ఆ శాపాన్ని పొందిన చిత్రకేతువు తలవంచి ఆమెను ప్రార్థించాడు. "అమ్మా నీవు ఇచ్చిన శాపాన్ని శిరస్సు వంచి స్వీకరిస్తున్నాను. మానవులు పొందవలసినది వారు పొందే తీరు తారు వారి కర్మ ఫలితముగా. నన్ను శపించావంటే అది నా పూర్వ జన్మ కర్మ ఫలమే. జీవుడు సంసారములో సంచరిస్తూ సుఖాన్నీ దుఃఖాన్ని జ్యానాన్నీ అజ్ఞ్యానాన్ని అనుభవిస్తాడు కర్మానుసారముగా. మానవుడికి జీవుడికీ కలిగే సుఖ దుఃఖములకు జీవుడూ కారణం కాదు. ఇతరులూ కారణం కాదు. తెలియని వారే నేను తప్పు చేసాను, వాడు తప్పు చేసాడు అంటారు. పరమాత్మ ఒక్కడే తన మాయతో సకల జగత్తులనీ సృష్టిస్తాడు. ఆ పరమాత్మే సుఖాన్ని దుఃఖాన్నీ బంధాన్నీ మోక్షాన్నీ ఇస్తాడు. పరమాత్మకి ఎలాంటి రాగద్వేషాలు ఉండవు. సంసారమనే చక్రముతో సంబంధం ఉండదు. ఆయనకు తనవాడూ పరాయి వాడూ మిత్రుడు అంటూ ఎవరూ ఉండరు. ఆయనకు సుఖమూ దుఃఖమూ అంటూ ఉండదు. సుఖం యందు ప్రీతీ దుఃఖం యందు కోపమూ లేదు. ఆయనకేమీ లేకున్నా ఆయన తన సంకల్పముతో మన కర్మానుగుణముగా సుఖదుఃఖాలను ప్రసాదిస్తూ ఉంటాడు. పుట్టుకా సంసారం బంధమూ ఇస్తూ ఉంటాడు. నీ శాపానికి భయపడి నేను ఇలా అనట్లేదు. శాపాన్ని తీసేయమని నేను అడగను. ఒక వేళ నేను మాట్లాడిన దాని వలన నీ మనసు కష్ట్పడితే, నేను తప్పుగా మాట్లాడితే క్షమించు. కానీ ఆ శాపం తొలగించమని నేను అడగను "

శ్రీశుక ఉవాచ
ఇతి ప్రసాద్య గిరిశౌ చిత్రకేతురరిన్దమ
జగామ స్వవిమానేన పశ్యతోః స్మయతోస్తయోః

ఇలా పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకుని వారందరూ చూస్తుండగానే విమానం ఎక్కి వెళ్ళిపోయాడు.

తతస్తు భగవాన్రుద్రో రుద్రాణీమిదమబ్రవీత్
దేవర్షిదైత్యసిద్ధానాం పార్షదానాం చ శృణ్వతామ్

అప్పుడు పార్వతీ దేవీ ఋషులూ దేవతలూ జ్ఞ్యానులూ అందరూ వింటూ ఉండగా శంకరుడు ఇలా చెప్పాడు

శ్రీరుద్ర ఉవాచ
దృష్టవత్యసి సుశ్రోణి హరేరద్భుతకర్మణః
మాహాత్మ్యం భృత్యభృత్యానాం నిఃస్పృహాణాం మహాత్మనామ్

శ్రీమన్నారాయణుని భక్తుల ప్రభావం అర్థమయ్యిందా. పరమాత్మ భక్తులూ, పరమాత్మ భక్తుల భక్తులు నిస్పృహులు. కహ్స్టమొచ్చినా సుఖమొచ్చినా వారు పరమాత్మను స్మరిస్తూనే ఉంటారు. 

నారాయణపరాః సర్వే న కుతశ్చన బిభ్యతి
స్వర్గాపవర్గనరకేష్వపి తుల్యార్థదర్శినః

శ్రీమన్నారాయణుని భక్తులు దేని నుండీ భయపడరు. వారికి స్వర్గమూ మోక్షమూ నరకమూ మూడూ సమానమే. వారు దేన్నీ కోరరు. 

దేహినాం దేహసంయోగాద్ద్వన్ద్వానీశ్వరలీలయా
సుఖం దుఃఖం మృతిర్జన్మ శాపోऽనుగ్రహ ఏవ చ

మానవులకు శరీరముతో సంబంధం ఉన్నప్పుడే ద్వంద్వములు. జీవులకు దేహము యొక్క సంబంధముతో కలిగేవి ద్వంద్వాలు. ఈ భావనలు ఆత్మకు కావు, ఆత్మవి కావు.

అవివేకకృతః పుంసో హ్యర్థభేద ఇవాత్మని
గుణదోషవికల్పశ్చ భిదేవ స్రజివత్కృతః

ఇది గుణదోష వికల్పం. ఇవి గుణములనీ ఇవి దోషములనీ అంటాం. పుష్పమాలలో పూలన్నీ కలిసి ఉన్నాయి అంటాము. కానీ అలా కలిపినవి దారము గానీ యదార్థముగా పూలు వేరుగానే ఉన్నాయి. ఆత్మ వేరుగా శరీరము వేరుగా ఉన్నా మాయ వలన శరీరమూ ఆత్మా కలిసి ఉన్నాయి అని అంటున్నాము.

వాసుదేవే భగవతి భక్తిముద్వహతాం నృణామ్
జ్ఞానవైరాగ్యవీర్యాణాం న హి కశ్చిద్వ్యపాశ్రయః

పరమాత్మ యందు భక్తి ఉన్న వారి యొక్క బలం జ్ఞ్యానమూ వైరాగ్యం. అలాంటి వారికి ఈ ప్రపంచములో తొలగించవలసినదీ తొలగిపోవలసినదీ అంటూ ఏమీ లేవు

నాహం విరిఞ్చో న కుమారనారదౌ న బ్రహ్మపుత్రా మునయః సురేశాః
విదామ యస్యేహితమంశకాంశకా న తత్స్వరూపం పృథగీశమానినః

నేనూ బ్రహ్మా కుమార నారదులూ మునులూ బ్రహ్మ పుత్రులూ దేవతలూ అందరూ నారాయణుని అంశ అంశలో వారము. ఆయన ఏమనుకుంటున్నాడో మాకు తెలియదు. ఆయన స్వరూపం కూడా మాకు తెలియదు. ఎవరికి వారమే మేమే ప్రభువులమనుకుంటున్నాము. అటువంటి మేము ఆ పరమాత్మ సంకల్పాన్ని తెలుసుకోలేము. 

న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నాప్రియః స్వః పరోऽపి వా
ఆత్మత్వాత్సర్వభూతానాం సర్వభూతప్రియో హరిః

ఇలాంటి వారికి ప్రీతి పాత్రుడూ శత్రువూ అంటూ ఉండరు. ఆయన అందరికీ ఆత్మే. శరీరములో కాళ్ళ నుండి తల వరకూ ఉన్న అవయవాలలో ఏది మనకు ఇష్టం అంటే ఏమని చెబుతాము. ఎలాగైతే శరీరమునకన్ని అవయవములూ సమానమో ఆత్మకు కూడా అన్నీ సమానమే. పరమాత్మకు అందరి యందు సమాన ప్రీతి ఉంది. పరమాత్మంటే సకల ప్రాణులకీ ప్రియుడు.

తస్య చాయం మహాభాగశ్చిత్రకేతుః ప్రియోऽనుగః
సర్వత్ర సమదృక్శాన్తో హ్యహం చైవాచ్యుతప్రియః

అటువంటి పరమాత్మకు చిత్రకేతువు మిక్కిలి ప్రియమైన వాడు. ఇతను అన్నింటినీ అన్నింటా సమానముగా చూస్తాడు. పరమాత్మకు అతను ప్రియుడు. పరమాత్మ నాకు (శంకరునకు) ప్రియుడు. 

తస్మాన్న విస్మయః కార్యః పురుషేషు మహాత్మసు
మహాపురుషభక్తేషు శాన్తేషు సమదర్శిషు

మహానుభావుల విషయములో వారి చర్యలను చూసి మనం ఆశ్చర్యపడకూడదు. వారెందుకు వస్తారో ఎందుకు వెళతారో మనకు అర్థం కాదు. వారు శాంతులూ సమదర్శులు. 

శ్రీశుక ఉవాచ
ఇతి శ్రుత్వా భగవతః శివస్యోమాభిభాషితమ్
బభూవ శాన్తధీ రాజన్దేవీ విగతవిస్మయా

ఇది విని పార్వతీ దేవి ఆశ్చర్యాన్ని వదిలిపెట్టి ప్రశాంతముగా ఉంది. 

ఇతి భాగవతో దేవ్యాః ప్రతిశప్తుమలన్తమః
మూర్ధ్నా స జగృహే శాపమేతావత్సాధులక్షణమ్

పార్వతీ దేవికి ప్రతి శాపం ఇవ్వగల శక్తి ఉండి కూడా చిత్రకేతువు మౌనముగా వెళ్ళిపోయాడు. ఇది మహానుభావుల లక్షణం. 

జజ్ఞే త్వష్టుర్దక్షిణాగ్నౌ దానవీం యోనిమాశ్రితః
వృత్ర ఇత్యభివిఖ్యాతో జ్ఞానవిజ్ఞానసంయుతః

ఈయనే త్వష్ట యజ్ఞ్యం చేస్తుంటే ఆ దక్షిణాగ్నిలో రాక్షస రూపములో పుట్టాడు. రాక్షసునిగా పుట్టినా అతనికి జ్ఞ్యాన విజ్ఞ్యానములు రెండూ ఉన్నాయి. పరమాత్మ యందు భక్తి పోలేదూ, లౌకిక జ్ఞ్యానమూ పోలేదు.

ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి
వృత్రస్యాసురజాతేశ్చ కారణం భగవన్మతేః

నీవడిగినది నేను వివరించాను. పరమాత్మ యందు భక్తి ఉన్న మహానుభావుడు రాక్షసునిగా పుట్టడానికి గల కారణం చెప్పాను

ఇతిహాసమిమం పుణ్యం చిత్రకేతోర్మహాత్మనః
మాహాత్మ్యం విష్ణుభక్తానాం శ్రుత్వా బన్ధాద్విముచ్యతే

ఇది మహానుభావుడైన చిత్రకేతు ఉపాఖ్యానం. విష్ణు భక్తుల మాహాత్యం విన్న వాడు సంసార బంధనం నుండి విడుదల అవుతాడు. 

య ఏతత్ప్రాతరుత్థాయ శ్రద్ధయా వాగ్యతః పఠేత్
ఇతిహాసం హరిం స్మృత్వా స యాతి పరమాం గతిమ్

ఈ చిత్రకేతూ వృత్తాసుర ఉపాఖ్యానమును ప్రతీరోజూ ప్రాతః కాలములో పరమాత్మను స్మరించుకుంటూ చదివిన వాడు పరమపదమును పొందుతాడు.